breaking news
Sathvik Varma
-
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా
రీసెంట్ టైంలో ప్రేమకథలతో సినిమాలు తీస్తున్నప్పటికీ బోల్డ్, రొమాంటిక్ కాన్సెప్ట్‌లు ఎక్కువగా తీస్తున్నారు. అలా ఈ నెల ప్రారంభంలో వచ్చిన మూవీ 'ప్రేమిస్తున్నా'. పలు హిట్ సినిమాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్.. ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ప్రీతీ నేహా అనే అమ్మాయి హీరోయిన్గా చేసింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?(ఇదీ చదవండి: నీ ప్రేమ మళ్లీ కావాలి బాపూ.. తెలుగు దర్శకుడి ఇంట్లో విషాదం) సాత్విక్, ప్రీతీ నేహా జంటగా నటించిన ఈ రొమాంటిక్ బోల్డ్ సినిమాకు భాను దర్శకత్వం వహించారు. నవంబరు 7న థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ పరంగా బాగుందనే టాక్ తెచ్చుకున్నప్పటికీ స్టార్స్ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు మూడు వారాల్లోనే అంటే ఈ శుక్రవారం (నవంబరు 28) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ బోల్డ్ లవ్ స్టోరీ సినిమాలంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి.'ప్రేమిస్తున్నా' విషయానికొస్తే.. రైల్వేలో చిన్న ఉద్యోగం చేసే శారద, తన కొడుకుని (సాత్విక్ వర్మ) అల్లారుముద్దుగా పెంచుతుంది. బదిలీపై ఘట్కేసర్లోని రైల్వే కాలనీకి శారద కుటుంబం షిఫ్ట్ అవుతుంది. అదే కాలనీకి చెందిన అమ్మాయి (ప్రీతీ నేహా) వీళ్లకు సాయం చేయడానికి వస్తుంది. ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడిన సాత్విక్.. 'నీతో రొమాన్స్ చేయాలని ఉంది' అని తొలి పరిచయంలోనే అడిగేస్తాడు. అమ్మాయి దీన్ని సిల్లీగా తీసుకుంటుంది. సాత్విక్ మాత్రం టైమ్ టేబుల్ వేసుకొని మరీ, ఆమెని ఫాలో అవుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో సాత్విక్‌తో అమ్మాయి రొమాన్స్‌కి ఒప్పుకొంటుంది. కానీ కండీషన్ పెడుతుంది. ఆ కండీషన్ ఏంటి? ప్రాణంగా ప్రేమించిన వాడిని ప్రీతీ ఎందుకు దూరం పెట్టింది? అమ్మాయి కోసం అతడు పిచ్చోడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'మాస్ జాతర'తో పాటు ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు) -
'ప్రేమిస్తున్నా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సరికొత్త ప్రేమకథతో ‘ప్రేమిస్తున్నా’
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు నటించిన తాజా చిత్రం ‘ప్రేమిస్తున్నా’.భాను దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న ఈ విడియోలో సినిమా ఎలా ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ...‘అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు, అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా, మేము విడుదల చేసిన సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా కు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోందని’అన్నారు.


