breaking news
	
		
	
  Jyotika
- 
      
                   
                                                     
                   
            వెకేషన్లో సూర్య దంపతులు.. వీడియో షేర్ చేసిన జ్యోతిక!
రెట్రో మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ డైరెక్టర్‌తో జతకట్టారు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరితో కలిపి పనిచేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో సూర్య తన కూతురితో కలిసి పాల్గొన్నారు. ఈ చిత్రంలో ప్రేమలు ఫేమ్ మమతా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా విరామం రావడంతో విదేశాల్లో వాలిపోయారు సూర్య. తన భార్య జ్యోతికతో కలిసి ఫారిన్లో చిల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్ ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇవీ చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) - 
            
                                     
                                                                                                       
                                   
                కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో సూర్య, జ్యోతిక ప్రత్యేక పూజలు (ఫొటోలు)
 - 
      
                   
                                                     
                   
            న్యూ ఇయర్ వేళ.. శక్తిపీఠాలు సందర్శించిన సూర్య దంపతులు..!
కోలీవుడ్ స్టార్ జంట జ్యోతిక- సూర్య దంపతులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఈ జంట.. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర కొల్లాపూర్‌లోని మహాలక్ష్మి, కామాఖ్య ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఈ జంట ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఆలయానికి వెళ్లినట్లు జ్యోతిక పోస్ట్ చేసింది.ఇక సినిమాల విషయానికొస్తే జ్యోతిక ఇటీవలే డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది. సూర్య ప్రస్తుతం రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్గా నటించింది. ఇటీవలే రెట్రో ట్రైలర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కంగువా డిజాస్టర్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.రెట్రో సెన్సార్ పూర్తి..ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్ పొందినట్లు మేకర్స్ వెల్లడించారు. రెట్రో సినిమా నిడివి(రన్‌టైమ్) దాదాపు రెండు గంటల 48 నిమిషాలుగా ఉండనుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా అభిమాలను అలరించనుంది. ఈ చిత్రంలో కరుణాకరన్, జోజూజార్జ్, సుజిత్ శంకర్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున తెరపైకి రానుంది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) - 
            
                                     
                                                                                                       
                                   
                సూర్య-జ్యోతిక ఇంట్లో సెలబ్రిటీలు.. ఎందుకో తెలుసా?
 - 
            
                                     
                                                                                                       
                                   
                సన్నజాజితీగలా హీరోయిన్ జ్యోతిక, థ్యాంక్స్ టూ విద్యా బాలన్ (ఫోటోలు)
 - 
      
                   
                                                     
                   
            మూడు నెలల్లో 9 కిలోలు తగ్గిన జ్యోతిక: ఈ సక్సెస్ సీక్రెట్ ఆమే!
బోలెడన్ని వ్యాయామాలు అంతులేని ఆహారపు మెళకువలు అందుబాటులో ఉన్నప్పటికీ, బరువు నిర్వహణ తనకు ’ఎప్పుడూ కష్టంగానే అనిపించేది అని నటి జ్యోతిక అన్నారు. రకరకాల వ్యాయామాలు, అంతులేని ఆహారాల మార్పులు, అపరిమిత ఉపవాసం ఇవేవీ నా అదనపు కిలోల బరువును తగ్గించడంలో సహాయపడలేదు. అని కూడా స్పష్టం చేశారు...అలాంటి జ్యోతిక ఇప్పుడు బరువు తగ్గారు. అదెలా సాధ్యమైంది? దీనికి ఓ ఏడాది క్రితం బీజం పడింది అని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఆ బీజం పేరు విద్యాబాలన్. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒక దశలో విపరీతంగా బరువు పెరిగారు. కానీ అకస్మాత్తుగా స్వల్ప వ్యవధిలోనే ఆమె గణనీయంగా బరువును తగ్గించుకోగలిగారు. దీనిపై ఎన్ని రకాల సందేహాలు, అంచనాలు, విశ్లేషణలు వచ్చినప్పటికీ... ఆమె మాత్రం స్పందించలేదు. అయితే గత అక్టోబర్ 2024లో విద్యాబాలన్ తన విపరీతమైన బరువు తగ్గడంపై మౌనం వీడింది జిమ్‌కి వెళ్లకుండానే చెమట్లు కక్కకుండానే తాను అదనపు కిలోల బరువు తగ్గడానికి కారణాలను, తన కొత్త ఆహారపు అలవాట్లను వెల్లడించింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ‘‘ డైట్ బట్ ’నో ఎక్సర్ సైజ్’ రొటీన్ ద్వారా విపరీతంగా బరువు తగ్గినట్టు వెల్లడించింది. దీనిని జ్యోతిక కూడా అనుసరించారు. ఆమెలాగానే నటి జ్యోతిక, తన బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించి ఆమె శిక్షకులనే ఎంచుకున్నారు. అచ్చం విద్య మాదిరిగానే తన డైట్ ఫిట్నెస్ మంత్రాన్ని మార్చడం ద్వారా ’ 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినట్లు’ వెల్లడించింది. తన ట్రైనర్ చెన్నైకి చెందిన న్యూట్రీషియన్ గ్రూప్ అమురా హెల్త్ టీమ్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దానితో పాటు , ‘అమురా, కేవలం 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినందుకు నా అంతరంగాన్ని తిరిగి కనుగొనడంలో నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు, అమురా! మీరందరూ ఓ మాయాజాలం అంటూ పొగిడింది. తన ఇంటర్వ్యూల ద్వారా నన్ను అమరా మాయా బృందానికి పరిచయం చేసినందుకు విద్యాబాలన్ కు కృతజ్ఞతలు’’ తెలిపింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika)‘‘‘నేను నా ప్రేగు, జీర్ణక్రియ, వేడిని కలిగించే ఆహారాలు ఆహార సమతుల్యత గురించి తెలుసుకున్నాను. మరీ ముఖ్యంగా, సానుకూల భావాన్ని కలిగించేటప్పుడు నా సంతోషం, మానసిక స్థితిపై ఆహారం ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను. ఫలితంగా, ఈ రోజు ఒక వ్యక్తిగా నేను చాలా శక్తివంతంగా అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’’ అంటూ బరువు తగ్గడం కన్నా మన శరీరంపై మనకు అవగాహన ఏర్పడడం ముఖ్యమని ఆమె వివరించింది. అయితే బరువు తగ్గడంతో పాటే మహిళల ఆరోగ్యానికి వెయిట్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో కూడా జ్యోతిక తెలియజేసింది. ‘ఆరోగ్యకరమైన జీవితం సమతుల్యతతో కూడి ఉంటుంది; బరువు తగ్గడం లో ఆహారపు అలవాట్లు ముఖ్యమైనవి, అలాగని శక్తి అక్కర్లేదని కాదు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలువెయిట్ ట్రైనింగ్ అనేది మహిళల భవిష్యత్తుకు కీలకం, బరువు తగ్గడంతో పాటు శక్తి కోల్పోకుండా ఉండడం కూడా ముఖ్యమైన విషయం. ఇది నేర్పినందుకు వయస్సు కేవలం ఒక సంఖ్య అని నిరూపించినందుకు శిక్షకుడు మహేష్‌కు ధ్యాంక్స్ చెప్పాలి. ‘నా శరీరం దాని పనితీరును అర్థం చేసుకోవడం దానితో వ్యాయామాలను కలపడం నా అనుభవంపై గరిష్ట ప్రభావాన్ని చూపింది అంటూ ఇదే సందర్భంగా పోషకాహార నిపుణులు ఫిట్నెస్ నిపుణుల బృందానికి తనను పరిచయం చేసినందుకు విద్యకు ధన్యవాదాలు తెలిపింది.చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్ - 
      
                   
                                                     
                   
            కూర్చునే నిహారిక డ్యాన్స్.. కొత్త కారుతో తెలుగు యాంకర్
కాస్ట్ లీ బెంజ్ కారు కొన్న తెలుగు యాంకర్ సోనియాబేబీ బంప్ ఫొటోలతో యూట్యూబర్ మహాతల్లిచీరల మెరుపు తీగకంటే సన్నగా జ్యోతిరాయ్చెన్నై మ్యాచ్ చూసేందుకు వచ్చిన యషికా-పార్వతిడార్క్ చాక్లెట్ లా మెరిసిపోతున్న అదితీ రావ్ హైదరీగాయం తాలుకు జ్ఞాపకాల్ని పంచుకున్న అన్షుబాలిలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న నటి నవ్య స్వామి View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by SONIYA SINGH (@soniya_singh31) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) - 
      
                   
                                                     
                   
            సౌత్‌లో ఇదే పెద్ద సమస్య.. ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి: జ్యోతిక
చాలామంది డైరెక్టర్లు హీరోల కోసమే కథలు రాసుకుంటారు అంటోంది హీరోయిన్ జ్యోతిక (Jyotika). హీరోయిన్ల కోసం ప్రత్యేకంగా కథలు రాసుకునేవారు ఎంతమంది ఉన్నారని పెదవి విరిచింది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్. ఫిబ్రవరి 28న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. డబ్బా కార్టెల్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వయసైపోయినవారిని హీరోలుగా జనాలు ఒప్పుకుంటారు. కానీ హీరోయిన్ల ఏజ్ పెరిగితే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరు.. నిజమేనా? అని అడుగుతుంటారు.వయసు అడ్డుగోడఇది చాలా పెద్ద ప్రశ్న.. నా విషయానికి వస్తే 28 ఏళ్ల వయసులో నాకు పిల్లలు పుట్టారు. ఆ తర్వాతే నేను విభిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. అయితే స్టార్ హీరోలతో కలిసి నటించలేదనుకుంటాను. ఇక్కడ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. సౌత్‌లోని అన్ని ఇండస్ట్రీల గురించి నేను చెప్పలేను కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం వయసును ఒక అడ్డుగోడగా చూస్తారు. అలాంటప్పుడు మనమే కొత్త దర్శకులతో పని చేస్తూ మన కెరీర్‌ను నిర్మించుకోవాల్సి ఉంటుంది. అదే పెద్ద సమస్యమహిళా ప్రధాన సినిమాలు, కథలు తెరకెక్కించేందుకు కె. బాలచందర్ వంటి దర్శకులు ఇప్పుడు లేరు. ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్లందరూ పెద్ద హీరోల కోసం కథలు రాసే పనిలోనే బిజీగా ఉన్నారు. మహిళా నటిని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసిన పెద్ద దర్శకుడు ఇటీవలి కాలంలో ఎవరున్నారు చెప్పండి? అదే మనం కోల్పోతున్నాం. లేడీ ఓరియంటెడ్ అనగానే బడ్జెట్ కూడా కుదించేస్తారు. వయసు పెరిగితే పరిగణనలోకి తీసుకోరు.. ఇది ఇంకో సమస్య! సౌత్‌లో నటిగా రాణించడం చాలా కష్టం. ఎప్పుడూ ఒంటరి పోరాటం చేస్తూనే ఉండాలి అని చెప్పుకొచ్చింది.లవ్.. సినిమాజ్యోతిక.. 'డోలీ సజా కె రఖనా' అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. వాలి చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. పూవెల్లమ్ కెట్టుప్పర్, ఖుషి, రిథమ్, దం దం దం, పూవెల్లం ఉన్ వాసం. ఖాకా ఖాకా, ధూల్, మన్మధన్.. ఇలా పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఠాగూర్, చంద్రముఖి, మాస్ సినిమాలతో తెలుగువారికీ పరిచయమైంది. హీరో సూర్య (Suriya)తో ఏడు సినిమాల్లో నటించింది. ఆ సమయంలో సూర్యతో ప్రేమలో పడ్డ జ్యోతిక 2006లో అతడ్ని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం.చదవండి: జనరేటర్ లో పంచదార గొడవపై ప్రశ్న.. విష్ణు ఏమన్నాడంటే? - 
      
                   
                                                     
                   
            తొలి సినిమా నా భర్తతో చేయడం మరిచిపోలేను: జ్యోతిక
కోలీవుడ్ స్టార్ హీరో సతీమణి జ్యోతిక ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తోంది. తాజాగా ఆమె డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారామె. అయితే ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరువుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జ్యోతిక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్లో నటించడంపై ఆమె మాట్లాడారు.బాలీవుడ్‌తో నా తొలిచిత్రం అక్షయ్ ఖన్నాతో నటించానని తెలిపింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.. అందువల్లే ఆ తర్వాత ఆఫర్లు రాలేదని వివరించింది. అది చేసే సమయంలో ఓ దక్షిణాది సినిమాకు సైన్ చేశానట్లు వెల్లడించింది. కోలీవుడ్‌లో తొలి సినిమానే నా భర్త సూర్యతో చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది. స్టార్డమ్ గురించి ఆమెను ప్రశ్నించగా.. ఇంటికి వెళ్లేముందే బయటే తమ స్టార్‌డమ్‌ను వదిలేస్తామని తెలిపింది. ఇంట్లోకి అడుగుపెట్టగానే మా పిల్లలకు తల్లిదండ్రులుగానే ఉంటాం.. ప్రతి ఉదయం వారి బాక్స్‌ల గురించే ఆలోచిస్తామని.. వాళ్ల పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని జ్యోతిక వెల్లడించింది. కాగా.. తాజా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్‌లో.. షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ను హితేష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌ను క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబయిలో డబ్బావాలా బాగా ఫేమస్. ఆ కోణంలోనే ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫుడ్ డబ్బాల్లో లంచ్‌తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా డబ్బా కార్టెల్ రూపొందించారు. ఈ సిరీస్‌లో అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలకపాత్రలు పోషించారు. - 
      
                   
                                                     
                   
            నీ భర్త కంటే విజయ్ నయం.. జ్యోతిక ఏమందో తెలుసా?
ఎవరి టాలెంట్ వారిదే! ఈ పదం సినిమా ఇండస్ట్రీలో అందరికీ వర్తిస్తుంది. ఎవరి స్క్రిప్ట్ సెలక్షన్ వారిదే.. బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా వారిదే! ఒకరితో మరొకరిని పోల్చలేం. కొన్నిసార్లు అపజయాలు ఎదురైనా మరికొన్నిసార్లు కలెక్షన్ల ఊచకోతతో రికార్డులు సృష్టిస్తుంటారు. ఫెయిల్యూర్ అందుకున్నంతమాత్రాన నటులు వెనకబడిపోయినట్లు కాదు! అయితే కంగువా సినిమాతో డిజాస్టర్ అందుకున్న హీరో సూర్య (Suriya)ను పలువురూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా జ్యోతిక (Jyotika) షేర్ చేసిన పోస్ట్ కింద నెగెటివ్ కామెంట్లతో చెలరేగిపోతున్నారు.నీ భర్తను ఆ రేంజ్ కలెక్షన్స్ తెమ్మనుసూర్య కంటే విజయ్ బెటర్ అని ఒకరు, నీ భర్త కంటే ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఉత్తమం అని మరొకరు సెటైర్లు వేశారు. సూర్య, కార్తీల కంటే విజయ్ చాలా నయం.. ఇదే నిజం.. ఆ ఇద్దరు హీరోలను డ్రాగన్, లవ్ టుడే కంటే ఎక్కువ కలెక్షన్స్ తీసుకురమ్మనండి అంటూ ఇలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే వీటన్నింటిపై జ్యోతిక చాలా కూల్‌గా స్పందించింది. నీ భర్త కంటే విజయ్ నయం అన్న కామెంట్‌కు.. అవునా, నిజమా? అన్నట్లుగా స్మైల్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది. స్పందించడం అవసరమా?తర్వాత సదరు కామెంట్లన్నింటినీ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జ్యోతిక ఆ ట్రోలర్స్‌కు రిప్లై ఇవ్వడం అవసరమా? అని పలువురు మండిపడుతున్నారు. పోనీ.. నీ భర్త కంటే వేరొకరు నయం అన్నప్పుడు చెంప చెల్లుమనిపించేలా ఆన్సర్ ఇవ్వొచ్చుగా అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ఇతర నటులు సక్సెస్ అయితే ఈ కుటుంబమంతా ఈర్ష్యతో రగిలిపోతుంది అని పెదవి విరుస్తున్నారు. ఇకపోతే జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) చదవండి: 'నమో నమః శివాయ' వీడియో సాంగ్ వచ్చేసింది - 
            
                                     
                                                                                                       
                                   
                Jyotika: టాలెంటెడ్ నటి.. తననే తీసేయాలనుకున్నారా? (ఫోటోలు)
 - 
      
                   
                                                     
                   
            ఎంగేజ్మెంట్ వేడుకలో స్టార్ హీరో దంపతులు.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి శివ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఈ సినిమాపై అభిమానుల్లో పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అయితే దసరాకు థియేటర్లలో రిలీజ్ కావాల్సిన కంగువా.. ఊహించని విధంగా వాయిదా పడింది. రజినీకాంత్ వేట్టైయాన్ బరిలోకి రావడంతో కంగువా మేకర్స్ విడుదలను వాయిదా వేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా తన బంధువుల ఎంగేజ్మెంట్ వేడుకకు సూర్య హాజరయ్యారు. తన భార్య జ్యోతికతో కలిసి జంటగా నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఇందులో కాబోయే నూతన వధూవరులకు ఎంగేజ్మెంట్ రింగ్ అందజేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్య అభిమానుల సంఘం పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వేడుక తమిళనాడులోని తిరుప్పూరులో జరిగిందని ఇన్‌స్టాలో ఓ అభిమాని షేర్ చేశారు. సూర్య కుటుంబానికి చెందిన బంధువుతో నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: దసరా బాక్సాఫీస్.. రజినీకాంత్ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్!)ఇక సినిమాల విషయానికొస్తే త్వరలోనే కంగువా థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్‌తో గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కించనున్న ఓ సినిమాలో కనిపించనున్నారు. అంతేకాకుండా తన సోదరుడు కార్తీ, అరవింద్ స్వామిలతో కలిసి మీయజగన్ అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు.Exclusive Video @Suriya_offl & Jyotika at Relative's Engagement Yesterday ♥️#Kanguva pic.twitter.com/ykOA50c3YJ— All India Suriya Fans Club (@Suriya_AISFC) September 17, 2024 - 
            
                                     
                                                                                                       
                                   
                Jyotika: బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్స్‌లో మెరిసిపోతున్న జ్యోతిక (ఫోటోలు)
 - 
            
                                     
                                                                                                       
                                   
                దిష్టి తగిలేంత అందంగా సూర్య - జ్యోతిక.. సూపర్ జోడీ! (ఫొటోలు)
 - 
      
                   
                               
                   
            'షైతాన్'ట్రైలర్‌తో మెప్పించిన అజయ్ దేవగన్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'షైతాన్'. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రాన్ని వికాస్ భల్ దర్శకత్వం వహించారు. మార్చి 8న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో ట్రైలర్ కొనసాగుతుంది. సరదాగా సాగిపోతున్న కబీర్ (అజయ్) కుటుంబంలోకి ఓ అనుకోని అతిథి ప్రవేశిస్తాడు. అపరిచిత (మాధవన్) వ్యక్తిగా వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయి. అతని నుంచి అజయ్ దేవగన్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది అసలు కథ. ఆసక్తికర సన్నివేశాలతో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మాధవన్ విలన్‌గా ఈ చిత్రంలో కనిపిస్తాడు. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్ పాఠక్ సంయక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గుజరాతికి చెందిన 'వష్' (Vash) సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. - 
      
                   
                               
                   
            హోమో సెక్సువల్ పాత్రలో స్టార్ హీరో.. ఆ రెండు దేశాల్లో బ్యాన్!
ఆరు దశాబ్దాల వయసు దాటినా.. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న అతికొద్ది మంది హీరోల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక్కరు. ఈ వయసులో కూడా ఆయన డిఫరెంట్ చిత్రాలతోనే ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఈ మెగాస్టార్ నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం ‘కాథల్-ది కోర్’. జీయో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టికి జోడీగా జ్యోతిక నటించింది. నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు కొద్ది రోజుల ముందే ఈ చిత్రానికి ఊహించని షాక్ తగిలిగింది. ఈ మలయాళ చిత్రాన్ని రెండు దేశాలు నిషేధించాయి. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని(హోమో-సెక్సువాలిటీ)ప్రోత్సహించేలా ఉందని కువైట్, ఖతార్ దేశాలు బ్యాన్ చేశాయి. ‘కాథల్-ది కోర్’ కథేంటి? ఈ చిత్రాన్ని త్వరలోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ప్రదర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పత్రిక..ఈ చిత్రం కథని క్లుప్తంగా వివరిస్తూ వార్తను ప్రచురించింది. దాని ప్రకారం.. కో ఆపరేటివ్ బ్యాంకులో పని చేసి రిటైర్ అయిన జార్జ్(మమ్ముట్టి).. భార్య ఓమన(జ్యోతిక)తో కలిసి తీకోయ్ అనే చిన్న ఊళ్ళో నివసిస్తుంటాడు. అతను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. (చదవండి: వారి వల్ల నా ఫ్యామిలీలో పక్కన పెట్టేశారు.. చనిపోదామనుకున్న అంటూ యమున ఆవేదన) నామినేషన్ వేసిన తర్వాత..అతని భార్య ఓమన హఠాత్తుగా విడుకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతుంది. అదే గ్రామంలో డ్రైవింగ్ స్కూల్ నడిపే వ్యక్తితో జార్జ్ స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. జోసెఫ్ మాత్రం తీవ్రంగా ఖండిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎన్నికల్లో జార్జ్ పోటీ చేశాడా? లేదా? విడాకుల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం చూసే తీరును ఇందులో చూపించినట్లు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పారు. దీంతో కువైట్, ఖతార్ దేశాలు ఈ చిత్రాన్ని బహిష్కరించాయి. - 
  
    
                
      ఆ సినిమాతోనే నేను జ్యోతిక లవ్ లో పడ్డాం
 - 
      
                   
                               
                   
            'నేను మీకు వీరాభిమానిని'.. జ్యోతిక పోస్ట్ వైరల్!
2005లో ఐకానిక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ చంద్రముఖి. ఈ చిత్రంలో రజినీకాంత్, నయనతార, ప్రభు, సోనుసూద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం చంద్రముఖి పాత్రలో జ్యోతిక అభిమానులను మెప్పించింది. తన హవాభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రేక్షకుల గుండెల్లో చంద్రముఖిగా తన పేరును ముద్రించుకుంది జ్యోతిక. (ఇది చదవండి: నిన్ను చాలా మిస్ అవుతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్!) అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా చంద్రముఖి-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కనిపించనుంది. పార్ట్-2 లో నటీనటులను పూర్తిగా మార్చేశారు. రజినీకాంత్ పోషించిన పాత్రలో రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో నటి జ్యోతిక ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. చంద్రముఖి పాత్రలో కంగనా నటించడం పట్ల ప్రశంసలు కురిపించింది. తాను కూడా కంగనా రనౌత్ అభిమానిని అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జ్యోతిక ఇన్‌స్టాలో రాస్తూ..' అత్యంత ప్రతిభావంతులైన నటీమణుల్లో కంగనా ఒకరు. మీరు చంద్రముఖి పాత్రను పోషించినందుకు చాలా గర్వపడుతున్నా. ఆ పాత్రలో అద్భుతంగా కనిపిస్తున్నారు. మీ నటనకు నేను కూడా పెద్ద అభిమానిని. ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే ప్రత్యేకంగా మీ కోసమే ఈ సినిమా చూడాలని ఉంది. ముఖ్యంగా లారెన్స్, పి వాసుకు మరో హిట్ ఖాతాలో పడినట్టే. సూపర్ హిట్ అవ్వాలని చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు. నా ఆల్ ది బెస్ట్." అంటూ పోస్ట్ చేసింది. కాగా.. చంద్రముఖి 2 సెప్టెంబర్ 15న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాల్లో విడుదల కానుంది. (ఇది చదవండి: అందుకే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: తెలుగు నటి) - 
      
                   
                               
                   
            నటి జ్యోతికపై కంగనా రనౌత్ ప్రశంసలు.. ట్వీట్ వైరల్
వైవిధ్యమైన నటనతో ఆకట్టుకుంటున్న కంగనా రనౌత్ నటిస్తున్న తాజాచిత్రం చంద్రముఖి-2. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది.2005లో రజినీకాంత్, నయనతార, జ్యోతిక నటించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సీక్వెల్లో తెరెకక్కుతున్న సినిమాలో చంద్రముఖిగా కంగనా నటిస్తుంది. ఈ క్రమంలో జ్యోతికపై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జ్యోతిక.. కంగనా తన ఫేవరెట్ బాలీవుడ్ హీరోయిన్ అని చెప్తుంది. ఈ వీడియోను ఓ నెటిజన్ పోస్ట్చేయగా కంనగా రనౌత్ స్పందిస్తూ.. చంద్రముఖిలో జ్యోతిక ఐకానిక్ నటనను నేను దాదాపు ప్రతిరోజూ చూస్తున్నాను. ఎందుకంటే మేము క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నాము. జ్యోతిక నటన అద్భుతం. ఆమెను మ్యాచ్చేయడం చాలా కష్టం అంటూ కంగనా ప్రశంసలు కురిపించింది. That’s encouraging, as a matter of fact I am watching Jyothika ji’s iconic performance in Chandramukhi almost every day because we are shooting the climax it’s nerve wracking, how astonishing she is in the first part!! it is practically impossible to match up to her brilliance 🙏 https://t.co/JENhDhbhFC — Kangana Ranaut (@KanganaTeam) February 12, 2023 - 
      
                   
                               
                   
            ఒక్కరోజులోనే 1.4 మిలియన్ ఫాలోవర్లు
తనపై అమితమైన ప్రేమాభిమానాలు చూపుతోన్న అభిమానులకు నటుడు సూర్య ధన్యవాదాలు తెలిపారు. ఇంతలా ప్రేమించే అభిమానులు ఉండటం నిజంగా తన అదృష్టం అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు విషయం ఏంటంటే తన 45వ పుట్టిన రోజు(జూలై 23) సందర్భంగా సూర్య ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ అయ్యారు. తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంటర్ అయిన సూర్యను 24 గంటల వ్యవధిలోనే 1.4 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో తనమీద అపరిమితమైన ప్రేమను చూపిస్తున్న అభిమానులకు సూర్య కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అభిమానులు ఉండటం తన అదృష్టం అన్నారు సూర్య. (సూర్య రెండో లుక్.. పక్షి ఎందుకుంది?) View this post on Instagram Feeling super lucky to have such unconditional love!! Thank you guys for making me believe in what I do.. Love you all!! A post shared by Suriya Sivakumar (@actorsuriya) on Jul 24, 2020 at 5:42am PDT రెండు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒపెన్ చేసిన సూర్య ఇప్పటి వరకు మూడు ఫోటోలు షేర్ చేశారు. ఒకటి భార్య జ్యోతికతో ఉన్న ఫోటో కాగా.. మరొకటి తనది. ప్రస్తుతం సూర్య ఇన్‌స్టాగ్రామ్‌లో నలుగురినే ఫాలో అవుతున్నారు. వారు సోదరుడు కార్తి, సోదరి బృందా, బెస్ట్ ఫ్రెండ్ రాజశేకర్పాండియన్, అతని ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్టైన్మెంట్. ఇక సూర్య పుట్టినరోజు సందర్భంగా.. నిర్మాత కలైపులి ఎస్ థాను రాబోయే చిత్రం ‘వాడి వాసల్’ పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వెట్రీ మారన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం జల్లికట్టు ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. (జ్యోతిక వ్యాఖ్యలను సమర్థించిన సూర్య..) - 
      
                   
                               
                   
            ఒక్కొక్క కేసుకి.. ఒక్కో పేరు!
తమిళ హీరో కార్తీ తాజా చిత్రం ‘దొంగ’ టీజర్ నేడు విడుదలైంది. దృశ్యం ఫేం మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళంలో ‘తంబి’ పేరుతో తీసిన ఈ చిత్రానికి తెలుగులో ‘దొంగ’ టైటిల్ పెట్టారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కార్తీకి అక్కగా ఆయన వదిన జ్యోతిక నటించారు.వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కీలకపాత్రల్లో సత్యరాజ్, షావుకారు జానకి కనిపించనున్నారు. తమిళ వెర్షన్ ‘తంబి’ టీజర్‌ను కూడా నేడు విడుదల చేశారు. వయకామ్ 18, సూరజ్ సదన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన ‘ఖైదీ’ సినిమా కార్తీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘ఖైదీ’, ‘దొంగ’ టైటిల్స్ రెండూ చిరంజీవి నటించిన సినిమా టైటిల్సే కావడం విశేషం. - 
      
                   
                               
                   
            జ్యోతిక, రేవతిల జాక్‌పాట్
తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా జ్యోతి సుపరిచితమే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను పెళ్లాడిన తరువాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. తాజాగా జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ జాక్‌పాట్. సీనియర్ నటి రేవతి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ట్విటర్ ద్వారా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్లో జ్యోతిక, రేవతి రకరకాల వేశాల్లో ప్రజలను మోసం చేసే పాత్రల్లో కనిపిస్తున్నారు. అంతేకాదు జ్యోతిక ఈ సినిమాటో యాక్షన్ సీన్స్‌కు ఇరగదీశారు. 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో సూర్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణ్ దర్శకుడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో యోగి బాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. - 
      
                   
                               
                   
            వదినతో తొలిసారి నటిస్తున్నా..
తమిళసినిమా: ‘వదిన జ్యోతికతో కలిసి తొలిసారిగా సినిమాలో నటిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’ అని నటుడు కార్తీ ట్విటర్లో పేర్కొన్నారు. గతంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన జ్యోతిక.. నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత నటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘36 వయదినిలే’ చిత్రంతో మళ్లీ నటిగా ఎంట్రీ ఇచ్చి ఆమె.. వరుసగా వుమెన్ ఒరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తన మరిది, నటుడు కార్తీతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రంలోనూ వీరు వదినా మరిదిగా నటించడనుండడం విశేషం. మలయాళ దర్శకుడు జిత్తు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైకం 18 స్టూడియోస్ సమర్పణలో పారలల్ మైండ్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం గురించి నటుడు కార్తీ తన ట్విటర్లో స్పందిస్తూ.. ‘వదినతో కలిసి తొలిసారి నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. జిత్తు జోసెఫ్ దర్శకత్వంలో నటించనుండటం ఆనందకరం. ఈ చిత్రంలో నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషించబోతున్నారు. మీ ఆశీస్సులతో చిత్రం ఈ రోజు ప్రారంభమైంది’ అని పేర్కొన్నాడు. నటుడు సూర్య కూడా కార్తీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో సూర్య, కార్తీ తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి గోవింద వసంత్ సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణను అందిస్తున్నారు. - 
  
    
                
      నాకంటే బాగా నటించిందట..
 - 
      
                   
                               
                   
            నాకంటే బాగా నటించిందట..

 చెన్నైః రెండువారాల క్రితం విడుదలైన, విజయవంతంగా నడుస్తున్న 36 వయదినిలే సినిమా సక్సెస్‌తో సినీ జంట సూర్య, జ్యోతిక మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ భార్యభర్తలిద్దరూ జంటగా నటించి ప్రేక్షకులను అలరించనున్నారట. 36 వయదినిలే సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడిన సూర్య స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ''మేమిద్దరం కలిసి త్వరలో తమిళంలో ఒక సినిమా చేస్తున్నాం.. కథలను పరిశీలిస్తున్నాం.. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మేమిద్దరం కలిసి వచ్చే ఏడాదే ఓ మూవీ చేయబోతున్నాం'' అని నిర్మాత కమ్ యాక్టర్ సూర్య తెలిపారు.
 తాను ఊహించిన దానికంటే ఎక్కువగా అద్భుతమైన విజయం సాధించిందని సూర్య సంబరపడుతున్నారు. ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుందన్నారు. ఇంత బాగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లక... సినిమా విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సినిమా రిలీజైన దగ్గరనుంచి జ్యోతికకు నిరంతరాయంగా ఫోన్ కాల్స్ చాలా వస్తూనే ఉన్నాయ న్నారు. ఈ సినిమాతో తానేంటో నిరూపించుకుంది మా జో అని సూర్య తెగ మురిసిపోతున్నాడు. నాకంటే జో చాలా బాగా నటించిదని అమ్మా నాన్న చెప్పారనీ.. దీనికి తాను గర్వంగా ఫీలవుతున్నానని అన్నారు. 
 
 కాగా తమిళ హీరో సూర్యను పెళ్లి చేసుకున్న హీరోయిన్ జ్యోతిక 36 వయదినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదరగొట్టింది. రోషన్ ఏండ్రూస్ దర్శకత్వంలో స్వయంగా హీరో సూర్య నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన రెండు వారాల్లో 10 కోట్లకు పైగా బిజినెస్ సాధించింది. - 
      
                   
                               
                   
            ఆరు రోజుల్లో రూ. 8 కోట్ల వసూళ్లు

 చెన్నై: నటి జ్యోతిక ఎనిమిదేళ్లు విరామం తర్వాత నటించిన '36 వయదినిలే' తమిళ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. విడుదలైన ఆరు రోజుల్లో తమిళనాడులో రూ. 8 కోట్లుపైగా వసూలు చేసింది. మౌత్ పబ్లిసిటీతో సినిమాకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. సినిమా బాగుందని టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ధియేటర్లకు వస్తున్నారు. మరో వారంలో ఈ సినిమా కలెక్షన్ రూ.20 కోట్లు దాటే అవకాశముందని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ అంచనా వేశారు.
 
 '36 వయదినిలే' సినిమాను మొదట మల్టిప్లెక్స్ ధియేటర్లలో మాత్రమే విడుదల చేశారు. హిట్ టాక్ రావడంతో మామూలు ధియేటర్లలోనూ ప్రదర్శిస్తున్నారు. తన సినిమాకు మంచి స్పందన రావడం పట్ల జ్యోతిక సంతోషం వ్యక్తం చేసింది. తనపై ప్రేమతో, గౌరవంతో '36 వయదినిలే' సినిమాను విజయవంతం చేశారని పేర్కొన్నారు. 


