సంగీత్ శోభన్ హీరోగా మానసా శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నయన సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను గురువారం విడుదల చేసి, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘‘ఇదొక ఫ్యాంటసీ కామెడీ మూవీ. ఒకపాట, నాలుగు రోజుల టాకీపార్ట్ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్.


