
ప్రతి వ్యక్తిలో అంతర్లీనంగా ఎంతో కొంత ప్రతిభ దాగి ఉంటుంది. అయితే ఉప్పొంగేలా బయటకు రావాలంటే..బలమైన గాయం లేదా ఎదురదెబ్బ తగిలినప్పుడే కసితో బయటకు వస్తుంది. లేదా ఎవ్వరైనా..మనల్ని విమర్శిస్తూ ఇచ్చే సలహాలు జీవితాన్ని అనుహ్యంగా మలుపుతిప్పుతాయి. అలా తండ్రి కారణంగా మంచి యూటర్న్ తీసుకుంది ఆమె జీవితం. ప్రపంచం ముందు ఓ గొప్ప హోదాలో ఉన్న ప్రముఖ వ్యక్తిగా నిలిచేలా చేసింది. ఇది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన గొప్ప పేరెంటింగ్ పాఠం కూడా.
ఆమెనే యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్. ఆమె ఏమి వారసత్వంగా కంపెనీకి సీఈవోగా అయిపోలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ మారుమూల పట్టణం నుంచి క్లర్క్‌గా ఉద్యోగ జీవితం మొదలు పెట్టి తన అపారమైన ప్రతిభ పాటవాలతో ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీకి సీఈవో అయ్యిందామె. ఈ విజయం తన తండ్రి సపోర్ట్ వల్లే వచ్చిందని చెబుతుంటారామె. కారు పెయింటర్, ఆర్మీ వ్యక్తి అయినా ఆమె తండ్రి జూలీకి డబ్బు సంపాదన గురించి తరుచుగా చెబుతుండేవాడు.
ఒకరోజు ఆ తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ కూతురు జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పి అత్యున్నత స్థాయిలో నిలబెట్టింది. ఆ విషయాన్ని సీఈవో జూలీ స్వీట్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ఒక డిబేట్ టోర్నమెంట్ సెమీఫైనల్‌లో ఓటమిని చవిచూశానని నాటి సంఘటనను గుర్తుచేసుకుందామె. ఆ డిబేట్ పోటీలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడి కుమార్తె విజేతగా నిలిచింది. దాంతో తాను తన తండ్రితో తన బాధను పంచుకున్నట్లు చెప్పుకొచ్చింది జూలీ.
ఆమె లయన్స్ క్లబ్ కుమార్తె కాబట్టేగా ఫస్ట్ ఫ్రైజ్ ఇచ్చారు అంటూ తన నిరాశాసను వ్యక్తం చేసింది తండ్రి దగ్గర. దానికి అతడి తండ్రి నుంచి వచ్చిన శక్తిమంతమైన ప్రతిస్పందన జూలీ మనసుని బలంగా తాకింది. "నువ్వు ఎప్పటికీ లయన్స్ క్లబ్ కుమార్తెవి కాలేవన్నది నిజం. అంటే ఇక్కడ నువ్వు మెరుగ్గా ఉండేలి అదే నన్ను ప్రత్యేకంగా నిలబెట్టగలదు. ఈ ప్రపంచం న్యాయం గురించి మాట్లాడదు..అచంచలమైన టాలెంట్ ఉన్నవాడికి ఫిదా అవుతుంది. అదే గుర్తుపెట్టుకో ఈ క్షణం నువ్వు మెరుగ్గాలేవు అందువల్లే గెలవలేకపోయావు. విజేత కావాలనుకుంటే అనుక్షణం నిన్ను నువ్వు మెరుగుపరచుకుంటేనే వెనుకబడవు." అని తండ్రి సూచించాడు.
ఆ మాటలు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి. దాంతో ఆమె వెనుకబడటం అన్న మాట దరిచేరనీయకూడదు అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యింది. అలా తన ప్రతిభను సానబెట్టుకుంటూ టీనేజ్ వయసులో ఒక క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించుకుంది. అక్కడ నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ..న్యాయ సంస్థ క్రావత్ స్వైన్ & మూర్ నుంచి యాక్సెంచర్ జనరల్ కౌన్సెల్ సీఈవో స్థాయికి ఎదిగేలే చేసింది.
బలహీనతలను జయిస్తూ..తన చుట్టూ ఉన్న ప్రపంచం కంటే మెరుగ్గా ఉండటంపై శ్రద్ధ పెట్టింది, నేర్చుకోవడం అనేదాన్ని ఎన్నటికి వదలిపెట్టలేదు. అదే తన సక్సెస్ మంత్ర అని సగర్వంగా చెప్పింది జూలీ. ఇది నిజంగా గొప్ప పేరెంటింగ్ పాఠం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఓటమిని నిజాయితీగా అంగీకరించేలా చేస్తూ..తనలో ఆత్మవిశ్వాసాన్ని చైతన్యవంతం చేయాలి.
విజయం కోసం ఏం చేస్తే మంచిది అనేది సూటిగా చెప్పాలి. ఆ మాటలు పిల్లవాడిలో ఓటమికి చెక్ చెప్పేలా తయారయ్యేలా ఉండాలి. అంతేతప్ప ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా, ఇతరులతో పోల్చి చులకనభావం కలిగించేలా ఉండకూడదు. తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే ప్రతి మాట పిల్లవాడిపై తీవ్ర ప్రభావం చూపుతుందనేందుకు ఈ యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ కథే ఉదాహరణ.
(చదవండి: Punita Arora: ఎవరీ పునీతా అరోరా..? సైన్యం, నేవీలలో అత్యున్నత హోదాలు..)