ఒక్కొక్క కేసుకి.. ఒక్కో పేరు! | Jyotika and Karthi Film Donga Teaser Out | Sakshi
Sakshi News home page

‘దొంగ’ టీజర్‌ విడుదల

Nov 16 2019 1:58 PM | Updated on Nov 16 2019 2:13 PM

Jyotika and Karthi Film Donga Teaser Out - Sakshi

‘దొంగ’ టీజర్‌లోని దృశ్యం

కార్తీ తాజా చిత్రం ‘దొంగ’ టీజర్‌ నేడు విడుదలైంది.

తమిళ హీరో కార్తీ తాజా చిత్రం ‘దొంగ’ టీజర్‌ నేడు విడుదలైంది. దృశ్యం ఫేం మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళంలో ‘తంబి’ పేరుతో తీసిన ఈ చిత్రానికి తెలుగులో ‘దొంగ’ టైటిల్‌ పెట్టారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కార్తీకి అక్కగా ఆయన వదిన జ్యోతిక నటించారు.వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కీలకపాత్రల్లో సత్యరాజ్‌, షావుకారు జానకి కనిపించనున్నారు. తమిళ వెర్షన్‌ ‘తంబి’ టీజర్‌ను కూడా నేడు విడుదల చేశారు.

వయకామ్‌ 18, సూరజ్‌ సదన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన ‘ఖైదీ’ సినిమా కార్తీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘ఖైదీ’, ‘దొంగ’ టైటిల్స్‌ రెండూ చిరంజీవి నటించిన సినిమా టైటిల్సే కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement