
బిగ్బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి రెండోసారి తండ్రయ్యారు. ఇవాళ ఆయన సతీమణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆదిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా రెండోసారి కూడా కూతురు పుట్టడం సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే ఆదిరెడ్డి భార్యకు సీమంతం వేడుగ ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.
కాగా.. బిగ్బాస్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్ షోపై రివ్యూలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.