దురంధర్‌పై ప్రశంసలు.. నన్ను కావాలనే టార్గెట్ చేశారు: అనురాగ్ కశ్యప్ | Anurag Kashyap slams social media backlash against critics of Dhurandhar | Sakshi
Sakshi News home page

Anurag Kashyap: దురంధర్‌పై ప్రశంసలు.. కావాలనే టార్గెట్ చేశారు: అనురాగ్ కశ్యప్

Feb 13 2026 9:32 PM | Updated on Feb 13 2026 9:35 PM

Anurag Kashyap slams social media backlash against critics of Dhurandhar

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

పాకిస్తాన్ గూడఛార నేపథ్యంలో వచ్చిన ఈ మూవీపై చాలామంది ప్రశంసలు కురిపించారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్‌ అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత తనతోతో పాటు చాలామంది సినీ క్రిటిక్స్‌పై సోషల్ మీడియాలో వేధింపులు మొదలయ్యాయని ‍అన్నారు. ఇలాంటివీ కావాలనే కొందరు పనిగట్టుకుని చేస్తారని విమర్శించారు. ఈ వేధింపులకు గురైన వారిలో తాను ఒకడినని అనురాగ్ పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు  హాజరైన కశ్యప్ ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే ఈ చిత్రంలో కొన్ని సమస్యాత్మక అంశాలు ఉన్నప్పటికీ.. సినిమాను నిర్మించేటప్పుడు ఆదిత్య ధర్ ధైర్యాన్ని కూడా తాను గుర్తించానని తెలిపారు. ఒక ప్రాజెక్ట్ పట్ల తనకున్న అభిమానం.. దాని లోపాలను విస్మరించినట్లు కాదని స్పష్టం చేశారు. నాకు ఏదైనా నచ్చితే నా అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దే అలవాటు తనకు లేదన్నారు. దురంధర్‌ను ప్రశంసించినందుకు తనను కూడా ప్రశ్నించారని అన్నారు. ఒక చిత్రనిర్మాతగా ఈ మూవీతో ఆదిత్య ధర్  ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని తెలిపారు. అర్జున్ రాంపాల్ నటించిన సీన్‌ చూసి ఓ డైరెక్టర్‌గా తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

కాగా.. రణ్‌ వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్‌ చిత్రంలో  సారా అర్జున్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడి  కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement