భద్రాచలం: భక్తుల జయజయ ధ్వానాలు, శ్రీరామనామస్మరణల నడుమ శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామి జలవిహారం చేస్తుండగా గోదావరి తీరం పులకించింది.
కరకట్ట, స్నానఘాట్ల నిండుగా భక్త జనం వీక్షిస్తుండగా స్వామి వారు లాహిరి.. లాహిరి.. లాహిరిలో అంటూ జల విహారం చేశారు.
భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో శ్రీ సీతారాముల తెప్పోత్సవం కనులపండువగా సాగింది.


