Sangeeth Shobhan
-
‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత మెగా డాటర్ నిహారిక నిర్మించిన రెండో చిత్రం రాకస. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్స్..మరే చిత్రానికి చేయలేదు. మెగా హీరోలు కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ట్రైలర్, టీజర్లు కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇలా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? నిర్మాతగా నిహారిక ఖాతాలో రెండో విజయం పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్ వీరు(సంగీత్ శోభన్).. తన ప్రియురాలు సుకన్యను పెళ్లి చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో సుకన్య పెళ్లికి రెడీ అవుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న సమయంలోనే సోము(వెన్నెల కిశోర్) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని పాస్‌పోర్ట్‌ని పోలీసులు తీసుకెళ్తారు. సోము జాడని కనిపెడితే తన పాస్‌పోర్టు తిరిగి వస్తుందని.. స్నేహితుడు బాలు(గెటప్ శ్రీను)తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా తిష్టవేసుకొని ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరంతా కలిసి ఓ ముసలాడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. చివరి క్షణంలో అతను చనిపోతాడు. అతనికి బదులుగా బాలు పోవాల్సి ఉండగా.. వీరూ అడ్డుపడతాడు. దీంతో బాలుకి బదులుగా వీరూ ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కోట ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఏంటి? నిజంగానే ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడా? సుబ్బులక్ష్మి(నయన్ సారిక) ఎవరు? ఆమె ఎందుకు కోటలోకి వెళ్లింది? సోము సంగతి ఏంటి? నిజంగా చనిపోయాడా? లేదా బతికే ఉన్నాడా? బలి కోసం కోటలోకి వెళ్లిన తర్వాత వీరూకి ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి ప్రాణాలలో బయటకు వచ్చాడా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. హారర్ కామెడీ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నటీనటులు, కథను పట్టించుకోరు. భయపెడుతూ నవ్విస్తే చాలు.. ఆ సినిమాను ఆదరిస్తారు. రాకస టీమ్ కూడా అదే పని చేసింది. చిన్నప్పుడు చదువుకున్న బకాసురుడి కథను స్ఫూర్తిగా తీసుకొని దర్శకురాలు మానస శర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే హారర్ కంటే ఎక్కువగా కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టారు. అది బాగానే వర్కౌట్ అయింది కూడా. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసే సన్నివేశాలతో ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాను తీర్చిదిద్దారు.పాడుబడ్డ కోట..ఆ కోటకు వెయ్యేళ్ల చరిత్ర.. బ్రహ్మరాక్షసుడి కండీషన్..ఇలా సినిమా ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. ఎప్పుడైతే హీరో ఎంట్రీ ఇస్తాడో కథనం కామెడీ వైపు టర్న్ తీసుకుంటుంది. ప్రియురాలి కోసం అమెరికా నుంచి రావడం..అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం.. ఊరి పెద్దల తీర్పుతో పాస్‌పోర్టు కోల్పోవడం..ఇందంతా కామెడీగా సాగిపోతాయి. అయితే ఈ తరహా పంచ్‌లు, కామెడీ సీన్లు చాలా సినిమాల్లో చూడడంతో ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోదు. అసలు కథను ప్రారంభించడానికి ఇదంతా సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్‌తో కథపై ఆసక్తి పెరుగుతుంది. హీరో ఎప్పుడైతే కోటలోకి ప్రవేశిస్తాడో.. అప్పటి నుంచి కథనం పరుగులు పెడుతూ.. నవ్వులు పూయిస్తుంది. బ్రహ్మరాక్షసుడి సీన్ భయపడితే..దెయ్యాల సీన్ నవ్వులు పూయిస్తుంది. ఇక గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, నయన్ సారిక కూడా కోటలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నవ్వులు డబుల్ అవుతాయి. అదే సమయంలో బ్రహ్మరాక్షసుడి నుంచి ఈ గ్యాంగ్ ఎలా తప్పించుకుంటుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గా అనిపిస్తుంది. అయితే సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. ఈ రోజుల్లు దెయ్యాలు, రాక్షసులు ఉంటాయా? అని లాజిక్కులు వెతక్కుండా సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. సంగీత్ శోభన్ మంచి నటుడు. ఏ పాత్రలోనైనా ఇట్టే లీనమైపోతాడు. వీరూ పాత్రలో కూడా ఒదిగిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్, సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నయన్ సారిక తెరపై అందంగా కనిపించింది. వీరిద్దరి లవ్‌ట్రాక్ అంతగా పండలేదు కానీ.. బోర్ మాత్రం కొట్టించదు. గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. కోటలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఇలాంటి సినిమాకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. కొన్ని చోట్ల బీజీఎంతోనే భయపెట్టాలి. ఈ విషయంలో సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్ విజువల్స్ బాగుతున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిహారిక ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. గ్రాండ్ లెవల్ లో సినిమాను నిర్మించారు. -
‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పావు గంట కథ విని ఓకే చెప్పారు: మానస శర్మ
‘‘రాకాస’ కథని నిహారికగారు ఓ పావు గంట వినగానే నమ్మకంతో వెంటనే ఓకే చెప్పారు. ఈ సినిమా ఔట్పుట్ కూడా ఆమెకు నచ్చాలని నేను మరింత బాధ్యతగా పని చేశాను. డైరెక్టర్‌గా ‘రాకాస’ నా తొలి ఫీచర్ ఫిల్మ్. నాకు వెబ్ సిరీస్‌లు చేసిన అనుభవం ఉండటంతో ‘రాకాస’ తీయడం సవాల్‌గా అనిపించలేదు’’ అని డైరెక్టర్ మానస శర్మ పేర్కొన్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో చిత్రదర్శకురాలు మానస శర్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేశాను. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా చేశాను. అనంతరం ‘బెంచ్ లైఫ్’ సిరీస్ చేశాను. ‘రాకాస’ని ఫ్యాంటసీ, అడ్వెంచర్, కామెడీ జానర్లో తీశాం. సంగీత్ అద్భుతమైన నటుడు. అతని కామెడీ టైమింగ్ నాకు ఇష్టం.నయన్ సారిక ప్రతిభ, నటన చూసి ఈ చిత్రంలోకి తీసుకున్నాం. థియేటర్లో చూసి, ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చిత్రమిది. అనుదీప్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నిహారికగారు మంచి నిర్మాత. ఇక నా తర్వాతి ప్రాజెక్టుల కోసం ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా ఉండేలా చూసుకుంటాను’’ అని తెలిపారు. -
అప్పటి నుంచి మా నాన్న డబ్బులు తీసుకోవట్లేదు : నిహారిక
మెగా డాటర్ నిహారిక నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్‌ని స్థాపించి, 2024లో ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాను నిర్మించారు. తొలి సినిమానే సూపర్ హిట్ అయింది. భారీ కలెక్షన్స్‌తో పాటు బోలెడు అవార్డులను తెచ్చిపెట్టింది. కాస్త గ్యాప్ తీసుకొని రెండో చిత్రంగా ‘రాకాస’ అనే హారర్ కామెడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమా టీజర్‌ని ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. తన సినీ జర్నీ గురించి నిహారిక ఆసక్తికర విషయాలను పంచుకుంది. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోకుండానే చిత్రాలను నిర్మిస్తున్నానని నిహారిక చెప్పింది.‘నేను యాంకర్‌గా 2015లో ఢీ జూనియర్ షో చేశా. అప్పుడు నాకు 20 ఏళ్లు. అప్పటి నుంచే మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం ఆపేశా. తండ్రిగా ఆయన నాకు అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇస్తాడు. అది ఆయనకు నాపై ఉన్న ప్రేమ మాత్రమే. అందుకే తీసుకుంటాను. అంతేకాని సినిమాలను నిర్మించేంత డబ్బులను మా నాన్న నుంచి తీసుకోలేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది.సొంత బ్యానర్లో ఎందుకు నటించడం లేదని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నాకు ఎవరైనా కథ చెప్పడానికి వచ్చినప్పుడు.. నేనే నటించాలి అనే కండీషన్ పెట్టను. ముందు కథ వింటాను. దానికి సెట్ అయ్యే నటీనటులను మాత్రమే తీసుకుంటాం.అంతేకానీ.. ఈ సినిమాలో నన్నే హీరోయిన్గా పెట్టుకోవాలని అని కండీషన్ పెట్టను. ఒకవేళ వాళ్లు చెప్పే కథకు నేనే సెట్ అవుతాను అనుకుంటే కచ్చితంగా నటిస్తాను. ఇప్పటి వరకు మాత్రం నా దగ్గరకు అలాంటి కథలు రాలేదు. అందుకే నటించలేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది.ఇక సినిమాల్లోకి వస్తానంటే ఇంట్లోవాళ్ల రియాక్షన్ ఏంటి అని మరో రిపోర్టర్ అడగగా.. ‘నేను ముందుగా డాక్టర్ అవుదాం అనుకున్నా. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే..వద్దని చెప్పారు. అందులో ఉండే మంచి, చెడులను వివరించారు. మా బంధువులలో కొంతమంది డాక్టర్లు ఉన్నారు. వాళ్లు కూడా ‘వద్దు..కష్టంగా ఉంటుంది’ అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లోకి వస్తానని చెప్పా. అప్పుడు కూడా ఇంట్లోవాళ్లు.. ఇండస్ట్రీలో ఉండే మంచి, చెడులను వివరించారు. ఆ తర్వాత నీ ఇష్టం అని మాత్రమే చెప్పారు. డాక్టర్ కంటే యాక్టర్ అవ్వడమే కాస్త ఈజీ అనిపించింది. అందుకే సినిమాల్లోకి వచ్చేశా’ అని నిహారిక చెప్పుకొచ్చింది. -
అమలాపురంలో సందడి చేసిన 'రాకాస' మూవీ టీమ్ (ఫొటోలు)
-
ఏప్రిల్‌లో రాకాస
సంగీత్ శోభన్ హీరోగా మానసా శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నయన సారిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను గురువారం విడుదల చేసి, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘‘ఇదొక ఫ్యాంటసీ కామెడీ మూవీ. ఒకపాట, నాలుగు రోజుల టాకీపార్ట్ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్. -
నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు)
-
నిహారిక కొణిదెల కొత్త మూవీ.. హీరోయిన్ దొరికేసింది
‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల్లో నటించిన సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) సోలో హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మానసా శర్మ దర్శకత్వం వహించనున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత నిహారిక కొణిదెల నిర్మించనున్న చిత్రం ఇది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ‘ఆయ్, క’ చిత్రాల ఫేమ్ నయన్ సారిక (Nayan Sarika)ను ఎంపిక చేసినట్లుగా మేకర్స్ గురువారం ప్రకటించారు. ‘‘జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (ఇందులో సంగీత్ శోభన్ లీడ్ యాక్టర్) వెబ్ సిరీస్‌కి రచయితగా, ‘బెంచ్లైఫ్’ సిరీస్‌కి దర్శకురాలిగా చేసిన మానసా శర్మ దర్శకత్వం వహించనున్న తొలి చిత్రం ఇది’’ అని యూనిట్ పేర్కొంది. The beautiful @UrsNayan joins the joyride that is #ProductionNo2!Excited for all the fun ahead with this amazing team ❤️😎#PEP2@IamNiharikak #SangeethShobhan #ManasaSharma @anudeepdev #MaheshUppala @manyam73 @beyondmediapres @Ticket_Factory pic.twitter.com/G7LwesEqHG— Pink Elephant Pictures (@PinkElephant_P) June 26, 2025 చదవండి: స్టార్ సింగర్ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే? -
జూదం కోసం సీక్రెట్ సొసైటీ.. ఆసక్తికరంగా ‘గ్యాంబ్లర్స్’ ట్రైలర్
సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’ (Gamblers). చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘ఆడడం చేతగానివాడికి జూదం అంటే నేరం అనిపిస్తుంది. ఆడడం తెలిసిన వాడికి జూదం నేరం కాదు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభం అయింది. సీక్రెట్ సొసైటీలోకి ఆహ్వానించడం.. అక్కడ ఏది నిజం కాదు చెప్పడం.. రూ.100 కోట్ల డైమండ్ మిస్ అయినట్లు ట్రైలర్లో చూపించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు.ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత రాజ్ కుమార్ బృందావనం మాట్లాడుతూ '' గతంలో మా సంస్థలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో 'శ్రీవల్లి' అనే సినిమాను నిర్మించాం. తాజాగా మరో వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తాజాగా 'గ్యాంబ్లర్స్' చిత్రాన్ని నిర్మించాం. సినిమాలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్గా అందరి మనసులను ఈ చిత్రం దోచుకుంటుంది' అన్నారు. మరో నిర్మాత సునీత మాట్లాడుతూ ''యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి. మా సంస్థ నుంచి రాబోతున్న మరో వైవిధ్యమైన చిత్ర. మా బ్యానర్ నుంచి కొత్త కాన్సెప్ట్‌లు చిత్రాలు అందించాలన్నదే మా లక్ష్యం.ఈ సినిమాలో డిఫరెంట్ సంగీత్ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి అంశం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నూతన ప్రతిభను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో మా బ్యానర్లో సినిమాలు చేస్తున్నాం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మా పాటలను విడుదల చేశాం' అన్నారు. దర్శకుడు కేఎస్కే చైతన్య మాట్లాడుతూ '' ఈ చిత్ర కథ చెప్పగానే నిర్మాతలు ఎంతో ఎక్జ్సైట్ అయ్యారు. ఫుల్ ఫ్యాకేజీలా ఈ సినిమా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి. కామెడీ, గ్లామర్, మిస్టరీ కలబోతగా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త లోకంలో ఉంటారు. సరికొత్తగా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నాం. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ పర్పార్మెన్స్ పొటెన్షియాలిటీని చూడబోతున్నారు అన్నారు. -
మ్యాడ్ స్క్వేర్ తర్వాత గ్యాంబ్లర్స్.. టీజర్ చూశారా?
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఒక ఐలాండ్‌లో జరిగే జూదం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. కేఎస్కే చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రశాంతి చారులింగ హీరోయిన్గా, రాకింగ్ రాకేశ్ ముఖ్యపాత్రలో నటించారు. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించారు. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ చూస్తే కథలో అనేక థ్రిల్లింగ్ అంశాలతో పాటు ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. -
జూన్‌లో గ్యాంబ్లర్స్
‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. కేఎస్కే చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రశాంతి చారులింగ హీరోయిన్గా, రాకింగ్ రాకేశ్ ముఖ్యపాత్రలో నటించారు. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించారు. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, సంగీత్ ఫస్ట లుక్‌ను విడుదల చేశారు.కేఎస్కే చైతన్య మాట్లాడుతూ– ‘‘మిస్టరీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. సంగీత్ నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని సునీత, రాజ్‌కుమార్ తెలిపారు. -
'మ్యాడ్' హీరోతో మెగా డాటర్ కొత్త సినిమా
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్.. ఇప్పుడు హీరోగా మరో మూవీ ఓకే చేశారు. 'కమిటీ కుర్రాళ్లు' మూవీతో నిర్మాతగా తొలి హిట్ అందుకున్న నిహారిక.. ఇప్పుడు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.(ఇదీ చదవండి: మరోసారి తల్లి కాబోతున్న 'బుజ్జిగాడు' నటి)నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని ప్రారంభించింది. మానస శర్మ అనే కొత్తమ్మాయిని దర్శకురాలిగా పరిచయం చేస్తోంది. గతంలో ఈమె.. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీసులకు దర్శకత్వం వహించింది. ఇప్పుడు సినిమాకు డైరెక్షన్ వహించబోతుంది. ఇదివరకే నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ లో సంగీత్ శోభన్ నటించాడు. దానికే మానస శర్మ కూడా పనిచేసింది. అప్పుడు ఓటీటీ సిరీస్ కోసం పనిచేసిన ఈ ముగ్గురు.. ఇప్పుడు సినిమా కోసం ఒక్కటయ్యారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాదే రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) -
'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ
టైటిల్ : మ్యాడ్ స్క్వేర్నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్, తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర హారిక, సాయి సౌజన్యసమర్పకులు: ఎస్. నాగ వంశీఎడిటింగ్: నవీన్ నూలిదర్శకత్వం, కథ: కల్యాణ్ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో, తమన్‌సినిమాటోగ్రఫీ: శామ్దత్విడుదల: మార్చి 28, 2025'మ్యాడ్ స్క్వేర్'తో(Mad Square) మరోసారి నవ్వులు పూయించేందుకు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ థియేటర్స్‌లోకి వచ్చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నేడు (మార్చి 28) సినిమా విడుదలైంది. కాలేజీ నేపథ్యంతో పరిచయం అయిన కొందరు స్నేహితులు వారి చదువులు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఒకచోట కలిస్తే వారి అల్లరి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లో చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి పారిపోయే సంఘటన నుంచి మ్యాడ్ పార్ట్-1 కథ మొదలవుతుంది. ఫైనల్‌గా ఆ విద్యార్థి RIEలోనే చదివి తీరుతాననే నిర్ణయంతో కథ ముగుస్తుంది. ఇప్పుడు లడ్డు గాడి పెళ్లితో మ్యాడ్ స్క్వేర్ కథ ప్రారంభమౌతుంది. కాలేజీ నుంచి తమ చదవులు పూర్తి చేసిన తర్వాత వారు ఏం చేశారనేది మ్యాడ్ స్క్వేర్‌లో ఫుల్ ఫన్‌తో దర్శకుడు చూపించాడు.కథేంటంటే..ఈ కథలో పెద్దగా లాజిక్స్ అంటూ ఏమీ ఉండవ్.. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. అశోక్ (నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్), దామోదర్(సంగీత్ శోభన్),లడ్డు(విష్ణు) నలుగురు స్నేహితులు ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత విడిపోతారు. కానీ, లైఫ్‌లో సెటిల్ కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లడ్డు(విష్ణు) పెళ్లి నుంచి ఈ సినిమా అసలు కథ మొదలౌతుంది. స్నేహితులకు చెప్పకుండా లడ్డు పెళ్లికి రెడీ అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు వేడక సమయంలో సడెన్‌గా ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ఫన్ మొదలౌతుంది. లడ్డుకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి మురళీధర్ గౌడ్ ఎదురు కట్నం ఇచ్చి సంబంధం సెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి చెడిపోకూడదని లడ్డూ ఫ్యామిలీ పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ఫ్రెండ్ పెళ్లి ఘనంగా చేయాలని దామోదర్, అశోక్, మనోజ్ అనేక ప్లాన్స్ వేస్తుంటారు. వారి హంగామాకు తోడు పెళ్లికూతురు ఫ్యామిలీ నుంచి లడ్డూకు ఎదురయ్యే అవమానాలు కడుపుబ్బా నవ్విస్తాయి. తన స్నేహితులు చేసే తుంటరి పనుల వల్ల ఆ పెళ్లిలో చాలా గందరగోళం నెలకొంటుంది. పెళ్లి జరుగుతున్నంత సేపు ఎక్కడ ఆ కార్యక్రమం ఆగిపోతుందో అనే భయంతో లడ్డు ఉంటాడు. సరిగ్గా పెళ్లి అవుతుందని సమయంలో లడ్డు స్నేహితులతో పాటు వచ్చిన ఒక వ్యక్తితో పెళ్లికూతురు వెళ్లిపోతుంది. ఈ విషయం తెలిశాక లడ్డూ ఇంట్లో జరిగే పంచాయితీ, అక్కడ మ్యాడ్ గ్యాంగ్ చేసే అతి ఫుల్‌గా నవ్విస్తుంది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న లడ్డు కోసం కాస్త రిలాక్స్ ఇవ్వాలని వారందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వారు ఎంట్రీ ఇచ్చాక గోవా మ్యూజియంలో విలువైన లాకెట్‌ను గోవాలో పెద్ద డాన్‌గా ఉన్న మ్యాక్స్ (సునీల్) మనుసులు దొంగలిస్తారు. దానిని లడ్డు బ్యాచ్ చేశారని పోలీసులు అనుమానిస్తారు. దీంతో వారిపై నిఘా ఉంచుతారు. అయితే, ఒక ఘటనలో ఆ లాకెట్ లడ్డు చేతికి దొరుకుతుంది. దీంతో దానిని తిరిగి తెచ్చివ్వాలని లడ్డు తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేస్తాడు. ఈ కేసును చేధించేందుకు ఒక ఐపీఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లడ్డు బ్యాచ్‌లో ఉన్న ఆ అధికారి ఎవరు..? లడ్డుని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయితో ఎందుకు వెళ్లిపోయింది...? వారిద్దరూ కూడా గోవాకే ఎందుకు వెళ్తారు..? చివరిగా ఆ లాకెట్ కథ ఏంటి.. ఎవరి వద్ద ఉంటుంది..? ఫైనల్‌గా లడ్డును తన స్నేహితుడే జైలుకు ఎందుకు పంపుతాడు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?మ్యాడ్ స్క్వేర్ విడుదలకు ముందే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కథ గురించి పెద్దగా ఏమీ ఉండదని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే కథ బలం ఉండదు. కానీ, నవ్వులతో వంద శాతం ఎంటర్టైన్ చేస్తారు. ప్రతి సీన్లో వరుస పంచ్‌లతో నవ్విస్తారు. డీడీ, లడ్డు గ్యాంగ్ కావాల్సినంత హంగామా చేస్తారు. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో వారు వినోదాన్ని పంచుతారు. పార్ట్-1లో కాలేజి క్యాంపస్‌ను ఎంచుకున్న దర్శకుడు.. పార్ట్‌లో లడ్డు గాడి పెళ్లి, గోవా కాన్సెప్ట్‌ను ప్రధానంగా ఎంచుకున్నాడు. యువతను ఆకట్టుకునేలా ఫుల్ పంచ్‌లతో సినిమా ఉంటుంది. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు దర్శకుడు కల్యాణ్ శంకర్. కాలేజీలో మొదలైన స్నేహం.. ఆ తర్వాత కూడా ఎంత మధురంగా ఉంటుందో లడ్డు కథతో దర్శకుడు చెప్పాడు. (ఇదీ చదవండి: ‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ)ఈ కథలో ప్రధాన పాత్రధారులైన మనోజ్, అశోక్, దామోదర్ల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే టైటిల్ పెట్టి హిట్ కొట్టాడు. ఇప్పుడు దానికి లడ్డుగాడి కథన కలిపి మ్యాడ్ స్క్వేర్ చేశాడని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో కథ గోవా షిఫ్ట్ అయ్యాక ఇంకాస్త స్పీడ్ పెంచాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా లడ్డు పెళ్లితో ఫుల్ ఎంటర్టైన్ చేస్తే రెండో భాగం కాస్త ఫన్ నెమ్మదిస్తుంది. మ్యాక్స్ గ్యాంగ్ చేసే దొంగతనం మ్యాడ్ గ్యాంగ్‌కు చుట్టుకోవడం. ఆపై లడ్డూ తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేయడం.. ఆయన్ని ఎలాగైనా కాపాడాలని డీడీ, లడ్డూ, అశోక్, మనోజ్ చేసే ప్రయత్నాలు సెకండాఫ్‌లో ఉంటాయి.సునీల్, లడ్డు ఫాదర్ మురళీధర్ మధ్య సీన్స్ బాగున్నాయి. సత్యం రాజేష్ పోలీసు పాత్ర నుంచి వచ్చే ప్రతి సీన్ కాస్త ఫోర్స్డుగా ఉంటుంది. సినిమాలో హిట్ సాంగ్ స్వాతిరెడ్డి కూడా సరైన పాయింట్లో లేదు అనిపిస్తుంది. ప్రియాంక జవల్కార్ను కామియో రోల్ ఇచ్చారు. కానీ, అంత ఎట్రాక్ట్ అనిపించలేదు. లడ్డు మీద వరుస పంచ్‌లు పడుతున్నా సరే సినిమాను ఫుల్ స్వింగ్‌లో నడిపించాడని చెప్పవచ్చు. అక్కడక్కడ మినహాయిస్తే.. విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో ఫుల్ వినోదం ఉంటుంది. రెండు గంటలపాటు బాగా ఎంజాయ్ చేసే థియేటర్ నుంచి ప్రేక్షకుల బయటకు వస్తారని చెప్పవచ్చు.ఎవరెలా చేశారంటే..?మ్యాడ్-1లో చాలా పాత్రలు ఉంటాయి.. అక్కడ అన్ని క్యారెక్టర్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది. కానీ, ఇందులో కొన్నింటికి తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నార్నె నితిన్ తనదైన స్టైల్లో సెట్ అయిపోయాడు. లడ్డూగా విష్ణు తన నటన తీరుతో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాకు ప్రధాన బలం లడ్డునే అని చెప్పవచ్చు. సంగీత్ శోభన్ డీడీగా తన వేగం ఎక్కడా తగ్గనివ్వకుండా పంచ్ డైలాగ్స్ పేలుస్తూనే ఉంటాడు. ఎక్కడా కూడా తన ఎనర్జీ తగ్గకుండా మెప్పిస్తాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ సైలెంట్‌గా లవర్ బాయ్‌లా తన ఫెయ్యిల్యూర్ స్టోరీ చెబుతూ చుట్టేస్తూ ఉంటాడు. రఘుబాబు, మురళీధర్ గౌడ్లు తమ పాత్రల పరిధి మేరకు నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ మరోసారి అతిథి పాత్రలో కనిపించింది కొద్దిసేపు మాత్రమే అయినప్పటికీ ప్రేక్షకులతో విజిల్స్ వేపించేలా చేశాడు. మ్యాక్స్ పాత్రలో సునీల్ విలనిజమే కాకుండా కామెడీని కూడా పండించాడు. శుభలేఖ సుధాకర తన పాత్ర పరిమితిమేరకు పర్వాలేదు. మ్యాడ్ స్క్వేర్ కథలో పెద్దగా బలం లేకున్నప్పటికీ దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన విధానం బాగుంది. కానీ, సంభాషణల విషయంలో బలవంతంగా నవ్విద్దాం అనేలా కొన్ని సీన్లు ఉన్నాయి. పాటల విషయంలో భీమ్స్ ఇంకాస్త శ్రద్ధ పెట్టింటే బాగుండు. తమన్ బీజీఎమ్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి సూపర్ అనిచెప్పవచ్చు. నిర్మాణం పరంగా ఉన్నంతమేరకు బాగుంది. నిర్మాతలు సూర్యదేవర హారిక, సాయి సౌజన్యలకు మ్యాడ్ స్క్వేర్ మంచి విజయాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న మ్యాడ్ స్క్వేర్.. ఇక థియేటర్లలో నవ్వులే!
గతంలో బాక్సాఫీస్ వద్ద యూత్‌ను అలరించిన సినిమా మ్యాడ్. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న మ్యాడ్ స్క్వేర్తో మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మన యంగ్ హీరోలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్. ఈ చిత్రాన్ని కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే మ్యాడ్ మూవీ మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. మ్యాడ్ స్క్వేర్ సెన్సార్ పూర్తయినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ సినిమా మార్చి 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.Manaki yedi thinnaga jaragavu gaa…Idhi anthe …Mission Censor: Completed ☑️#MADSquare certified U/A for a fun packed theatrical ride ❤️Theatres lo kooda anni light lu velige entertainment tho siddam 😎In cinemas worldwide from MARCH 28th! 🥳@NarneNithiin… pic.twitter.com/HRDODIX4ib— Sithara Entertainments (@SitharaEnts) March 24, 2025 -
MAD OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మ్యాడ్’.. స్ట్రీమింగ్ ఎక్కడ,ఎప్పుడు?
చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన మూవీ ‘మ్యాడ్’. కాలేజీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్తవారే అయినప్పటికీ ప్రచార చిత్రాలతో తొలి నుంచే మ్యాడ్పై హైప్ క్రియేట్ అయింది. అక్టోబర్ 6న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం..అంచనాలకు తగ్గట్టే మంచి విజయం సాధించింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్..తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. నవంబర్ 3 నుంచి ఈ చిత్రం నెట్‌ఫిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేస్తూ..‘మిమ్మలందర్ని పిచ్చెక్కించే ఒక శుభవార్త. మ్యాడ్ చిత్రం నవంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని రాసుకొచ్చింది. ‘మ్యాడ్’ కథేంటి? మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు.ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్ ఇంట్రావర్ట్‌గా ఉంటాడు. మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు. అశోక్‌ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్‌కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్‌తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో MAD(మనోజ్, అశోక్, దామోదర్) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ. Mimmalnandarini picchekinche oka subhavaartha. MAD cinema 3rd November nunchi Netflix lo stream avabothundhi. #MADonNetflix pic.twitter.com/m5xKGH1vwj — Netflix India South (@Netflix_INSouth) October 30, 2023 -
ఓటీటీలో 'ప్రేమ విమానం' సినిమాకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్
థియేటర్లలో సినిమాలు సంగతెలా ఉన్నా ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా అలా జీ5లో రిలీజైన 'ప్రేమ విమానం' చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. 'మ్యాడ్' సినిమాతో థియేటర్లలో హిట్ కొట్టిన సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్ పడింది. ఈ క్రమంలోనే ఓ అరుదైన మార్క్ చేసుకుందీ సినిమా. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) విమానం ఎక్కాలని కలలుకనే ఇద్దరు చిన్న పిల్లలు.. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా 'ప్రేమ విమానం' సినిమా తీశారు. విడుదలైన వారం పదిరోజుల్లోనే ఈ వెబ్ మూవీ 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ చేరుకుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా కొడుకులు దేవాన్ష్, అనిరుధ్ నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రలు చేశారు. సంతోష్ కటా దర్శకుడు కాగా.. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) Our heartwarming movie #PremaVimanam has skyrocketed past 50 million streaming minutes, making it the ultimate winner this Dussehra season! 🎉 You can't afford to miss #PremavimanamOnZEE5, currently available for streaming on https://t.co/aXxsNkGNGi. Prepare to be enchanted by… pic.twitter.com/RS92IQjlZA — ABHISHEK PICTURES (@AbhishekPicture) October 21, 2023 -
‘ప్రేమ విమానం’ మూవీ రివ్యూ
టైటిల్: ప్రేమ విమానం నటీనటులు: అనసూయ భరద్వాజ్, సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, 'వెన్నెల' కిశోర్ తదితరులు నిర్మాణ సంస్థలు: అభిషేక్ పిక్చర్స్, జీ 5 నిర్మాత: అభిషేక్ నామా దర్శకత్వం: సంతోష్ కట్టా సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి విడుదల తేది: అక్టోబర్ 12, 2023 ఓటీటీ వేదిక: జీ5 ‘ప్రేమ విమానం’ కథేంటంటే.. రాము(దేవాన్ష్ నామా), లక్ష్మణ్ అలియాస్ లచ్చి (అనిరుధ్ నామా) చిన్న పిల్లలు. విమానం ఎక్కాలనేది వారిద్దరి కోరిక. తమ కోరికను తండ్రి(రవివర్మ)కి చెబితే..పంటలు పండిన తర్వాత కచ్చితంగా విమానం ఎక్కిస్తా అని మాటిస్తాడు. కొన్నాళ్లకే అప్పుల బాధతో తండ్రి ఉరేసుకొని మరణిస్తాడు. తల్లి శాంతమ్మ(అనసూయ భరద్వాజ్) కూలి పనికెళ్తూ పిల్లలను పోషించుకుంటుంది. వాళ్లు మాత్రం విమానం ఎక్కాలనే కోరికతో తల్లికి తెలియకుండా రకరకాలు పనులు చేస్తుంటారు. కట్ చేస్తే.. మణికంఠ అలియాస్ మణి(సంగీత్ శోభన్)కు ఆ ఊరి సర్పంచ్ కూతురు అభిత(శాన్వీ మేఘన)అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆమెకు కూడా మణిని ప్రేమిస్తుంది. ఆ కారణంగానే మణి ఉర్లోనే ఉంటూ తండ్రి(గోపరాజు రమణ)తో కలిసి కిరాణం కొట్టు రన్ చేస్తుంటాడు. అభితకు అమెరికా నుంచి సంబంధం రావడంతో తండ్రి ఆ పనుల్లో బిజీగా ఉంటాడు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని అభిత..మణితో కలిసి ఊరి నుంచి పారిపోతారు. దుబాయ్‌కి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసమే హైదరాబాద్ వస్తారు. మరోవైపు విమానం ఎక్కాలనే పిచ్చితో ఇంట్లో తల్లి దాచిన డబ్బును దొంగిలించి రాము, లక్ష్మణ్ హైదరాబాద్‌కు వస్తారు. ఎయిర్పోర్ట్ కోసం వెతుకుతుంటారు. అప్పుడు వారికి ఎదురైన సమస్యలు ఏంటి? రాము, లక్ష్మణ్‌లు.. మణి, అభితలకు ఎలా కలిశారు? విమానం ఎక్కాలనే వారి కోరిక నెరవేరిందా లేదా? ఊర్లో నుంచి కూతురు పారిపోయిన తర్వాత సర్పంచ్ ఏం చేశాడు? మణి, అభితలు దుబాయ్‌కి వెళ్లారా లేదా? చివరకు ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. టైటిల్‌కు దగ్గట్టే ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు విమానం స్టోరీ రెండూ ఉంటాయి. విమానం ఎక్కాలనే ఇద్దరి పిల్లల కోరిక.. ప్రేమను దక్కించుకోవాలనే ఓ జంట తపన ఈ చిత్రంలో చూడొచ్చు. ఓ వైపు పిల్లలు, మరో వైపు ప్రేమ జంట.. ఒకే సమయంలో రెండు డిఫరెంట్ కథలను చెబుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు కొంతమేర సఫలం అయ్యాడు. ఒకే సమయంలో రెండు డిఫరెంట్ సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా క్లైమాక్స్‌లో ఈ రెండు కథలను ముడిపెడుతూ అల్లుకున్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే పిల్లల కథ చూస్తున్నంత సేపు మనకు ఈ మధ్యే వచ్చిన ‘విమానం’సినిమా గుర్తుకొస్తుంది. మణి, అభితల లవ్‌స్టోరీలో కొత్తదనం లేదు కానీ బోర్ కొట్టదు. విమానం ఎక్కాలనే చిన్న పిల్లల కోరికను తెలుపుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. రైతు ఆత్మహత్యతో కథ ఎమోషనల్ వైపు టర్న్ తీసుకుంటుంది. డబ్బును చెల్లించేందుకు శాంతమ్మ పడే కష్టాలు భావోద్వేగానికి గురిచేస్తే.. విమానం ఎక్కేందుకు పిల్లలు చేసే పనులు.. స్కూల్ టీచర్ గోపాల్(వెన్నెల కిశోర్)ని అడిగే ప్రశ్నలు నవ్వులు పూయిస్తాయి. మరోవైపు మణి, అభిత లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. కథపై ఆసక్తి వచ్చేలోపు శుభం కార్డు పడుతుంది. రెండు వేరు వేరు కథలను బ్యాలెన్స్ చేయడంలో సఫలమైన దర్శకుడు..ఎమోషన్స్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చూపించడంలో మాత్రం విఫలం అయ్యాడు. సినిమాల్లో గుండెల్ని పిండేసే సన్నివేశాలు చాలా ఉన్నాయి కానీ వాటిని లైట్‌గా చూపించి వదిలేశాడు. స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త ఫోకస్ చేసి బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ముందుగా ఈ చిత్రంలో రాము, లచ్చి పాత్రల్లో దేవాన్ష్ నామా, అనిరుధ్ నామాల గురించి చెప్పుకోవాలి. వీరిద్దరికి తొలి సినిమా అయినా చక్కగా నటించారు. ముఖ్యంగా అనిరుధ్ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. ఇక ఈ మధ్యే ‘మ్యాడ్’ చిత్రంతో అలరించిన సంగీత్ శోభన్.. ఇందులో ప్రేమికుడుగా నటించి మెప్పించాడు. అతని కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సంగీత్‌కు జోడీగా శాన్వీ మేఘన తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. శాంతమ్మగా అనసూయ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. వెన్నెల కిశోర్, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


