తిరుమల: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ధనుర్మాస కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసిన అనంతరం వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనేక మంది ప్రముఖులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు.


