ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా | Sathvik Premistunna Movie OTT Streaming Update | Sakshi
Sakshi News home page

OTT: మూడు వారాల్లోనే ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Nov 26 2025 10:25 AM | Updated on Nov 26 2025 10:28 AM

Sathvik Premistunna Movie OTT Streaming Update

రీసెంట్ టైంలో ప్రేమకథలతో సినిమాలు తీస్తున్నప్పటికీ బోల్డ్, రొమాంటిక్ కాన్సెప్ట్‌లు ఎక్కువగా తీస్తున్నారు. అలా ఈ నెల ప్రారంభంలో వచ్చిన మూవీ 'ప్రేమిస్తున్నా'. పలు హిట్ సినిమాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్.. ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ప్రీతీ నేహా అనే అమ్మాయి హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?

(ఇదీ చదవండి: నీ ప్రేమ మళ్లీ కావాలి బాపూ.. తెలుగు దర్శకుడి ఇంట్లో విషాదం

సాత్విక్, ప్రీతీ నేహా జంటగా నటించిన ఈ రొమాంటిక్ బోల్డ్ సినిమాకు భాను దర్శకత్వం వహించారు. నవంబరు 7న థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ పరంగా బాగుందనే టాక్ తెచ్చుకున్నప్పటికీ స్టార్స్ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు మూడు వారాల్లోనే అంటే ఈ శుక్రవారం (నవంబరు 28) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ బోల్డ్ లవ్ స్టోరీ సినిమాలంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి.

'ప్రేమిస్తున్నా' విషయానికొస్తే.. రైల్వేలో చిన్న ఉద్యోగం చేసే శారద, తన కొడుకుని (సాత్విక్ వర్మ) అల్లారుముద్దుగా పెంచుతుంది. బదిలీపై ఘట్కేసర్‌లోని రైల్వే కాలనీకి శారద కుటుంబం షిఫ్ట్ అవుతుంది. అదే కాలనీకి చెందిన అమ్మాయి (ప్రీతీ నేహా) వీళ్లకు సాయం చేయడానికి వస్తుంది. ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడిన సాత్విక్.. 'నీతో రొమాన్స్‌ చేయాలని ఉంది' అని తొలి పరిచయంలోనే అడిగేస్తాడు. అమ్మాయి దీన్ని సిల్లీగా తీసుకుంటుంది. సాత్విక్‌ మాత్రం టైమ్‌ టేబుల్‌ వేసుకొని మరీ, ఆమెని ఫాలో అవుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో సాత్విక్‌తో అమ్మాయి రొమాన్స్‌కి ఒప్పుకొంటుంది. కానీ కండీషన్‌ పెడుతుంది. ఆ కండీషన్ ఏంటి? ప్రాణంగా ప్రేమించిన వాడిని ప్రీతీ ఎందుకు దూరం పెట్టింది? అమ్మాయి కోసం అతడు పిచ్చోడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'మాస్ జాతర'తో పాటు ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement