నిహారిక కొణిదెల కొత్త మూవీ.. హీరోయిన్‌ దొరికేసింది | Nayan Sarika Pair up with Sangeeth Shobhan in Niharika Next Production | Sakshi
Sakshi News home page

మ్యాడ్‌ హీరో కొత్త సినిమా.. హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Jun 27 2025 11:25 AM | Updated on Jun 27 2025 12:07 PM

Nayan Sarika Pair up with Sangeeth Shobhan in Niharika Next Production

‘మ్యాడ్, మ్యాడ్‌ స్క్వేర్‌’ చిత్రాల్లో నటించిన సంగీత్‌ శోభన్‌ (Sangeeth Shobhan) సోలో హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మానసా శర్మ దర్శకత్వం వహించనున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమా తర్వాత నిహారిక కొణిదెల నిర్మించనున్న చిత్రం ఇది. ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు ‘ఆయ్, క’ చిత్రాల ఫేమ్‌ నయన్‌ సారిక (Nayan Sarika)ను ఎంపిక చేసినట్లుగా మేకర్స్‌ గురువారం ప్రకటించారు. 

‘‘జీ5తో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ రూపొందించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (ఇందులో సంగీత్‌ శోభన్‌ లీడ్‌ యాక్టర్‌) వెబ్‌ సిరీస్‌కి రచయితగా, ‘బెంచ్‌లైఫ్‌’ సిరీస్‌కి దర్శకురాలిగా చేసిన మానసా శర్మ దర్శకత్వం వహించనున్న తొలి చిత్రం ఇది’’ అని యూనిట్‌ పేర్కొంది.

 

 

చదవండి: స్టార్‌ సింగర్‌ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే?

Advertisement
 
Advertisement
Advertisement