‘తొలి ప్రేమ కథ’ టీజర్ చాలా నచ్చింది: శైలేష్ కొలను | Tholiprema Katha Teaser Launch Event | Sakshi
Sakshi News home page

‘తొలి ప్రేమ కథ’ టీజర్ చాలా నచ్చింది: శైలేష్ కొలను

Nov 7 2026 5:14 PM | Updated on Nov 7 2026 5:16 PM

Tholiprema Katha Teaser Launch Event

సాత్విక్ వర్మ, అనీ హీరోహీరోయిన్లుగా చేసిన సినిమా ‘తొలి ప్రేమ కథ’. లతా.కె నిర్మిస్తున్న ఈ చిత్రానికి  సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు. హీరో ఆకాష్ పూరి, డైరెక్టర్ శైలేష్ కొలను ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. ‘తొలి ప్రేమ కథ’ కరెక్ట్ టైమ్‌లో మూడ్ ఆఫ్ ది సీజన్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాల కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలోనే ఈ సినిమా వస్తోంది. టీజర్ చూస్తుంటే చాలా హాయిగా ఉంది. చాలా జెన్యూన్‌గా, నేచురల్‌గా ఉంది. సాత్విక్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. తను చాలా కష్టపడ్డాడు. నాకు ఈ టీజర్ చాలా నచ్చింది. ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా. అందరూ థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

ఆకాష్ పూరి మాట్లాడుతూ..‘తొలి ప్రేమ కథ’ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సాత్విక్, అన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్లతో కలిసి పనిచేశాను. ఇద్దరూ కూడా చాలా అద్భుతమైన ఫెర్ఫార్మర్స్ అని అన్నాడు. హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ. ఇది మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ. దీనికి కారణం ధ్రువన్ అందించిన అద్భుతమైన మ్యూజిక్. మా నిర్మాత, దర్శకుడు చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారు. అందరూ కూడా మా సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement