మరోవారం వచ్చేసింది. ఈసారి రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా', కీర్తి సురేశ్ 'రివాల్వర్ రీటా', ధనుష్ 'అమర కావ్యం' లాంటి పెద్ద సినిమాలతో పాటు అంధక, ఖైదు, స్కూల్ లైఫ్, మరువ తరమా! లాంటి తెలుగు చిన్న మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి. ఉన్నంతలో రామ్ మూవీపై మాత్రమే కాస్తోకూస్తో హైప్ ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ 15 వరకు సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.
(ఇదీ చదవండి: 23 ఏళ్ల ప్రేమ.. గుళ్లో పెళ్లి చేసుకున్న సీరియల్ జంట)
ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో ఆర్యన్, శశివదనే చిత్రాలు కొద్దో గొప్పో చూసే లిస్టులో ఉండగా.. ఈ వీకెండ్‌లో రవితేజ 'మాస్ జాతర' కూడా స్ట్రీమింగ్ కానుందనే టాక్ వినిపిస్తుంది. ఇవి కాకుండా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఐదో సీజన్, జాన్వీ కపూర్ 'సన్నీ సంస్కారీ కీ తులసి' కూడా ఉన్నాయి. కాకపోతే వీటికి సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీస్ రాబోతున్నాయంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 24 నుంచి 30వ తేదీ వరకు)
నెట్‌ఫ్లిక్స్
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 26
జింగిల్ బెల్ హైస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 26
సన్నీ సంస్కారి కీ తులసి కుమారి (హిందీ చిత్రం) - నవంబరు 27
మాస్ జాతర (తెలుగు మూవీ) - నవంబరు 27 (రూమర్ డేట్)
ఆర్యన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 28
లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ (మాండరిన్ మూవీ) - నవంబరు 28
హాట్‌స్టార్
బార్న్ హంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28
అమెజాన్ ప్రైమ్
వుయ్ ఆర్ గ్రీన్ లాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - నవంబరు 24 (రెంట్ విధానం)
జీ5
రేగాయ్ (తమిళ సిరీస్) - నవంబరు 28
ద పెట్ డిటెక్టివ్ (మలయాల సినిమా) - నవంబరు 28
రక్తబీజ్ (బెంగాలీ మూవీ) - నవంబరు 28
సన్ నెక్స్ట్
శశివదనే (తెలుగు సినిమా) - నవంబరు 28
ఆపిల్ టీవీ ప్లస్
ప్రీ హిస్టారిక్ ప్లానెట్: ఐస్ ఏజ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 26
వండ్‌లా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 26
లయన్స్ గేట్ ప్లే
ప్రీమిటివ్ వార్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28
(ఇదీ చదవండి: మాజీమంత్రి ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ.. బ్రహ్మానందం క్లారిటీ)


