breaking news
Festival Celebration
-
సంస్కృతుల మేళవింపు నాగసాకి కుంచి
జపాన్‌లోని నాగసాకి నగరంలో అక్టోబర్ 7 నుంచి 9 వరకు ‘నాగసాకి కుంచి’ ఉత్సవం జరగనుంది. అత్యంత వైభవోపేతంగా, జనసంరంభంతో కొనసాగే ఈ వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మూడు రోజుల వేడుకలో నాగసాకి నగరవీథుల్లో రంగురంగుల రథాలను ఊరేగిస్తారు. ఊరేగింపుల్లో జనాలు సంప్రదాయ గీతాలను పాడుతూ, నృత్యం చేస్తూ ముందుకు సాగుతారు. ఈ వేడుకను తిలకించడానికి ఇప్పటికే దేశవిదేశాలకు చెందిన పర్యాటకులు నాగసాకి నగరానికి క్యూ కట్టారు.నాగసాకి నగరానికి సంరక్షక దేవతగా భావించే సువా ఆలయం కేంద్రంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పురాతనమైన సువా ఆలయంలో 1634లో దయూ–మాచి ప్రాంతానికి చెందిన తకావో, ఒతోహా అనే ఇద్దరు కళాకారిణులు ‘కోమీ’ అనే నోహ్ నాట్య గీతాన్ని ప్రదర్శించారట! అప్పటి నుంచే ‘నాగసాకి కుంచి’ ఉత్సవం మొదలైందని చెబుతారు. ఈ ఉత్సవం మొదలైన కాలంలోనే ‘దేజిమా’ అనే కృత్రిమ ద్వీప నిర్మాణం, మెగానే వంతెన నిర్మాణం జరగడం నాగసాకి చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు.వీథులే రంగస్థల వేదికలుఈ ఉత్సవంలో నగర వీథులే రంగస్థల ప్రదర్శన వేదికలుగా మారిపోతాయి. రంగురంగుల అలంకరణలతో రూపొందించిన రథాలు, డ్రాగన్ నృత్యాలు, సింహ నృత్యాలు, పడవ ఆకారంలోని రథాలు వీథుల్లో సందడి చేస్తాయి. తిమింగలం నీరు చిమ్మే ప్రదర్శన, కొక్కొడెషో వంటి ప్రత్యేక కళారూపాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నాగసాకిలోని పలు ప్రాంతాలకు చెందిన కళాకారుల బృందాలు ఈ ప్రదర్శనల్లో పాల్గొంటాయి. నగరంలో 58 ‘డాన్స్ టౌన్స్ ’ ఉండగా, వాటిని ఏడు బృందాలుగా విభజించారు. ప్రతి బృందానికి తమ కళారూపాలను ప్రదర్శించే అవకాశం ఏడేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. అందుకే ప్రతి ప్రదర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. సువా ఆలయం, ఒటాబిషో, యాసకా ఆలయం, చువో పార్క్ ప్రధాన ప్రదర్శన వేదికలుగా ఉంటాయి. కుంచి పేరు వెనుక...కుంచి అనే పేరుకు ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. చైనా చాంద్రమాన కేలండర్లో తొమ్మిదో నెల తొమ్మిదో రోజుతో దీనికి సంబంధం ఉన్నట్లు చెబుతారు. జపనీస్‌లో తొమ్మిదో రోజును ‘కు–నిచి’ అని పిలుస్తారు. కాలక్రమంలో అదే ‘కుంచి’గా మారిందని భావిస్తారు.సంస్కృతుల సంగమంనాగసాకి ఓడరేవు నగరం కావడంతో కాలక్రమంలో అనేక దేశాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ ప్రభావం కుంచి ఉత్సవంలోనూ కనిపిస్తుంది. జపాన్ సంప్రదాయ కళలతో పాటు చైనా, డచ్ సంస్కృతుల ప్రభావం కూడా కొన్ని ప్రదర్శనల్లో కనిపిస్తుంది. దీంతో ఈ ఉత్సవం నాగసాకి బహుళ సాంస్కృతిక చరిత్రకు ప్రతిబింబంగా నిలుస్తోంది. ‘నాగసాకి కుంచి’ దాదాపు నాలుగు శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. స్థానిక సంస్కృతిని కాపాడుకుంటూ, పర్యాటకులను ఆకట్టుకుంటూ నేటికీ అదే ఉత్సాహంతో కొనసాగుతోంది. రమా జంబుల -
10 నుంచి బతుకమ్మ వేడుకలు.. హైదరాబాద్ మొత్తం ఏం చేస్తున్నారంటే?
హైదరాబాద్: బతుకమ్మ పండగను ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై శనివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులు హాజయ్యారు. ఈ సందర్భంగా ఈనెల 18వ తేదీన సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ట్యాంక్ బండ్ పై వేలాది మంది మహిళలతో ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు సంజయ్ జాజు తెలిపారు. 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉండే అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చి ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు.ఈ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని పండగ శోభ వచ్చేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విధ్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశం ఉండడంతో వారికి ఏ విధమైన ఇబ్బందులూ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జన ఏర్పాట్లు అదే విధంగా, ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్ లో ఉన్న బతుకమ్మ ఘాట్ తో పాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ ఎంసీ అధికారులను సీఎస్ ఆదేశించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ట్యాంకు బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతుండడంతో ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు. అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని సూచించారు. బతుకమ్మ జరిగే పది రోజుల పాటు రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తుండడంతో అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని టూరిజం కేంద్రాలు, ప్రముఖ ప్రాంతాల్లోనూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు. బతుకమ్మ ఉత్సవాలను ప్రతిబింబించేలా ఈ సారి ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్లో జరుగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను కూడా ఈ లోగోలో తెలియచేసే విధంగా రూపొందించనున్నట్టు తెలిపారు. -
ఒకే నగరం.. ఎన్నో మ్యూజిక్ వేదికలు! ఎందుకంత స్పెషల్?
నగర వీధుల్లో చిందులాడే అడుగుల చప్పుడు... రాత్రివేళల రంగుల వెలుగులు... వాటికి మృదువైన సాక్సోఫోన్ స్వరం తోడైతే? ఆ అనుభూతే వేరు! సంగీతానికి హద్దులు లేవని చాటుతూ, జాజ్ స్వరాలతో తైపీ నగరాన్ని ముంచెత్తేందుకు సిద్ధమవుతోంది 2026 తైపీ జాజ్ ఫెస్టివల్. సెప్టెంబర్ 4న ప్రారంభమై అక్టోబర్ 11 వరకు జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు ఇప్పటికే ప్రపంచం నలుమూలలకు చెందిన పర్యాటకులు తైపీ నగరానికి క్యూ కట్టారు.ఈ ఏడాది 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ఈ తైపీ జాజ్ ఫెస్టివల్‌కి ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి సంగీతాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా నగర జీవనశైలిలో భాగంగా పరిచయం చేస్తోంది. జాజ్ సంగీతాన్ని వినడానికి ప్రత్యేకంగా ఒక హాలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నగర వీధుల్లో నడుస్తూ, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూ, విశ్రాంతి తీసుకుంటూ కూడా సంగీతాన్ని ఆస్వాదించేలా ఈ వేడుకను రూపొందిస్తున్నారు. జాజ్ క్లబ్బుల నుంచి సాంస్కృతిక ప్రదేశాల వరకు; చిన్న వేదికల నుంచి భారీ బహిరంగ ప్రదర్శనల వరకు; నగరాన్నే ఒక సంగీత వేదికగా మార్చేసింది ఈ జాజ్ ఫెస్టివల్. అందుకే ఈసారి తైపీ నగరం కేవలం సందర్శనకే కాదు, మ్యూజిక్‌ను కూడా వినిపించేస్తుంది.ఎన్నో సంగీత వేదికలుఈ ఫెస్టివల్లో భాగంగా 12 జాజ్ వేదికల్లో 19 ఇండోర్ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. చిన్న వేదికలపై కళాకారులు ప్రేక్షకులకు దగ్గరగా ప్రదర్శనలు ఇవ్వడం వల్ల సంగీతాన్ని మరింత ఆత్మీయంగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఫెస్టివల్‌లోని ఆసక్తికరమైన కార్యక్రమాల్లో సెప్టెంబర్ 26న ట్రెజర్ హిల్ ఆర్టిస్ట్ విలేజ్‌లో జరిగే ప్రత్యేక ప్రదర్శన ఒకటి. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తైవాన్ కు చెందిన తొలి పూర్తి స్థాయి స్కా సంగీత బృందంగా గుర్తింపు పొందిన ‘స్కారకియో’ ఉత్సాహభరితమైన సంగీతంతో ప్రేక్షకులను అలరించనుంది.ఒకవైపు వేగవంతమైన స్కా సంగీతం; మరోవైపు మృదువైన జాజ్, ఫ్రెంచ్ గీతాల సౌందర్యం. ఒకే వేదికపై ఇంత భిన్నమైన సంగీత ప్రపంచాలను పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఇందులో భాగంగా తైపీలోని ఐదు ప్రముఖ పర్యాటక, సాంస్కృతిక ప్రదేశాల్లో 12 ప్రత్యేక సంగీత ప్రదర్శనలు జరుగుతు న్నాయి. అంటే, సంగీతాన్ని వినడమే కాదు, నగర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జాజ్‌లో మునిగిపోయే అవకాశం అన్నమాట!సంగీతమే కాదు!తైపీ జాజ్ ఫెస్టివల్ లక్ష్యం కేవలం పెద్ద కచేరీలు నిర్వహించడం మాత్రమే కాదు. జాజ్ సంగీతాన్ని ప్రజల రోజూవారీ జీవితంలో ఒక ఆహ్లాదకరమైన భాగంగా మార్చడం కూడా ఈ వేడుక ఉద్దేశం. 2007 నుంచి కొనసాగుతున్న ఈ ఉత్సవం.. తైపీ నగర జీవనశైలిని జాజ్ సంగీతంలోని స్వేచ్ఛా భావంతో కలుపుతోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు తమ సంగీతంతో తైపీకి అంతర్జాతీయ జాజ్ రంగును తీసుకువస్తున్నారు.మూడు రోజులు ప్రత్యేక ఆకర్షణఈ ఫెస్టివల్‌కు ప్రత్యేక ఆకర్షణ.. అక్టోబర్ 9 నుంచి 11 వరకు తైపీ మ్యూజిక్ సెంటర్లో మూడు రోజుల పాటు జరిగే బహిరంగ సంగీత వేడుక. ఈ ప్రధాన వేదికపై తైవాన్ కు చెందిన ప్రముఖ కళాకారులతో పాటు అంతర్జాతీయ జాజ్ బృందాలు కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. మొత్తం 11 సంగీత బృందాలు తమ ప్రతిభను ప్రదర్శించనున్నాయి. అనుభవజ్ఞులైన కళాకారులతో పాటు కొత్త తరానికి చెందిన సంగీతకారులు ఒకే వేదికపై కనిపించనుండటం ఈ వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకురానుంది.ఇదీ చదవండి: ఈ వారం కథ: చీమ బ్రతుకేనా? -
కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ!
కొన్ని పండుగల వెనుక సంస్కృతీ సంప్రదాయాల చరిత్ర ఉంటే, మరికొన్ని పండుగలు భావోద్వేగాలు, విశ్వాసాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి అరుదైన పండుగే ‘నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లా మెజొరానా’. పనామాలోని గ్వరారేలో ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. పనామా ప్రజల గ్రామీణ సంస్కృతి, సంగీతం, నృత్యం, సంప్రదాయ దుస్తులు, రైతుల జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ ఉత్సవం 1949లో ప్రారంభమైంది.ఈ మెజొరానా పండుగ ప్రారంభం వెనుక ఓ తండ్రి వేదన ఉంది. ఈ పండుగ నిర్వాహకులలో ఒకరైన మాన్యుయెల్ ఫెర్నాండో జారాతె కుమార్తె లుకీమియాతో బాధపడేది. దీంతో జారాతె ‘వర్జిన్ డి లాస్ మెర్సిడెస్’ అమ్మవారిని వేడుకున్నాడు. తన కుమార్తె ఆరోగ్యం బాగుపడితే, అమ్మవారి దయకు కృతజ్ఞతగా ప్రతి ఏడాది జానపద సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ బాలిక కోలుకోవడంతో– ఇచ్చిన మాట ప్రకారం 1949లో మొదటిసారి ఈ జానపద సంబరాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించే ఈ వేడుకలకు వేలాదిమంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తరలివస్తారు. ఈ ఏడాది ఈ వేడుకలను సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు.పనామా గ్రామీణ సంప్రదాయాలను కాపాడటమే ఈ మెజొరానా పండుగ లక్ష్యం. ముఖ్యంగా రైతుల జీవన విధానం, వారి పాటలు, సంగీతం, నృత్యాలు, దుస్తులు, చేతివృత్తులు, స్థానిక కళలను తరువాతి తరాలకు అందించాలనుకున్నారు. అందులో ప్రధాన పాత్రను ‘మెజొరానా’ అనే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ సంగీత వాయిద్యానికి ఇచ్చారు. పరిమాణంలో చిన్నదిగా కనిపించినా దాని శబ్దానికి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పనామా గ్రామీణ కవులు పాడే ‘దెసిమా’ పాటలకు ఇది సంగీత సహకారం అందిస్తుంది. సెడార్, బాల్సో, వోలడార్ వంటి స్థానిక కలపతో ఈ మెజొరానాలను తయారు చేస్తారు. గతంలో వీటి తంత్రుల కోసం కోడి పేగులను ఉపయోగించేవారు, ప్రస్తుతం నైలాన్ తీగలను ఉపయోగిస్తున్నారు.కారెటాస్ పరేడ్ మరో ప్రత్యేకత అలంకరించిన ఎద్దుల బండ్ల ఊరేగింపు. పండుగ ముగింపు వేడుకల్లో ఈ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.‘ఫెస్టివల్ ఆఫ్ మెజొరానా’ కేవలం ఒక సంగీత వేడుక కాదు. అనేక సంప్రదాయ కళలకు వేదిక. దాదాపు 75 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ వేడుక ప్రాంతీయ అస్తిత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యానికి కూడా వేదిక కల్పిస్తోంది. ఒక కుటుంబం మొక్కుకున్న మొక్కు ఓ దేశానికి పండుగగా మారి, జానపద సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.పాటల్లో పలికే రైతు జీవితం..ఈ ఉత్సవంలోని ‘దెసిమా’ పాటలు ప్రత్యేక ఆకర్షణ. గ్రామీణ జీవితం, రైతుల కష్టాలు, ప్రేమ, ప్రకృతి వంటి ఎన్నో విషయాలను పాటల రూపంలో చెప్పే సంప్రదాయం ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పోటీల్లో పాల్గొంటారు.- రమా జంబులఇదీ చదవండి: శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ! -
గణేశ మండపంలో అవయవదాన సందేశం
సూరత్: భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక అవగాహనకు గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహిస్తున్నగణేశోత్సవం వేదికగా నిలుస్తున్నది. వాస్తవ్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘ఆర్గన్ డొనేషన్.. లైఫ్ డొనేషన్..’ అనే థీమ్‌తో వినూత్న గణేశ మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాందేర్ రోడ్‌లోని తాడ్వాడీ చార్ రాస్తా వద్ద బేజన్వాలా కాంప్లెక్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ మండపం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది.వినాయక మండపం నేపథ్యంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆకర్షణీయమైన పోస్టర్లు, స్ఫూర్తినిచ్చే వాస్తవ ఘటనలు, సందేశాల ద్వారా మరణానంతరం అవయవదానం చేయడం ద్వారా అవసరమైన వారికి జీవితంపై కొత్త ఆశ కల్పించవచ్చని వారు భక్తులకు వివరిస్తున్నారు. ఒక బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవదానం ద్వారా 8 నుంచి 9 మంది వరకు ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.అవయవదానానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను వివిధ దృశ్యాలు, సందేశాల ద్వారా ప్రదర్శించారు. బ్రెయిన్ డెడ్ వ్యక్తి కుటుంబ సభ్యులకు అవయవదానంపై కౌన్సెలింగ్ ఇవ్వడం, కుటుంబ సభ్యుల సమ్మతి అనంతరం అవయవదాతకు గార్డ్ ఆఫ్ ఆనర్తో గౌరవప్రదంగా వీడ్కోలు పలకడం, గ్రీన్ కారిడార్ ద్వారా అవయవాలను ఒక నగరం నుంచి మరో నగరానికి తరలించే ప్రక్రియను ఇందులో చూపించారు.డొనేట్ లైఫ్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత నీళేశ్ మండలేవాలా మాట్లాడుతూ.. 2047 నాటికి అవయవాల కొరత కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోని పరిస్థితి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. గణేశోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో యువతకు ‘ఆర్గన్ డొనేషన్.. లైఫ్ డొనేషన్..’ సందేశాన్ని చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఒకవైపు 6 మి.మీ. గణేశుడు.. మరోవైపు 50 వేల విగ్రహాలు! -
పండగ షాపింగ్‌కు.. ఏ కార్డు వాడదాం?
వినాయకచవితి వచ్చేసింది. మరో నెలరోజుల్లో దసరా. ఆ తరువాత దీపావళి. ఇలా వరుస పండగలొచ్చే సీజన్ మొదలయ్యింది. పండగంటే మొదట చేసేది షాపింగే. చాలామందికి ఈ విషయంలో అక్కరకొచ్చేది క్రెడిట్ కార్డే. ఎందుకంటే రెడీగా అంత డబ్బులు లేకపోవటం ఒక కారణమైతే... ఆ కార్డులపై వచ్చే ఆఫర్లు మరో కారణం. ఒక్కోసారి క్యాష్‌బ్యాక్ ఇతర ఆఫర్లను చూసుకుంటే నేరుగా నగదు పెట్టి కొనటం కన్నా క్రెడిట్ కార్డుతో కొంటేనే మంచిదనిపిస్తుంది. మరి ఈ సారి పండగ షాపింగ్ ఏ కార్డుతో చేస్తే బెటర్? ఎవరు ఎలాంటి ఆఫర్లిస్తున్నారు? అసలు ఒక కార్డు సరిపోతుందా? అవసరాన్ని బట్టి మన దగ్గర ఉన్న వివిధ రకాల కార్డులు ఉపయోగించటం మంచిదా? ఇవన్నీ సమగ్రంగా వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం.. – సాక్షి, వెల్త్పండగ సీజన్లో షాపింగ్ పెరుగుతుంది. దుస్తులు, ఎల్రక్టానిక్స్, గ్రాసరీ, ఫుడ్ ఆర్డర్లు, ప్రయాణాలు.. ఇలా కుటుంబ ఖర్చులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు భలే ఆకర్షిస్తుంటాయి. అయితే ఒక కార్డుపై ‘‘10% క్యాష్‌బ్యాక్’’ మరో కార్డుపై ‘15% క్యాష్‌బ్యాక్’ అని ఇచ్చారనుకోండి. 15% క్యాష్‌బ్యాక్ కార్డు బెస్ట్ అనుకోవాలా? అదే తప్పు. ఎందుకంటే ఎవరు ఎంత శాతాన్ని క్యాష్‌బ్యాక్‌గా ప్రకటించినా... దానికో లిమిట్ అంటూ ఉంటుంది. కార్డు వాడేవారు ఆ లిమిట్‌ను బట్టి తమకు అది ఉత్తమమో కాదో తేల్చుకోవచ్చు. కొన్ని కార్డులైతే నిర్దిష్ట వెబ్సైట్లు లేదా వ్యాపారుల దగ్గర కొంటే అధిక డిస్కౌంట్లు ఆఫర్ చేస్తాయి. కొన్ని కార్డుల్లో వార్షిక ఫీజు ఉంటుంది. కాబట్టి కార్డు ఎంచుకునేటప్పుడు క్యాష్‌బ్యాక్ శాతంతో పాటు నెలవారీ/త్రైమాసిక పరిమితి, వార్షిక ఫీజు, మినహాయింపులు, మీరు నిజంగా చేసే ఖర్చులను కూడా చూడాలి.ఎవరికి ఏ కార్డు బెటర్...డైనింగ్, గ్రాసరీ ఖర్చులు ఎక్కువైతే.. హెచ్ఎస్బీసీ లైవ్ ప్లస్ప్రతిరోజూ క్యాష్‌బ్యాక్ అందిస్తున్న కార్డులో ప్రస్తుతం దీన్ని అత్యంత ఆకర్షణీయమైన కార్డుగా చెప్పొచ్చు. ఎందుకంటే డైనింగ్, ఫుడ్ డెలివరీ, గ్రాసరీ, షాపింగ్, యుటిలిటీ ఖర్చులపై 10 శాతం వరకూ క్యాష్‌బ్యాక్ ఉంటుంది. ఇది గరిష్ఠంగా నెలకు రూ.1200 వరకూ వస్తుంది. ఇతర అర్హత కలిగిన ఖర్చులపై మరో 1.5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుంది. దీనికి ఎలాంటి పరిమితులూ లేవు. వార్షిక ఫీజు రూ.999. అయితే ఒక ఏడాదిలో గనక రూ.2 లక్షలు ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీజు మినహాయింపు ఉంటుంది.గ్రాసరీకి కొత్త ప్రత్యామ్నాయం.. ఫెడరల్ బ్యాంక్ పైసాబజార్ పైసాబ్యాక్ఈ క్రెడిట్ కార్డు మార్కెట్‌కు చాలా కొత్త. ఎందుకంటే ఈ నెల్లోనే వచ్చింది. ప్రత్యేకంగా కుటుంబాలు ఖర్చుపెట్టే గ్రాసరీని టార్గెట్ చేస్తూ ఫెడరల్ బ్యాంక్, పైసాబజార్ కలిసి తెచ్చిన కోబ్రాండెడ్ కార్డు ఇది. అర్హత ఉన్న గ్రాసరీ కొనుగోళ్లపై 7.5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. రిలయన్స్ ఫ్రెష్, డీమార్ట్‌లో చేసే ఖర్చులకు ప్రాధాన్యమెక్కువ. స్టార్ బజార్, నేచర్ బాస్కెట్ వంటి సూపర్ మార్కెట్లతో పాటు బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా ఈ కార్డు కవర్ చేస్తోంది. ఇవికాక ఇతర అర్హత ఉన్న ఖర్చులపై 1 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. రూ.2,000కు మించిన కొన్ని యూపీఐ లావాదేవీలపై 0.5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. అయితే మొత్తం క్యాష్‌బ్యాక్ పరిమితి మాత్రం నెలకు రూ.1000 మాత్రమే. ఇదికాక ఏడాదికి రూ.1.5 లక్షలు గనక ఖర్చుచేస్తే వార్షిక ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రతినెలా రూ.8,000 నుంచి రూ.15000 వరకు గ్రాసరీపై వెచ్చించే కుటుంబాలకు ఇది బెస్ట్ కార్డ్ అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే క్యాష్‌బ్యాక్ అనేది పాయింట్ల రూపంలో వస్తుంది. వాటికి ఏడాది కాలపరిమితి ఉంటుంది. డైనింగ్, ట్రావెల్‌కు సూపర్ కార్డు.. ఎస్‌బ్యాంకు పైసాసేవ్డైనింగ్, ట్రావెల్ ఖర్చులపై 6 శాతం వరకూ క్యాష్‌బ్యాక్ ఉంది. అది కూడా నెలకు రూ.3వేల వరకూ. ఇతర అర్హత కలిగిన ఖర్చులపై 1% వరకూ క్యాష్‌బ్యాక్ ఉంది. స్విగ్గీ, జొమాటో, రెస్టారెంట్లు, మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, హోటళ్ల వంటి డైనింగ్, ట్రావెల్ ఖర్చులన్నీ ఈ పరిధిలోకి వస్తాయి. నెలకు రూ.3000 అంటే ఏడాదికి రూ.36వేల దాకా గరిష్ఠంగా క్యాష్‌బ్యాక్ పొంద వచ్చు. రూ.499 ఫీజు ఉన్నా... ఏడాదికి రూ.1.2 లక్షలు ఖర్చు చేస్తే మినహాయిస్తారు. అయితే, కొన్ని అర్హత గల లావాదేవీలకే 6% క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో షాపింగ్ చేసేవారికి.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డ్ప్రస్తుతం ఈ కార్డుతో గనక మింత్రాలో షాపింగ్ చేస్తే 7.5%, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తే 5%, క్లియర్‌ట్రిప్‌లో లావాదేవీలు జరిపితే 5% క్యాష్‌బ్యాక్ ఉంది. ఈ మూడు వ్యాపార సంస్థల్లోనూ జరిపే లావాదేవీలకు విడివిడిగా 3 నెలలకు రూ.4,000 గరిష్ఠ పరిమితి వర్తిస్తుంది. అంటే మూడింటిపై కలిసి ఏడాదికి గరిష్ఠంగా రూ.48వేల వరకూ క్యాష్‌బ్యాక్ పొందే అవకాశముంది. వార్షిక ఫీజు రూ.500 కానీ... ఏడాదికి రూ.3.5 లక్షలు గనక ఈ కార్డుపై ఖర్చుచేస్తే రెన్యువల్ ఫీజు ఉండదు.సాధారణ ఆన్లైన్ ఖర్చులకు... ఎస్బీఐ క్యాష్‌బ్యాక్ కార్డ్ఈ కార్డు ప్రధాన ఆకర్షణ ఏంటంటే... ఇది ఏదో కొన్ని వ్యాపార సంస్థలకే పరిమితం కావటం లేదు. ఆన్లైన్లో చేసే ఖర్చుల్లో అర్హత కలిగిన వాటిపై 5 శాతం వరకూ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్రతి స్టేట్మెంట్ సైకిల్‌కు గరిష్ఠంగా రూ.2,000 వరకూ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇక ఆఫ్‌లైన్ ఖర్చులపై కూడా 1 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. ఇది కూడా గరిష్ఠంగా రూ.2,000 పరిమితి లోబడి ఉంటుంది. సాధారణంగా స్టేట్మెంట్ సైకిల్ 30– 45 రోజులుగా ఉంటుంది. అంటే జాగ్రత్తగా ఉపయోగిస్తే గరిష్ఠంగా ఏడాదికి రూ.32,000 నుంచి రూ.48వేల వరకు క్యాష్‌బ్యాక్ అవకాశం ఉంది. అయితే యుటిలిటీ చెల్లింపులు, బీమా చెల్లింపులు, పెట్రోల్/డీజిల్, రెంట్, వాలెట్‌లోకి లోడ్ చేయటం, విద్యా ఖర్చులు, నగల కొనుగోళ్లు, రైల్వే టికెట్ల బుకింగ్ వంటివాటికి ఈ క్యాష్‌బ్యాక్ వర్తించదు. ప్రధాన ఆన్లైన్ సంస్థలకైతే.. హెచ్డీఎఫ్సీ మిలీనియాఅమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, టాటా క్లిక్, స్విగ్గీ, జొమాటో, ఉబెర్, బుక్ మై షో, సోనీ లైవ్, కల్ట్.ఫిట్ వంటి ప్రముఖ వ్యాపార సంస్థలతో ఈ కార్డు అనుసంధానమై ఉంది. కాబటల్టి వాటికి చేసే ఖర్చులైతే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర అర్హత కలిగిన ఖర్చులపై మాత్రం క్యాష్‌బ్యాక్ పరిమితి 1 శాతమే. కాకపోతే గరిష్ఠంగా ఒక స్టేట్మెంట్ సైకిల్‌కు రూ.1,000 పరిమితి వర్తిస్తుంది. వార్షిక ఫీజు వెయ్యి రూపాయలు. కానీ ఏడాదికి రూ.లక్ష ఖర్చుపెడితే దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ కార్డుపై మరో ప్రధాన ఆకర్షణేమిటంటే ఒక త్రైమాసికంలో గనక రూ.లక్ష వరకు ఖర్చు చేస్తే వెయ్యి రూపాయల ఓచర్ లేదా లాంజ్ బెనిఫిట్లలో ఏదో ఒకటి ఎంచుకునే మైల్స్టోన్ ప్రయోజనం ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకైతే.. అమెజాన్ పే ఐసీఐసీఐదీన్ని చాలా ప్రత్యేకమైన కార్డ్‌గా చెప్పొచ్చు. ప్రత్యేకించి అమెజాన్‌లో షాపింగ్ చేసే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఇది అత్యుత్తమం. ఎందుకంటే అమెజాన్‌లో చేసే ఖర్చులపై ప్రైమ్ సభ్యులకైతే 5%, సభ్యులు కానివారికైతే 3% క్యాష్‌బ్యాక్ ఉంటుంది. అమెజాన్ పే భాగస్వాములకు గనక ఈ కార్డు ద్వారా పే చేస్తే దానికి 2%, ఇతర అర్హత కలిగిన ఖర్చులపై 1% క్యాష్‌బ్యాక్. దీనికి పరిమితి కూడా లేదు. కార్డు తీసుకునేటపుడు ఎలాంటి ఫీజూ ఉండదు. రెన్యువల్ ఫీజూ ఉండదు. అమెజాన్‌లో తరచుగా కొనుగోళ్లు చేసే వారికి ఉత్తమం. అయితే క్యాష్‌బ్యాక్ నేరుగా బ్యాంక్ ఖాతాలోకి రాదు. అమెజాన్ పే బ్యాలెన్స్‌కు జతవుతుంది.ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింటికీ.. బాబ్ కార్డ్ క్యాష్బ్యాక్అర్హత కలిగిన ఆన్లైన్ లావాదేవీలపై 5%, ఆఫ్‌లైన్ లావాదేవీలపై 1% క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది ఈ కార్డు. కాకపోతే నెలకు గరిష్ఠంగా రూ.1,500 మాత్రమే పొందగలుగుతారు. ఈ క్యాష్‌బ్యాక్ నేరుగా మీ బిల్లు నుంచి తగ్గిపోతుంది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే ఒక స్టేట్మెంట్ సైకిల్లో కనీసం 4 లావాదేవీలైనా చేయాలి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి...క్యాష్‌బ్యాక్ కోసం అదనంగా లేదా అనవసరంగా ఖర్చులు చేయొద్దు రూ.1,000 క్యాష్‌బ్యాక్ కోసం రూ.20,000 అనవసర ఖర్చు చేయటం నష్టమే. బిల్లు రాగానే అందులో కనీసం ఇంత చెల్లిస్తే సరిపోతుందని ఉంటుంది. కానీ అలా చేయొద్దు మీరు చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని గడువు తేదీ లోపు చెల్లించేయాలి. లేకపోతే వడ్డీ అనేది క్యాష్‌బ్యాక్‌కు ఎన్నో రెట్లు ఎక్కువకావచ్చు. ఈఎంఐకి క్యాష్‌బ్యాక్ వర్తిస్తుందో లేదో చూడాలి చాలా కార్డులపై ఈఎంఐ లావాదేవీలకు క్యాష్‌బ్యాక్ వర్తించదు. నెలవారీ/ త్రైమాసిక క్యాష్‌బ్యాక్ గరిష్ఠ పరిమితి చూడాలి. వార్షిక ఫీజును ఏ సందర్భాల్లో మినహాయిస్తారో ముందు తెలుసుకోవాలి. పండగ డిస్కౌంటు, కార్డు క్యాష్‌బ్యాక్ రెండూ వస్తాయని ముందే అనుకోవద్దు కొన్ని వ్యాపార సంస్థల ఆఫర్లు ఇతర క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కలపలేని సందర్భాలుంటాయి.ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీఒకటికి మించిన కార్డులు ఓకేనా?ఉంచుకోవచ్చు, కానీ వార్షిక ఫీజులు తడిసి మోపెడు కాకుండా చూసుకోవాలి. వార్షిక ఫీజుల్లేని కార్డులు బెటర్. ఒకవేళ ఫీజులున్న కార్డులైతే గరిష్ఠంగా 2–3 చాలు. మీ ఖర్చుల్ని అన్ని కార్డులపై సమానంగా విభజించటం కాకుండా ఏ కేటగిరీకి ఏ కార్డు మంచిదో ఆఫర్లను బట్టి బేరీజు వేసుకుని వాడితే గరిష్ఠ లబ్ధి పొందొచ్చు. ఉదాహరణకు: అమెజాన్‌లో కొంటే... అమెజాన్ పే ఐసీఐసీఐ డైనింగ్, ట్రావెల్‌కు.. ఎస్ పైసా సేవ్ గ్రాసరీకి.. ఫెడరల్ పైసాబ్యాక్ మామూలు ఆన్లైన్ కొనుగోళ్లకు.. ఎస్బీఐ క్యాష్‌బ్యాక్. -
శ్రీనాథ విరచిత వినాయక దండకం
జయ జయ జగదేక రక్షామణీ!దేవ చూడామణీ శ్రేణి శోణ ప్రభాజాల బాలా తప స్మేర పాదారవిందా!ముకుందప్రియా! యిందుధారీ!కటస్యంది దానాంబుధారా ధునీ ధోరణీ గాహ కౌతూహలాయత్త మత్త ద్విరేఫాంగనా గాన సంగీత రంగీకృతస్వాంత!దంతావ ళాస్యా! నమస్యా! త్రిలోకైక వశ్యా! యవశ్యాయ శైలాత్మజా ధర్మసంతాన!సంతాన కల్పద్రు పుష్పావతంసా! యసారోరు సంసార మాయాంధకారా హృతిప్రక్రియా భాస్కరా!కోటిభాస్వన్నిరాఘాట దేహ ప్రభాభాస్వరా! దేవ! హేరంబ! లంబోదరా! యేక దంతా! మహాకాయ! సంతప్త కార్తస్వరాభా!విశాలాక్ష మౌంజీధరా! నాగ యజ్ఞోపవీతా సమన్విత కృష్ణాజినా!యాఖువాహా! కుఠారాయుధా! విఘ్నరాజా! గణాధ్యక్ష!కారుణ్య లీలా కటాక్షంబునన్ మమ్ము వీక్షించి రక్షింపుమీ!క్షీర వారాళి నీ మందరక్ష్మాధర స్వామి కవ్వంబుగా, నీ భుజంగాధినాథుండు సూత్రంబుగా, గచ్ఛపాధీశుడాధార పీఠంబుగా, సర్వదివ్వౌషధీ వల్లులన్ వైచి, నానా పదార్థంబుల న్వెన్నలం బంచుకో గోరి యున్నార, మిక్కార్య మే విఘ్నముం బొందకుండంగ, నే విక్రియం జెంద కిష్టార్థ సంసిద్ధులం గైకొనుం గాక నీ యాజ్ఞ సర్వేశ సర్వాత్మకా!నిర్వికల్పా! నిరీహా! నిరాంతక! నిశ్శంక! యోంకార మూర్తీ! నమస్తే! నమస్తే! నమఃఇవీ చదవండి: వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు -
వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు
(శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి)ప్రతి ఏడాది వచ్చే వినాయకచవితి పర్వదిన శుభసందర్భంగా ప్రతి గృహంలోను, సంస్థల్లోనూ ప్రత్యేకంగా పూజాదికార్యక్రమాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పూజలో ఉపయోగించే పూజాద్రవ్యాలతో పాటుగా, స్వామివారిని పూజించే పత్రిది కూడా ప్రథమస్థానం. అందువల్ల ఈ పూజకు సమకూర్చుకోవలసిన అన్ని రకాల పూజాద్రవ్యాలు, పత్రి తదితరాలన్నీ మీకోసారి జ్ఞప్తికి తీసుకురావాలని ఈ క్రింద ఇస్తున్నాం. ఇవి నూతన గృహస్థులకు మరింత ఉపయోగపడగలవని ఆశిస్తున్నాం.పూజా ద్రవ్యములు: వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు.పూజా వస్తువులు: దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడాకుల తోరణాలు, దేవునికి తగిన పీఠము.నైవేద్యం: ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి రకానికి 21 చొప్పున.పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కలిగినా భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.పాలవెల్లి పూజ: శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.పూజా మందిరంలో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు, ఇతర వృత్తులలో వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడంæ శుభఫలదాయకం.గణేశుని పూజ (పూజకు ఏర్పాట్లు)ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపుకుంకుమతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.ఓం శ్రీ మహాగణాధిపతయే నమఃదీపారాధన: (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘పరిశుద్ధి: (పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిఃపుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమఃశ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తువిఘ్నేశ్వరుని వ్రతకల్పముశ్రీ గణేశాయ నమః శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘø్నపశాన్తయే ‘‘అగజానన పద్మార్కం గజానన మహర్నిశంఅనేక దన్తం భక్తానాం ఏకదన్త ముపాస్మహే ‘‘శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాఃశ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకఃలంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననఃవక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజఃషోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపిఃవిద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ఆచమనంఓం కేశవాయ స్వాహానారాయణాయ స్వాహామాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి.గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమఃత్రివిక్రమాయ నమః వామనాయ నమఃశ్రీధరాయ నమః హృషీకేశాయ నమఃపద్మనాభాయ నమః దామోదరాయ నమఃసంకర్షణాయ నమః వాసుదేవాయ నమఃప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమఃపురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమఃనారసింహాయ నమః అచ్యుతాయ నమఃజనార్దనాయ నమః ఉపేంద్రాయ నమఃహరయే నమః శ్రీ కృష్ణాయ నమః(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాఃయేతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!(ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.)ప్రాణాయామంఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జపఃఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య .............. ప్రదేశే .............. – ............. నదీ మధ్యప్రదేశే (మీ ప్రస్తుత నివాస ప్రాంతం ఏ జీవనదుల మధ్య వున్నదో ఆ నదుల పేర్లు చెప్పుకోండి) స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, ఇందువాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............................... (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధన కనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్థ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘(కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)తదంగ కలశపూజాం కరిష్యేః(మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను)శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితఃమూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాఃకుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణఃఅంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాఃగంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ!నర్మదే సింధు కావేరీ జలేస్మిం సన్నిధింకురు ‘‘అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి)శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను)గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాంఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పతఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాదనంఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)కుంకుమం సమర్పయామిగంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను)స్వామికి పుష్పాలతో పూజ (ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి (పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)దీపం దర్శయామి (దీపమును చూపవలెను)నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని త్రిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడి చేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను).ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహాశ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి)శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి(గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)వరసిద్ధి వినాయక పూజా ప్రారంభంస్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా ఃతావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురుధ్యానం: స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...) ప్రాణ ప్రతిష్ఠ: (స్వామి వారికి ప్రాణం పోయుట)ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః‘ పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత‘ మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః అమృత మాపః‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘ఆవాహనమ్: స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘‘ఆసనమ్: స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి).మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘పాద్యమ్: స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి)శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం ‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘అర్ఘ్యమ్: స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ఆచమనీయమ్: స్వామివారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘మధుపర్కం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనా«థం నమోస్తుతే‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానమ్ : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ క్రింది చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)పాలు: ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం‘ భవా వాజన్య సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘పెరుగు: ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘నేయి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్‌ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘పంచదార: ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్‌ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్‌ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘ శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సరస్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.) వస్త్రమ్ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్నిగాని, పుష్పాక్షతలనుగాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘గంధం: (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి.అక్షతలు: (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘సిందూరం: శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘మాల్యం: శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘ పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు).సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘అధాంగ పూజ: (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)గణేశాయ నమః పాదౌ పూజయామి‘ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘కామారిసూనవే నమః జంఘే పూజయామి‘అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘హేరంబాయ నమః కటిం పూజయామి‘లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘గణనాథాయ నమః హృదయం పూజయామి‘స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ఏకవింశతి పత్ర పూజఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజా సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి)⇒ ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు)⇒ ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక)⇒ ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు)⇒ ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు)⇒ ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు)⇒ ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు)⇒ ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి)⇒ ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి)⇒ ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు)⇒ ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు)⇒ ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం)⇒ ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ)⇒ ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు)⇒ ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం)⇒ ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు)⇒ ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు)⇒ ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం)⇒ ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు)⇒ ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు)⇒ ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్ది)ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు)ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘ (21 రకముల ఆకులను కలిపి వేసి నమస్కారము చేయవలెను)ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి!అఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి!బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి!మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి!స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామిశ్రీ గణపతి అష్టోత్తర శతనామావళిఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమఃఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమఃఓం హ్రస్వగ్రీవాయ నమఃఓం మహోదరాయ నమఃఓం మహోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళస్వరూపాయ నమఃఓం ప్రమధాయ నమఃఓం ప్రథమాయ నమఃఓం ప్రాజ్ఞాయ నమఃఓం విఘ్నకర్త్రే నమఃఓం విఘ్నహంత్రే నమఃఓం విశ్వనేత్రే నమఃఓం విరాటత్పయే నమఃఓం శ్రీపతయే నమఃఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమఃఓం శివప్రియాయ నమఃఓం శీఘ్రకారిణే నమఃఓం శాశ్వతాయ నమఃఓం బలాయ నమఃఓం బలోత్థితాయ నమఃఓం భవాత్మజాయ నమఃఓం పురాణ పురుషాయ నమఃఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమఃఓం అగ్రగణ్యాయ నమఃఓం అగ్రపూజ్యాయ నమఃఓం అగ్రగామినే నమఃఓం మంత్రకృతే నమఃఓం చామీకరప్రభాయ నమఃఓం సర్వాయ నమఃఓం సర్వోపన్యాసాయ నమఃఓం సర్వకర్త్రే నమఃఓం సర్వనేత్రే నమఃఓం సర్వసిద్ధిప్రదాయ నమఃఓం సర్వసిద్ధయే నమఃఓం పంచహస్తాయ నమఃఓం పార్వతీనందనాయ నమఃఓం ప్రభవే నమఃఓం కుమార గురవే నమఃఓం అక్షోభ్యాయ నమఃఓం కుంజరాసుర భంజనాయ నమఃఓం ప్రమోదాయ నమఃఓం మోదకప్రియాయ నమఃఓం కాంతిమతే నమఃఓం ధృతిమతే నమఃఓం కామినే నమఃఓం కపిత్థ పనసప్రియాయ నమఃఓం బ్రహ్మచారిణే నమఃఓం బ్రహ్మరూపిణే నమఃఓం బ్రహ్మవిద్యాధిపాయ నమఃఓం విష్ణవే నమఃఓం విష్ణుప్రియాయ నమఃఓం భక్తజీవితాయ నమఃఓం జితమన్మథాయ నమఃఓం ఐశ్వర్యకారణాయ నమఃఓం జ్యాయనే నమఃఓం యక్షకిన్నరసేవితాయ నమఃఓం గంగాసుతాయ నమఃఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమఃఓం వటవే నమఃఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమఃఓం భక్తనిధయే నమఃఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమఃఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమఃఓం సత్యధర్మిణే నమఃఓం సఖ్యే నమఃఓం సరసాంబునిధయే నమఃఓం మహేశాయ నమఃఓం దివ్యాంగాయ నమఃఓం మణికింకిణీ మేఖలాయ నమఃఓం సమస్తదేవతామూర్తయే నమఃఓం సహిష్ణవే నమఃఓం సతతోత్థితాయ నమఃఓం విఘాతకారిణే నమఃఓం విశ్వక్‌దృశే నమఃఓం విశ్వరక్షాకృతే నమఃఓం కళ్యాణ గురవే నమఃఓం ఉన్మత్తవేషాయ నమఃఓం అపరాజితే నమఃఓం సమస్త జగదాధారాయ నమఃఓం సర్వైశ్వర్యప్రదాయ నమఃఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమఃఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమఃశ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.బిల్వం : శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి.ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు)దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమా సుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి‘‘నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి)ఓమ్ భూర్భువస్సువః ‘ ఓం తత్సవితుర్వరేణ్యంభర్గోదేవస్య ధీమహి ‘ ధియోయనః ప్రచోదయాత్ ‘‘(పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి)ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘ సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదై్గః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి)ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘(అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘శ్రీ గణేష ప్రార్థనతొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‘తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా!తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్ ∙∙ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్నిటలాక్షు నగ్రసుతునకుపటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్శ్రీ వినాయకుని దండకము శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణీ లోకరక్షామణీ బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్జూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్‌గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా!ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః నీరాజనమ్ : (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా‘ నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ‘‘ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాష్ట్ర్య యాముఖే తయామా సగ్ం సృజామసి‘‘ సంతత శ్రీరస్తు‘ సమస్త సన్మంగళానిభవంతు‘ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి‘‘ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి‘‘ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి)మంత్రపుష్పమ్ : (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి)గణాధిప నమస్తేస్తుఉమాపుత్రా విఘ్ననాశన‘వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక‘‘ఏకదంతైక వదన తథా మూషికవాహన‘కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‘‘తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి‘తన్నోదంతిః ప్రచోదయాత్‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.ఆత్మప్రదక్షిణ నమస్కారమ్ : (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు)ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ‘ నమస్తే విఘ్నరాజాయ‘ నమస్తే విఘ్ననాశన‘‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ‘తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే‘పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవఃత్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల‘అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ‘తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామిప్రార్థన(పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి)నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన‘ ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‘‘ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ‘ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా‘‘ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమఃప్రార్థన నమస్కారాన్ సమర్పయామి‘‘సాష్టాంగ నమస్కారమ్ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా‘ పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి‘‘ శ్లో‘‘ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితంమయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతిసుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు.(నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.అపరాధ ప్రార్థన: అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశంమయా‘ దాసోయమితి మాంమత్వా క్షమస్వ గణనాయక‘‘ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం‘ పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక‘‘ శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి‘‘ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి).(ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి)అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు.విఘ్నేశ్వరుని కథా ప్రారంభం(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను.పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమనగా, అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా యుదరమందు నివసించియుండమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించెను.కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుచూ కొంత కాలమునకు గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపిస్తుండగా, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తానును కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అనిన పిదప, విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చెను. కావున శివునొసంగు’’ అనెను.ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించెను. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసురగర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళెను. పిదప శివుడు నంది నెక్కి కైలాసమునకు వేగంగా బయలుదేరెను.వినాయకోత్పత్తికైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని చెప్పెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండెను. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలముతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్ళెను. అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియసంభాషణములు ముచ్చటించుకొనుచుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చెను. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టి, అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను. విఘ్నేశాధిపత్యముఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరిరి. గజాననుడు తాను పెద్దవాడు గనుక అయ్యాధిపత్యము ఇవ్వమని కోరెను. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు.సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో, వారికి యీ ఆధిపత్యం ఇచ్చెదను’’ అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనము ఎక్కి వాయు వేగముగా వెళ్ళెను. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయయు తెలిపి రక్షింపవే’’ యని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించెను.‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’ అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపించుచూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణములు చేయుచూ కైలాసమున వుండెను. ఆ మంత్ర ప్రభావముతో∙అంతకు పూర్వము గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించెను. ఆ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూచి ఆశ్చర్యపడుచూ, కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వుము’’ అని ప్రార్థించెను. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు.ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారము చేయబోగా ఉదరము భూమికి ఆని, చేతులు భూమికి అందవయ్యే, ఈ విధంగా ప్రణామము చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంబున వెలసివున్న చంద్రుడు జూచి వికటంబుగ నవ్వెను. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలు కూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లిపోయి అతడు మృతుండయ్యెను. పార్వతి శోకించుచు చంద్రుని జూచి,‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’’ అని శపించెను. చంద్రునికి కలిగిన శాపము లోకానికి కూడా శాపమైంది.ఋషీపత్నులకు నీలాపనిందలుఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నిప్రదక్షిణము చేయుచున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడెను. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య(స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరచి సప్త ఋషులను సమాధానపరచెను. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీవిచ్చిన శాపము వలన లోకములకెల్ల కీడు వాటిల్లుచున్నది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపమునకు ఉపశమనము చెప్పెను. అంత బ్రహ్మాదులు సంతోషించి తమ గృహములకేగి, భాద్రపద శుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖముగా ఉండిరి.శమంతకోపాఖ్యానముయదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. ఆ మణియున్న దేశమున అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచిౖయె ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీ కృష్ణునకు తెలియజేసిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణంగా ప్రసేనుడు అశౌచమును పొందెను. ఈ కారణముచే ప్రసేనుడు సింహం దాడిలో మరణించెను. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకము సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీకృష్ణుడు కూడా వేటకై వెళ్ళివుండెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుచూ తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లుబాగుగా ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించెనని సత్రాజిత్తు, పౌరులు భావించిరి. అంతట ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి.ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను.కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో పడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను.శ్లో‘‘ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః(తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.)అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను.ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనమొనర్చుకొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమముగా జాంబవంతుని బలము క్షీణించసాగెను. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి దేవాదిదేవా! ఆర్తజనరక్షకా! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందుముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి జాంబవంతా! శ్యమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చినది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను.ద్వారకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొనిరి. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన (కుమార్తె) సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను.శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను. ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు.సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయెను, ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్వుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద్వ యుద్ధంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయెను.బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను.ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను.శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు, అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను. చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయము కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ బాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు, నివేదన మొనరింపవలెనని, సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను.అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను. భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను.ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖముగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను. దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపాఖ్యానములో శ్రీకృష్ణపరమ్మాత వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానమును అనగా అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయములతో శిరమున అక్షతలు ధరించిన యెడల చవితి చంద్రుని చూచిననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యానము గాథను చదువుట, వినుట సాంప్రదాయమైనది. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మహా భక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచుండెను.‘‘మంగళం మహత్’’ చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.– కథ సమాప్తం –పునఃపూజ ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి‘‘ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి)విఘ్నేశ్వరుని మంగళహారతులుశ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం!నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘సురుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిçపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ‘‘ జయ ‘‘పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మి దానిమ్మపువ్వు గరిక మాచీపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ‘‘ జయ ‘‘పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ‘‘ జయ ‘‘దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ‘‘ జయ ‘‘మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ‘‘ జయ ‘‘ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ‘‘ జయ ‘‘వాయనదానముశ్లో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా!(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్.(వ్రతకల్ప పూజా విధానం సమాప్తం)ఇదీ చదవండి: శ్రీనాథ విరచిత వినాయక దండకం -
విఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడు
మొట్టమొదటి పూజలందుకోవలసిన దైవం.. వినాయకుడేవిఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడుఆది దంపతులకు మానసపుత్రుడు.. ఓంకార స్వరూపుడు...జ్ఞానానికి, వివేకానికి ప్రతీక.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు..కార్యసిద్ధిని ప్రసాదించే సిద్ధివినాయకుడు..భక్తుల కోరికలను ఆలకించే మన గణపయ్య!ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగాలంటే విఘ్ననాయకుడైన శ్రీగణేశుని అనుగ్రహం కావాల్సిందే. అందుకే దైవారాధనలో, పూజా కార్యక్రమాల్లో, సర్వశుభకార్యాల ప్రారంభంలో తొలి పూజలందుకునే దైవం వినాయకుడే.విఘ్నేశ్వరుని ఆరాధన కేవలం విఘ్నాలను తొలగించమని కోరడం మాత్రమే కాదు. మనలోని అజ్ఞానం, అహంకారం, అసహనం, తొందరపాటు వంటి అంతర్గత విఘ్నాలను తొలగించి, మంచి ఆలోచన, వివేకం, ఏకాగ్రత, ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థించడం కూడా.పసుపు గణపతి – పవిత్రతకు ప్రతీకపార్వతీమాత చేతుల మీదుగా పసుపు ముద్దతో అవతరించి, మన ఇళ్లలో ‘‘పసుపు గణపతి’’గా తొలి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్ననివారకుడే కాక, విద్య, బుద్ధి, జ్ఞానాలను ప్రసాదించే జ్ఞానప్రదాతగా కూడా ఆరాధించబడుతున్నాడు.అందుకే, ‘కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ... ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!’ అంటూ మనం గణేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం.వినాయక చవితి – భక్తి, ఆనందాల పర్వదినంభాద్రపద శుద్ధ చవితి అనగానే ప్రతి ఇంటా వినాయక చవితి పండుగ సందడి కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తుంది. పండుగల ద్వారా మనం కేవలం ఆచారాలను మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను కూడా తరువాత తరాలకు అందిస్తాం. అందుకే పిల్లలను పూజలో భాగస్వాములను చేసి, గణపతి తత్వాన్ని వారికి పరిచయం చేయడం, వినాయకుని కథ చదివించడం లేదా చదివి వినిపించడం ఎంతో ముఖ్యం.వినాయక వ్రతం – మనలోని మంచి గుణాలకు నాంది సకల విఘ్నాలకు అధిపతియైన విఘ్నేశ్వరుడిని భాద్రపద శుద్ధ చవితి పర్వదినాన కుటుంబసమేతంగా భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. తలపెట్టిన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడాది పొడవునా విజయవంతంగా సాగాలని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని స్వామిని ప్రార్థిస్తాం.అయితే భక్తితో కొలుస్తూ మనం కోరేది కేవలం కోరికల నెరవేర్పు మాత్రమే కాదు, మంచి ఆలోచన ఇవ్వమని.. వివేకంతో నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వమని.. ఎదురయ్యే విఘ్నాలను ధైర్యంగా అధిగమించే శక్తి ఇవ్వమని.. కుటుంబంలో సుఖశాంతులు కలిగించమని.. సమాజంలో ఐకమత్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని.. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.ఇదే వినాయకవ్రతంలో అంతర్లీనంగా ఉన్న పరమార్థం.విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. బుద్ధిని ప్రసాదించే బుద్ధిప్రదాత..విజయాన్ని అందించే సిద్ధివినాయకుడు.. మంగళాలను చేకూర్చే మంగళమూర్తి..శ్రీ గణనాథుని కృపాకటాక్షాలు ప్రతి ఇంటిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ... శ్రీ గణేశాయ నమః! శ్రీ సిద్ధివినాయకాయ నమః! శ్రీ విఘ్నేశ్వరాయ నమఃఇదీ చదవండి: వినాయక పూజకు సన్నద్ధత -
ఏనుగు బొజ్జ.. చిన్న ఎలుక.. ఇందులో ఇంత పెద్ద తత్త్వమా?
మొన్న ఓల్డ్ బోయిన్పల్లి దగ్గర రోడ్డు పక్కన రెండు మూడు కిలోమీటర్ల ΄÷డుగునా గణేష్ విగ్రహాలు కనిపించాయి. గణపతుల గణాలు భూమ్మీదకి దిగినట్టుగా ఉంది. అలా ఆ విగ్రహాల్ని చూస్తూ ముందుకు పోతుండగా అక్కడొకచోట ఒకాయన కనిపించాడు. ‘ఇదేమిటి! ఇక్కడ ఈ గ్రీకు పెద్దమనిషి కనిపిస్తున్నాడు’ అని కళ్ళు నులుముకుని చూసాను. సందేహం లేదు.. అతనే... పుస్తకాల్లో చూసిన ముఖమే.ఎపిక్టెటస్!‘మనల్ని బాధపెట్టేది జరిగే సంఘటనలు కాదు, ఆ సంఘటనల గురించి మనం ఏమనుకుంటున్నామో అది’ అని చెప్పిన గొప్ప తత్త్వవేత్త. ఒకప్పుడు బానిసగా బతికిన రోజుల్లో, అతడి యజమాని ఒకసారి అతడి మీద కోపంతో అతడి కాలు విరిచేసాడు. అందుకని ఇప్పుడు ఆ కాలున్నవైపు కొద్దిగా వాలి ఉన్నాడు. కానీ మార్కస్ అరీలియస్ లాంటి చక్రవర్తికే దారి చూపించిన వాడు. ‘మీరేమిటిక్కడ?’ అనడిగి, ‘నాకింకా నమ్మశక్యం కాకుండా ఉంది. లేకపోతే ఒకటో శతాబ్దపు రోమ్ ఎక్కడ? ఈ ΄ాత బోయిన్పల్లి ఎక్కడ?’ అన్నాను.‘నువ్వేకదా నన్ను తలుచుకుంటూ ఉన్నది’ అన్నాడు ఎపిక్టెటస్ నా వైపు చూపు తిప్పకుండానే. ఆయన ఆ గణేష్ మూర్తుల్నే కళ్ళప్పగించి చూస్తున్నాడు.అప్పుడు తట్టింది, అప్పటికి రెండు మూడు రోజులుగా నేను ఆయన పుస్తకాలే చదువుతున్నానని. ‘అంటే మీరు ఎవరు తలుచుకుంటే వాళ్ళ దగ్గర ప్రత్యక్షమవుతారా?’ అనడిగాను.‘అవును. నిన్ననే, పుణేలో ఎవరో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ΄ాఠాలు చెప్తూ నా మాటలు పదే పదే చెప్తూ ఉంటే అక్కడికి పోక తప్పింది కాదు’ అని అంటూ ‘ఈయనేమిటి? ఇలా ఉన్నాడు... ఏథెన్సులోనూ, రోములోనూ నేనిలాంటి శిల్పాలు ఎప్పుడూ చూడలేదు’ అని అన్నాడు ఆశ్చర్యపోతూ.‘ఈయన వినాయకుడు, విఘ్నాధిపతి. మావాళ్ళు చెప్పేదేమంటే ఆయన మొదట్లో రైతుల దేవుడని, ప్రకృతి దేవుడని, పర్యావరణానికి దేవుడని. ఆ చెవులు చేటలు, ఆ బొజ్జ సుభిక్షానికి గుర్తు, ఆ ఎలుక రైతుల విరోధి కదా, అందుకని లొంగదీసుకున్నాడంటారు..’ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఎపిక్టెటస్ నా వైపు తిరిగి నన్ను పరిశీలనగా చూసాడు.‘కాదు కాదు... నువ్వు ఆ అవయవాల్ని వర్ణిస్తున్నావు. అవి అలా ఎందుకున్నాయో వివరిస్తున్నావు. నేను ఆలోచిస్తున్నది అది కాదు. నిన్న ట్రయినింగ్ క్లాసులో అంతా పిల్లలు... వాళ్ళ మాటలే ఇంకా నా చెవుల్లో వినబడుతున్నాయి. అందులో ఒకమ్మాయి ఆ ఫాకల్టీని అడుగుతోంది... నన్నంతా లావుగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటున్నారు, డైటింగ్ చెయ్యాలంటారు, యోగా చెయ్యాలంటారు... నాకు చాలా ఆందోళనగా ఉంది. నేనేం చెయ్యాలో చెప్పండి అని.కానీ, చూడు మిత్రమా.. బాడీ షేమింగ్‌ని పూర్తిగా జయించినవాడు ఇలా ఉంటాడు. ఎంత అన్ అ΄÷లొజిటిక్గా ఉన్నాడు. అచ్చం మా సోక్రటీసులాగా ఉన్నాడు. లోకం పెట్టుకునే ఏ కొలతలకీ లొంగిపోకుండా తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉన్నాడు. తను తనుగా. అలా ఉండాలంటే ముందు కావలసింది అటువంటి ఆత్మనిశ్చయత, అటువంటి ఆత్మనిర్భరత. ముందు నిన్ను నువ్వు అంగీకరిస్తే అప్పుడు తక్కిన లోకమంతా నిన్ను గౌరవించి తీరుతుంది. అవునూ, ఆ దంతమెందుకు విరిగి పోయింది?’ అనడిగాడు.‘అదా.. వ్యాసుడు భారతం చెప్తూ ఉంటే ఈయన రాయడానికి కూర్చున్నాడు. మధ్యలో గంటం విరిగిపోయింది. కాని రాత ఆపకూడదని నియమం. అందుకని తన దంతం తనే విరుచుకుని దాంతో రాయడం మొదలుపెట్టాడంటారు’ అన్నాను.‘ఆహా! ఆ వ్యక్తిత్వం నేనూహించినట్టే ఉంది. అలాంటి వాళ్ళు ఒక పనికి పూనుకున్నారనుకో. వెనక్కి తగ్గరు. దేనికైనా సిద్ధపడతారు. తమ ఆత్మలోంచి కొంత ధారపోసి అయినా సరే ముందుకు నడుస్తారు. మనకి చూడటానికి వాళ్ళు గాయపడ్డారనిపిస్తుంది. కాని గాయాన్ని గేయంగా మార్చుకుంటారు. అందం కాదు, ఆర్భాటం కాదు, పదిమందీ ఏమనుకుంటారన్న ఆత్రుత కాదు, అన్నిటికన్నా ముందు తాము ఒప్పుకున్న పని ఆగిపోకుండా ముందుకు నడిచిందా లేదా. అంతే. అదే వాళ్ళకి నిజమైన అలంకారం’ అని అన్నాడు వెలుగు చిమ్ముతున్న చూపుల్తో.‘అలా అయితే ఆ ఎలక సంగతేమిటి?’ అనడిగాను. ‘ఇందాకా నువ్వు ఈయన్ని రైతుల దేవుడని చె΄్పావు. ఒక్క రైతులకే ఎందుకు? ఈయన మనుషులందరికీ దేవుడని ఆ ఒక్క ఎలకని బట్టి చె΄÷్పచ్చు. ఎలక చూడు. ఎంత రెస్ట్‌లెస్‌గా ఉంటుంది! నిలకడ లేని జీవి. ఊరికే పరుగెట్టుకుంటూ పోతుంది. కాని ఆయన దాన్ని వాహనంగా మార్చుకున్నాడు. అంత పెద్ద శరీరం, అంత చిన్న వాహనం. ఎవరేనా తమ యాంగ్జయిటీని అదుపు చేసుకోగలిగితే అలానే ఉంటుంది, చిన్న ఎలక మీద ఏనుగు వూరేగినట్టు. అద్భుతం కదా’ అని అన్నాడు.‘మరి ఆ చెవుల సంగతేమిటి?’ అనడిగాను. ఈలోపు ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుంది. ఒకటే హారన్లు. ఎపిక్టెటస్ ఆ ట్రాఫిక్ కేసి చూసాడు. ‘ఇప్పుడు కాదులే, మరోసారి మాట్లాడుకుందాం, ఇప్పటికైతే ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈయన సరిగ్గా ఇప్పటి కాలానికి తగ్గ దేవుడు. ట్రూ పర్సనాలిటీ కోచ్. అన్నిటికన్నా ముందు మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావన్న దానికి ఎవరికీ సంజాయిషీలిచ్చుకోనక్కర్లేదు. నిన్ను నువ్వు అంగీకరించు. ఎవరు ఏం చెప్పినా చెవులు చాటంత చేసుకుని విను.కానీ ఊరికే ఆందోళన పడిపోకు. నువ్వెలా బతకాలో నీ స్క్రిప్టు నువ్వే రాసుకో. అవసరమైతే నీలో ఒక భాగాన్ని తుంచెయ్యవలసి వస్తే తుంచెయ్యి. ఒక్క భాగమేమిటి? నీకు అప్పగించిన పనికి అవసరమైతే నిన్ను నువ్వే మూల్యంగా చెల్లించుకోడానికి సిద్ధపడు. గుర్తుపెట్టుకో నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ముందు నీకు నువ్వే ఒక పెద్ద అడ్డంకి. నిన్ను నువ్వు జయించుకున్నావా! నీకు తిరుగులేదు’ అని అంటూ వడివడిగా నడుచుకుంటూ ఆ జన సందోహంలో కలిసిపోయాడు, ఆ మహాతత్త్వవేత్త ఎపిక్టెటస్.– వాడ్రేవు చినవీరభద్రుడుఇదీ చదవండి: 1980ల నాటి వినాయక చవితి ఓ జ్ఞాపకం కదా! -
1980ల నాటి వినాయక చవితి ఓ జ్ఞాపకం కదా!
‘కుడుమిస్తే పండగ’ అని సామెత. పిల్లలకు కుడుములు తెచ్చే వినాయక చవితి వస్తే ఇక పండగే. ‘ఓ బొజ్జ గణపయ్య... నీ బంటు నేనయ్యా... ఉండ్రాళ్లు చవిచూడవయ్యా’ అని పాటలు పాడతాం కానీ ఆ కుడుములు గణేశుడు తినడు పాపం... మాకే ఇచ్చేస్తాడు. బొజ్జ గణపయ్యకు పిల్లలంటే ఇష్టం కదా మరి.బాలగణేశుడు తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ తిరిగి అదే లోక ప్రదక్షిణగా గణనాయకుడైపోయాడు. ఆయన కేవలం తల్లిదండ్రుల చుట్టే తిరిగాడు. మేమైతే తల్లిదండ్రులు చెప్పిన స్కూళ్ళు, పుస్తకాలు, ట్యూషన్ల చుట్టూ తిరుగుతూ వినాయక చవితిరోజు మాకు బాగా మార్కులు రావాలని పుస్తకాలన్నీ తెచ్చి వినాయకుని విగ్రహం దగ్గర పెట్టేవాళ్లం. నూరు ఇవ్వకపోయినా గట్టున పడేసేవాడు.అప్పట్లో డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని? రూపాయి రూపాయికి అందరూ వెతుక్కోవడమే. మరి దేవుణ్ణి పెట్టాలంటే డబ్బు ఏదీ? అందుకే చందాలు మొదలయ్యాయి. ఇంటింటికీ తిరిగి రూపాయి, అర్ధ చందాలు వసూలు చేసి దేవుడి విగ్రహం పెట్టేవాళ్లు. ఇప్పటిలా వీధి వీధినా ఒకటి లేదనుకోండి. ఊరికి ఒకటి. అదీ మూడు రోజులే.ఇక ఇళ్లల్లో వినాయక చవితికి మట్టి ప్రతిమలే. ఇవి ఎలా చేస్తారో చూద్దామని పండగరోజు ఉదయాన్నే బజారుకు నాన్నతో పాటు వెళ్లేవాళ్లం. వినాయకుని విగ్రహాలు అమ్మేవాళ్లు ఆ ముందురోజు రాత్రే ఊళ్లోకి దిగి బంకమన్ను, నీళ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ల దగ్గర అచ్చులు పెట్టుకుని ఉండేవాళ్లు. బంకమన్ను కలిపి, నూనె రాసిన అచ్చులో అదిమి, అచ్చును పేపర్ మీద తిరగేస్తే వినాయకుని బొమ్మ రెడీ. అదే పేపర్లో దానిని చుట్టి ఇంటికి తెచ్చుకునేవాళ్లం. మా చిన్నప్పుడు వినాయకునికి గొడుగు తప్పనిసరి. అవి విడిగా అమ్మేవారు. రంగు కాగితాల గొడుగు కొనుక్కొని వచ్చి వినాయకుణ్ణి ప్రతిష్టించాక గొడుగు వెనుక గుచ్చేవాళ్లం.చవితిరోజు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు వస్తాయని పెద్దవాళ్లు చంద్రుణ్ణి చూడొద్దని ముందే వార్నింగ్ ఇచ్చేవాళ్లు. శమంతకమణి కథలో శ్రీకృష్ణుడిపై మణి దొంగతనం నింద పడటానికి కారణం చవితి చంద్రుణ్ణి చూడటమే అని చెబుతారు. అందుకే చాలా భయం వేసేది. చంద్రుణ్ణి చూడకుండానే పెన్ను కొట్టేశామనో, నోట్సు చింపేశామనో మన మీద నిందలు పడుతూనే ఉంటాయి. చూస్తే ఇంకేమైనా ఉందా?వినాయక చవితి రోజు ఉదయం పూట బజార్లన్నీ ఏవో గడ్డి మైదానాల్లా ఉంటాయి. పత్రి అమ్మేవారు వరుసగా కూచుని కిటకిటలాడుతూ ఉంటారు. అన్నిరకాల పత్రి ఒకరి దగ్గర ఉండదు. కొందరు మారేడు, గరిక అమ్మితే కొందరు ఉమ్మెత్త, మాచీపత్రం అమ్ముతారు. కొందరి దగ్గర జిల్లేడు దొరికితే, కొందరి దగ్గర వావిలి దొరుకుతుంది. ఇక కొన్నిరకాల పత్రి మనమే ఊరి బయటకు వెళ్లి, ΄÷లాల వెంట తిరిగి తెచ్చుకోవాలి. మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రితో పూజ చేయాలని శాస్త్రం. అన్నీ ఔషధ గుణాలున్న ఆకులే.అమ్మ ఉదయాన్నే లేచి వినాయకుడికి పెట్టాల్సిన ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం తయారు చేస్తే నాన్న దూలానికి ‘పాలవెల్లి’ కట్టి దానికి మొక్కజొన్న ΄÷త్తులు, వెలగపండ్లు, సీతాఫలాలు వేలాడదీసేవారు. తొమ్మిదీ తొమ్మిదిన్నరకు పూజ మొదలయ్యేది. పూజ కొంచెం ఎక్కువసేపు జరిగినట్టు అనిపించినా, కుదురు లేనట్టుగా కూచున్నా అయ్యే వరకూ లేవడం అసాధ్యం. లేస్తే తిట్లే. పూజ అయ్యాక వినాయకుడి ముందు గుంజిళ్లు తీసి, చెంపలు వేసుకొని, చదువు బాగా రావాలని మొక్కుకునేవాళ్లం.ఆ సాయంత్రం ఊళ్లో పిల్లలందరికీ ఒకటే ఆటలు. పల్లేరుకాయలతో కొట్టుకునే ఆట ఉండేది. భలే దెబ్బ తగిలేది. తర్వాత మానేశారు అలా కొట్టుకోవడం. తర్వాత మంటపం దగ్గర కూచుంటే స్పీకర్లలో ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాటలు తెగ వినిపించేవి. ప్రసాదం దక్కేది. వీలుంటే పాటకచ్చేరీ కూడా ఉండేది.మూడు రోజులు వినాయకుణ్ణి ఇంట్లో ఉంచుకున్నాక ఇక నిమజ్జనం చేసేవాళ్లం. ఈనాటిలా పెద్దపెద్ద లారీలు, క్రేన్లు అప్పట్లో లేవు. వీధిలోని కుర్రాళ్లంతా కలిసి వీధిలోని మట్టి విగ్రహాలన్నీ ఒక చిన్న బండి మీదో లేదా చేతుల మీదుగానో మోసుకుంటూ ‘గణపతి బొ΄్పా మోరియా’ అంటూ కాలువకో, చెరువుకో లేదా సముద్ర తీరానికో ఊరేగింపుగా తీసుకెళ్లేవాళ్లం. తీరానికి వెళ్ళాక మట్టి వినాయకుడు నీటిలో కరిగిపోతుంటే, ‘వచ్చే ఏడాది త్వరగా రా తండ్రీ’ అని చేతులు ముడిచి దండం పెట్టేవాళ్లం.ఆ రోజుల్లో వినాయక చవితి నిరాడంబరంగా, హోరు లేకుండా ఉండేది. ఆకుపచ్చగా ఉండేది. సహజంగా ఉండేది. పండగ అంతరార్థం తెలుసుకుంటే పర్యావరణంతో పాటుగానే పండుగ చేసుకోమని గణేశుడు చెప్తున్నట్టే ఉంటుంది. ప్రకృతిగణాలకు నాయకుడైన గణేశుడు ప్రకృతిని కాపాడి వానలు, పంటలు ఇవ్వాలని కోరుకుందాం. – కెఇదీ చదవండి: వినాయక చవితి.. పత్రి -
బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ
వినాయక చవితి వేడుకలు దేశీయ వర్తక శ్రేణులకు సరికొత్త కళను తీసుకొచ్చాయి. కొవిడ్ తర్వాతి కాలంలో ప్రశాంతంగా, అట్టహాసంగా జరుగుతున్న ఈ ఉత్సవాలు ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వర్తక రంగాలకే కాక దేశవ్యాప్త రిటైల్ మార్కెట్‌కు ఊపునిస్తున్నాయి. ఈ పండుగ సీజన్లో సుమారు రూ.10,000 కోట్లకు పైగా వ్యాపారం సాగుతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వినాయక విగ్రహాల తయారీ నుంచి డెకరేషన్, పూజా సామగ్రి, స్వీట్లు, లైటింగ్.. వరకు ప్రతి విభాగానికి ఈ పండుగ కొత్త ఊపిరి పోస్తోంది.విగ్రహాల తయారీ, మండపాల ఏర్పాటుగణేష్ ఉత్సవాల్లో ప్రధానాకర్షణ విగ్రహాలు, మండపాలే. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పర్యావరణ స్పృహ పెరగడంతో మట్టి గణపతులకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో వేల సంఖ్యలో వెలసిన భారీ మండపాల నిర్మాణం కోసం స్థానిక కాంట్రాక్టర్లు, పందిరి నిర్మాతలు, డెకరేషన్ సిబ్బందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కో భారీ మండపం ఏర్పాటుకు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. విగ్రహాల విక్రయాలు, రవాణా, మండపాల డెకరేషన్ ఖర్చులతో కలిపి కేవలం ఈ విభాగంలోనే వేల కోట్ల రూపాయల ఆర్ధిక లావాదేవీలు జరుగుతున్నాయి.లైటింగ్, మైక్ సిస్టమ్స్ఉత్సవాల వేళ మండపాల్లోని రంగురంగుల లైటింగ్, ఆకట్టుకునే థీమ్ డెకరేషన్లు మార్కెట్‌ను ఏలుతున్నాయి. ఎల్ఈడీ లైట్లు, లేజర్ షోలు, సౌండ్ సిస్టమ్‌ల అద్దెలు విపరీతంగా పెరిగాయి. ఈసారి డిజిటల్ డెకరేషన్లు, ఫ్లవర్ ఆర్ట్ కాన్సెప్ట్‌లకు నిర్వాహకులు ప్రాధాన్యమిస్తున్నారు. ఎలక్ట్రికల్ వ్యాపారులు, లైటింగ్ కాంట్రాక్టర్లు, ఈవెంట్ మేనేజర్లు ఈ పండుగ సీజన్లో దాదాపు 30-40 శాతం అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు లైటింగ్, సౌండ్ సిస్టమ్ వ్యాపారం జోరుగా సాగుతోంది.పూలు, పండ్లు, పూజా సామగ్రిపండుగ రోజుల్లో పూలు, పండ్ల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. వినాయకుడికి ఇష్టమైన తులసి, గరిక, పత్రి, మందార, చామంతి పూలకు భారీ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గట్లుగానే పూలు, పండ్ల ధరలు సాధారణ రోజుల కంటే పెరిగాయి. ఇక పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, ధూపం, కర్పూరం, వెండి ఉత్పత్తుల విక్రయాలు పుంజుకుంటున్నాయి. చిరు వ్యాపారుల నుంచి పెద్ద షాపుల వరకు పూజా విభాగానికి సంబంధించిన బిజినెస్ రూ.1,500 కోట్లకు పైగానే నడుస్తోందని అంచనా.లడ్డూలు, స్వీట్లువినాయకుడి నైవేద్యం అంటేనే లడ్డూలు, మోదకాలు, కుడుములు. ఈ ఉత్సవాల వేళ దేశవ్యాప్తంగా స్వీట్ షాపులు కిటకిటలాడుతున్నాయి. సాంప్రదాయ మోదకాలతో పాటు డ్రై ఫ్రూట్ స్వీట్లు, ఆర్గానిక్ బెల్లంతో చేసిన మిఠాయిలకు గిరాకీ పెరిగింది. ప్రసాదాల తయారీ కోసం పాల ఉత్పత్తులు, నెయ్యి, పిండి పదార్థాల వినియోగం పుంజుకుంది. ప్రముఖ స్వీట్ బ్రాండ్లు వినాయక చవితి ప్రత్యేక ఆఫర్లు, గిఫ్ట్ ప్యాక్‌లతో భారీగా లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: 2030 నాటికి 20 లక్షల కొలువులు..! -
బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?
నైజీరియాలోని ఓండో రాష్ట్రంలో ఉన్న ఓవో నగరం శోభాయమానంగా వెలిగిపోతోంది. 600 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ‘ఇగోగో’ మహోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఆగస్టు చివరిలో ప్రారంభమై, సెప్టెంబరు మాసమంతా ఈ పండుగ సాగుతుంది. ఇది నైజీరియన్ల స్థానిక జ్ఞాపకాలతో, రాచరికంతో, సామాజిక గుర్తింపుతో ముడిపడి ఉన్న వేడుక. ఎంతో ఉత్సాహంగా సాగే ఈ వేడుకలను తిలకించడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇప్పటికే ఓవో నగరానికి క్యూకట్టారు.నైజీరియాలో వర్షాకాలం ముగిసే వేళ జరిగే సాంస్కృతిక పండుగల కాలంలోనే ఈ ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ ఇగోగో వేడుక మూలాలు పురాణ కాలపు రాణి ఒరోన్సే చరిత్రతో ముడిపడి ఉన్నాయి. దేవలోకం నుంచి దివికి దిగివచ్చిన ఒరోన్సే, ఓవో రాజును వివాహమాడి, రాజసౌధంలో కొన్ని నియమాలను విధించింది. తనకు ఇష్టంలేని బెండకాయలను వండరాదని, తన సమక్షంలో తలపాగాలు ధరించరాదని, తన దారిలో నీరు చల్లకూడదని కోరింది.ప్రజలు కొన్నేళ్లపాటు ఆ నిబంధనలను గౌరవించినప్పటికీ, కాలక్రమంలో వాటిని ఉల్లంఘించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాణి ఒరోన్సే, అడవుల్లోకి వెళ్లి అదృశ్యమైపోయింది. కానీ వెళ్లేముందు తన జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఇగోగో ఉత్సవాన్ని నిర్వహించాలని, అలా చేస్తే రాజ్యానికి శుభం కలుగుతుందని వరమిచ్చింది. నాటి నుంచి ఇగోగో పండుగ ఆచారంగా మారింది. వేడుకకు కొన్ని వారాల ముందునుంచే నగరం నూతన శోభను సంతరించుకుంటుంది. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది.మహిళలు ఊదా, తెలుపు, పసుపు రంగుల ప్రత్యేక వస్త్రాలను నేస్తారు. సంగీత, నృత్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పిల్లల నుంచి పెద్దవారి వరకు సన్నద్ధమవుతారు. విదేశాల్లో స్థిరపడినవారు తమ మాతృభూమికి చేరుకుంటారు. మహిళలు పగడపు పూసల ఆభరణాలు ధరించి, ఒరోన్సే రాణి గుణగణాలను, ఆమె త్యాగాన్ని కీర్తిస్తూ తరతరాలుగా వస్తున్న సంప్రదాయ గీతాలను ఆలపిస్తారు. ఈ వేడుకల్లో ఆనాడు రాణి ఒరోన్సే విధించిన నిబంధనలను ప్రజలంతా కచ్చితంగా పాటిస్తారు. నేడు ఇగోగో పండుగ కేవలం సంప్రదాయానికే పరిమితం కాకుండా, పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రత్యేక ఆకర్షణ ఒలోవో రాజుఇగోగో ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ ఓవో సామ్రాజ్య అధిపతి అయిన ‘ఒలోవో’ రాజు ప్రత్యేకమైన అలంకరణ. సాధారణ రోజుల్లో కిరీటాలు, మిరుమిట్లుగొలిపే వస్త్రాలు ధరించే రాజు, ఈ పండుగ రోజుల్లో విభిన్నంగా కనిపిస్తాడు. తలపాగా లేకుండా, పగడాల పూసల టోపీని, పగడాల హారాలను ధరిస్తాడు. అంతేకాక, రాణి ఒరోన్సే స్త్రీత్వాన్ని, ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటడానికి చీర వంటి ప్రత్యేక వస్త్రాన్ని ధరిస్తాడు. రాజ పురోహితులు, సర్దారులతో కలిసి వీథుల్లో నృత్యం చేస్తూ సాగుతాడు.- రమా జంబులఇవి కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్! -
కొండపై నుంచి జారుతూ రేసు.. ఈ వింత పండుగ ఎక్కడో తెలుసా?
ఈ ఫోటోలో అంకుల్ని చూశారా? చిన్న పిల్లాడిలా మూడు చక్రాల సైకిల్ మీద దూసుకు΄ోతున్నాడు. పైగా అతను సైకిల్ తొక్కడం లేదు, కొండ మీద నుంచి జారుతున్నాడు. ఈ వింత రేసు కొలంబియా దేశం, మెడలిన్ నగరంలో జరిగింది.ప్రతి సంవత్సరం జరిపే దీని పేరు ‘వాలు పండుగ’. కొండ వాలు మీద సొంతగా తయారు చేసుకున్న ఇంజన్ లేని బండ్లు, తొక్కనవసరం లేని సైకిళ్లతో రేసులో పాల్గొనాలి. ఈ ఊళ్లో పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తున్నారని వాళ్లకు వ్యాపకం కోసం ఇలా బండ్లు తయారు చేయమంటారు.పిల్లలు తమ చేతులతోనే చెక్కతో, ఇనుముతో ఈ ముచ్చటైన బుడ్డి బండ్లను తయారు చేస్తారు. వాటితో రేసు పెట్టి గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. ఈ రేసు ఉద్దేశం భయాన్ని గెలవడం. కొండ అంటే భయం కాదు, సరదా అని చెప్పడం. ఇంజిన్ లేదు, పెట్రోల్ లేదు. ఉన్నదల్లా ధైర్యం, స్నేహితుల చప్పట్లు. అవి చాలు కదా గెలవడానికి.ఇవి కూడా చదవండి: చిన్నారి జాలి చూపితే.. కుక్క ప్రాణం కాపాడింది! -
ఉగాండాలో మొదలైన బయింబా ఫెస్టివల్.. ప్రత్యేకతలేంటో తెలుసా?
ఉగాండా అంటే ప్రకృతి అందాలు, వన్యప్రాణులు మాత్రమే కాదు.. వైవిధ్యమైన సంగీతం, కళలు, సంప్రదాయాలతో కళకళలాడే దేశం కూడా. ఆ దేశంలోని సాంస్కృతిక, సృజనాత్మక ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రముఖ వేడుక బయింబా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్. ఆగస్టు 28న మొదలైన ఈ వేడుకలు 30న ముగుస్తున్నాయి. ఈ ఫెస్టివల్లో సంగీత నాటక నృత్యాలు సహా పలు దృశ్య కళల ప్రదర్శనలు జరుగుతాయి.ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో 2006లో బయింబా ఫౌండేషన్ ప్రారంభమైంది. ఈ ఫౌండేషన్ 2008లో తొలిసారిగా బయింబా ఫెస్టివల్ నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఉత్సవం తూర్పు ఆఫ్రికాలోని ప్రముఖ బహుళ కళా ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగింది. లంకులు ఐలండ్ వేదికగా ఈ ఉత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ బయింబా ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం.అంతేకాకుండా సృజనాత్మక రంగానికి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు, కళావిద్య, కళాకారుల అభివృద్ధి, సాంస్కృతిక వ్యాపార అవకాశాలను పెంచడం కూడా దాని కార్యక్రమాల్లో భాగం. ఉగాండా ఆర్థికాభివృద్ధిలో కూడా ఈ ఉత్సవం తోడ్పడుతుంది. బయింబా ఫెస్టివల్‌కు ఉన్న ప్రత్యేకతల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఒకటి. వివిధ దేశాలు, విభిన్న సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన కళాకారులు, సంగీతకారులు, ప్రదర్శనకారులు ఇక్కడ కలుసుకుంటారు. వారంతా తమ తమ అనుభవాలను పంచుకుంటారు.ఈ బయింబా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్– కళాభిమానులకు, పర్యాటకులకు, ప్రపంచ సంస్కృతులను తెలుసుకోవాలనుకునే వారికి ఒక ప్రత్యేక అనుభవంగా నిలుస్తుంది. ఈ ఫెస్టివల్ కోసం ఈ ఏడాది బయింబా అంతర్జాతీయ కళాకారుల నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. సంగీతం, నృత్యం, సినిమా, ఫ్యాషన్, ఫోటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్, థియేటర్ తదితర విభాగాలకు చెందిన కళాకారులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.ఇవి చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి? -
రాఖీ కడితే దుష్టశక్తులు దూరమవుతాయా?
భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది. శివకేశవులను స్మరిస్తూ వారి శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పర్వదినాన్ని పాటించడం, సంప్రదాయాలను ఆచరించడం అవసరం. అయితే శ్రావణ పూర్ణిమ పేరు చెప్పగానే అన్నింటికన్నా ముందుగా గుర్తుకొచ్చేది రక్షాబంధన పర్వమే.భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, భూత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.పూర్వం దేవతలకు, రాక్షసులకు తరచు యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది.రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణకోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తోడ్ గఢ్ మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమాయూన్కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీ సోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు.నారీపూర్ణిమ:మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నారీ పూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి సముద్రంలోకి నారికేళాలను అంటే కొబ్బరికాయలను వదులుతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నారియల్ పూర్ణిమగా) వ్యవహారంలోకి వచ్చింది.జంధ్యాల పున్నమి పాల్కురికి సోమనాథకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమి అని వర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమనాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.హయగ్రీవ జయంతి:ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధాపరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది సాధ్యపడదని, మరేదైనా వరం కోరుకోవలసిందని అమ్మవారు చెప్పింది. అప్పుడు హయగ్రీవుడు తనలాగే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది.ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి ధనుస్సు అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది.దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి ఆ దుష్ట రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీశక్తి మహిమ ను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని, శివశక్తిని ఈ కథ తెలియజెబుతుంది. అందుకే శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.జంధ్యాల పౌర్ణమి: సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారందరూ శ్రావణ పూర్ణిమనాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యాన్నే ’యజ్ఞోపవీతం’ అని అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం.ఇలా శ్రావణపూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. ఈ రోజున పరమేశ్వరుడిని పంచామృతాలతో లేదా ఆవునేతితో లేదా ఆవుపాలతో అభిషేకించి, రుద్రనమక చమకాలతో ఆరాధించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో అపమృత్యు దోషాలు, భయాలు తొలగి, చక్కటి ఆరోగ్యం, తేజస్సు కలుగుతాయి.ఉపాకర్మఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనినే ముంజ అంటారు. ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు ఈ మంజను తీసి వేస్తారు. అందుకే ముంజ విడుపు అని కూడా ఈ కార్యక్రమానికి పేరు. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ’జంధ్యాల పూర్ణిమ’ కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. – డి.వరలక్ష్మిఇవి కూడా చదవండి: శివుడు శరభుడిగా ఎందుకు మారాడు? -
ఓణం హిందూ పండుగ కాదా?.. తెరపైకి కొత్త చర్చ!
తిరువనంతపురం: కేరళలో ఓణం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని మతాల ప్రజలు ఇందులో భాగస్వాములవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఓణం హిందూ పండుగ కాదని, అది కేవలం మలయాళ సంస్కృతి, పంటల పండుగ మాత్రమేనని ప్రచారం జరుగుతోంది. ఈద్, క్రిస్మస్ పండుగలకు స్పష్టమైన మతపరమైన గుర్తింపు ఉన్నప్పుడు, మహాబలి-వామన పురాణ గాథతో ముడిపడిన ఓణం నుంచి దాని మత గుర్తింపును ఎందుకు వేరు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.ఓణం మూలాలు భాగవత, వామన పురాణాల్లోని మహాబలి-వామనుల కథతో ముడిపడి ఉన్నాయి. మహాబలి త్యాగం, వామనుడి పూజలతో పాటు తిరువోణం నక్షత్రం, త్రిక్కాకర ఆలయ సంప్రదాయాలు, ఓణత్తప్పన్ ఆరాధన, పూల రంగోలి (పూకలం) వంటివన్నీ హిందూ ఆచారాలే. అయితే, ప్రస్తుతం దీనిని లౌకిక, లెఫ్ట్-లిబరల్ దృక్పథంతో ద్రావిడ-ఆర్య, అసుర-దేవతల కుల వివక్ష పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఓణం మాత్రమే కాకుండా పొంగల్, బైసాఖి వంటి పలు ప్రాంతీయ హిందూ పండుగలను సైతం కేవలం సంస్కృతి, పంటల పండుగలుగా మార్చి వాటి మూలాలను తొలగించే ధోరణి కనిపిస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఓణం హిందూ సంప్రదాయాలతో కూడుకున్నందున ముస్లింలు దూరంగా ఉండాలని పలువురు మౌలానాలు సూచించగా, సిరో-మలబార్ చర్చి మాత్రం దీనిని సాంస్కృతిక వేడుకగా భావించవచ్చని పేర్కొంది. అందరూ కలిసి వేడుకలు జరుపుకోవడం మంచిదే అయినప్పటికీ, లౌకికవాదం పేరుతో ఒక పండుగకున్న చారిత్రక మూలాలను చెరిపివేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇది కూడా చదవండి: ఏలియన్స్‌తో మాట్లాడొద్దు.. హెచ్చరించిన చైనా! -
శ్రీలంకలో ఘనంగా పెరహెర వేడుకలు.. ఎందుకు జరుపుతారంటే?
సంస్కృతి, ఆధ్యాత్మికతతో ముడిపడినటువంటి ‘కాండీ ఎసల పెరహెర వేడుకలు’ శ్రీలంకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 18 నుంచి 28 వరకు సాగే ఈ వేడుకలను మొత్తం 10 రాత్రులు, 11 రోజులు పాటు అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఊరేగింపులు, కళాకారుల ప్రదర్శనలు, అలంకరణలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో తుది ఘట్టమైన ‘రాందోళి పెరహెర’ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.కాండీ ఎసల పెరహెర ఉత్సవాల తేదీలు ప్రతి సంవత్సరం మారుతున్నప్పటికీ, ఈ పండుగ నిర్వహణ ఎప్పుడూ ఒకేలా సాగుతుంది. ఈ సంబరాలు ప్రధానంగా మూడు ఘట్టాలుగా కొనసాగుతాయి.ఉత్సవాల్లో ప్రారంభ క్రతువు కప్ సిటువీమ. ఈ వేడుకలు శ్రీ దళదా మాలిగావా (బుద్ధుని పవిత్ర దంత అవశేషం ఉన్న దేవాలయం) ప్రాంగణంలో ప్రారంభమవుతాయి. ఉత్సవ ప్రారంభానికి సూచికగా ఆలయ ప్రాంగణంలో ఒక పవిత్ర వృక్షాన్ని నాటుతారు. ఇది ప్రధానంగా మతపరమైన ఆచారం అయినప్పటికీ, పెరహెర సీజన్ కు ఇది అధికారిక ప్రారంభ ఘట్టంగా నిలుస్తుంది.ఉత్సవాల్లో రెండో ఘట్టం కుంభాల్ పెరహెర. పండుగ మొదటి ఐదు రాత్రులను ‘కుంభాల్ పెరహెర’ అని పిలుస్తారు. ఈ ప్రారంభ ఊరేగింపులు పరిమాణంలో కాస్త చిన్నవిగా, సంప్రదాయబద్ధంగా సాగుతాయి. ఎక్కువ రద్దీ లేకుండా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా ఆస్వాదించడానికి ఇవి చక్కటి అవకాశం. ఈ రాత్రులలో సంప్రదాయ కాండియన్ నృత్యకారులు, కొరడా ఝళిపించే ప్రదర్శకులు, మేళతాళాల వాయిద్యకారులు, అలంకరించిన ఏనుగులు, దివిటీలు పట్టిన సేవకులు పాల్గొంటారు.మూడో ఘట్టం రాందోళి పెరహెర. అంటే మహా ఊరేగింపులు. ఆఖరి ఐదు రాత్రులను ‘రాందోళి పెరహెర’ అని పిలుస్తారు. పండుగ మొత్తంలోనే అత్యంత అద్భుతంగా, వైభవంగా సాగే రాత్రులు ఇవే! ఈ ఊరేగింపులు జరిగేటప్పుడు కాండీ నగర వీథులు వేలాదిమంది భక్తులతో, పర్యాటకులతో నిండిపోతాయి. వందలాది మంది నృత్యకారులు, కళాకారులు, వాద్యకారుల బృందాలు, రాత్రి ఆకాశాన్ని కాంతులతో నింపే అగ్ని విన్యాసకులు, విద్యుత్ దీపాలతో ప్రకాశించే వస్త్రాలు ధరించిన గజరాజులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి కాండీ పెరహెరకే అత్యంత ముఖ్యమైన ఘట్టాలు కావడంతో అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.ఈ ఉత్సవాల్లో చివరి ఊరేగింపు రాత్రి వేకువ జామున జరిగే వేడుక దహవల్ పెరహెర. ఇందులో భాగంగా మహావలి నది ఒడ్డున జరిగే ‘దియా–కెపీమ’ అంటే ‘జలఖండన’ కార్యక్రమంతో ఎసల పెరహెర ముగుస్తుంది. ఇందులో భాగంగా నదీ జలాలను లాంఛనప్రాయంగా ఖండించినట్లు నీళ్లల్లో కత్తులను తాటిస్తారు. ఈ క్రతువును వీక్షించేందుకు సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు.శ్రీలంకలో జరిగే ప్రసిద్ధ ‘కాండీ ఎసల పెరహెర’ ఉత్సవం కేవలం ఒక సాంస్కృతిక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. గౌతమ బుద్ధుని పవిత్ర దంత అవశేషానికి అత్యంత భక్తిశ్రద్ధలతో గౌరవం అర్పిస్తూ, దేశానికి సమృద్ధిగా, సమయానుకూల వర్షాలు, ప్రజలకు శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ చారిత్రాత్మక వేడుక శ్రీలంక బౌద్ధ సంస్కృతి విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతోంది.- రమా జంబుల -
ఓనం కేరళం! పండుగలో పిల్లలకు మోస్ట్ ఫేవరెట్ ఏంటో తెలుసా?
పిల్లలూ... ఇప్పుడు కేరళంలో ఓనమ్ పండగ సీజన్. మనకు దసరా, సంక్రాంతి ఎలాగో... కేరళ వాళ్లకు ‘ఓనమ్’ అలా అన్నమాట. ఇది వాళ్ల పెద్ద పండుగ. పూర్వం కేరళను ‘మహాబలి’ అనే ఒక మంచి రాజు పాలించేవాడట. ఆయనంటే ప్రజలందరికీ చాలా ఇష్టం.ఆ రాజు ఏటా ఒకసారి ఆకాశం నుంచి భూమికి వచ్చి, తన ప్రజలందరూ ఎలా ఉన్నారో చూసి వెళ్తాడని అక్కడి వాళ్ల నమ్మకం. ఆ రాజుగారికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పడానికే ఈ ఓనమ్ పండుగ చేసుకుంటారు. ఈ పండుగకు పిల్లలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు! పది రోజుల పాటు రోజూ పొద్దున్నే లేచి, తోటల్లో కలర్‌ఫుల్ పూలను కోసుకొస్తారు. ఇంటి ముందు ‘పూకళం’ అంటే పూలతో పెద్ద పెద్ద ముగ్గులు భలే అందంగా పెడతారు. పట్టు లంగాలు, తెల్లటి సాంప్రదాయ బట్టలు వేసుకుని దేవదూతల్లా రెడీ అవుతారు.ఈ పండుగలో పిల్లలకు మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ ఏంటో తెలుసా? ‘పులికలి’ అనే టైగర్ డ్యాన్స్! కొందరు మనుషులు ఒంటికి పులి లాగా రంగులు వేసుకుని, డప్పుల చప్పుళ్లకు వీధుల్లో డాన్స్ చేస్తుంటే పిల్లలు తెగ నవ్వుకుంటారు. అలాగే నదుల్లో పెద్ద పెద్ద పడవ పందాలు జరుగుతుంటే చూసి చప్పట్లు కొడతారు. ఇక పండగ రోజు అరిటాకులో పాయసం, బోలెడు వంటకాలతో కడుపునిండా విందు భోజనం తింటారు. మరి ఈసారి ఓనమ్ పండుగకు మీరు కూడా ఇంట్లో పూల ముగ్గులు వేసి ఎంజాయ్ చేస్తారా!ఇవి కూడా చదవండి: 'జుడో' పోటీ..! బలం కంటే తెలివితో ప్రత్యర్థిని ఓడించగలమా? -
తేళ్లను తాకినా కుట్టవట..! కందుకూరులో తేళ్ల పంచమి వేడుకలు..
తెలంగాణ: దేశమంతా సోమవారం నాగుల పంచమి జరుపుకొంటే నారాయణపేట జిల్లా సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లా గురుమిట్కల్ మండలం కందుకూరులో మాత్రం తేళ్ల పంచమి ఘనంగా నిర్వహించారు. ఇక్కడ తేళ్లను దైవస్వరూపంగా భావిస్తూ ఏటా ప్రత్యేకంగా తేళ్ల జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.కందుకూరు గ్రామ సమీపంలోని కొండపై ఉన్న కొండమవ్వ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని, అక్కడే ఉన్న తేళ్ల విగ్రహాలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం కొండపై ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తొలగించినా.. వాటి కింద తేళ్లు కనిపించాయి. తేళ్లను చేతితో తాకినా.. పట్టుకున్నా..అవి కుట్టకపోవడం అమ్మవారి దివ్యానుగ్రహమని భక్తులు విశ్వసిస్తారు.చిన్నారులు, యువత, మహి ళలు, పురుషులు అనే తేడా లేకుండా భక్తులు తేళ్లను చేతుల్లోకి తీసుకుని, చేతులు, పొట్ట, ముఖం తదితర శరీర భాగాలపై పెట్టుకుని జాతరలో సందడి చేశారు. గుట్టపై ఉండే వాతావరణ పరిస్థితులు, వన మూలికల కారణంగా తేళ్లు కుట్టలేకపోతున్నాయని కొందరు విద్యావంతులు చెబుతున్నారు. -
అవా ఒడోరి... డాన్స్ హుషారే!
జపాన్‌లో షికోకు దీవిలోని తోకుషిమా నగరంలో సందడి మొదలైంది. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన ‘అవా ఒడోరి’ సంప్రదాయ నృత్యోత్సవ సంరంభానికి సిద్ధమైంది. ఏటా ఆగస్టు 12 నుంచి 15 వరకు జరిగే ఈ వేడుకలను తిలకించడానికి పదిలక్షల మంది సందర్శకులు తరలి వస్తారని అంచనా. ఈ వేడుకల్లో వేలాదిమంది సంప్రదాయ నర్తకులు పాల్గొంటున్నారు.మామూలు రోజుల్లో ప్రశాంతంగా ఉండే తోకుషిమా నగరం ఈ నాలుగు రోజులు మాత్రం రంగుల ప్రపంచంగా మారిపోతుంది. రాత్రి వేళల్లో ప్రధాన రహదారులను మూసివేసి డాన్స్ షోల కోసం ప్రత్యేకమైన స్టేజ్‌లు, సందర్శకుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. నది ఒడ్డున వెలిసే సంప్రదాయ స్ట్రీట్ ఫుడ్ షాపులు పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఈ ఉత్సవ వైభవం బ్రెజిల్‌లోని రియో కార్నివాల్‌ను తలపిస్తుంది.వందల ఏళ్ల చరిత్ర..ఈ నృత్యోత్సవం ఆవిర్భావం వెనుక మూడు ప్రత్యేకమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది బోన్ ఒడోరి. జపాన్‌లో ఏటా వేసవిలో పితృదేవతల జ్ఞాపకార్థం జరుపుకునే ఒబోన్ పండుగలో చేసే బోన్– ఒడోరి నృత్యం నుంచి ఈ పండుగ ఆవిర్భవించిందని ఒక నమ్మకం. రెండోది ఒక కోట నిర్మాణం. క్రీ.శ. 1587లో హాచిసుకా ఇయెమాసా అనే రాజు తోకుషిమా కోట నిర్మాణాన్ని పూర్తి చేసిన సందర్భంగా ప్రజలకు విందు ఇచ్చాడు. ఆ ఆనందంలో సామాజిక హోదాలతో సంబంధం లేకుండా ప్రజలంతా మైమరిచి చేసిన బృంద నర్తనమే కాలక్రమేణా ‘అవా ఒడోరి’గా మారిందంటారు. మూడోది జాపనీస్ నోహ్ నాటకాలకు మూలమైన ఫుర్యూ నృత్యం నుంచి ఈ పండుగ వచ్చిందనేది మరో కథనం. అందరూ ఆహ్వానితులే!ఈ అవా ఒడోరి వేడుకల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందులో నృత్యకారులు ‘రెన్’, ‘నివాకా రెన్’ అని పిలిచే బృందాలుగా ఏర్పడతారు. సాధారణ ప్రజలు, పర్యాటకుల కోసం నివాకా రెన్ అనే వేదికను ఏర్పాటు చేస్తారు. వీరు ప్రత్యేక దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. డాన్స్ ప్రారంభించే ముందు ప్రసిద్ధ కళాకారుల నుంచి ఉచితంగా స్టెప్పులు నేర్చుకుని వేడుకల్లో పాల్గొనవచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రధాన రహదారులను మూసివేసి డాన్సులు చేస్తుంటారు. అంతేకాదు, ఆగస్టు నెలలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనలేని పర్యాటకుల కోసం నగర కేంద్రంలోని ‘అవా ఒడోరి కైకాన్’ భవనంలో ఏడాది పొడవునా ఈ ప్రదర్శనలు అందుబాటులో ఉంటాయి. పగటిపూట ప్రత్యేక షోలతో పాటు, ప్రతిరోజూ రాత్రి ప్రసిద్ధ డాన్స్ గ్రూపులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తాయి. సందర్శకులకు డాన్స్ నేర్పి, వారితో కలిసి స్టెప్పులు వేయిస్తారు.విభిన్న నృత్య శైలులు ఈ అవా ఒడోరిలో మహిళలు, పురుషుల డాన్స్స్టైల్ వేరువేరుగా ఉంటుంది. మహిళలు ఎంతో సొగసుగా, కాలివేళ్లపై నిల్చుని నాట్యం చేస్తారు. ఇందుకోసం నల్లటి సంప్రదాయ చెక్క చెప్పులను ధరిస్తారు. వీటి నుంచి వచ్చే క్లిక్–క్లాక్ శబ్దాలు ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తలపై విసనకర్ర ఆకారంలో ఉండే ‘అమిగాసా’ అనే గడ్డితో చేసిన టోపీలను ధరిస్తారు. ఇక పురుషులు ‘హప్పి’ అనే వదులైన సంప్రదాయ దుస్తులు ధరించి చాలా ఫాస్ట్‌గా కదులుతూ డాన్స్‌లు చేస్తుంటారు. పేపర్ లాంతర్లను గాల్లో వేగంగా తిప్పుతూ వెలుగులతో విన్యాసాలు చేస్తారు. ఈ వేడుకలు జరిగే నాలుగు రోజుల పాటు షామిసేన్ అనే మూడు తీగల వాయిద్యం, యోకోబుయె అనే వెదురు పిల్లన గ్రోవి, కానే (గంట), తైకో (పెద్ద డ్రమ్స్) వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తారు. ఇదే సమయంలో పర్యాటకులు సైతం సంప్రదాయ పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటారు.∙ రమా జంబుల -
ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)
-
బోనం వెలుగు (ఫోటోలు)
-
కరీబియన్ వేడుక... కెనడా వేదిక
ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద కరీబియన్ సాంస్కృతిక వేడుకకు కెనడాలోని టొరంటో నగరం వేదికగా నిలుస్తోంది. ‘టొరంటో కరీబియన్ కార్నివాల్’ ఈ ఏడాది 59వ వసంతంలోకి అడుగుపెట్టింది.ఈ వేడుకల్లో అత్యంత కీలకమైన గ్రాండ్ పరేడ్ ఆగస్టు ఒకటిన టొరంటో ఎగ్జిబిషన్ ప్లేస్‌లో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. కరీబియన్ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి ఇప్పటికే లక్షలాది మంది పర్యాటకులు టొరంటోకు చేరుకున్నారు.ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలు..ప్రస్తుతం ఈ కార్నివాల్లో భాగంగా కంటికిఇంపుగా సాగే భారీ పరేడ్లు, సంగీత పోటీలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీబియన్ దీవుల నుంచి వచ్చిన కళాకారుల సంగీత హోరు, రంగురంగుల దుస్తులలో నృత్యాలు చేస్తూ సాగే పరేడ్లు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకనాడు చిన్నగా ప్రారంభమైన ఈ పండుగ, నేడు ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగి, టొరంటో నగర వైభవాన్ని ప్రపంచానికి చాటుతోంది.టొరంటో ఆర్థిక వ్యవస్థకు ఏటా అర బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందించే ఈ కరీబియన్ కార్నివాల్ ఉత్సవ ప్రస్థానం 1967లో ప్రారంభమైంది. కెనడా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, అక్కడ నివసిస్తున్న కరీబియన్ సమాజం తమ సాంస్కృతిక మూలాలను చాటుకోవడానికి 1967లో ‘కరిబానా’ పేరుతో ఈ వేడుకను మొదటిసారిగా ప్రారంభించింది. నాటి యోంగ్ స్ట్రీట్‌లో జరిగిన తొలి పరేడ్‌లో దాదాపు యాభైవేల మంది పాల్గొన్నారు. కెనడాకు కరీబియన్ ప్రజలు అందించిన ఈ బహుమతే, కాలక్రమేణా నేటి భారీ అంతర్జాతీయ ఉత్సవానికి బలమైన పునాదిగా మారింది.కరీబియన్ ప్రాంతంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ వేడుక ‘కరీబానా’ పేరుతో మొదలైంది. తరువాతి కాలంలో ఈ పేరును ‘టొరంటో కరీబియన్ కార్నివాల్‘గా మార్చారు. కెనడాలో స్థిరపడిన కరీబియన్ ప్రజల సాంస్కృతిక పరిరక్షణకు, వారి ఆర్థిక స్వావలంబనకు ఈ వేడుక ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.- రమా జంబుల -
వైభవంగా గియాన్ మత్సూరీ సంబరాలు..
జపాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం గియాన్ మత్సూరీ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై నెల మొత్తం అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. యాసకా ఆలయానికి సంబంధించిన ఈ చారిత్రాత్మక ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన భారీ రథాల ఊరేగింపు జూలై 17న ప్రారంభమైంది. అంగరంగవైభవంగా నిర్వహించే ఈ వేడుకలను వీక్షించేందుకు ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు క్యోటో నగరానికి క్యూకట్టారు.దైవదూతగా స్థానిక బాలుడు!క్రీస్తుశకం 869లో నగరంలో వ్యాపించిన ఒక తీవ్రమైన అంటువ్యాధి నుంచి తమను రక్షించాలని దేవుళ్లను వేడుకుంటూ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఉత్సవాలను నిరంతరాయంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ పండుగలో ఇప్పటికీ ఒక విలక్షణమైన ఆచారాన్ని పాటిస్తారు. ఒక స్థానిక బాలుడిని దైవదూతగా ఎంపిక చేస్తారు. ఆ బాలుడు జూలై 13 నుంచి 17వ తేదీన ఊరేగింపు పూర్తయ్యే వరకు నేలపై కాలు మోపరాదనే కఠినమైన నియమం పాటించాల్సి ఉంటుంది.ఆకట్టుకునే భారీ రథాలుఈ ఉత్సవాల్లో ముఖ్యమైనది భారీ రథాల ఊరేగింపు. ఈ ఊరేగింపులో యమ, హొకో అనే రెండు రకాల రథాలను ఉపయోగిస్తారు. ఇందులో హోకో రథాలు సుమారు 25 మీటర్ల ఎత్తు, 12 టన్నుల బరువుతో మనుషులంత పరిమాణం ఉన్న భారీ చక్రాలతో నిర్మితమై ఉంటాయి. జూలై 17న జరిగిన మొదటి ఊరేగింపులో 23 రథాలు పాల్గొంటాయి. జూలై 24న జరిగే రెండో ఊరేగింపులో మిగిలిన 10 రథాలు నగర వీధుల్లో విహరిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రథాల తయారీలో ఒక్క మేకును కూడా ఉపయోగించకుండా కేవలం తాళ్లతోనే రథ భాగాలను అనుసంధానిస్తారు.రాత్రి వేళల్లో యోయియామా బ్లాక్ పార్టీలు!జూలై 17, 24 తేదీల్లో జరిగే ప్రధాన ఊరేగింపులకు ముందు వచ్చే మూడు సాయంత్రాలు క్యోటో నగరం సరికొత్త శోభను సంతరించుకుంటాయి. వీటిని వరుసగా యోయి– యామా వీధి వేడుకలుగా పిలుస్తారు. వేడుకల సమయంలో రాత్రి వేళల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేస్తారు. ఆహార శాలలు, రంగురంగుల దుకాణాలతో వీధులలో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా సాంప్రదాయ ‘యుకతా’ నూలు వస్త్రాలు ధరించి, వీధుల్లో నృత్యాలు చేస్తారు. ఈ సమయంలోనే స్థానిక ప్రజలు తమ ఇళ్ల తలుపులు తెరిచి, తమ వంశపారంపర్యంగా వస్తున్న పురాతన వస్తువులను ప్రదర్శించే ‘బ్యోబు మత్సూరీ’ అనే వేడుక కూడా ఈ సమయంలోనే జరుగుతుంది.- రమా జంబుల -
టొరంటోలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
టొరంటో: కెనడాలోని టొరంటోలో స్ట్రీట్ ఫెస్టివల్ జరుగుతుండగా కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దాలతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత అక్కడ యాక్టివ్ షూటర్ ఉన్నట్లు హెచ్చరించిన పోలీసులు, ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రకటించారు. సెయింట్ క్లేర్ ఎవెన్యూ వెస్ట్, అర్లింగ్టన్ ఎవెన్యూ సమీపంలో 'సాల్సా ఆన్ సెయింట్ క్లేర్' ఉత్సవం జరుగుతుండగా ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని, మొత్తం ఆరుగురికి బుల్లెట్ గాయాలయ్యాయని టొరంటో పోలీసులు వెల్లడించారు.పరారీలో నిందితులుకాల్పులు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రజలెవరూ ఆ ప్రాంతానికి రావద్దని హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సురక్షితంగానే ఉన్నప్పటికీ, కాల్పులకు తెగబడిన నిందితుడు లేదా నిందితులు ఇంకా పట్టుబడలేదని పోలీసులు తెలిపారు. లాటినో సంస్కృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ 'సాల్సా' ఉత్సవ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. Toronto, Canada | An incident of mass shooting reported at a street festival on St Clair Ave W & Arlington Ave, resulting in two deaths and injuring 6 others. The suspect is still at large. Heavy police force deployed at the scene. Public has been asked to avoid the area: Toronto… pic.twitter.com/37cPvePepe— ANI (@ANI) July 12, 2026ప్రత్యక్ష సాక్షుల కథనంఈ ఉత్సవంలో స్టాల్ నడుపుతున్న ప్యాట్సీ గుటిరెజ్ అనే మహిళ మాట్లాడుతూ.. తాను కస్టమర్లకు వస్తువులు ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా జనం భయంతో పరుగులు తీయడం చూశానని తెలిపారు. దీంతో తాము వ్యాపారాన్ని నిలిపివేశామని, ఇలాంటి ఉత్సవాల్లో హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రత్యక్ష సాక్షి వాలెరీ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి తాను ఒక రెస్టారెంట్ సమీపంలో కూర్చుని ఉన్నప్పుడు జనం కేకలు వేస్తూ పరుగులు తీశారని చెప్పారు. ఏం జరుగుతుందో తెలియక, ప్రాణభయంతో అందరం నేలపై పడుకున్నామని ఆమె వివరించారు.ఈ హింసాత్మక ఘటనపై అంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘సాల్సా ఆన్ సెయింట్ క్లేర్ ఫెస్టివల్లో జరిగిన ఈ దారుణ హింస నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం బాధాకరం. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.ఘనంగా ‘సాల్సా ఆన్ సెయింట్ క్లేర్’అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. లాటినో సంస్కృతి ప్రతిబింబించేలా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో లైవ్ లాటిన్ సంగీతం, నృత్య ప్రదర్శనలు, సంప్రదాయ ఆహార స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఏడాది ఈ ఉత్సవం 22వ సారి జరుగుతోంది. టొరంటో నగర నడిబొడ్డున ఉన్న వాణిజ్య ప్రాంతంలో జరిగే ఈ వేడుకకు వేలాది మంది ప్రజలు తరలివస్తుంటారు. అలాంటి రద్దీ ప్రాంతంలో ఈ ఘోరం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తర అమెరికాలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా టొరంటోకు పేరుంది. కెనడాలోనే అతిపెద్ద నగరమైన ఇక్కడ, ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో కాల్పులు జరగడం చాలా అరుదు. -
సోమశర్మ వృత్తాంతం..
‘మహర్షీ! కౌశిక పుత్రుడైన సోమశర్మ విష్ణు సాక్షాత్కారం పొందిన మహాభక్తుడని విని ఉన్నాను. అతడి వృత్తాంతం చెప్పు’ అని సూతుడిని అడిగాడు శౌనకుడు. అప్పుడు సూతుడు అతడికి సోమశర్మ వృత్తాంతం ఇలా చెప్పాడు: కౌశికుడి కుమారుడైన సోమశర్మ చ్యవనుడి కుమార్తె సుమనను పెళ్లాడాడు. అతడు ధనసంపదలు లేనందున దారిద్య్రంతో బాధపడసాగాడు. వివాహమై ఎన్నాళ్లు గడచినా సంతానం లేకపోవడంతో మరింత దుఃఖితుడై లోలోన మనోవేదన చెందసాగాడు.సోమశర్మ వేదనను గమనించిన అతడి భార్య సుమన, ‘నాథా! మనోవేదన శరీరాన్ని కూడా దహించేస్తుంది. మీరెందుకు బాధపడుతున్నారు?’ అని అడిగింది.‘దేవీ! ఈ జన్మలో నాకు ధనపుత్ర సంపదలు లేకపోవడం వల్ల దిగులు చెందుతున్నాను. పూర్వజన్మ పాపాల వల్లనే నాకీ గతి ఏర్పడినట్లుందని తలచి దుఃఖిస్తున్నాను’ అని చెప్పాడు.‘ప్రాణనాథా! సృష్టిలోని సకలజీవులు విషయాశ వల్ల సంసారబాధలు పడుతుండటం సహజమే! మోహం వల్ల లోభం; లోభం వల్ల అసత్యం; అసత్యం వల్ల పాపం; పాపం వల్ల దుఃఖం సంభవిస్తాయి. ఋణానుబంధాల కారణంగా సంతానం కలుగుతుంది. పూర్వజన్మలో మనం ఎవరి వద్ద ధనం తీసుకోలేదు. ఎవరితోనూ మనకు రాగద్వేషాదులు లేవు.’ అని చెప్పింది.‘నువ్వు చెప్పినది నిజమే! ఇది నివృత్తి మార్గం. కాని, ఎందరో సాధువులైన మహాపురుషులు సకృత కర్మలు ఆచరించి, దారాపుత్రాదులతో చతుర్విధ పురుషార్థాలను పొందారు. మనం ధన పుత్రలాభం పొందే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు’ భార్యను అడిగాడు సోమశర్మ.‘నాథా! ప్రవృత్తి, నివృత్తి మార్గాలు రెండూ శ్రుతి సమ్మతాలు. ‘పుత్రేణ లోకాన్ జయతి’ అని వేదవాక్యం. పుత్రుడు లోకజయానికి సాధనం. గుణవంతుడు, విద్వాంసుడు అయిన ఒక పుత్రుడి వల్ల వంశం తరిస్తుంది. ఎందరో మహర్షులు ప్రవృత్తిమార్గంలో చతుర్విధ పురుషార్థాలను సాధించారు.’ అంటూ అనేక ఉదాహరణలను చెప్పింది.‘దేవీ! ఇవన్నీ నువ్వెలా తెలుసుకున్నావు?’ అడిగాడు సోమశర్మ.‘నాథా! నా తండ్రి చ్యవనుడి ద్వారా కొంత జ్ఞానం పొందాను. ఆయన ద్వారానే కొన్ని పూర్వగాథలను తెలుసుకున్నాను. నాకు తెలిసినంత చెప్పాను. వసిష్ఠ మహర్షి వద్దకు వెళితే ఆయన మరిన్ని విశేషాలు చెప్పగలరు’ అని చెప్పింది సుమన.సోమశర్మ గంగాతీరంలో ఉన్న వసిష్ఠాశ్రమానికి వెళ్లాడు. వసిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. వసిష్ఠుడు అతడిని వచ్చిన కారణమేమిటని అడిగాడు.‘మహర్షీ! నా దారిద్య్ర బాధలకు, నాకింత వరకు సంతానం కలగకపోవడానికి కారణమేమిటి?’ ప్రశ్నించాడు సోమశర్మ.‘నాయనా! నువ్వు పూర్వజన్మలో కర్షకుడివి. భార్యాపుత్రులు, సిరిసంపదలతో కలిగిన వాడివి. అయినా జ్ఞానశూన్యుడివై, లోభివై, చివరకు భార్యాపుత్రులకు కూడా తగిన అన్నవస్త్రాదులు సమకూర్చక పీడించావు. నువ్వు సంపాదించిన నిక్షేపాలను రహస్య ప్రదేశాల్లో పాతిపెట్టి, వాటి సంగతి భార్యా పిల్లలకు చెప్పకుండానే కాలధర్మం చెంది, యమలోకానికి చేరుకున్నావు. దాన ధర్మాలు చేయనందునే ఈ జన్మలో దారిద్య్రాన్ని అనుభవిస్తున్నావు’ చెప్పాడు వసిష్ఠ మహర్షి.‘మరి నాకు ఈ జన్మలో విప్రత్వం లభించడానికి కారణమేమిటి?’ ప్రశ్నించాడు సోమశర్మ.‘పూర్వజన్మలో సంపన్న కర్షకుడివైన నీ వద్దకు ఒక విప్రుడు వచ్చాడు. నువ్వు అతడికి నీ గోశాలలో ఆశ్రయం ఇచ్చావు. అతడికి షడ్రసోపేతమైన భోజనంపెట్టి ఆతిథ్యమిచ్చావు. ఆ పుణ్యఫలం వల్లనే నీకు విప్రజన్మ లభించింది. నీ దారిద్య్రం తీరాలంటే లక్ష్మీనారాయణుల ధ్యానమే మార్గం’ అని చెప్పాడు వసిష్ఠుడు.వసిష్ఠుడి సలహాపై సోమశర్మ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రం జపిస్తూ లక్ష్మీనారాయణుల కోసం తపస్సు చేశాడు. అతడి తపస్సును భంగపరచడానికి దేవేంద్రుడు నానా ఆటంకాలు కల్పించాడు. అయినా సోమశర్మ నిశ్చల మనస్కుడై తపస్సు కొనసాగించాడు. సోమశర్మ తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు లక్ష్మీసమేతంగా గరుడారూఢుడై వచ్చి, అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడికి కోరిన వరాలను అనుగ్రహించాడు.శ్రీమహావిష్ణువు అనుగ్రహం వల్ల సోమశర్మకు దారిద్య్ర బాధ తీరి, ధన సంపదలు సమకూరాయి. కొన్నాళ్లకు పండంటి మగబిడ్డ జన్మించాడు. అతడు బాల్యం నుంచి కృష్ణభక్తుడై దినదినాభివృద్ధి చెందాడు. అతడు యుక్తవయస్కుడు కాగానే సోమశర్మ, సుమన దంపతులు అతడికి వివాహం చేసి, పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లారు.పురావిశేషం..పూరీలోని శ్రీక్షేత్రంలో జరిగే విశేషమైన వేడుక స్నానపూర్ణిమ. జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఆలయ అర్చకులు జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను గర్భాలయం నుంచి బయటకు తీసుకువచ్చి, ఆలయ ప్రాంగణంలోని ‘స్నానబేడి’ అనే స్నానాగారంలో పవిత్రస్నానం చేయిస్తారు. ఇందులో భాగంగా 108 కలశాల జలాలతో అభిషేకిస్తారు. ఈరోజు జగన్నాథుడు గజముఖుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. జ్యేష్ఠ పూర్ణిమ రోజు స్నానం తర్వాత జగన్నాథుడు జ్వరం బారినపడి, ‘అనసర ఘర’ అనే జ్వరమందిరంలో పద్నాలుగు రోజులు గడుపుతాడు. - సాంఖ్యాయన -
వేడుకల్లో రోమ్ నగరం..
క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఇద్దరు మహోన్నత వ్యక్తులు సెయింట్ పీటర్, సెయింట్ పాల్ల సంస్మరణార్థం జూన్ 29న నిర్వహించుకునే ‘ఫీస్ట్ ఆఫ్ సెయింట్స్ పీటర్ అండ్ పాల్’ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమవుతున్నాయి. యేసుక్రీస్తు సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో వీరిద్దరూ చూపిన అచంచలమైన విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఈ వేడుకలను జరుపుకొంటారు.రోమ్ నగరంలో వేడుకలుపీటర్, పాల్ల పండుగను రోమ్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వాటికన్ లోని సెయింట్ పీటర్స్ బెసిలికా ఈ వేడుకలకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. సెయింట్ పీటర్ వారసుడిగా ప్రస్తుత పోప్ ఈ చరిత్రాత్మక వేడుకలకు నేతృత్వం వహిస్తారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఆర్చ్బిషప్లకు ‘పాలియం’ అందజేస్తారు. అయితే ఈ పండుగ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, క్రీస్తు ప్రేమను, రక్షణ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు పీటర్, పాల్లు చూపిన ధైర్యాన్ని, నిబద్ధతను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అలవరచుకోవాలని ఈ వేడుక గుర్తు చేస్తుంది. ఈ వేడుకలను కళ్లారా వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది యాత్రికులు, పర్యాటకులు రోమ్ నగరానికి పోటెత్తుతారు. ఈ వేడుకలను కేవలం రోమ్ నగరంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు చర్చిలలో జరుపుకొంటారు.త్యాగానికి ప్రతిరూపం పీటర్, పాల్యేసుక్రీస్తు ఎంపిక చేసుకున్న పన్నెండు మంది ముఖ్య శిష్యులలో పీటర్ ఒకరు. ఒక సాధారణ జాలరి అయిన పీటర్‌ను, యేసుక్రీస్తు మానవ హృదయాలను గెలుచుకునే ‘మనుష్యులను పట్టు జాలరి’గా మార్చారు. రోమన్ల నుంచి తీవ్రమైన వేధింపులు ఎదురైనప్పటికీ, ఆయన తన విశ్వాసాన్ని వీడలేదు. క్యాథలిక్ క్రైస్తవులు ఈయన్ను మొదటి పోప్‌గా, రోమ్ చర్చి వ్యవస్థాపకుడిగా భావిస్తారు. అలాగే మొదట్లో క్రైస్తవులను తీవ్రంగా హింసించిన సెయింట్ పాల్, దమస్కు మార్గంలో యేసుక్రీస్తును దర్శించుకున్న తర్వాత పూర్తిగా మారిపోయారు. ఆ తర్వాత ‘పాల్’గా మారిన ఆయన, మధ్యప్రాచ్యం, ఐరోపా అంతటా క్రైస్తవ మతాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. నూతన నిబంధనలో ఆయన రాసిన లేఖలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.చారిత్రక ఆధారాల ప్రకారం పీటర్, పాల్– వీరిద్దరూ రోమ్ నగరంలోనే దైవసాన్నిధ్యం చెందారని విశ్వసిస్తారు. రోమ్‌లోని ప్రసిద్ధ ‘సెయింట్ పీటర్స్ బెసిలికా’, ‘సెయింట్ పాల్స్ ఔట్‌సైడ్ ది వాల్స్’ ప్రార్థనా మందిరాల్లో వీరిద్దరి సమాధులు ఉన్నాయి. చర్చి క్యాలెండర్లో వీరిద్దరి పేరుమీద ప్రత్యేకమైన రోజులున్నప్పటికీ రోమ్ నగరంలో వారు పొందిన అమరత్వాన్ని స్మరించుకుంటూ జూన్ 29ని ‘ఫీస్ట్ ఆఫ్ సెయింట్స్ పీటర్ అండ్ పాల్’గా నిర్వహిస్తున్నారు. - రమా జంబుల -
సత్యం కోసం మహా త్యాగం..
‘ముహర్రం’ ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల. త్యాగానికి, సత్యానికి, అచంచలమైన ధైర్యానికి ప్రతీక. ఈ నెలలో అత్యంత ప్రాముఖ్యమైనది పదవ రోజైన ‘ఆషురా’. ఆరోజు ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. శతాబ్దాల క్రితం, కర్బలా మైదానంలో ప్రవక్త(స) వారి మనుమడైన హజ్రత్ ఇమామ్ హుసైన్ (రజి) ఆయన 72 మంది అనుచరులు అధర్మానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారు.యజీద్ అనే పాలకుడి అన్యాయాన్ని అంగీకరించకుండా, ఇస్లామీయ మానవీయ విలువలను, శాంతిని కాపాడటం కోసం ఇమామ్ హుసైన్ తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఆకలి దప్పులతో అలమటించినాసరే, ధర్మం వైపే నిలబడి వీరమరణం పొందిన ఆయన ఉదంతం ప్రపంచ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ఘట్టంగా నిలిచిపోయింది. అందుకే ముహర్రం అంటే పండుగ కాదు, అది సత్యం కోసం జరిగిన మహా త్యాగానికి ప్రతిరూపం.ఈ కర్బలా యుద్ధం కేవలం రెండు శక్తుల మధ్య జరిగిన పోరాటం కాదు; అది న్యాయానికి – అన్యాయానికి, సత్యానికి – అసత్యానికి మధ్య జరిగిన చారిత్రాత్మక సంగ్రామం. తన కళ్లెదుటే పురిటిపాపల నుండి వృద్ధుల వరకు దాహంతో విలవిల్లాడుతూ ప్రాణాలు వదులుతున్నా, ఇమామ్ హుసైన్ అధర్మానికి తలవంచలేదు. ఆయన చూపిన ఈ ధీరత్వం శతాబ్దాలు దాటినా నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంది.అందుకే ఈ రోజున ముస్లింలే కాకుండా, మానవత్వాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని త్యాగాన్ని స్మరించుకుంటారు. సత్యం కోసం ప్రాణాలనైనా అర్పించవచ్చు కానీ, అన్యాయంతో చేతులు కలపకూడదు. అనే గొప్ప జీవన సందేశాన్ని ముహర్రం మానవాళికి అందిస్తోంది. – ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
శాంతి సయోధ్యల సంబరం
పురాతన సంస్కృతికి అద్దం పట్టే సెబీబా ఉత్సవాలకు అల్జీరియాలోని జానేట్ నగరం సన్నద్ధమవుతోంది. అల్జీరియా టూర్స్ పర్యవేక్షణలో జూన్ 20 నుంచి 27 వరకు వారం రోజులు సాగే ఈ ప్రత్యేక సాంస్కృతిక జాతర సరికొత్త అనుభూతిని పంచుతుంది. పరస్పర వైరం ఉన్న తెగల మధ్య కుదిరిన చరిత్రాత్మక సయోధ్యకు, శాంతి ఒప్పందానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవం యునెస్కో సాంస్కృతిక వారసత్వ వేడుకల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. సహారా ఎడారి ప్రజల అస్తిత్వ రూపం సెబీబా వేడుకలు.మూడువేల ఏళ్ల కిందట స్థానిక తెగల మధ్య జరిగిన సుదీర్ఘమైన, భీకరమైన యుద్ధాల ముగింపునకు, ఇరు వర్గాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి ఒక సజీవ సాక్ష్యం ఈ ఉత్సవాలు. యుద్ధంపై శాంతి సాధించిన విజయమే ఇందులోని ప్రధాన సందేశం. అలాగే ఇక్కడి ఆచారాలు శక్తికి, సౌందర్యానికి మధ్య ఉన్న సమతుల్యతను ప్రతిబింబిస్తాయి. పురుషులు తరతరాల నాటి తువారెగ్ దుస్తులు, తలపాగాలు ధరించి, చేతుల్లో కత్తులు పట్టుకుని వీరత్వంతో కూడిన నృత్యాలు చేస్తారు. ఇవి కేవలం నృత్యాలు కావు, పూర్వపు తెగల మధ్య జరిగిన యుద్ధాలను తలపించే ప్రతీకాత్మక ప్రదర్శనలు. అలాగే మహిళలు ప్రత్యేకమైన లయతో కూడిన డప్పు చప్పుళ్లతో, గంభీరమైన గీతాలను ఆలపిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతారు. ఈ ఉత్సవం స్థానిక తువారెగ్ కళాకారులకు, చేతివృత్తుల వారికి పెద్ద ఉపాధి మార్గం కూడా! స్థానిక హస్తకళాకారులు తయారుచేసే కత్తులు, వెండి ఆభరణాలు, ప్రత్యేక దుస్తులు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పర్యాటకులు స్థానిక మార్కెట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. సహారా ఇసుక తిన్నెల మధ్య, ప్రాచీన రాతి శిల్పాల నీడలో, పూర్వీకుల సంస్కృతిని నేటికీ సజీవంగా ఉంచుతున్న తువారెగ్ పౌరుల ‘సెబీబా’ ఉత్సవం, మానవజాతికి ఒక అపురూపమైన సాంస్కృతిక కానుక. వారి ఆత్మగౌరవానికి, సామూహిక స్మృతికి ప్రతీక ఈ వేడుకలు.వారం రోజుల పర్యటన1. (జూన్ 20 – శనివారం): రాత్రి 9:55 గంటలకు అల్జీర్స్ రాజధాని నుంచి నేరుగా విమాన ప్రయాణం. అర్ధరాత్రి 0:10 గంటలకు జానేట్ చేరుకుంటారు. 2. (జూన్ 21 – ఆదివారం): ‘ఇహెరిర్ లోయ’ సందర్శన. ఎడారి ఓసిస్ నీటిలో ఈత కొట్టే అవకాశం. 3. (జూన్ 22 – సోమవారం): ఇథారెన్ పురాతన సంచార గ్రామం సందర్శన. 4. (జూన్ 23 – మంగళవారం): ఎస్సెండైలీన్ వ్యాలీ గుండా పాదయాత్ర, ఇసుక రాతి తోరణాల సందర్శన. రాత్రి ఎల్ మిహాన్ ప్రాంతంలో జరిగే ‘డౌఘియా’ రిహార్సల్ వీక్షణ.5. (జూన్ 24 – బుధవారం): ఇమెరౌడెన్ రాతి చిత్రాల పరిశీలన. రాత్రి జెలౌజ్ తెగ ‘తిమౌలావీన్’ యుద్ధ నృత్యాల రిహార్సల్స్ వీక్షణ.6. (జూన్ 25 – గురువారం): ముగింపు వేడుక – సెబీబా ఫెస్టివల్. తువారెగ్ సంస్కృతికి అద్దం పట్టే అద్భుత నృత్యాలు, ఆభరణాల ప్రదర్శన.7. (జూన్ 26 – శుక్రవారం): ఎర్గ్ అద్మెర్ ఇసుక దిబ్బల మధ్య 7,000 ఏళ్ల నాటి ‘ది వీపింగ్ కౌ’ రాతి శిల్పం వీక్షణ. అడాయిక్ రాతి అడవి, పురాతన కోటలు, జానేట్ మ్యూజియం సందర్శన.8. (జూన్ 27 – శనివారం): అర్ధరాత్రి దాటాక 2:15 గంటలకు జానేట్ నుంచి తిరుగు ప్రయాణం. ఉదయం 5:55 గంటలకు అల్జీర్స్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. -
సెబాసో... సపోరో
జపాన్ లోని హొకైడో నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకునే హొకైడో ష్రైన్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శతాబ్దానికి పైబడిన చరిత్ర కలిగిన ఈ వేడుకలు నేటి నుంచి జూన్ 16 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో అద్భుతమైన ప్రదర్శనలతో సపోరో నగరమంతా పండుగ శోభ సంతరించుకుంది. సపోరా ఫెస్టివల్‌గా కూడా పిలుచుకునే ఈ పండుగ మూడు రోజులూ నకాజిమా పార్క్‌లో పెద్ద ఎత్తున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా పార్క్ అంతటా భారీ దుకాణాలను ఏర్పాటు చేశారు. స్థానికులు, పర్యాటకులు తమ సాంప్రదాయ దుస్తులైన ‘యుకాతా’ (తేలికపాటి నూలుతో చేసిన కిమోనోలు) ధరించి ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండే ఈ పార్క్‌లో స్థానిక వంటకాలు, పానీయాలు, మిఠాయిలు విక్రయించే వందలాది స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.వీటితో పాటు చిన్నపిల్లల కోసం జంపింగ్ కాసిల్స్, మ్యాజిక్ హౌస్, సాహసోపేతమైన డెత్ డిఫైయింగ్ మోటార్‌బైక్ (కళ్లకు గంతలు కట్టుకుని గుండ్రటి గోడలపై బైక్ నడిపే విన్యాసం) సందర్శకులను ఎంతగానో అలరిస్తాయి. అలాగే మరుయామా పార్క్‌లోని పురాతన మందిరం వద్ద సాంప్రదాయ పూజా కార్యక్రమాలను అక్కడి ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పండుగలో అత్యంత ప్రధానమైన ఘట్టం చివరి రోజైన జూన్ 16న జరుగుతుంది. హొక్కైడో ష్రైన్ నుంచి ఉదయం 8 గంటల ప్రాంతంలో వేలాది మందితో ఒక భారీ ఊరేగింపు ప్రారంభమై, సపోరో నగర కేంద్రం వైపుగా సాగుతుంది.ఈ ఊరేగింపులో పాల్గొనే వేలాది మంది ప్రజలు జపాన్ దేశపు ప్రాచీన హెయాన్ కాలం నాటి (క్రీ.శ. 794– 1185) రంగురంగుల, సంప్రదాయ దుస్తులలో మెరుస్తారు. నగర వీధుల గుండా సాగే ఈ ప్రదర్శనలో తైకో డ్రమ్స్, సంగీత వాయిద్యాల మోతలు మార్మోగుతాయి. స్థానికులు మోసే 4 భారీ ‘మికోషి’ (కర్రతో చేసిన చిన్న దేవాలయం లాంటి నిర్మాణాలు), 8 అద్భుతమైన ఫ్లోట్లు (రథాలు) ఈ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మధ్యాహ్న సమయానికి ఈ ఊరేగింపు సెంట్రల్ సపోరోకు చేరుకుంటుంది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి, కెమెరాల్లో బంధించడానికి వేలాది మంది ప్రజలు పోటీపడతారు. మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ వేడుకలు జపాన్ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.∙ రమా జంబుల -
‘గుర్రాల స్నానం’ 300 ఏళ్ల పాత పండగ గురించి తెలుసా?
పిల్లలూ... మన ఊర్లో ‘ఎడ్ల పందాలు’, ‘కోడి పందాలు’ లాగే ఇంగ్లాండ్‌లో గుర్రాల పండగ జరుగుతుంది. ఇంగ్లాండ్‌లో ‘యాపిల్బై’ అనే చిన్న ఊరులో మొన్న జూన్ 6న ‘గుర్రాల స్నానం పండుగ’ జరిగింది. ప్రతి వేసవిలో ఈ పండగ చేస్తారు. ఇది 300 ఏళ్ల పాత పండగ!పండుగ రోజు ‘జిప్సీ’ అనే సంచార జాతి వాళ్లు ఎక్కడెక్కడి నుంచో అందమైన గుర్రాలు, రంగురంగుల బండ్లతో యాపిల్ బైకి వచ్చేస్తారు. తాము ప్రయాణం చేసి వచ్చిన గుర్రాలకి అక్కడి ‘ఈడెన్’ నదిలో స్నానం చేయిస్తారు. చల్లటి నీళ్లలో గుర్రాలు హాయిగా ఈదుతాయి. స్నానం చేసి, జూలు దువ్వుకున్న గుర్రాలు మెరిసిపోతాయి. అప్పుడు వాటిని కొనడానికి, అమ్మడానికి బేరాలు జరుగుతాయి.గుర్రాలే కాదు, చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అందరూ కలుసుకుని ఆడతారు, పాడతారు, కథలు చెప్పుకుంటారు. గుర్రాలు నదిలో ‘టప్ టప్’ అని నడుస్తుంటే చూడ్డానికి వేల మంది వస్తారు. కొందరు గుర్రాల మీద కూర్చునే నదిలోకి దిగుతారు. భలే థ్రిల్లింగ్‌గా ఉంటుంది! ఈ జాతరలో ‘బౌ–టాప్ వాగన్’ అనే గుండ్రని పైకప్పు ఉన్న బండ్లు స్పెషల్. ఇవి జిప్సీల తిరుగాడే ఇళ్లు. మనం ప్రతి సంస్కృతిని గౌరవించాలి. -
అమెరికాలో కాల్పుల కలకలం: వేడుకల్లో బుల్లెట్ల వర్షం!
ఓహియో: అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో కలకలం చెలరేగింది. టోలెడో నగరంలోని ఒక ప్రాంతంలో వేడుకలు జరుగుతుండగా, గుర్తుతెలియని ఆగంతకుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఉత్సాహంగా సాగుతున్న వేడుకల్లో ఒక్కసారిగా వినిపించిన తుపాకీ శబ్దాలు..అక్కడి వాతావరణాన్ని ఆందోళనకరంగా మార్చివేశాయి. జనం ప్రాణభయంతో అటూఇటూ పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.పండుగ వేళ బుల్లెట్ల వర్షంఓహియోలో ‘ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్’ జరుగుతుండగా కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులకు రక్తపు మడుగులో పలువురు క్షతగాత్రులు కనిపించారు. ఈ ఘటనపై నగర కౌన్సిల్ సభ్యురాలు థెరిసా మోరిస్ స్పందిస్తూ.. ఈ కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది గాయపడ్డారని, రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఇలాంటి దారుణం జరగడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా నౌకాదళంలో పనిచేసిన కెవిన్ బెర్రీ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం, కాల్పుల అనంతరం ఎవరో గన్ను కింద పడేసి వెళ్లడం తాను చూశానని, అర్బోరేటమ్ ప్రాంతంలో ఐదుగురు గాయపడి పడి ఉండటాన్ని గమనించానని పేర్కొన్నారు.నిందితుడి కోసం ముమ్మర గాలింపుఈ హింసాత్మక ఘటనకు పాల్పడిన నిందితుని కోసం టోలెడో పోలీస్ డిపార్ట్మెంట్ ముమ్మరంగా గాలిస్తోంది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోలీసులు స్పందిస్తూ.. డెలావేర్ అవెన్యూ, రాబిన్‌వుడ్ అవెన్యూ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు, దర్యాప్తుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు స్థానికులు, సందర్శకులు ఎవరూ ఆ ప్రాంతానికి రావద్దని హెచ్చరించారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై ఆధారాలు సేకరిస్తున్నారు.‘బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ఈ ఉదంతంపై ఓహియో గవర్నర్ మైక్ డివైన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేసవి ఉత్సవాలు అనేవి సంతోషంగా గడపడానికి ఉద్దేశించినవని, ఇలాంటి చోట్ల హింస చోటుచేసుకోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కాల్పుల శబ్దాలు వినగానే జనం ప్రాణాలు కాపాడుకోవడానికి చెల్లాచెదురుగా పరుగులు తీయడం కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘వాస్తవంలో బతకండి మిస్టర్ ట్రంప్’.. నీళ్లు చల్లిన టెహ్రాన్! -
ఈ దేవతా పూజలో ఇవి వాడరాదు!
సనాతన ధర్మంలో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సమర్పించే పండ్లు, పువ్వులు, పత్రాల విషయంలో పురాణాలు కొన్ని నియమాలను విధించాయి. ఏ దేవునికి ఏది నిషిద్ధమో తెలియకుండా పూజించడం వల్ల ఆరాధన నిష్ఫలమవుతుందని మనుస్మృతి, వివిధ పురాణ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భక్తులు తప్పక తెలుసుకోవలసిన పూజా నియమాలు, నిషేధాల గురించి...శ్రీమహావిష్ణువును లక్ష్మీసమేతుడిగా ఆరాధించేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. విష్ణుపూజలో విరిగిన బియ్యాన్ని (అక్షతలను) ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. పూజకు ఎల్లప్పుడూ పూర్తి పరిమాణంలో ఉన్న తాజా అక్షతలను మాత్రమే వాడాలి. అలాగే, విష్ణుమూర్తికి జిల్లేడు, ఉమ్మెత్త పువ్వులను సమర్పించకూడదు. లయకారుడైన శివుడు అభిషేక ప్రియుడు. అయితే శివపూజలో మొగలిపువ్వును ఉపయోగించడం మహాపాపంగా పరిగణిస్తారు.పురాణ గాథ..బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం నడిచినప్పుడు.. బ్రహ్మదేవునికి అనుకూలంగా మొగలిపువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పింది. దీంతో ఆగ్రహించిన పరమశివుడు, తన పూజకు మొగలిపువ్వు పనికిరాకుండా పోతుందని శపించాడు. ఈ వృత్తాంతం శివ పురాణంలో వివరంగా పేర్కొన్నారు.వినాయకునికి తులసి దళాలు సమర్పించరాదు..సకల విఘ్నాలను తొలగించే గజాననుడికి 21 రకాల పత్రాలతో పూజ చేయడం ఆనవాయితీ. కానీ, ఆ పత్రీ పూజలో తులసి ఆకులను మాత్రం చేర్చకూడదు. కేవలం వినాయక చతుర్థి రోజున చేసే ఏకవింశతి పత్రీపూజలో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ఆరాధించేటప్పుడు అమ్మవారికి సమర్పించే పండ్లు తాజాగా, స్వచ్ఛంగా ఉండాలి. నిల్వ ఉన్నవి, పాతబడినవి, పక్షులు లేదా కీటకాలు కొరికినవి, కుళ్ళిపోయిన పండ్లను సమర్పించడం అశుభం.సూర్యభగవానునికి బిల్వ పత్రాలు సమర్పించరాదు..ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తికి బిల్వ పత్రాలను (మారేడు దళాలను) సమర్పించడం నిషిద్ధం. మారేడు దళాలు శివపూజకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. సూర్య భగవానుని అనుగ్రహం కోసం ఎర్రటి పువ్వులు (మందార వంటివి), బెల్లం, గోధుమలు, తామ్రపాత్రలో నీటిని అర్ఘ్యంగా సమర్పించడం శ్రేష్ఠమని భవిష్య పురాణం చెబుతోంది. పూజా విధానాలు, సామగ్రికి సంబంధించి మత గ్రంథాలలో స్పష్టమైన నియమాలు ఉన్నప్పటికీ.. ప్రాంతీయ ఆచారాలు, సంప్రదాయాలు, వివిధ వర్గాల నమ్మకాలను బట్టి స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.ఏది ఏమైనా విశేష పూజలు, వ్రతాలు చేసేటప్పుడు స్థానిక పండితులు లేదా ఇంటి పురోహితుల సలహాలను పాటించడం ఉత్తమం. – పసుపులేటి వెంకటేశ్వరరావు, పాత్రికేయులు -
ఎడారిలో విరిసిన త్యాగ కుసుమం!
ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పవిత్ర పర్వదినం ‘ఈదుజ్జుహా’ లేదా ‘బక్రీద్’. పండుగ రాగానే అందరి ఇళ్లలో సందడి, ఖుర్బానీలు కనిపిస్తాయి. అయితే, ఈ పండుగ వెనుక ఉన్న అసలైన మర్మం, ‘ఖుర్బానీ’ అనే పదానికి ఉన్న మహోన్నతమైన అర్థం– మహత్తర త్యాగం. ప్రపంచ చరిత్రలోనే ఎవరూ ఊహించని, సాటిలేని త్యాగాన్ని ఆచరించి చూపించిన అమరమూర్తి ప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలామ్ (అ). ఆయన జీవితం బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అడుగడుగునా కఠోర పరీక్షల పరంపర. పుత్రునిగా, భర్తగా, తండ్రిగా, ప్రవక్తగా... ఆయన తన కర్తవ్య నిర్వహణలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఆ, స్ఫూర్తిదాయక గాథ ఇదిగో...ఖుర్బానీ అంటే జంతుబలి కాదు... అనుపమానమైన ఆత్మత్యాగం! ఐదు వేల ఏళ్ల క్రితం ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక తల్లి దైవమార్గంలో ప్రదర్శించిన అచంచల విశ్వాసానికి, నిరుపమానమైన ఓర్పుకు సజీవసాక్ష్యం ఈ పండుగ. గుండెలను పిండేసే ఆనాటి సంఘటనలు, నేటికీ మానవాళికి అందిస్తున్న ఓ మహత్తర సందేశం...దాదాపు ఐదువేల సంవత్సరాల క్రితం... నేటి ఇరాక్ ప్రాంతాన్ని ‘నమ్రూద్’ అనే గర్వాంధుడైన రాజు పాలిస్తుండేవాడు. తానే దేవుడినని గర్వించే ఆ రాజు బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఇబ్రాహీం (అ) గళం విప్పారు. సర్వ సృష్టిని సృష్టించిన ఆ ఒక్కడే దేవుడని, ఆయననే ఆరాధించాలని పిలుపునిచ్చారు.దీంతో ఆగ్రహించిన రాజు, ఇబ్రాహీంను భగభగ మండే అగ్నిగుండంలో పడవేయించాడు. కానీ, దైవసంకల్పంతో ఆ అగ్నిగుండం కాస్తా చల్లని పూలపాన్పుగా మారిపోయింది! ఆ పరాభవంతో రాజు దేశ బహిష్కారం విధించగా, ఇబ్రాహీం దైవసందేశ ప్రచారంలోనే శేషజీవితాన్ని గడిపారు.ఎడారిలో కురిసిన ‘జమ్ జమ్’ అమృతంవయసు పైబడుతున్న కొద్దీ, తన తర్వాత దైవసందేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక సంతానం ఉంటే బాగుండని ఆయన కోరుకున్నారు. దైవానుగ్రహంతో వృద్ధాప్యంలో పండంటి బాబు (ఇస్మాయీల్) జన్మించాడు. లేకలేక కలిగిన బిడ్డను చూసుకుని ఆ దంపతులు మురిసిపోతున్న తరుణంలో... దేవుడు మరో కఠిన పరీక్ష పెట్టాడు. భార్యను, పసికొడుకును జనసంచారం లేని నిర్జన ఎడారిలో వదిలి రమ్మని ఆదేశించాడు.దైవాజ్ఞను శిరసావహించి, భార్య హాజిరాతో విషయం చెప్పారు. దైవనిర్ణయాన్ని ఆమె కూడా చిరునవ్వుతో స్వీకరించి, ఆ ఎడారిలో నిస్సహాయంగా నిలిచింది. (ఆనాటి ఆ నిర్జన ఎడారే నేటి ప్రపంచ ప్రసిద్ధ మక్కా నగరం).నాలుక తడుపుకోవడానికి చుక్క నీరు లేని ఆ ఎడారిలో, పసికందు దాహంతో గుక్కపట్టి ఏడుస్తుంటే... ఆ తల్లి గుండె విలవిలలాడింది. నీటి కోసం అక్కడి ‘సఫా’, ‘మర్వా’ కొండల మధ్య ఆమె పరుగులు తీశారామె. ఆ సమయంలో, చిన్నారి ఇస్మాయీల్ దాహంతో ఏడుస్తూ కాలిమడిమలతో నేలను తాకిన చోట... దైవాజ్ఞతో ఒక అద్భుతమైన నీటి ఊట వెలిసింది. అదే పవిత్ర జలం ‘జమ్ జమ్’. నాటి నుండి నేటి వరకు, కోట్లాది మంది దాహం తీరుస్తున్న ఆ పవిత్ర జలం ఎన్నటికీ చెడిపోదు.మానవ చరిత్ర ఎరుగని ‘ఆఖరి పరీక్ష’కొన్నేళ్ల తర్వాత, ఇబ్రాహీం మక్కా తిరిగివచ్చి భార్యాపిల్లలను కలుసుకున్నారు. తనయుడు ఇస్మాయీల్తో కలిసి పవిత్ర ‘కాబా’ గృహాన్ని నిర్మించారు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో... మానవ చరిత్ర కనీవినీ ఎరుగని అత్యంత కఠినమైన పరీక్ష ఎదురైంది. తనప్రాణప్రదమైన కన్నకొడుకునే దైవమార్గంలో త్యాగం (ఖుర్బానీ) చేయాలని కలలో దైవాదేశం అయింది.ఆశ్చర్యం ఏమిటంటే, తండ్రి ఆ విషయాన్ని కొడుక్కి చెప్పినప్పుడు... ఆ చిన్నారి ఇస్మాయీల్ ఏమాత్రం భయపడకుండా, ‘నాన్నా! దైవాజ్ఞను నెరవేర్చండి, నన్ను ఓర్పు వహించేవారిగా పొందుతారు‘ అని తండ్రికే ధైర్యం చెప్పాడు. ఆ తండ్రీకొడుకులు దైవసమ్మతి కోసం తమ సర్వస్వాన్ని,ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. వారి అచంచల విశ్వాసానికి మెచ్చిన అల్లాహ్... ఇస్మాయీల్ స్థానంలో ఒక జీవాన్ని ప్రసాదించి, ఆ పరీక్షను విజయవంతం చేశాడు. ఆ త్యాగానికి ప్రతీకగానే నేడు ముస్లింలు బక్రీద్ రోజున పశువును ఖుర్బానీ ఇస్తారు.రక్తమాంసాలు కావు... భయభక్తులే ముఖ్యం!ఖుర్బానీ అంటే కేవలం ఒక జంతువును బలి ఇవ్వడం కాదు; అల్లాహ్ పట్ల మనకున్న అంకితభావాన్ని, నిస్వార్థాన్ని చాటుకోవడం. అందుకే పవిత్ర ఖురాన్ స్పష్టంగా చెబుతోంది: ‘వాటి మాంసమూ అల్లాహ్‌కు చేరదు, వాటి రక్తమూ చేరదు. కానీ మీ హృదయాల్లోని భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయి’.జీవన సూత్రంమన ప్రతి ఆచరణా దైవాదేశాలకు అనుగుణంగా ఉండాలి. ఒకే దైవాన్ని విశ్వసించడం, మానవులంతా ఒక్కటే అని నమ్మడం, తల్లిదండ్రుల హక్కులు కాపాడటం, పేదలను ఆదుకోవడం, చెడుకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవడం... ఇవే బక్రీద్ మనకు అందించే జీవన సూత్రాలు. అవసరమైతే ధన, ప్రాణ త్యాగాలకైనా వెనుకాడమనే దృఢ సంకల్పాన్ని చాటి చెప్పే పవిత్ర చిహ్నమే ఈ ‘బక్రీద్’. – ముహమ్మద్ ముజాహిద్ -
శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా నీలమ్మ తల్లి పండుగ (ఫొటోలు)
-
వరుణుడు కోసం అగ్నిబాణాలు
వానలు సమృద్ధిగా కురవాలి; పంటలు పుష్కలంగా పండాలి. ఇంటికి సిరిసంపదలు తేవాలి– ప్రతి దేశంలోనూ రైతులందరి ఆశ ఇది. ఇదే ఆకాంక్షతో థాయ్‌లాండ్, లావోస్ ప్రజలు ప్రతి ఏటా ‘బున్ బాంగ్ ఫై’ అనే రాకెట్ ఫెస్టివల్‌ను అత్యంత ఉత్సాహభరితంగా, అంగరంగ వైభవోపేతంగా జరుపుకొంటారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ అద్భుత వేడుక యసోథోన్ ప్రావిన్స్‌లో మే 8న ప్రారంభమై మే 10తో ముగుస్తుంది.తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. లావోస్ వానదేవుడైన ‘పయా థేన్’ ఒక నాగ సర్పం కారణంగా ఆగ్రహించడంతో వర్షాలు కురవక కరవు వాటిల్లింది. దీంతో ప్రజలు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి వెదురుతో తయారు చేసిన భారీ రాకెట్లను ఆకాశంలోకి ఎగురవేశారట! ఈ పురాణం ఆధారంగా వానదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వెదురు రాకెట్లను ఎగురవేసే సంప్రదాయం మొదలైంది. వీరు ఎగురవేసే రాకెట్లు నేరుగా స్వర్గానికి చేరుకుని, ప్రజల అవసరాలను వానదేవుడికి విన్నవిస్తాయని, ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. థాయ్‌లాండ్ ఈశాన్య ప్రాంతంలోని మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. కాబట్టి వారికి వర్షాలు చాలా కీలకం. రుతుపవనాలు సకాలంలో రావడం వారికి చాలా ముఖ్యం. ఈ ప్రకృతి పండుగను థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రాంతాలైన యసోథోన్, రోయి ఎట్, కలసిన్, ఉడాన్ థాని, నోంగ్ ఖై, మహా సారఖామ్, సిసాకెట్, నోంగ్ బువా లాంఫు, లోయి, అమ్నాత్ చారోయెన్ ప్రావిన్స్‌లతో పాటు ఉత్తర ప్రాంతంలోని కొన్ని ప్రావిన్స్‌లలో విస్తృతంగా జరుపుకొంటారు. మూడు రోజుల పాటు నిర్వహించుకునే ఈ ఉత్సవం రంగురంగుల ఊరేగింపులతో, జానపద నృత్యాలతో కోలాహలంగా సాగుతుంది. సుమారు 20 నుంచి 25 కిలోల గన్‌పౌడర్‌తో నింపిన ఈ రాకెట్లను బౌద్ధ పురాణాల్లోని ‘నాగ’ అనే పౌరాణిక సర్పం బొమ్మతో అలంకరిస్తారు. రాకెట్లను ప్రయోగించే ముందు బౌద్ధ సన్యాసులు వీటికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదిస్తారు. రాకెట్లను తయారు చేసిన బృందాలకు బహుమతులు అందజేస్తారు. అయితే, ఒకవేళ ఏదైనా రాకెట్ ప్రయోగం విఫలమైతే, ఆ రాకెట్ తయారుచేసిన వాళ్లని సరదాగా బురదలో ముంచి శిక్షిస్తారు. ఇది దేవుడికి ఆగ్రహం కలిగించిందని భావించి చేసే ఒక వినోదాత్మక ఆచారం. పురుషులు, స్త్రీల వేషధారణలో కనిపిస్తూ, హాస్యభరితమైన ప్రదర్శనలతో పర్యాటకులను అలరిస్తారు. వ్యవసాయ ఇతివృత్తాలతో కూడిన జానపద నృత్యాలు ఇక్కడ ప్రధానం. ముఖ్యంగా ‘లామ్ వాంగ్’ అనే నృత్యంలో పాల్గొనేవారు వృత్తాకారంలో లయబద్ధంగా నర్తిస్తారు. వేడుక సందర్భంగా బంధుమిత్రులతో కలిసి విందులు చేసుకుంటారు. ఈ బున్ బాంగ్ ఫై కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా, ఒక అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణగానూ మారింది. టూరిజం అథారిటీ ఆఫ్ థాయ్‌లాండ్ 1974 నుంచి ఈ వేడుకలకు అండగా నిలుస్తోంది. ఈ మూడురోజుల పండుగ కాలాన్ని ఈశాన్య ప్రాంతంలో సెలవుదినంగా గుర్తిస్తారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమవ్వడానికి ముందు రైతులు జరుపుకునే ఈ వినోదభరిత ఉత్సవం ప్రకృతికి, మానవ సంకల్పానికి మధ్య ఉన్న విడదీయలేని బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. రమా జంబుల(చదవండి: -
రాజవంశీకుడినని నమ్మించి.. పొద్దున్నే భక్తులకు షాక్!
పతనంతిట్ట: కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ధ వలియ కోయికల్ శ్రీ ధర్మ శాస్త్ర ఆలయంలో విషు పండుగ నాడు కలకలం చెలరేగింది. అయ్యప్ప స్వామికి చెందిన పవిత్రమైన బంగారు ఆభరణాన్ని (కానిప్పొన్ను) ఒక వ్యక్తి అత్యంత చాకచక్యంగా ఎత్తుకెళ్లిన ఘటన అటు భక్తులను, ఇటు ఆలయ అధికారులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. తాను పందళం రాజ కుటుంబానికి చెందిన వ్యక్తినని నమ్మించి, స్వామివారి సొమ్ముతో ఒక వ్యక్తి పరారుకావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రాజ వంశస్థుడినంటూ మోసంవిషు పండుగ సందర్భంగా స్వామివారికి పందళం స్రాంబికల్ ప్యాలెస్ నుంచి తీసుకొచ్చిన 'తిరువాభరణం' అలంకరించారు. బుధవారం ఉదయం 4:30 గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఓ భక్తుడు తాను పందళం రాజ కుటుంబానికి చెందిన వ్యక్తినని అక్కడున్న వారిని నమ్మించాడు. అశ్వవాహనరూఢుడైన అయ్యప్పను ప్రతిబింబించే పవిత్రమైన ‘కానిప్పొన్ను’ (బంగారు కానుక) ఆభరణాన్ని ఆచారంలో భాగంగా కళ్లకద్దుకునే నెపంతో తీసుకున్నాడు. ఆ తర్వాత దానిని గుట్టుచప్పుడు కాకుండా తనతో పాటే తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.ఆచారాన్నే ఆసరాగా చేసుకుని..ఆలయ సంప్రదాయాల ప్రకారం పందళం రాజ కుటుంబ సభ్యులు దర్శనానికి వచ్చినప్పుడు, గర్భగుడిలోని పూజారి స్వయంగా ఈ ‘కానిప్పొన్ను’ను వారికి ఇస్తారు. రాజ వంశస్థులు దానిని తమ కళ్లకు అద్దుకుని, భక్తిని చాటుకోవడం ఒక ఆనవాయితీ. దశాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారాన్నే ఆ మోసగాడు ఆసరాగా చేసుకున్నాడు. పవిత్రమైన ఆభరణం చేతికి రాగానే, కళ్ళకద్దుకుంటున్నట్లు నటించి ఎవరికీ అనుమానం రాకుండా ఆ బంగారంతో జారుకున్నాడు.సీసీటీవీ దృశ్యాలతో ముమ్మర దర్యాప్తుసాధారణంగా విషు ప్రత్యేక దర్శనం ఉదయం 9 గంటలకు పూర్తవుతుంది. ఆ తర్వాత ఆభరణాలను తిరిగి పందళం ప్యాలెస్‌కు సురక్షితంగా తరలిస్తారు. అయితే ఈ లోపే ఈ అనూహ్య ఘటన జరగడంతో ఆలయ దేవస్వం బోర్డు అధికారులు తీవ్రంగా పరిగణించారు. స్వామివారి ఆభరణం చోరీకి గురైనట్లు గుర్తించిన వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు, అధికారులు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను నిశితంగా పరిశీలిస్తూ, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.ఇది కూడా చదవండి: ఏ క్షణాన్నైనా సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల.. చెక్ చేసుకోండిలా.. -
హిందూమతం పునః స్వీకరణ.. భూమన కరుణాకర్ రెడ్డి ప్రోత్సహహంతోనే మళ్ళీ హిందూమతంలో చేరాం
-
చైత్రమాసం విశిష్టత..! తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయంటే..
“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి "ఉగాది, "శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి. అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది.అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది.అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి.ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’.ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే..కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు.కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది.అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి.మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయంటే..ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు.అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.(చదవండి: -
గ్రేప్ ‘పండు’గ ప్రారంభం
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలోని గ్రేప్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. ప్రజలు నేరుగా తోటల్లోకి వెళ్లి స్వయంగా పరిశీలించి కట్ చేసుకొని కొనుగోలు చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ హారి్టకల్చర్ వర్సిటీ ప్రాంగణంలోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ఈ వెసులుబాటు ఉంది.52 రకాల ద్రాక్ష చెట్ల నుంచి ఇష్టమైన పండ్లు కోసుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ క్షేత్రానికి సందర్శకులు రావచ్చని నిర్వాహకులు వెల్లడించారు. రకాన్ని బట్టి రూ.250 నుంచి 700 ధర నిర్ణయించారు. కార్యక్రమంలో పరిశోధన కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫలకళా మహోత్సవం
అక్కడి వీథులన్నీ ఫలకళతో పరవశం కలిగిస్తాయి. నిమ్మజాతికి చెందిన పండ్లతో రూపొందించిన భారీ కళాకృతులు కనువిందు చేస్తాయి. సంప్రదాయ నృత్యగానాలతో జనాలు వీథుల్లో జరిపే ఊరేగింపులు ఉర్రూతలూగిస్తాయి. పండ్లు ఎవరైనా తింటారు గాని, పండ్లతో భారీ కళాప్రదర్శనలు చేయడమే ఫ్రెంచి ప్రజల ప్రత్యేకత. ఫ్రాన్స్ ఆగ్నేయ ప్రాంతంలో ఇటలీ సరిహద్దులకు చేరువలో ఉన్న మెంటన్ నగరం ఏడాదికి ఒకసారి ఫలకళను సంతరించుకుంటుంది. పదిహేను రోజుల పాటు అట్టహాసంగా జరిగే ఈ ఫలకళా మహోత్సవాన్ని ‘ఫెట్ డి సిట్రాన్’ అని, ‘ఫెస్టివల్ డి లిమన్’ అని అంటారు. ఫలకళాకృతుల ప్రదర్శనతో పాటు ఊరంతా వీథి వీథినా ఊరేగింపులు, నృత్యగాన ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉండటం వల్ల ఈ వేడుక ‘కార్నివాల్ ఆఫ్ మెంటన్’గా కూడా ప్రసిద్ధి పొందింది.మెంటన్ నగరంలో ఈ ఫలకళా మహోత్సవం నిర్వహణ 1934 నుంచి ప్రారంభమైంది. నాటి నుంచి ఏటా జరిగే ఈ వేడుకలకు రెండో ప్రపంచయుద్ధం కారణంగా 1940–46 మధ్యకాలంలోను, గల్ఫ్ యుద్ధం కారణంగా 1991లోను, ‘కోవిడ్–19’ కారణంగా 2021లోను అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ ఆటంకాలు మినహా మిగిలిన సంవత్సరాలలో ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతూనే వచ్చాయి. అదే రీతిలో ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 14 నుంచి మార్చి 1 వరకు మెంటన్ నగరంలో ఫలకళా మహోత్సవం సందడిగా జరుగుతోంది. ఈసారి మెంటన్ ఫలకళా మహోత్సవం ‘వండర్స్ ఆఫ్ లైఫ్’ను థీమ్‌గా ఎంచుకుంది. ఇందులో భాగంగా నిమ్మ జాతికి చెందిన నిమ్మ, నారింజ, బత్తాయి, దబ్బపండ్లతో వైవిధ్యభరితమైన జీవరాశుల కళాకృతులను వీథుల్లో అలంకరించారు. ఈ ఏడాది ఫలశిల్పాల కోసం 140 టన్నులకు పైగా పండ్లను వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 15, 22 తేదీల్లోను; మార్చి 1న జరిగే ‘గోల్డెన్ ఫ్రూట్ పరేడ్’లో దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. మేళతాళాలు, నృత్య గానాలతో వీథి వీథినా జరిగే ఊరేగింపులతో మెంటన్ నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈసారి వాలెంటైన్స్ డే రోజు నుంచి ‘కార్నివాల్ ఆఫ్ మెంటన్’ కూడా ప్రారంభం కావడంతో మెంటన్ వీథులన్నీ యువజంటల కేరింతలతో కొత్త కళను సంతరించుకున్నాయి. -
ఆ ఇంటికి ‘పెద్ద’రాయుడు..
ములుగు: నల్లబెల్లి మండ ల పరిసర గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దును ఆడించే పెద్ద వెంకటయ్యది మూడు తరాల చరిత్ర. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తే అతడికి జీవనాధారం. వెంకటయ్య దగ్గర ఉన్న గంగిరెద్దు పేరు పెద్దరాయుడు. తెల్లటి శరీరం, నుదుట ఎర్రని చుక్క, మెడలో గంటలతో అడుగు పెడితే పిల్లలందరూ చుట్టుముడుతారు. ‘పెద్దరాయుడిని మేము ఎద్దులా చూడము. మా కుటుంబంలో నా కన్న బిడ్డలా చూసుకుంటాం’అని పెద్ద వెంకటయ్య చెప్పుతుంటే ఆయన కళ్లలో గర్వం, ప్రేమ కనిపించాయి. పెద్దరాయుడు గురించి ఆయన మాటల్లో.. కఠినమైన శిక్షణ.. ప్రేమతోనే సాధ్యంఒక ఎద్దును గంగిరెద్దుగా తీర్చిదిద్దడం వెనుక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. తిరుపతి కొండల్లో గురువు ప్రేమ సైగలతో శిక్షణ ఇస్తారు. డూడూ బసవన్న అంటే తల ఊపడం, కాళ్లతో తాళం వేయడం, యజమాని మాట ప్రకారం ఆశీర్వదించడం ఇవన్నీ నేర్పడానికి ఎంతో ఓర్పు ఉండాలి. ప్రతిరోజూ పెద్దరాయుడు (గంగిరెద్దు)కు స్నానం చేయించి ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ కుటుంబ సభ్యులకంటే జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. పండుగ సమయంలో గతంలో బియ్యం, ధాన్యం, కాసిన్ని డబ్బులు ఇచ్చేవారు. కానీ పట్టణీకరణ పెరగడం, ప్రజల్లో ఆసక్తి తగ్గడంతో ప్రస్తుతం ఆదరణ తగ్గింది. కుటుంబ పోషణతోపాటు ఎద్దు మేతకు కూడా ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం మమ్ముల్ని కళాకారులుగా గుర్తించి పింఛన్ ఇవ్వాలి. పశుపోషణకు సాయం చేస్తే ఈ కళను బతికించుకుంటాం. -
కేరళ అవియల్ తింటారా? లడక్ తుక్పా సిప్ చేస్తారా?
పండుగలు అనగానే అందరికీ ముందుగా పిండి వంటలు గుర్తుకు వస్తాయి. అలాగే పండుగల రోజుల్లో రుచికరమైన వివిధ ఆహారాలను ఆరగించాలని అనిపిస్తుంది. అటువంటి సందర్భాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మన ప్రాంతీయ ఆహారాలు లభించకపోతే నిరాశ కలుగుతుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లినప్పుడు ఈ లోటు కనిపించదు. ఎందుకంటే రాజధానిలోని స్టేట్స్ భవన్ ఆ కొరత తీరుస్తూ, దేశంలోని వివిధ ప్రాంతాల రుచులను అందిస్తోంది.సకల రుచుల సమాగమందేశ రాజధాని ఢిల్లీ అంటే కేవలం రాజకీయాలకే కాదు.. అద్భుతమైన రుచులకు కూడా నిలయం. ముఖ్యంగా చాణక్యపురిలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ అతిథి గృహాలు (స్టేట్ భవన్స్), పర్యాటకులకు అద్భుతమైన వివిధ ప్రాంతాల ఆహార రుచులను అందిస్తున్నాయి. ఇక్కడి కాంటీన్లలో ఆయా రాష్ట్రాలకు చెందిన నిపుణులైన వంటగాళ్లు, సంప్రదాయ పద్ధతుల్లో ప్రాంతీయ వంటకాలను తయారు చేస్తారు. ఇక్కడ లభించే ఆహారాలు.. దేశంలోని ఆహార ప్రియులు ఢిల్లీని సందర్శించినప్పుడు వారి ‘అభిరుచి’ని పరిపూర్ణం చేస్తాయి.ఆంధ్రప్రదేశ్ భవన్: రూ. 200కే వెజ్ థాలీఅశోకా రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలోనే అత్యంత ప్రసిద్ధ స్టేట్ భవన్ కాంటీన్. ఇది దశాబ్దాలుగా విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులు, పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ లభించే అన్లిమిటెడ్ వెజ్ థాలీలో అన్నం, పప్పు, సాంబార్, రసం, కూరలు , పెరుగు కేవలం రూ. 200లకే లభిస్తాయి. నాన్-వెజ్ ప్రియుల కోసం స్పైసీ మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ చెట్టినాడ్ వంటి ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో లభించే దోశలు ఇక్కడ చాలా ఫేమస్.కర్ణాటక సంఘం-కేరళ హౌస్: పరిపూర్ణతనిచ్చే పాయసంఆర్.కె. పురంలోని కర్ణాటక సంఘంలో లభించే అద్భుతమైన రాగి దోశ, మసాలా దోశ, స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ ఆహార ప్రియుల నోరు ఊరిస్తాయి. ఇక్కడ దక్షిణాది సంగీతం వింటూ, ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేయవచ్చు. జంతర్ మంతర్ రోడ్డులోని కేరళ హౌస్ ‘సమృద్ధి’ కాంటీన్.. కేరళ సంప్రదాయ ఎర్ర బియ్యం (రెడ్ రైస్), అవియల్ (కొబ్బరితో చేసిన కూరగాయల మిశ్రమం), కేరళ ఫిష్ కర్రీకి పెట్టింది పేరు. ఇక్కడ దొరికే కొబ్బరి పాలు, బియ్యంతో చేసే ‘పాయసం’ ఇక్కడి భోజనానికి పరిపూర్ణతనిస్తాయి.బీహార్ నివాస్- గుజరాత్ భవన్: నెయ్యి వంటకాలు తింటుంటే..బీహార్ నివాస్‌లోని ‘ది పాట్‌బెల్లీ’ రెస్టారెంట్ అద్భుతమైన ‘లిట్టీ చోఖా’తో అత్యంత ప్రాచుర్యం పొందింది. మట్టి వాసనతో కూడిన ఈ రుచి ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇక కౌటిల్య మార్గ్‌లోని గుజరాత్ భవన్ తన అద్భుతమైన వెజ్ థాలీతో రుచులూరిస్తుంటుంది. ఇందులో ఖిచ్డీ, కఢీ, ధోక్లా, తెప్లా,నెయ్యితో చేసిన వంటకాలు గుజరాతీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. తీపి, వగరు రుచుల కలయికతో ఇక్కడి భోజనం ఇంటి వాతావరణాన్ని గుర్తు చేస్తుంది.మహారాష్ట్ర సదన్- బెంగాలీ రుచులు: ‘బిజోలి గ్రిల్’ ఒక్కసారి తింటే..ఇండియా గేట్ సమీపంలోని మహారాష్ట్ర సదన్ పరిపూర్ణ రెస్టారెంట్‌ను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించే మిసల్ పావ్, సాబుదానా ఖిచ్డీ, మహారాష్ట్ర థాలీలోని జుంకా (శనగపిండి వంటకం) చాలా అద్భుతంగా ఉంటాయి. తూర్పు భారత్ రుచుల కోసం బంగా భవన్‌లోని ‘బిజోలి గ్రిల్’ ఉత్తమమైనది. బెంగాలీ సంప్రదాయ చేపల వంటకాలు, ముఖ్యంగా ఆవాల ఘాటుతో కూడిన 'షోర్షే హిల్సా', స్టీమ్డ్ ఫిష్ (భాపా హిల్సా), కోషా మాంగ్షో (మటన్ కర్రీ) ఇక్కడి సిగ్నేచర్ వంటకాలుగా చెబుతుంటారు.ఒడిశా నివాస్- అస్సాం భవన్: రొయ్యల వేపుడు ఫేమస్ఒడిశా నివాస్‌లో లభించే ప్రత్యేకమైన ‘ప్రాన్ కాషా మసాలా’ (రొయ్యల వేపుడు), ఆవాలతో చేసే చేపల కూర అద్భుత సీ ఫుడ్ రుచులను అందిస్తాయి. ఇక్కడి ఛేనా పోడా (జున్ను స్వీట్) అస్సలు మిస్ కాకూడదు. అస్సాం భవన్ విషయానికొస్తే ఇక్కడ ఆవనూనె ఘుమఘుమలతో కూడిన అస్సామీ ఫిష్ కర్రీ, లూచీ, అచ్చమైన అస్సామీ చాయ్ లభిస్తాయి. ఇక్కడి వంటకాలు తక్కువ మసాలాలతో, సహజ సిద్ధమైన రుచులతో ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.లడఖ్-కశ్మీర్: సాల్టీ టీతో కొత్త అనుభూతిచలికాలంలో లడఖ్ భవన్లో లభించే వేడివేడి తుక్పా (నూడిల్ సూప్), మోమోలు, దెన్తుక్ (హ్యాండ్ పుల్డ్ నూడిల్స్)లను తినకుండా ఎవరూ ఉండలేరు. ఇక్కడి బట్టర్ టీ (సాల్టీ టీ) ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. జమ్ముకశ్మీర్ భవన్లో లభించే రాజరికపు వంటకాలైన రోగన్ జోష్ (మటన్), యఖ్ని (మీట్ బ్రోత్), దమ్ ఆలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. కశ్మీరీ సంప్రదాయ వంటకాల్లోని అద్భుత రుచులు ఇక్కడ కనిపిస్తాయి.ఇది కూడా చదవండి: 8 నెలల్లో 834 బాల గర్భిణులు.. షాకింగ్ నిజాలివే.. -
‘మకర జ్యోతి’కి సర్వం సిద్ధం.. భక్తుల నియంత్రణ ఇలా..
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో జనవరి 14న జరగనున్న మకరవిలక్కు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) అరుణ్ ఎస్ నాయర్ తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా బారికేడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల పనులు కూడా పూర్తయ్యాయన్నారు. కాగా కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు, ఉత్సవాల రద్దీని నియంత్రించేందుకు దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై అధికారులు కఠినమైన పరిమితులను విధించారు.మకరవిలక్కు(మకర జ్యోతి) పర్వదినం సందర్భంగా భక్తుల సంఖ్యను అధికారులు క్రమబద్ధీకరించారు. జనవరి 13న వర్చువల్ క్యూ ద్వారా 35,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి అవకాశం కల్పించనున్నారు. ప్రధాన ఉత్సవం రోజైన జనవరి 14న ఈ సంఖ్యను వర్చువల్ క్యూ ద్వారా 30,000కు పరిమితం చేశారు. ఇక జనవరి 15 నుండి 18 వరకు ప్రతిరోజూ 50,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, 5,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పించారు. జనవరి 19న తిరిగి భక్తుల సంఖ్యను 30,000కు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.పందళం నుండి జనవరి 12న ప్రారంభమయ్యే తిరువాభరణ ఊరేగింపు జనవరి 14న సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో జనవరి 14న ఉదయం 10 గంటల నుండి నిలక్కల్-పంబ మార్గంలో, ఉదయం 11 గంటల నుండి పంబ-సన్నిధానం మార్గంలో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. అలాగే జనవరి 12 ఉదయం నుండి జనవరి 15 మధ్యాహ్నం వరకు హిల్ టాప్ వద్ద ప్రైవేట్ వాహనాల పార్కింగ్‌ను నిషేధించారు. దీంతో భక్తులు తమ వాహనాలను నిలక్కల్ వద్దే పార్క్ చేయాల్సి ఉంటుంది. ఎరుమేలి అటవీ మార్గంలో కూడా జనవరి 13 సాయంత్రం రాకపోకలపై ఆంక్షలు విధించారు.భక్తుల రద్దీని తట్టుకునేందుకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అల్పాహారం, తాగునీటి సౌకర్యాలను కల్పిస్తోంది. పోలీస్ విభాగం భారీ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను రూపొందించగా, ఆర్ఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర కేంద్ర బలగాల మద్దతుతో అదనపు సిబ్బందిని మోహరించారు. భక్తుల రవాణా కోసం సుమారు వెయ్యి కేఎస్ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. అటవీ ప్రాంతాల్లో అనధికారిక గుడిసెలు వేయడం, వంట చేయడంపై కఠిన నిషేధం విధించామని, పోలీస్, అటవీ, ఫైర్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని ఏడీఎం తెలిపారు.ఇది కూడా చదవండి: 108 అశ్వాలతో ప్రధాని మోదీ శౌర్య యాత్ర -
సంక్రాంతికి 150 ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..
హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారికి దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. సుమారు 150 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి (సీపీఆర్ఓ) ఎ శ్రీధర్ మీడియాకు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యే కాకుండా దేశంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ భారత ప్రాంతాలకు కూడా రైళ్లను నడపనున్నట్లు వివరించారు.తిరుపతి, షిరిడీలకు..పండుగ సమయంలో రద్దీగా ఉండే తిరుపతి, షిరిడీ తదితర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు శ్రీధర్ తెలిపారు. పండుగ సీజన్లో 150 ప్రత్యేక రైళ్లతో మొత్తం 600 రైళ్లు నిరంతరాయంగా నడుస్తాయని, తద్వారా సికింద్రాబాద్ లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ స్థాయిలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.స్టేషన్లలో రద్దీ నివారణకు..కాగా పండుగ రద్దీ సమయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రైల్వే శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని ముఖ్య రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లకు మళ్లించారు. మరికొన్ని రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్ల నుండి నడపాలని అధికారులు నిర్ణయించారు. స్టేషన్లలో రద్దీని తగ్గించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.రహదారి మార్గంలో..ఇదిలావుండగా, సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రోజుకు సుమారు లక్ష వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు తాను స్వయంగా మోటారు సైకిల్‌పై పర్యటిస్తానని ప్రకటించారు.నితిన్ గడ్కరీకి లేఖటోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా 'ఫ్రీవే' విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై చర్చించేందుకు త్వరలోనే కేంద్ర మంత్రితో భేటీ కానున్నట్లు, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున నామమాత్రపు చెల్లింపులు చేసి, ప్రయాణికులకు ఊరట కలిగిస్తామని అన్నారు. వీటితో పాటు ప్రతిష్టాత్మక మేడారం జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి రవాణా ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగలు, జాతరల వేళ ప్రజల ప్రయాణం సాఫీగా సాగేలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదని అన్నారు. ఇది కూడా చదవండి: Republic Day 2026: ఉగ్ర ముప్పు.. భారీగా భద్రతా బలగాల మోహరింపు -
సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!
చిలుకా పదపద నెమలి పదపద..మైనా పదపద మనసా పద.. గాలి పటమా పద పదా.. హంసలాగా పదపద.. అమాసనే పరిపదకిటా.. హద్దు కాదు పద పద..పైకి పోయే పటమే.. ఇది పందెం గెలిచే పటమే.. అంటూ సాగే ఈ పాటను వింటుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో.. పతంగుల సీజన్ వచ్చిందంటే.. పిల్లలు కూడా అంతే ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఇప్పటికే పతంగుల సందడి మొదలైంది. దీంతో మార్కెట్లో అనేక మోడళ్లు, రకాల పతంగులు ముంచెత్తుతున్నాయి. భాగ్యనగరంలోని ప్రతి గల్లీలోనూ రంగురంగుల గాలిపటాలు ఎగరుతున్నాయి. అయితే గతంలో చైనా మాంజా మిగిల్చిన చేదు అనుభవాల నేపథ్యంలో ఈ సారైనా వాటి వినియోగానికి చెక్ పెట్టాలని అధికారులు, పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. చైనా మాంజాతో ప్రమాదం పొంచి ఉందని గ్రహించాలని, మన ఆనందం మరొకరిని బాధించకుండా చూసుకోవాలని చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో కొత్త ఏడాది అడుగుపెట్టగానే ఆకాశం రంగుల పతంగులతో నిండిపోతుంది. జనవరి ప్రారంభం నుంచి సంక్రాంతి పండుగ ముగిసే వరకూ, కొన్ని ప్రాంతాల్లో జనవరి చివరి వరకూ కూడా పతంగుల సందడి కొనసాగుతూనే ఉంటుంది. బాల్కనీల్లో, టెర్రస్‌పై నిలబడి, ఖాళీ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా చేరి.. ‘కాయ్ పో చె!’ అంటూ ఉత్సాహంగా అరవడం నగర జీవనశైలిలో ఒక ప్రత్యేకమైన పండుగ సంస్కృతిగా మారిపోయింది. అయితే దీనిని కొందరు స్వార్థపరులు సొమ్ముచేసుకునే ప్రయత్నంలో పండుగ లాంటి ఈ వాతావరణాన్ని విషాధంగా మిగులుస్తున్నారు. పతంగులకు వాడే చైనా మాంజా, సింథటిక్ మాంజా హైదరాబాద్‌లో యేటా వందల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. పండుగ ఆనందం, మరుసటి క్షణంలో విషాదంగా మారుతున్న దృశ్యాలు అనేక మందిని బాధిస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి పతంగులు ఎంచుకోవాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పండుగ ఆరోగ్య రహస్యాలు, పతంగుల పోటీలు వంటి విశేషాలు తెలుసుకుందాం.. కాలక్రమేణా మార్పు.. వాస్తవానికి మనం ప్రస్తుతం వినియోగిస్తున్న గాలిపటాలు స్థానంలో మొదట వస్త్రంతో తయారుచేసిన గాలిపటాలు తయారయ్యేవి. అయితే నెమ్మదిగా పేపరు గాలిపటాలు ఆ స్థానాన్ని ఆక్రమించాయి. అయితే వీటి వల్ల ప్రకృతికి అంత ప్రమాదం ఏమీ లేదు.. కానీ ప్రస్తుతం మార్కెట్లో లభించే ప్లాస్టిక్ గాలిపటాలతో పర్యావరణానికి హాని పొంచివుందని నిపుణులు చెబుతున్నారు. అసలు గాలిపటాల సంస్కృతి మొదటి చైనాలో పుట్టింది. కాలక్రమంలో నెమ్మదిగా ఇతర దేశాలకూ పాకింది. దేశంలో నిజాం నవాబుల ప్రోత్సాహంతో ఈ సంస్కృతి తెలుగు రాష్ట్రాలకూ విస్తరించింది. ఇప్పుడు ఒక ప్రాంతం, ప్రదేశం అంటూ లేదు.. దేశవ్యాప్తంగా గాలిపటాల సందడి కనిపిస్తుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనడం చూస్తుంటాం. ఆరోగ్య రహస్యం.. యేటా శీతాకాలంలో.. అంటే సంక్రాంతి సమయంలో ఈ గాలిపటాల సందడి కనిపిస్తుంటుంది. అయితే దీనికీ కొన్ని శాస్త్రీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ సమయంలో గాలి ఒకే దిశగా వీచడం వల్ల గాలిపటాలు ఎగరేయడానికి అనువుగా వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో పాటు చలికాలంలో ఇన్ఫెక్షన్లు, అనేక ఆరోగ్య సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉదయంపూట సూర్య రశ్మిని ఆస్వాదిస్తూ పతంగులు ఎగరేయడం వల్ల విటమిన్ ‘డి’ శరీరానికి లభించడమే కాకుండా ఎండ వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మన సామాజిక బాధ్యత.. గాలిపటాలు ఎగరేయడమంటే ఎవరికైనా ఆసక్తే. అందుకే ‘పతంగుల పండగలు’ పేరుతో ప్రత్యేక పోటీలు పెట్టుకొని మరీ గాలిపటాలు ఎగరేయడాన్ని ఆస్వాదిస్తారు. అయితే మాంజా ప్రమాదాల నేపథ్యంలో పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పెద్దలదే. రంగు రంగుల పతంగులు, ప్లాస్టిక్ మోడళ్లకు ఆకర్షితులవుతున్న చిన్నారులకు సామాజిక బాధ్యతను నేర్పించాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది.. ముఖ్యంగా గాలిపటం అంటే పత్తి దారం, ఇప్పటి సింథటిక్ మాంజా మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించాలి. దీని వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పాలి. గాలిపటాల పోటీలను ఆస్వాదించే వారు.. వాటి వినియోగంలో ఉపయోగించే మెటీరియల్లోని తేడాలను, దాని వల్ల కలిగే అనర్థాలను భవిష్యత్తు తరానికి తెలియజెప్పడంలోనూ పోటీపడాలి. అలనాటి స్మృతులు..ఇప్పటి వారికంటే మార్కెట్లో రెడీమేడ్ గాలిపటాలు దొరుకుతున్నాయిగానీ..ఓ ఇరవైయేళ్ల క్రితం గాలిపటాలు కావాలంటే.. వార్తాపత్రికలను చింపి కొబ్బరి ఈనెలు, మైదాపిండి జిగురును ఉపయోగించి పతంగులు తయారుచేసుకునే వాళ్లు. అయితే వీటిలోనూ అనేక మోడళ్లు.. విభిన్న రకాల పేర్లు ఉన్నాయి. గుడ్లందార్, గుడ్డి లంగోటి, అద్దా వంటివి మన దగ్గర సాధారణంగా వినిపించే పేర్లు.. ‘గుడ్లందార్’ అంటే రెండు కళ్లున్న గాలిపటం. ఒంటికన్ను ఉన్న దాన్ని ‘గుడ్డి లంగోటి’ అంటారు. ‘అద్దా’ అంటే చాలా పెద్ద పతంగి అని అర్థం. వీటితోపాటు విభిన్న రకాల్లో, వర్ణాల్లో గాలిపటాలు మార్కెట్లో సందడి చేస్తాయి. మోడ్రన్ గాలిపటాలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టెక్నాలజీ నేపథ్యంలో ఎల్ఈడీ లైట్లతో వెలిగే పతంగులు.. చీకట్లో మిలమిలా మెరిసే పతంగులూ కనిపిస్తున్నాయి. (చదవండి: -
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (చిత్రాలు)
-
ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
లఘు చిత్ర వైభవం..
నగరం మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నాంది పలికింది. సిటీలో మొట్టమొదటి సారిగా ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ శుక్రవారం ప్రారంభమైంది. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 21 తేదీ వరకూ కొనసాగనుంది. నగరంలోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి భారతదేశంతో పాటు స్పెయిన్, ఈజిప్‌్ట, యూకే, యూఎస్ఏ, సౌత్ కొరియా, శ్రీలంక, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ వంటి పలు దేశాల నుంచి 704 చిత్రాలు ఎంట్రీలు రావడం విశేషం. అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా మొదటి రోజు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో అన్సెసావో, జహాన్ షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో భాగంగా 704 ఎంట్రీల నుంచి 60 అత్యుత్తమ షార్ట్ ఫిల్మ్‌లను ఎంపిక చేసి ప్రదర్శించనున్నారు. అన్సెసావో.. 30 నిమిషాల నిడివి గల కొంకణి లఘు చిత్రం ‘అన్సెసావో’.. టొరంటోలో జరిగిన 14వ అంతర్జాతీయ దక్షిణ ఆసియా చలనచిత్రోత్సవంలో ఉత్తమ అంతర్జాతీయ లఘు చిత్రం అవార్డును గెలుచుకుంది. మంగురీష్ జగదీష్ బండోద్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వృద్ధాప్యం, ఒంటరితనం తదితర సవాళ్లను ఎదుర్కోవడంలో మానవ ప్రయాణాన్ని సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించింది. ఈ చిత్రానికి నటి ప్రశాంతి తల్పంకర్ ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏలో అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పోరాటం, బలహీనతలతో సతమతమవుతున్న ఒక వృద్ధురాలి భావోద్వేగ లోతును, సంక్లిష్టతను ఆమె తన అద్భుతమైన నటనతో ప్రతిబింబించారు. జహాన్–ది లాస్ట్ గిఫ్ట్.. రాహుల్ శెట్టి దర్శకత్వం వహించిన జహాన్ చిత్రం.. సంయమనంతో కూడిన కథనంతో పాటు ఆకట్టుకునే దృశ్యాలను మిళితం చేసి, వాతావరణ మార్పుల వాస్తవాలను చూపిస్తుంది. టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ లఘు చిత్రాన్ని ఇటీవల వేవ్స్ సమ్మిట్ 2025లో ప్రదర్శించారు. ఇది పర్యావరణ బాధ్యత, వాతావరణ అవగాహనపై ప్రాధాన్యతను తెలిపింది. అంతేకాకుండా, ఇటీవల ముంబైలో జరిగిన లేక్‌సిటీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో టైగర్ ష్రాఫ్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.ప్యానెల్ చర్చలు.. మాస్టర్‌క్లాసులు.. ఎంపిక చేసిన 60 లఘు చిత్రాల్లో విజేతలకు రూ.3 లక్షల నగదు బహుమతి లభించనుంది. రెండు రోజుల పాటు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 4, 5లలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్లో అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు జూడీ గ్లాడ్‌స్టోన్, మైథిలిరావు, నాగేశ్ కునూరర్, లీమా దాస్, సుంజు బచుస్పతిమయుమ్, ఉత్పల్ బోర్పుజారి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఈ ప్రాంతం నుండి వస్తున్న కొత్త ప్రతిభను హైలైట్ చేస్తూ..ఒక ప్రత్యేక ఈశాన్య పెవిలియన్ కింద 11 లఘు చిత్రాలు, ప్రేక్షకుల కోసం ఎంపిక చేసిన ఐదు క్లాసిక్ చిత్రాలు కూడా ప్రదర్శిస్తున్నారు. అదనంగా, భారతీయ సినిమాలో సమకాలీన సమస్యలపై ప్యానెల్ చర్చలు, యువ, ఔత్సాహిక చిత్రనిర్మాతల కోసం ఒక మాస్టర్‌క్లాస్ కూడా ఉంటుంది. టిక్కెట్లు జోమాటో యాప్‌లోని డిస్ట్రిక్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. -
హనుక్కా పండుగ అంటే..? అందుకే యూదులు అంతలా..
ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదంగా మార్చేసి..సంతోషాన్ని ఆవిరి చేశారు ముష్కరులు. ఆదివారం సెలవరోజు కావడం సరదాగా బీచ్‌లో ఈ పండుగ చేసుకుంటున్న యూదులపై హఠాత్తుగా కాల్పులు జరిపారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఘటనలో అక్కడికక్కడే 16 మందికి పైగా మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలయ్యారు. ఇలా మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటే..ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూదులు జరుపుకునే పండు హనుక్కా అంటే ఏంటి. ఈ పండుగ ప్రధానోద్ధేశ్యం ఏంటో చూద్దామా..!.యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక (Hanukkah)ను "కాంతి పండుగ" అని కూడా పిలుచుకుంటారు. మక్కబీస్ (Maccabees) అనే యోధులు జెరూసలేం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన అద్భుతానికి గుర్తుగా ఈ వేడుకను ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీనిలో భాగంగా ప్రతిరాత్రి మెనోరా (Menorah) పై(కొవ్వొత్తుల స్టాండ్) కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు, ఆటలు, పాటలతో గడుపుతారు. ఆ రోజు నూనెతో చేసిన వంటకాలను తింటారు. ఈ పండుగ అణిచివేత నుంచి సంపాదించుకున్న స్వేచ్ఛ, విశ్వాసాలకు ప్రతీకగా జరుపుకుంటారు యూదులు. హనుక్కా అంటే.."హనుక్కా" అంటే హీబ్రూలో "అంకితం" (dedication) అని అర్థం. ఇది ఆలయ పునఃప్రతిష్ఠను సూచిస్తుంది.అద్భుతం జరిగిన రోజు..క్రీ.పూ. 2వ శతాబ్దంలో గ్రీకు-సిరియన్ పాలకులు యూదుల మత స్వేచ్ఛను అణచివేసినప్పుడు, మక్కబీస్ (Maccabees) అనే యోధులు పోరాడి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో ఒక రోజుకు సరిపడా నూనె ఎనిమిది రోజులు వెలిగిందని ఒక అద్భుతం జరిగింది.ఏరోజున ఈ పండుగ జరుపుకుంటారంటే..ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం కిస్లేవ్ (Kislev) నెల 25వ రోజున ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారు?మెనోరా వెలిగించడం(ప్రత్యేక దీపపు స్టాండ్): ప్రతి రాత్రి తొమ్మిది కొమ్మల దీపం (Hanukkiah లేదా Menorah) వెలిగిస్తారు. ఒక ప్రత్యేక కొవ్వొత్తి (Shamash) మిగిలిన ఎనిమిదింటిని వెలిగిస్తుంది. ఇది అద్భుతానికి ప్రతీక.డ్రీడెల్ (Dreidel) అనే నాలుగు వైపుల బొంగరంతో ఆడుతూ పాటలు పాడుతూ జరుపుకుంటారు.విందు..ఆరోజు ముఖ్యంగా బంగాళదుపంతో చేసిన పాన్కేక్లను తప్పనిసరిగా ఆరగిస్తారు. దాంతోపాటు జామ్ డోనట్స్‌ను కూడా ఆస్వాదిస్తారు. అంతేగాదు ఆరోజు పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్ బాక్స్‌లను గిఫ్ట్‌గా ఇచ్చి పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తుంటారు కూడా.స్వేచ్ఛకు గుర్తుగా చేసుకునే హనుక్కా పండగ రోజునే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపి వేడుకను ఆస్వాదించే స్వేచ్ఛే లేకుండా చేసి తీరని శోకాన్ని నింపారు. నాడు జరిగిన అద్భుతమే జరిగి..తమ పండుగను యూదులు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.(చదవండి: ఏఐతో.. 'మెస్సీ'మరైజ్! సెల్ఫీ రూ. 10 లక్షలు..) -
విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)
-
భళారే బాలినీస్!
ఇండోనేషియాలో ‘దేవతల దీవి’గా పేరున్న బాలి ద్వీపానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకస్థానం ఉంది. ఇది కేవలం అందమైన బీచ్‌లు, వరి పొలాలకే కాకుండా ఆధ్యాత్మిక పండుగలకు కూడా ప్రసిద్ధి. నిజానికి హిందూ–బౌద్ధ మతాల కలయికను పాటించే అతిపెద్ద జాతి బాలినీస్! వారు 210 రోజులకు ఒకసారి, బాలినీస్ క్యాలెండర్ (పావుకోన్) ప్రకారం జరుపుకునే పండుగను బాలినీస్ ఫెస్టివల్ అంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది నవంబర్ 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ‘గలుంగన్’ అనే పేరుతో జరిగే మొదటిరోజు వేడుక, అత్యంత ప్రత్యేకమైనది. ఈ పండుగ సందర్భంగా, ద్వీపం అంతటా రహదారుల పక్కన పెన్జోర్ (అలంకరించిన పొడవైన వెదురు స్తంభాలు) ఏర్పాటు చేస్తారు. ఇవి దైవత్వాన్ని ఆహ్వానించడానికి, శ్రేయస్సుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి గుర్తుగా నిలుస్తాయి. పది రోజుల తర్వాత వచ్చే కుణీంగాన్ పండుగతో ఈ ఫెస్టివల్ ముగుస్తుంది. ఆ చివరి రోజున తమ పూర్వీకుల ఆత్మలు తిరిగి స్వర్గానికి వెళ్తాయని అక్కడివారు నమ్ముతారు. ప్రతి దేవాలయంలో ఒడాలన్ (ఆలయ వార్షికోత్సవం) ఉత్సవం జరుగుతుంది. సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ప్రత్యేకమైన కళల ప్రదర్శన కన్నుల పండుగగా సాగుతుంది. ఈ బాలినీస్ పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కావు, ఇవి బాలినీస్ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.ఆధ్యాత్మికతలో ఆదర్శం!బాలీలో మరొక ముఖ్యమైన పండుగ న్యేపి (మౌన దినం) గురించి చెప్పుకోవాల్సిందే! సకా క్యాలెండర్ ప్రకారం బాలి ప్రజలు నూతన సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుంటూ న్యేపీని ఆత్మపరిశీలన దినంగా జరుపుకుంటారు. ఇది ఎక్కువగా మార్చి నెలలో జరుగుతుంటుంది. న్యేపి రోజున, ద్వీపం మొత్తం 24 గంటల పాటు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. విమానాశ్రయాలను మూసివేస్తారు. వీధులు నిర్మానుష్యంగా ఉంటాయి. స్థానికులంతా ప్రార్థన, ధ్యానం, ఆత్మపరిశీలనలో నిమగ్నమవుతారు. ఇది లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. (చదవండి: గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి) -
భళారే బాలినీస్!
ఇండోనేషియాలో ‘దేవతల దీవి’గా పేరున్న బాలి ద్వీపానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకస్థానం ఉంది. ఇది కేవలం అందమైన బీచ్‌లు, వరి పొలాలకే కాకుండా ఆధ్యాత్మిక పండుగలకు కూడా ప్రసిద్ధి. నిజానికి హిందూ–బౌద్ధ మతాల కలయికను పాటించే అతిపెద్ద జాతి బాలినీస్! వారు 210 రోజులకు ఒకసారి, బాలినీస్ క్యాలెండర్ (పావుకోన్) ప్రకారం జరుపుకునే పండుగను బాలినీస్ ఫెస్టివల్ అంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది నవంబర్ 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి.ఈ ఉత్సవాల్లో ‘గలుంగన్’ అనే పేరుతో జరిగే మొదటిరోజు వేడుక, అత్యంత ప్రత్యేకమైనది. ఈ పండుగ సందర్భంగా, ద్వీపం అంతటా రహదారుల పక్కన పెన్జోర్ (అలంకరించిన పొడవైన వెదురు స్తంభాలు) ఏర్పాటు చేస్తారు. ఇవి దైవత్వాన్ని ఆహ్వానించడానికి, శ్రేయస్సుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి గుర్తుగా నిలుస్తాయి. పది రోజుల తర్వాత వచ్చే కుణీంగాన్ పండుగతో ఈ ఫెస్టివల్ ముగుస్తుంది. ఆ చివరి రోజున తమ పూర్వీకుల ఆత్మలు తిరిగి స్వర్గానికి వెళ్తాయని అక్కడివారు నమ్ముతారు.ప్రతి దేవాలయంలో ఒడాలన్ (ఆలయ వార్షికోత్సవం) ఉత్సవం జరుగుతుంది. సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ప్రత్యేకమైన కళల ప్రదర్శన కన్నుల పండుగగా సాగుతుంది. ఈ బాలినీస్ పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కావు, ఇవి బాలినీస్ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. -
శతాయుష్మాన్ భవ!
జపాన్ సంస్కృతిలో నవంబర్ నెల ఎంతో ప్రత్యేకమైనది. ఈ సమయంలో జపాన్ దేవాలయాలను సందర్శిస్తే, అందమైన కిమోనో వస్త్రధారణలో మెరిసే చిన్నచిన్న పిల్లలను చూడవచ్చు. ఇది జపాన్ సంప్రదాయ వేడుక. ఈ వేడుకని షిచి–గో–సాన్ పండుగ(Shichi-Go-San festival) అని పిలుస్తారు. ఆ పదాలకు అక్షరాలా ‘ఏడు, ఐదు, మూడు’ అని అర్థం. ఈ పండుగను ఈ మూడు నిర్దిష్ట వయస్సుల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు– తమ పిల్లల పెరుగుదలకు దీవెనలందించిన దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం దేవుళ్లను ప్రార్థించడానికి జరుపుకుంటారు.మూడు సంవత్సరాల వయసు ఉన్న బాలుడు లేదా బాలిక, ఐదు సంవత్సరాల వయసు ఉన్న బాలుడు, ఏడు సంవత్సరాల వయసు ఉన్న బాలిక ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ పండుగ సందర్భంగా నవంబర్ 15న చాలామంది జపాన్ తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి షింటో దేవాలయాలు లేదా బౌద్ధ దేవాలయాలను సందర్శిస్తారు.షిచి–గో–సాన్ పండుగ చరిత్ర– హీయాన్ కాలం (794–1185) నాటిది. అప్పటి నుంచి, ఉన్నత వర్గాల, సమురాయ్ కుటుంబాలు తమ పిల్లలు ఆరోగ్యంగా పెరిగినందుకు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పాత రోజుల్లో, వైద్య సంరక్షణ అంతగా అభివృద్ధి చెందనందున, శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండేది. అందుకే ఏడేళ్ల వయస్సు వచ్చే వరకు పిల్లలను ‘కామి నో ఉచి’ అంటే– దేవుని పిల్లలుగా పరిగణించేవారు. ఏడేళ్ల వయస్సు దాటితేనే వారిని మానవ లోకంలోకి ప్రవేశించినట్లుగా భావించేవారు.ఈ వేడుకల కోసం నవంబర్ 15వ తేదీని ఎంచుకోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేంటంటే 1603–1867 మధ్య కాలంలో టోకుగావా సునాయోషి అనే పాలకుడు తన కన్నబిడ్డ ఆరోగ్యం కోసం అదేరోజు ప్రార్థించాడట. ఈ వేడుకలో పాల్గొనే పిల్లలకు తల్లిదండ్రులు ‘చిటోసియామే’ అనే మిఠాయిని ప్రత్యేకంగా తినిపిస్తారు. ఎందుకంటే ‘చిటోసె’ అంటే దీర్ఘాయుష్షు అని అర్థం. ఈ క్యాండీని ‘వెయ్యేళ్ల క్యాండీ’ అని కూడా పిలుస్తారు. ఈ క్యాండీల ప్యాకింగ్పైన కొంగలు, తాబేళ్లు ఇలా దీర్ఘాయుష్షుకు చిహ్నమైన బొమ్మలు ఉంటాయి. -
అమీన్ పీర్ దర్గా ఉత్సవాలు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు అహ్వానం అందింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు.నవంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు హజరుకావాలని వైఎస్ జగన్‌ను కోరారు. వైఎస్ జగన్‌ను కలిసిన కడప మాజీ మేయర్ సురేష్ బాబు, అమీన్ పీర్ దర్గా చీఫ్ ముజావర్ అమీరుద్దిన్, మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు. -
ఇబ్బంది పెట్టే సంబరాలు ఎందుకు: జస్టిస్ ఓకా
సాక్షి, హైదరాబాద్: దేశంలో పండుగలు జరుపుకునే తీరుపై విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్.ఒకా(Justice Abhay S. Oka) అభ్యంతరం వ్యక్తం చేశారు. వాయు, శబ్ధ, జల కాలుష్యాలకు కారణమవుతున్న పండగ సంబరాల విషయంలో న్యాయ వ్యవస్థ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఇటీవల ‘‘కాలుష్యం.. వాతావరణ మార్పులు.. మనం.. సుస్థిర భవిష్యత్తు’’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పండుగల పేరుతో పర్యావరణ నాశనాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మత సంప్రదాయాల పేరుతో విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు నదులను కలుషితం చేస్తున్న వైనం, వీధుల్లో హద్దులు, నిబంధనలు మీరి జరుపుకున్న దీపావళి వేడుకల కారణంగా పలు చోట్ల పౌరులకు అసౌకర్యం, కొన్ని చోట్ల ప్రమాదాలు సంభవించడం వంటి ఘటనల జరుగుతున్న నేపథ్యంలో జస్టిస్ అభయ్ ఎస్.ఓకా మాటలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడుతోంది. అంతేకాదు.. దీపావళి, గణేశ్ ఉత్సవాలు, న్యూఇయర్ వేడకల్లో తొక్కిసలాటలు, ప్రమాదాల కారణంగా పలువురు గాయపడుతూండటం, కొందరు ప్రాణాలు కోల్పోతూండటం కూడా జస్టిస్ ఓకా వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ‘‘టపాసులు కాల్చడం, లౌడ్ స్పీకర్లతో ఊరేగింపులు.. నదుల్లో విగ్రహాల నిమజ్జనం వంటివి ఏవీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద వచ్చే అత్యంత ప్రధానమైన మత సంప్రదాయల కిందకు రావు’’ అని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో మన వైఫల్యానికి కీలకమైన కారణం ఏమిటంటే.. అటు పౌరులు, ఇటు ప్రభుత్వం కూడా రాజ్యాంగంలోని 51ఏ నిబంధనల్లోని ప్రాథమిక బాధ్యతలను విస్మరించడం అని ఆయన అన్నారు.‘‘దురదృష్టకరమైన అంశం ఏమిటంటే.. మతం పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసే ధోరణి ఉండటం. అయితే ప్రపంచంలోని ప్రతి మతం కూడా ప్రకృతిని కాపాడమనే చెబుతోంది. సాటి జీవజాతులతో సహానుభూతితో వ్యవహరించమనే చెబుతుంది. పండుగలను జరుపుకునే క్రమంలో పర్యావరణాన్ని నాశనం చేయమని, జంతువుల పట్ల క్రూరత్వంతో వ్యవహరించమని ఏ మతమూ చెప్పదు’’ అని స్పష్టం చేశారు. దీపావళి వస్తే టపాసుల శబ్ధాలతో ఊళ్లకు ఊళ్లు మారుమోగిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఈ శబ్ధాలకు పక్షలు, జంతువులు బెదిరిపోతూంటాయి. చిన్న పిల్లలు, వయోవృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతూంటారు. వీరందరిని ఇబ్బంది పెట్టడంలో వచ్చే సంతోషం ఏమిటి?’’ అని ప్రశ్నించారు.న్యాయ వ్యవస్థ ఆదర్శంగా నిలవాలి..ప్రకృతిని కాపాడే విషయంలో న్యాయ వ్యవస్థ అందరికీ ఆదర్శంగా నిలవాలని, ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత అన్నది గుర్తించాలని ఆయన కోరారు. పౌరులు, రాజ్యం కూడా మత సెంటిమెంట్ల ప్రభావానికి లోనుకాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. మతపెద్దలు, రాజకీయ నేతలు కూడా పండుగల సమయంలో కలిగే కాలుష్యం, అసౌకర్యాల విషయంలో నోరెత్తకపోవడంపై జస్టిస్ అభయ్ ఎస్. ఓకా అందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సంబంధిత న్యాయం కోసం పోరాడుతున్న వారికి సమాజం నుంచి మద్దతు కూడా కరవు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
వైభవంగా నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ ఉత్సవాలు (ఫొటోలు)
-
దివాలీకి స్వీట్లు లేకపోతే ఎలా? ఈజీగా ఇలా చేసేయ్యండి!
ముచ్చటగా అలంకరించిన లోగిళ్లు అందంగా ముస్తాబైన చిన్నా పెద్దలుఓ వైపు దీప కాంతులు మరోవైపు బాణాసంచా పేలుళ్లు ఆనందాలు విప్పారుతుండగా తియ్యని రుచులు నోరారా ఆస్వాదిస్తుంటే వేడుకంతా నట్టింట్లో కొలువుదీరినట్టే ఉంటుంది. రెట్టింపు ఆనందాలను పంచడానికి వంటిల్లు తీపి వంటకాలను సిద్ధం చేస్తూనే ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా పండగవేళ తియ్యని రుచులను సులువుగా చేసేద్దాం. ఇంటిల్లి పాదికీ ఆనందాన్ని పంచేద్దాం..సూజీ హల్వా కావలసినవి: సూజీ (బొంబాయి రవ్వ) – కప్పు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – కప్పు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; జీడిపప్పు, కిస్మిస్ – అవసరమైనంత.తయారీ: పాన్‌లో నెయ్యి వేడి చేసి, జీడిపప్పు, ద్రాక్ష వేయించాలి. ∙వాటిని తీసి, అదే నెయ్యిలో సూజీ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ∙మరో పాత్రలో నీరు మరిగించి, రవ్వ పోస్తూ, కలపాలి. ∙రవ్వ ఉడికిన తర్వాత పంచదార కలిపి తర్వాత యాలకుల పొడి వేసి కలపాలి. ∙చివరగా వేయించిన కాజూ, ద్రాక్ష వేసి మిక్స్ చేయాలి.గులాబ్ జామూన్కావలసినవి: రెడీమేడ్ జామూన్ మిక్స్ – కప్పు; నీళ్లుపాలు – అవసరమైనంత (జామూన్ మిక్స్ కలపడానికి); పంచదార‡ – ఒకటిం΄ావు కప్పులు; నీళ్లు – కప్పు; యాలకుల పొడి – చిటికెడు.తయారీ: ∙పంచదార, నీళ్లు కలిపి, మరిగించి సిరప్ తయారు చేయాలి. దాంట్లో చిటికెడు యాలకుల పొడి కలపాలి ∙జామూన్ మిక్స్‌కి కొంచెం నీళ్లు లేదా పాలు జోడించి మృదువుగా కలపాలి ∙మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ, ఉండలు చేయాలి ∙బాణలిలో నూనె పోసి వేడయ్యాక, సిద్ధంగా ఉంచుకున్న ఉండలు వేసి, వాటిని గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి ∙వేయించిన జామూన్లను వేడి సిరప్‌లో వేసి, రెండు గంటలు నాననివ్వాలి.రైస్ పుడ్డింగ్ / పాయసంకావలసినవి: బియ్యం – పావు కప్పు; పాలు – 3 కప్పులు; పంచదార – పావు కప్పు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; యాలకులు, కిస్మిస్ – అవసరమైనంత; నెయ్యి – టేబుల్ స్పూన్.తయారీ : బియ్యం కడిగి, కొద్దిగా ఉడికాక పాలు పోసి, మెల్లిగా మరిగించాలి. బియ్యం పూర్తిగా ఉడికాక పంచదార కలపాలి. యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపాలి.బేసిన్ లడ్డూ కావలసినవి: బేసన్ (సెనగపిండి) – కప్పు; నెయ్యి – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; యాలకుల పొడి – పావు టీ స్పూన్.తయారీ: ప్యాన్ నెయ్యి వేసి, వేడి చేయాలి. మంట బాగా తగ్గించి, దాంట్లో శనగపిండి వేసి, మెల్లగా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. చల్లారిన తర్వాత పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ, చేతులతో లడ్డూలు చేయాలి. -
పాప్ కల్చర్ కామికాన్..! దేశంలోనే అతిపెద్ద ఫెస్టివల్
హైదరాబాద్ నగరంలో మరోసారి పాప్ కల్చర్ సందడి మొదలైంది. ప్రముఖ కాస్ప్లేయర్లు, గేమింగ్ సెలబ్రిటీలు, యానిమే, ఫిల్మ్ స్టార్స్ నగరానికి చేరుకోనున్నారు. నగర వేదికగా దేశంలోనే అతిపెద్ద పాప్ కల్చర్ ఫెస్టివల్ ‘కామికాన్ ఇండియా 2025–26’ సీజన్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకూ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగనుంది. కామిక్స్, గేమింగ్, కాస్ప్లే, యానిమే, ఫిల్మ్స్, టీవీ, మెర్చండైజ్ వంటి విభిన్న, వినూత్న కార్యక్రమాలు, ప్రదర్శనలు ఒకే వేదికపై నిర్వహించే అతిపెద్ద యూత్ లైఫ్‌స్టైల్ ఫెస్టివల్ కామికాన్ ఇండియా. ప్రస్తుతం హైదరాబాద్ కేవలం ఐటీ సిటీ కాదు, ఇదొక కల్చరల్ క్రియేటివ్ సెంటర్‌గా అవతరించింది. ముఖ్యంగా ఈ తరం యువత గ్లోబల్ పాప్ కల్చర్‌ని తమదైన రీతిలో అర్థం చేసుకుంటూ ‘లైఫ్‌స్టైల్ సెలబ్రేషన్’గా అలవర్చుకుంటోంది. ప్రస్తుతం కామికాన్ కేవలం కామిక్స్ ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది కొత్త తరం జీవనశైలికి ప్రతిబింబం. పాప్ కల్చర్ నుండి లైఫ్‌స్టైల్ వరకూ.. ఫ్యాషన్, ఆర్ట్, డిజైన్, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ తదితర అంశాలతో కలిసిన ఫ్యూజన్‌కి ఇది కేంద్రబిందువు. యానిమే టీ–షర్టులు, కామిక్ క్యారెక్టర్ కలెక్టబుల్స్, ఆర్ట్ పోస్టర్లు, గేమింగ్ జోన్లు.. ఇవన్నీ ఆధునిక యువతకు ‘లైఫ్‌స్టైల్ ఎక్స్ప్రెషన్’గా మారిపోయాయి. ఈ ఫెస్టివల్లో అంతర్జాతీయ గెస్ట్‌లు, సెలబ్రిటీలతో ప్రశ్నోత్తర సెషన్లు, లైవ్ మ్యూజిక్, స్టాండప్ కామెడీ, యానిమే షోకేస్‌లు, ఈ–స్పోర్ట్స్ గేమింగ్ అరీనాలు, ఎక్స్‌క్లూజివ్ మెర్చండైజ్ లాంచ్‌లు, కంటెంట్ క్రియేటర్ల మీట్–అండ్–గ్రీట్స్ అన్నీ కలిపి ‘బెస్ట్ వీకెండ్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచేలా ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కామికాన్ ఇండియా సీఈఓ షెఫాలీ జాన్సన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ యువతలో సృజనాత్మకత, ఎనర్జీ, గ్లోబల్ కల్చర్‌పై ఆసక్తి విపరీతంగా ఉంది. అందుకే ఈ నగరమే తమ కొత్త సీజన్ ప్రారంభానికి సరైన వేదికని అభిప్రాయపడ్డారు. సృజనాత్మక హరివిల్లు.. కాస్ప్లే.. కాస్ప్లే ఇప్పుడు కేవలం ఆట కాదు.. ఇది ఒక ఆర్ట్ ఫార్మ్. అభిమానులు తమకు ఇష్టమైన సూపర్ హీరోలు, విలన్స్, యానిమే క్యారెక్టర్ల వేషధారణను రంగరించి, వ్యక్తిత్వాన్ని కొత్త రీతిలో చూపిస్తారు. ఈ కల్చర్ ద్వారా యువతలో ఫ్యాషన్ సెన్స్, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గత కొంత కాలంగా హైదరాబాద్‌లో కాస్ప్లేయర్లకు ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. గతంలో నగరంలో నిర్వహించిన కామికాన్ హైదరాబాద్ ఫెస్ట్‌కు 40 వేల మందికి పైగా హాజరై ఈ తరం ఔత్సాహికత్వాన్ని ఘనంగా ప్రదర్శించారు. ఈ ఏడాది ఆ సంఖ్యను మించి ఉండనుందని నిర్వాహకులు చెబుతున్నారు. డిస్ట్రిక్ట్, మై జొమాటో ఈ సీజన్‌కు ప్రత్యేక టికెటింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ కామిక్ కాన్ 2025–26 ఈవెంట్‌కి సంబంధించిన టికెట్లు డి్రస్టిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. క్రియేటివ్..కేరాఫ్ హైదరాబాద్..ఈ ఫెస్టివల్ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని ఆరొమాలే కెఫే, క్రియేటివ్ కమ్యూనిటీ వేదికగా కామికాన్ ఇండియా ఆధ్వర్యంలో కాస్ప్లే వర్క్‌షాప్ సైతం నిర్వహించారు. పాప్ కల్చర్ అభిమానులకు, క్రియేటివిటీకి, ఫ్యాండమ్కి ఇదొక అద్భుత వేదికగా నిలుస్తోంది. ఈ వర్క్‌షాప్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచి్చన 150 మందికి పైగా కాస్ప్లే అభిమానులు పాల్గొని తమ కళాత్మకతను, సృజనాత్మకతను ప్రదర్శించి సందడి చేయనున్నారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారికి కాస్ట్యూమ్ డిజైనింగ్, ప్రాప్ క్రియేషన్, ఫోమ్ కటింగ్, ప్యాటర్న్ మేకింగ్ వంటి బేసిక్ టెక్నిక్స్‌ను ప్రాక్టికల్‌గా నేరి్పంచారు. ముఖ్యంగా ‘రియలిస్టిక్ ఎఫెక్ట్స్’.. బాటిల్ డ్యామేజ్ లుక్ వంటి ఫినిషింగ్ టచ్‌లు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇచ్చారు. ఫోమ్‌ను వేడి చేసి ఆకట్టుకునే ఆకారాలు మార్చే పద్ధతిని చూపించారు. ఈ సెషన్ ఇండియన్ చాంపియన్‌షిప్ ఆఫ్ కాస్ప్లే (ఐసీసీ) రెండు సార్లు గెలిచిన అక్షయ్ చూరీ నడిపించడం విశేషం. ఆయన కాస్ట్యూమ్ తయారీ, ప్రెజెంటేషన్, డీటైలింగ్కి సంబంధించిన చిట్కాలను పంచుకున్నారు. అదనంగా.. వీఎఫ్ ఎక్స్ మేకప్, విగ్ స్టైలింగ్, కాంటాక్ట్ లెన్స్ వినియోగం.. వంటి అంశాలపై ప్రత్యేక సెగ్మెంట్ నిర్వహించే.. దీనిలో సేఫ్టీ, హెల్త్, కంఫర్ట్‌పై దృష్టి పెట్టారు. నచ్చిన క్యారెక్టర్‌తో మొదలుపెట్టండి.. హైదరాబాద్ యానిమే క్లబ్, కాస్ప్లే క్లబ్ హెడ్ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. కాస్ప్లే మొదలుపెట్టేందుకు ముందే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇష్టపడే క్యారెక్టర్‌తో మొదలుపెడితే చాలు. అదే మీకు ఆసక్తిని, స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో ఐసీసీ 2024–25 హైదరాబాద్ క్వాలిఫయ్యర్ శుక్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆయన రూపొందించిన వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్ క్యారెక్టర్ ‘అండుయిన్ వ్రిన్’ ఆర్మర్ కాస్ట్యూమ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం క్లాస్ కాదు, ఒక ఫన్ ఇంటరాక్టివ్ సెషన్. పారి్టసిపెంట్లు స్వయంగా ప్యాటర్న్లు కట్ చేయడం, ఫోమ్ గ్లూ చేయడం నేర్చుకోవడం వావ్ అనిపించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వర్క్‌షాప్ ఒక బిగినర్ ఫ్రెండ్లీ సెషన్‌గా.. నగరంలోని కాస్ప్లే ఔత్సాహికులకు ఆత్మవిశ్వాసం పెంచి కొత్త ఊపునిచ్చింది. (చదవండి: బన్ మస్కా..! వేడి వేడి ఇరాన్ చాయ్ కాంబినేషన్ అదుర్స్..!) -
మోహన్‌బాబు యూనివర్సిటీలో యూత్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
విజయాలను ఒసగే విజయదశమి అంతరార్థం ఇదే..!
ఈ విజయదశమికి ఆత్మజ్ఞానాన్ని మన జీవితాలలో ఉదయించన్నవ్విండి అని పిలుపునిచ్చారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశింకర్. విజయదశమిని మనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకింటున్నాం, నిజానికి ఈ యుద్ధం మంచికి, చెడుకి మధ్య కాదు. వేదాంత పరంగా చూసినప్పుడు, బయట ప్రపంచంలో కనిపించే ద్వైతభావనపై అనంత వ్యాప్తమై ఒకటిగా మాత్రమే ఉన్న సత్యం సాధించే విజయిం అది. శుద్ధచైతన్య స్వరూపమైన జగన్మాతే అన్ని రూపాలు, నామాలలో న్నిండి ఉంది. ఈ విధంగా అంతట నిండి ఉన్న ఒకే ఒక్క దైవత్వాన్ని అన్ని రూపాలలోనూ దర్శించగలగటమే ఈ పండుగ పరమార్థం. దైవీభావనకు, ఆసురీభావనకు జరిగే ఈ యుద్ధం బయట ప్రపంచంలో మాత్రమే కాదు, అది మన మనసులో ఎపుుడూ జరుగుతూనే ఉంది. విజయదశమినాడు రావణుడి బొమ్మను దహనం చేయటం మనం చాలాచోట్ల చూస్తున్నాం. రావణుడు అహంకారానికి చిహ్నం. అహం అంటే 'నేను వేరు' అనే తప్పుడు భావన. దాంతో వాళ్ల చుట్టూ వాళ్లే గోడలు కట్టుకుంటాం. ఆ అహంకారన్ని అణిచేందుకు వాళ్లకంటే వేరుగా మరొకరు (నేను వేరు, అతడు/ఆమె వేరు అనే భావన) కావాలి. ఆత్మవిశ్వాసానికి ఆ అవసరం లేదు. తాము ఇతరుల కంటే గొప్పవాళ్లమని అహంకారులు అనుకుంటారు. ఇక రాముడు ఆత్మజ్ఞానాన్నకి ప్రతీక. శ్రీరాముడు ఆత్మను, ఆత్మజ్ఞానాన్ని కూడా సూచిస్తాడు. వ్యక్తిలో ఆత్మజ్ఞానం (రాముడు) ఉదయించినపుడు, లోపల ఉన్న అహంకారం, చెడు భావన రూపంలో ఉన్న రావణుడు సంపూర్ణంగా నశించిపోతాడు. దీనికి సూచనగా ఈరోజు మనం మనలో ఉన్న చెడు భావనలను జ్ఞానం అనే అగ్నికి ఆహుతి ఇస్తాం (సమర్పిస్తాము). ఆ విధంగా సమర్పించటం వల్ల మన అంతరంగ వికాసం ఆరంభం అవుతుంది. మనలో అద్భుతమైన ఆనందం పెలులబుకతుంది, అది మనకే కాక సమాజమంతటికి మంచి చేస్తుంది. ఈ సంత్సర కాలమంతా సేకరించుకుపి మన మనసులో పేరుకున్న ఇష్టాఇష్టాలు, రాగద్వేషాలపై మనం విజయిం సాధించటాన్ని ఈ విజయదశమి రోజు సూచిస్తుంది. దైవీభావనల ఎఱుక మనలో కలిగినపుడు అది నిజమైన విజయం. అపుడు మన జీవితంలో శాంతి, ఆనందం, సౌభాగ్యం కలుగుతాయ. చెడు భావనలు మనలను ఆక్రమించుకున్నప్పుడు మనం దుుఃఖాన్ని, కష్టాలనును అనుభవిస్తాము. అందుకే వేదకాలంలో ప్రజలు ఒకర్నొకరు పలకరించుకనేటపుుడు “ఆరోగ్యమస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు” (మీరు ఆరోగ్యంగా, తృప్తిగా ఉండాలి, మీ కార్యాలు శుభకరంగా జరగాలి) అన్న చెప్పేవారు. రావణ వినాశనం అనేది తిరుగులేని రామబాణంతో మాత్రమే జరుగగలదు. అదే విధంగా అన్నిరకాలైన చెడుభావనలు, మానసిక చాంచల్యాలపై ఆత్మజ్ఞానంతోనే విజయిం సాధించగలం. సరే, మరి ఈ ఆత్మజ్ఞానాన్ని పిందటిం ఎలా? (హిందీలో) విశ్రామ్ మే రామ్ హై (విశ్రాంతి లో రాముడు ఉన్నాడు) అన్న చెపునటులగా, ప్రగాఢమైన విశ్రాంతి ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. ఈనాటి సమాజంలో మనం చూస్తున్న అలజడులన్నిటికీ ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత లేకపోవటమే కారణం. “నే నెవరు?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంతే కాదు, మీరు ఎవరు కాదు అని కూడా అడగిండి. “నేను ఈ శరీరాన్ని కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు...” ఇలా విచారించి చూసినపుడు చివరికి ఏం మిగులుతిందో గమన్నించిండి! ఈ విధంగా మన స్వస్వభావాన్ని గమనించుకోవటం అనేది మన ఆత్మను ఉత్తేజపరచి మనలో సింతృప్తిని పెంపొందిస్తుంది. ఒక మనిషి మనసులో ఈ ప్రశ్నలు రేకెత్తిన మరుక్షణమే అతని జీవితంలో కష్టాలు, చెడు భావనలు అంతరించిపోవట ఆరంభమవుతుంది. అయితే, ఎంత విచారించినా సరే మళ్ళీమళ్ళీ మన మనసు వేసే చిక్కుముళ్లలో మనం పడుతూనే ఉంటాం. ఇవి మనకు మనమే వేసుకుంటున్న బంధాలు. ఈవిధమైన గందరగోళ స్థితినే యోగులు మాయ అపి పిలిచారు. ఈ మాయ నుంచి బయటపడేందుకే మనక ధ్యానం అవసరం. అందుకే, ఈ ముసుగును తొలగించుకునేందుక అనేక మార్గాలు సూచించారు: మనం పండుగలు, ఉత్సావాల జరుపుకుంటాము, జగన్మాతను ఆరాదిస్తాం, దైవం మనలోపలే ఉన్నదని, అంతే కాక విశ్వమంతా స్వచ్ఛమైన చైతన్యంగా నిండి ఉన్నదని మనకు మనమే గుర్తుచేసుకుంటాం. ఈ సమస్త విశ్వం ఆ ఏకైక చైతన్యపు లీల. దీన్నే మనం పదేపదే తప్పక గుర్తు చేసుకోవాలి అని అన్నారు గురుదేవ్ రవిశంకర్.(చదవండి: నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..) -
Vijaya Dashami: సర్వం శక్తిమయం!
ఆదిశక్తి అయిన అమ్మవారిని ఆరాధించడం తరతరాల సంప్రదాయం. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని శరన్నవరాత్రులలో ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వీటినే దసరా నవరాత్రులని అంటారు. ‘దేవీభాగవతం’ వంటి పురాణగాథల ప్రకారం ఆదిశక్తి దుర్గాదేవిగా ఆవిర్భవించి, రక్తబీజ, చండ ముండ, శుంభ నిశుంభ, మహిషాసురాది రాక్షసులను సంహరించింది. దుష్టసంహారానికి ప్రతీకగా నవరాత్రులలో చివరి రోజున విజయ దశమినాడు దసరా పండుగను జనాలు వేడుకగా జరుపుకొంటారు.దసరా నవరాత్రులలో పూజాదికాలు శాక్తేయ సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. సింధులోయ నాగరికత కాలం నుంచి శాక్తేయ సంప్రదాయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. సింధులోయ నాగరికతలో మొదలైన శాక్తేయ సంప్రదాయం దేశం నలువైపులకు విస్తరించింది. ఇందులో భాగంగానే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ప్రధానంగా అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. వీటితో పాటు యాభైఒక్క శక్తిపీఠాలు ఉన్నాయి. దేవీ భాగవతం నూట ఎనిమిది శక్తిపీఠాలను పేర్కొంది. వీటిలో కొన్ని భారతదేశంతో పాటు పాకిస్తాన్, టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో ఉన్నాయి. ఈ శక్తిపీఠాలు ఏర్పడటానికి మూలంగా దక్షయజ్ఞం గాథను చెబుతారు. శక్తిపీఠాల మూలగాథఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం తలపెట్టాడు. ఈ యజ్ఞానికి సమస్త దేవతలను, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులను, మునిగణాలను ఆహ్వానించాడు. కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుడిని మాత్రం పిలవలేదు. తండ్రి మాటను కాదని సతీదేవి శివుడిని పెళ్లాడింది. అందువల్లనే దక్షుడు కూతురిని, అల్లుడిని తాను నిర్వహించే యాగానికి ఆహ్వానించకుండా విస్మరించాడు. పుట్టింటి వేడుకకు పిలుపుతో పనేముంది అనుకుని సతీదేవి భర్త వారిస్తున్నా పట్టించుకోకుండా ప్రమధగణాలను వెంటబెట్టుకుని దక్షయజ్ఞానికి వెళ్లింది. ఆమెను చూసిన దక్షుడు ఆమెను, శివుడిని దారుణంగా నిందించాడు. శివనింద భరించలేని సతీదేవి యోగాగ్నిగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. సతీ వియోగంతో శివుడు జగద్రక్షణ బాధ్యతను మానేశాడు. ఆమె మృతకళేబరాన్ని భుజం మీద మోసుకుంటూ దిక్కుతోచక తిరగసాగాడు. శివుడిని తిరిగి కార్యోన్ముఖుడిని చేయాల్సిందిగా దేవతలందరూ విష్ణువుకు మొరపెట్టుకున్నారు. సతీ కళేబరం చెంత ఉన్నంత వరకు శివుడు యథాస్థతికి రావడం అసాధ్యమని తలచిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, ఆమె శరీరాన్ని ఖండించాడు. సతీదేవి ఖండితావయవాలు భూమ్మీద ఒక్కోచోట చెల్లాచెదురుగా పడ్డాయి. అవి పడిన చోట శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. వీటిలోని ప్రధానమైన పద్దెనిమిది శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తింపు పొందాయి. స్కాంద పురాణం వంటి పురాణాల ప్రకారం యాభైఒక్క శక్తి పీఠాలు ఉన్నాయి. దేవీభాగవతం ప్రకారం నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల గురించి చాలామందికి తెలుసు. మిగిలిన శక్తిపీఠాలలో కొన్ని విశేషమైనవి, విలక్షణమైనవి ఉన్నాయి. వీటిలో కొన్ని అరుదైన శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం.మహామాయ పీఠం – జమ్ము కశ్మీర్మహామాయ శక్తిపీఠం జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా అమర్నాథ్లో ఉంది. ఇది గుహాలయం. బయటి నుంచి చూడటానికి సాధారణమైన కొండగుహలా కనిపిస్తుంది గాని, లోపల పురాతనమైన మహామాయ విగ్రహం ఉంటుంది. అమర్నాథ్లో శివాలయం పొందినంతగా ఇది ప్రసిద్ధి పొందలేదు. అమర్నాథ్ యాత్రికుల్లో చాలామంది ఈ మహామాయ ఆలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇది సతీదేవి గొంతు భాగం పడిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. ఇది పార్వతీపీఠంగా ప్రసిద్ధి పొందింది.దాక్షాయనీ పీఠం – టిబెట్దాక్షాయని శక్తిపీఠం టిబెట్‌లో ఉంది. కైలాస పర్వతానికి సమీపాన మానస సరోవరానికి చేరువలో ఉన్న ఒక మంచుకొండ మీద ఈ శక్తిపీఠం ఉంది. మానస సరోవరం వద్ద వెలసినందున దీనిని మానసా శక్తిపీఠం అని కూడా అంటారు. సతీదేవి కుడిచేయి ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాల కథనం. గోపురంలా కనిపించే శిఖరం కింద సహజంగా ఏర్పడిన గుహలోని పురాతన దాక్షాయని విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటుంటారు. గండకీ చండీ పీఠం – నేపాల్గండకీ చండీ శక్తిపీఠం నేపాల్‌లో ఉంది. హిమాలయ సానువుల్లో గండకీ నదీ తీరానికి చేరువలో ముస్తాంగ్ పట్టణానికి సమీపంలో ఈ శక్తిపీఠం ఉంది. హిందువులకు, బౌద్ధులకు పవిత్ర క్షేత్రమైన ముక్తినాథ్ ఆలయానికి అతి చేరువలోనే గండకీ చండీ ఆలయం కూడా ఉంది. సతీదేవి ముఖ భాగం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో పురాతన శాక్తేయ సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహిస్తుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటుంటారు.సావిత్రీ పీఠం – హరియాణాసావిత్రీ శక్తిపీఠం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా థానేసర్‌లో ద్వైపాయన సరోవరం ఒడ్డున ఉంది. ఈ క్షేత్రంలోనే కురుపాండవ సంగ్రామం జరిగిందనే మహాభారత కథనం అందరికీ తెలిసినదే! కురుక్షేత్రలో వెలసిన సావిత్రీ శక్తిపీఠం స్థానికంగా భద్రకాళి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల విజయం కోసం శ్రీకృష్ణుడు ఇదే శక్తిపీఠంలో అమ్మవారిని అర్చించాడట! యుద్ధానంతరం పాండవులు ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపి, కానుకగా గుర్రాలను సమర్పించారట! ఈ ప్రదేశంలో సతీదేవి కుడిచేతి చీలమండ పడినట్లు పురాణాల కథనం. దసరా నవరాత్రి వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి.గాయత్రీ పీఠం – రాజస్థాన్గాయత్రీ శక్తిపీఠం రాజస్థాన్‌లోని అజ్మేర్ నగరానికి చేరువలో ఉన్న పుష్కరక్షేత్రంలో ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి మణికట్లు పడ్డాయని పురాణాల కథనం. అందువల్ల ఈ శక్తిపీఠాన్ని మణిబంధ పీఠం, మణివేదిక ఆలయం అని కూడా ఉంటారు. గాయత్రీ మంత్రసాధనకు ఈ శక్తిపీఠం అత్యుత్తమ క్షేత్రమని, ఇక్కడ చేసే గాయత్రీ మంత్రసాధన శీఘ్రంగా ఫలిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పుష్కర క్షేత్రంలోని బ్రహ్మదేవుడి ఆలయానికి అతి చేరువలో ఉన్న ఈ ఆలయ నిర్మాణంలోని శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది.దేవగర్భ పీఠం – హిమాచల్ప్రదేశ్దేవగర్భ శక్తిపీఠం హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా పట్టణంలో ఉంది. ఇక్కడ వెలసిన దేవగర్భదేవినే వజ్రేశ్వరి అని, స్థానికులు కాంగ్రాదేవి అని అంటారు. ఈ ప్రదేశంలో సతీదేవి ఎడమ స్తనభాగం పడినట్లు పురాణాల కథనం. వజ్రేశ్వరిని దుర్గాదేవి ఉగ్రరూపంగా భావిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయంలోని విలువైన సంపదను మహమ్మద్ ఘజనీ దోచుకున్నాడు. ఆ తర్వాత 1905లో సంభవించిన భూకంపంలో ఆలయ నిర్మాణం బాగా దెబ్బతినడంతో తర్వాత ప్రస్తుతం కనిపిస్తున్న రీతిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. దసరా నవరాత్రులు ఈ ఆలయంలో వైభవోపేతంగా జరుగుతాయి.త్రిపురసుందరీ పీఠం – త్రిపురత్రిపురసుందరీ శక్తిపీఠం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఉదయపూర్ పట్టణంలో ఉంది. చిన్న కొండపై ఉన్న ఈ ఆలయ నిర్మాణం కూర్మాకృతిలో కనిపిస్తుంది. అందువల్ల దీనిని కూర్మపీఠం అని కూడా అంటారు. ఈ ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరి రూపంలో కొలువై కనిపిస్తుంది. సతీదేవి కుడిపాదం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో అసోంలోని కామాఖ్య పీఠం తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయంగా త్రిపురసుందరీ పీఠం ప్రసిద్ధి పొందింది.భవానీ పీఠం – బంగ్లాదేశ్భవానీ పీఠం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లా సీతాకుండ్ వద్ద చంద్రనాథ్ కొండపై ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ఛత్తల్ భవానీ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు చంద్రశేఖరుడిగా కొలువై ఉండటంతో ఈ ప్రదేశం చంద్రకాంత్ ధామ్‌గా కూడా ప్రసిద్ధి పొందింది. సతీదేవి కుడి భుజం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దసరా నవరాత్రి వేడుకలు ఈ శక్తిపీఠంలో ఘనంగా జరుగుతాయి.శివానీ పీఠం – ఉత్తరప్రదేశ్శివానీ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లా రామ్‌గిరిలో ఉంది. ఇక్కడ కామదగిరి ప్రదక్షిణ మార్గంలో కొండ మీద ఉన్న అనేక ఆలయాల్లో పురాతనమైన శివానీ పీఠం కూడా ఉంది. సతీదేవి కుడి స్తనభాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. రామాయణ కథనం ప్రకారం సీతా రామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ చిత్రకూట పర్వతంపైనే కొన్నాళ్లు గడిపారట! కామదనాథుడి పేరిట శివుడు వెలసిన కొండ కావడంతో ఈ కొండకు కామదగిరి అనే పేరు వచ్చింది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరికలు ఈడేరుతాయని భక్తుల నమ్మకం.హింగ్లాజ్ పీఠం – పాకిస్తాన్హింగ్లాజ్ శక్తిపీఠం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ మర్కన్ తీరంలో ఉన్న హింగ్లాజ్ పట్టణంలో ఉంది. హింగ్లాజ్ నేషనల్ పార్కలో ఉన్న కొండ పైభాగంలో ఉన్న గుహలో హింగ్లాజ్ ఆలయం ఉంది. ఇక్కడి దేవతను హింగ్లాజ్ దేవి అని, హింగులా దేవి అని అంటారు. సతీదేవి లలాట భాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. పాకిస్తాన్‌లోని హిందువులతో పాటు మన దేశంలోని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ దసరా నవరాత్రులతో పాటు వసంత నవరాత్రి వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. మహామాయ పీఠం – జమ్ము కశ్మీర్మహామాయ శక్తిపీఠం జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా అమర్నాథ్లో ఉంది. ఇది గుహాలయం. బయటి నుంచి చూడటానికి సాధారణమైన కొండగుహలా కనిపిస్తుంది గాని, లోపల పురాతనమైన మహామాయ విగ్రహం ఉంటుంది. అమర్నాథ్లో శివాలయం పొందినంతగా ఇది ప్రసిద్ధి పొందలేదు. అమర్నాథ్ యాత్రికుల్లో చాలామంది ఈ మహామాయ ఆలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇది సతీదేవి గొంతు భాగం పడిన ప్రదేశమని పురాణాలు చెబుతున్నాయి. ఇది పార్వతీపీఠంగా ప్రసిద్ధి పొందింది.దాక్షాయనీ పీఠం – టిబెట్దాక్షాయని శక్తిపీఠం టిబెట్‌లో ఉంది. కైలాస పర్వతానికి సమీపాన మానస సరోవరానికి చేరువలో ఉన్న ఒక మంచుకొండ మీద ఈ శక్తిపీఠం ఉంది. మానస సరోవరం వద్ద వెలసినందున దీనిని మానసా శక్తిపీఠం అని కూడా అంటారు. సతీదేవి కుడిచేయి ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాల కథనం. గోపురంలా కనిపించే శిఖరం కింద సహజంగా ఏర్పడిన గుహలోని పురాతన దాక్షాయని విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటుంటారు. గండకీ చండీ పీఠం – నేపాల్గండకీ చండీ శక్తిపీఠం నేపాల్‌లో ఉంది. హిమాలయ సానువుల్లో గండకీ నదీ తీరానికి చేరువలో ముస్తాంగ్ పట్టణానికి సమీపంలో ఈ శక్తిపీఠం ఉంది. హిందువులకు, బౌద్ధులకు పవిత్ర క్షేత్రమైన ముక్తినాథ్ ఆలయానికి అతి చేరువలోనే గండకీ చండీ ఆలయం కూడా ఉంది. సతీదేవి ముఖ భాగం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో పురాతన శాక్తేయ సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహిస్తుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటుంటారు.సావిత్రీ పీఠం – హరియాణాసావిత్రీ శక్తిపీఠం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా థానేసర్‌లో ద్వైపాయన సరోవరం ఒడ్డున ఉంది. ఈ క్షేత్రంలోనే కురుపాండవ సంగ్రామం జరిగిందనే మహాభారత కథనం అందరికీ తెలిసినదే! కురుక్షేత్రలో వెలసిన సావిత్రీ శక్తిపీఠం స్థానికంగా భద్రకాళి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల విజయం కోసం శ్రీకృష్ణుడు ఇదే శక్తిపీఠంలో అమ్మవారిని అర్చించాడట! యుద్ధానంతరం పాండవులు ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపి, కానుకగా గుర్రాలను సమర్పించారట! ఈ ప్రదేశంలో సతీదేవి కుడిచేతి చీలమండ పడినట్లు పురాణాల కథనం. దసరా నవరాత్రి వేడుకలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి.గాయత్రీ పీఠం – రాజస్థాన్గాయత్రీ శక్తిపీఠం రాజస్థాన్‌లోని అజ్మేర్ నగరానికి చేరువలో ఉన్న పుష్కరక్షేత్రంలో ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి మణికట్లు పడ్డాయని పురాణాల కథనం. అందువల్ల ఈ శక్తిపీఠాన్ని మణిబంధ పీఠం, మణివేదిక ఆలయం అని కూడా ఉంటారు. గాయత్రీ మంత్రసాధనకు ఈ శక్తిపీఠం అత్యుత్తమ క్షేత్రమని, ఇక్కడ చేసే గాయత్రీ మంత్రసాధన శీఘ్రంగా ఫలిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పుష్కర క్షేత్రంలోని బ్రహ్మదేవుడి ఆలయానికి అతి చేరువలో ఉన్న ఈ ఆలయ నిర్మాణంలోని శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది.దేవగర్భ పీఠం – హిమాచల్ప్రదేశ్దేవగర్భ శక్తిపీఠం హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా పట్టణంలో ఉంది. ఇక్కడ వెలసిన దేవగర్భదేవినే వజ్రేశ్వరి అని, స్థానికులు కాంగ్రాదేవి అని అంటారు. ఈ ప్రదేశంలో సతీదేవి ఎడమ స్తనభాగం పడినట్లు పురాణాల కథనం. వజ్రేశ్వరిని దుర్గాదేవి ఉగ్రరూపంగా భావిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయంలోని విలువైన సంపదను మహమ్మద్ ఘజనీ దోచుకున్నాడు. ఆ తర్వాత 1905లో సంభవించిన భూకంపంలో ఆలయ నిర్మాణం బాగా దెబ్బతినడంతో తర్వాత ప్రస్తుతం కనిపిస్తున్న రీతిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. దసరా నవరాత్రులు ఈ ఆలయంలో వైభవోపేతంగా జరుగుతాయి.త్రిపురసుందరీ పీఠం – త్రిపురత్రిపురసుందరీ శక్తిపీఠం ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ఉదయపూర్ పట్టణంలో ఉంది. చిన్న కొండపై ఉన్న ఈ ఆలయ నిర్మాణం కూర్మాకృతిలో కనిపిస్తుంది. అందువల్ల దీనిని కూర్మపీఠం అని కూడా అంటారు. ఈ ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరి రూపంలో కొలువై కనిపిస్తుంది. సతీదేవి కుడిపాదం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో అసోంలోని కామాఖ్య పీఠం తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయంగా త్రిపురసుందరీ పీఠం ప్రసిద్ధి పొందింది.భవానీ పీఠం – బంగ్లాదేశ్భవానీ పీఠం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లా సీతాకుండ్ వద్ద చంద్రనాథ్ కొండపై ఉంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ఛత్తల్ భవానీ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు చంద్రశేఖరుడిగా కొలువై ఉండటంతో ఈ ప్రదేశం చంద్రకాంత్ ధామ్‌గా కూడా ప్రసిద్ధి పొందింది. సతీదేవి కుడి భుజం ఈ ప్రదేశంలో పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దసరా నవరాత్రి వేడుకలు ఈ శక్తిపీఠంలో ఘనంగా జరుగుతాయి.శివానీ పీఠం – ఉత్తరప్రదేశ్శివానీ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లా రామ్‌గిరిలో ఉంది. ఇక్కడ కామదగిరి ప్రదక్షిణ మార్గంలో కొండ మీద ఉన్న అనేక ఆలయాల్లో పురాతనమైన శివానీ పీఠం కూడా ఉంది. సతీదేవి కుడి స్తనభాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. రామాయణ కథనం ప్రకారం సీతా రామ లక్ష్మణులు వనవాస కాలంలో ఈ చిత్రకూట పర్వతంపైనే కొన్నాళ్లు గడిపారట! కామదనాథుడి పేరిట శివుడు వెలసిన కొండ కావడంతో ఈ కొండకు కామదగిరి అనే పేరు వచ్చింది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరికలు ఈడేరుతాయని భక్తుల నమ్మకం.హింగ్లాజ్ పీఠం – పాకిస్తాన్హింగ్లాజ్ శక్తిపీఠం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ మర్కన్ తీరంలో ఉన్న హింగ్లాజ్ పట్టణంలో ఉంది. హింగ్లాజ్ నేషనల్ పార్కలో ఉన్న కొండ పైభాగంలో ఉన్న గుహలో హింగ్లాజ్ ఆలయం ఉంది. ఇక్కడి దేవతను హింగ్లాజ్ దేవి అని, హింగులా దేవి అని అంటారు. సతీదేవి లలాట భాగం ఇక్కడ పడినట్లు పురాణాల కథనం. పాకిస్తాన్‌లోని హిందువులతో పాటు మన దేశంలోని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ దసరా నవరాత్రులతో పాటు వసంత నవరాత్రి వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలుదేశ విదేశాల్లో పలుచోట్ల అమ్మవారి ఆలయాల్లో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. దసరా వేడుకల సందర్భంగా పలుచోట్ల వీథుల్లో అమ్మవారి మండపాలను ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోను, తెలంగాణలో ఆలంపురంలోని శక్తిపీఠమైన జోగులాంబ ఆలయంలోను ఈ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఈసారి దసరా వేడుకలు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజైన సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అక్టోబర్ 2న విజయదశమి నాటితో దసరా నవరాత్రులు పూర్తవుతాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని రోజుకో అవతారంలో రోజుకో తీరులో అలంకరిస్తారు. రోజుకో ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని నవరాత్రులలో చేసే అలంకరణలు, నైవేద్యాల వివరాలు: -
విజయనగరం : సిరిమాను వచ్చింది.. సంబరం తెచ్చింది (ఫొటోలు)
-
విశాఖపట్నం..యూత్ జోష్ (ఫొటోలు)
-
వైభవంగా పోలేరమ్మ నగరోత్సవం.. కిక్కిరిసిన వెంకటగిరి (ఫొటోలు)
-
కేరళ సంస్కృతికి దర్పణం ఈ పండుగ..!
కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మలయాళీలు ఘనంగా జరుపుకునే పర్వదినాలలో ఇది ఒకటి. వితరణ శీలి, ప్రజానురంజక పాలకుడైన బలిచక్రవర్తి ఈరోజు భూమి మీదకు తిరిగి వస్తాడని మలయాళీలు నమ్ముతారు. ఈ పండుగ ప్రతి ఏటా ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. ఇది 12 రోజులపాటు జరుపుకునే పండుగ. ఇది ఎంతో చరిత్ర, సంంస్కృతి, మతపరమైన ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ సంవత్సరం ఓనం పండుగను సెప్టెంబరు 5, శుక్రవారం జరుపుకోనున్నారు. తిరువోణం అని పిలువబడే రోజునే బలి వస్తాడంటారు. ఆ రోజే ప్రధానవేడుకను చేసుకుంటారు. కేరళ సంస్కృతికి అద్దం పట్టే పండుగ ఓనం. బలి చక్రవర్తి ఆగమనాన్ని పురస్కరించుకుని మలయాళీలు ఈరోజున తమ ఇళ్లను పువ్వులు, తోరణాలు, రంగోలీలతో ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా ఖీర్, పులిస్సేరి వంటి రుచికరమైన వంటకాలను కూడా తయారు చేస్తారు. ప్రతి కుటుంబం ఓనం సద్యను తయారు చేస్తాయి. ఈ శాకాహార భోజనంలో 20కిపైగా వంటకాలు ఉంటాయి.ఈ పండుగను పురస్కరించుకుని కథాకళి నృత్యం, వల్లం కలి(బోట్ రేస్) వంటివి ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు కైకొట్టికలి, తుంబి తుల్లాల్ సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఈరోజున మగవారు చొక్కా, ముండు అని పిలువబడే లుంగీ ధరిస్తారు. స్త్రీలు ముండు, నరియతు అనబడే ఒక బంగారు పై ఆచ్చాదనను ధరిస్తారు. ఓనం కేరళలో వ్యవసాయ పండుగ. కుమ్మట్టికలి, పులికలి వంటి జానపద ప్రదర్శనలు కూడా ఇస్తారు.పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య) వంటి ఆటల్లో పాల్గొంటారు.ఓనం పండుగ ముఖ్య తేదీలుసెప్టెంబర్ 4, 2025 – ఉత్రాదం రోజు, మొదటి ఓనం (ఉత్రడప్పచ్చిల్)సెప్టెంబర్ 5, 2025 – తిరువోణం రోజు, రెండవ ఓణం (ప్రధాన వేడుక)సెప్టెంబర్ 6, 2025 – అవిట్టం రోజు, మూడవ ఓనం, త్రిస్సూర్ పులికలిసెప్టెంబర్ 7, 2025 – చాతాయం రోజు, నాల్గవ ఓనం (చదవండి: గణేశ నిమజ్జనం ఆంతర్యం..!) -
ప్రపంచంలో కొలువైన ఈ గణపయ్యల గురించి తెలుసా?
విఘ్నాలను తొలగించే వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచేందుకు యావత్ భక్తజనం సంసిద్ధమవుతోంది. చిన్నా పెద్దా అంతా బొజ్జగణపయ్యను కొలిచేందుకు ఉవ్విళ్లూరుతారు. తొమ్మిది రోజుల పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.గణేష్ చతుర్థిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అపారమైన భక్తితో జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తప్పక సందర్శించాల్సిన అయిదు ప్రత్యేకమైన గణేష్ విగ్రహాల గురించి తెలుసుకుందాం.ప్రతి సంవత్సరం వినాయక చవితిని భాద్రపద శుక్ల చవితి తిథి నాడు జరుపుకుంటారు. కోరిన కోర్కెలు నేరవేర్చు స్వామీ అని ఆ గణనధుడుని వేడుకొని వినాయకవత్రకథను చదువుకొని అక్షితలు వేసుకొని చంద్రుడిని దర్శించుకుంటారు. అనేక మంటపాల్లో కొలువుదీరిన గణపతిని తనివితీరా దర్శిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా వంటి రాష్ట్రాలతోపాటు, మలేషియా, నేపాల్, సింగపూర్, మారిషస్ ,కెనడా లాంటి దేశాల్లో కూడా సంబరాలు జరుగుతాయి. ప్రపంచంలో కూడా గణేష్ విగ్రహాలకు ప్రత్యేకత ఉంది. థాయిలాండ్‌లోని ఎత్తైన విగ్రహంతోపాటు, జపాన్, మలేషియా,అమెరికా, బాలిలోని అద్భుతమైన గణపతి విగ్రహాలకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇదీ చదవండి: Yoga మైగ్రేన్‌తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలుమహా గణపతి ఆలయం, ఫ్లషింగ్, న్యూయార్క్ (USA)ఉత్తర అమెరికాలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి, ఇది అద్భుతమైన గణేష్ విగ్రహాన్ని కలిగి ఉంది. గణేష్ చతుర్థి సందర్భంగా భక్తులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.గణేష్ విగ్రహం, చాచోఎంగ్సావో (థాయిలాండ్)థాయిలాండ్ ప్రపంచంలోనే ఎత్తైన గణేష్ విగ్రహాలలో ఒకటి. ఈ విగ్రహం 39 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గులాబీ రంగు గణేష్ విగ్రహం, రిలాక్స్డ్ భంగిమలో కూర్చుని, జ్ఞానం , శ్రేయస్సును సూచిస్తుంది.గణేశ మందిరం, టోక్యో (జపాన్)టోక్యోలోని కన్నోన్-జి ఆలయంలోని గణేశ మందిరంలో జపాన్ బౌద్ధ మరియు హిందూ దేవతలతో సాంస్కృతిక సంబంధాలు ప్రతిబింబిస్తాయి. ఇక్కడి విగ్రహాన్ని సంపదకు, విజయానికి సంరక్షకుడిగా భావిస్తారు.బాటూ కేవ్స్, మురుగన్ కౌలాలంపూర్ (మలేషియా)మలేషియాలోని బాటు గుహల వద్ద కొలువుదీరని మురుగన్‌కు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ గుహల ప్రవేశ ద్వారం వద్ద ఒక అద్భుతమైన గణేశ విగ్రహం కొలువుదీరి ఉంటుంది. గణేశ చతుర్థి సందర్భంగా పర్యాటకులు, భక్తులకు ఇది ప్రధాన ఆకర్షణ.గణేశ విగ్రహం, బాలి (ఇండోనేషియా)బాలిలో,ఉబుద్‌లోని ఒక ప్రత్యేకమైన రాతితో చెక్కిన విగ్రహం అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటిగా వెలుగొందుతోంది. ఇది రక్షణ జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. -
హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి సందడి (ఫొటోలు)
-
భక్తి ప్లస్ టెక్ కాంబోలో.. గణపయ్యకు టెక్నో హారం!
ఈసారి గణపయ్యకు టెక్ టచ్‌తో స్వాగతం చెప్పారంటే, ఇక మీ పండుగ వాతావరణం భక్తి ప్లస్ టెక్ కాంబోలో డబుల్ ఆనందంతో మెరిసిపోతుంది.వీఆర్ గణపయ్యతో రద్దీకి గుడ్‌బై!వినాయక చతుర్థి రాగానే ముంబయి లాల్బాగ్చా రాజా ముందు కనిపించే రద్దీ మాటల్లో చెప్పలేనిది. కాని.. ఇప్పుడు బయట అడుగు పెట్టకుండానే, మీ లివింగ్‌రూమ్‌లో కూర్చొని ఆ భవ్య దర్శనాన్ని ఆస్వాదించవచ్చు. అదే ఈ ‘లాల్బాగ్ 360’ వీఆర్ దర్శనం. ఒక్క యాప్‌తో మీ హాల్లో కూర్చునే పూజా గంటలు, పూజారుల మంత్రోచ్ఛారణ, మండప అలంకారాలు అన్నీ కళ్లముందే ప్రత్యక్షం అవుతాయి. ఎడమ వైపు తిప్పితే పూలతో అలంకరించిన మండపం, కుడివైపు తిప్పితే గణపయ్య పాదాల వద్ద నమస్కరిస్తున్న భక్తులు అన్నీ నిజంగానే అక్కడ ఉన్నట్టు అనిపిస్తాయి.ఇదే విధంగా ‘గణేశ్ వీఆర్’, ‘విజయవిధి వర్చువల్ దర్శనం’ లాంటి యాప్‌లు కూడా 360 డిగ్రీల వీడియోలతో పండుగ వాతావరణాన్ని ఇంటికే తీసుకొస్తున్నాయి. వాడటం కూడా చాలా సులభం. మీ ఫోన్ లేదా స్మార్ట్ టీవీలో యాప్ డౌన్లోడ్ చేసి, హెడ్సెట్ లేదా మానిటర్లో ఫుల్‌స్క్రీన్‌లో ఆన్ చేస్తే సరిపోతుంది. లైవ్ టైమింగ్స్, లింకులు అధికారిక వెబ్సైట్లో దొరుకుతాయి.ఒకే టచ్‌తో భక్తి ప్లస్ డీజే మోడ్!గణేష్ మండపం అంటే వెలుగుల వేదిక! అయితే, ఇప్పుడు తీగలు, ప్లగ్‌లు, స్విచ్‌లతో ఇబ్బంది పడే రోజులు పోయాయి. ఒక వైఫై ఎల్ఈడీ బల్బు పెట్టేస్తే చాలు. మీ మండపం క్షణాల్లో ‘సినిమా సెట్’లా మెరిసిపోతుంది. ఉదయం పూజ సమయానికి పసుపు వెలుగు, మధ్యాహ్నం భక్తులు రాగానే ప్రకాశించే తెలుపు వెలుగు, రాత్రి డీజే బీట్ పడగానే గ్రీన్ , బ్లూ, రెడ్ ఫ్లాష్‌లతో మండపం ఫుల్ పార్టీ మూడ్‌లోకి మారిపోతుంది. ఇవన్నీ కేవలం ఫోన్ టచ్‌తోనే! ‘అలెక్సా, డివోషనల్ మోడ్ ఆన్’ అంటే పసుపు, ఎరుపు కాంబినేషన్ రెడీ. వాడటం కూడా సింపుల్. బల్బు పెట్టి, యాప్ డౌన్లోడ్ చేసి, వైఫై కనెక్ట్ చేస్తే సరిపోతుంది. టైమింగ్ సెట్ చేసి, పూజ సమయానికి ఆటోమేటిక్‌గా వెలుగులు వెలిగేలా చేసుకోవచ్చు. విప్రో, ఫిలిప్స్, హెవెల్స్ లాంటి బ్రాండ్లు మంచి ఆప్షన్లు ఇస్తున్నాయి. ఒక్క బల్బు ధర రూ. 600 నుంచి మొదలవుతుంది.ఒక్క బాక్స్‌లో మొత్తం పండుగ! వినాయక చవితి దగ్గర పడుతుంటే, ఇంట్లో అందరికీ ఒకటే టెన్షన్, పూజ సామగ్రిని సర్దుకోవాలి, పత్రి తెప్పించాలి, విగ్రహం తీసుకురావాలి. వీటన్నిటికీ చివరి నిమిషంలో టెన్షన్.. టెన్షన్! కాని, ఈసారి అంతా ఈజీ! ‘ఆరాధ్య గణేశ్ చతుర్థి సంపూర్ణ పూజా కిట్’ చేతిలో ఉంటే చాలు, మీ పండుగ ఏ లోటు లేకుండా చక్కగా పూర్తవుతుంది.ఒక్క బాక్స్‌లోనే పన్నెండు అంగుళాల మట్టి గణపయ్య, ఇరవైఒక్క రకాల పవిత్ర పత్రి, ఒక చెక్క పాలవెల్లి సహా పూజకు కావాల్సినవన్నీ సిద్ధంగా లభిస్తాయి. కేవలం పూలు, పండ్లు, నైవేద్యం బాధ్యత మాత్రమే మీది! ఎవరైనా పూజ విధానం మరచిపోయారా? టెన్షన్ లేదు, చిన్న పుస్తకంతోపాటు, వీడియో గైడ్ కూడా వెబ్సైట్లో రెడీగా ఉంటుంది. పైగా ప్యాకేజింగ్ నుంచి విగ్రహం వరకు అంతా ప్రకృతికి నష్టం లేకుండా పర్యావరణహితంగా ఉంటుంది. ధర కేవలం రూ.1500 మాత్రమే! -
జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)
-
పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాల తయారీ.. ముస్తాబవుతున్న గణనాథులు (ఫొటోలు)
-
శ్రావణం స్పెషల్ ఇంపాక్ట్ ఫెయిర్–మినీ ఎడిషన్
హైదరాబాద్ నగరంలోని వీ హబ్ వేదికగా నిర్వహించిన వినూత్న కార్యక్రమం ‘ఇంపాక్ట్ ఫెయిర్–మినీ ఎడిషన్’ విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ సంప్రదాయం, సృజనాత్మకత, మహిళా వ్యవస్థాపకత– ఆవిష్కరణలను ప్రదర్శించడానికి వీ హబ్ ఆధ్వర్యంలో శ్రావణం స్పెషల్‌గా ‘ఇంపాక్ట్ ఫెయిర్–మినీ ఎడిషన్’ను నిర్వహించింది. మహిళా వ్యవస్థాపకులకు విలువైన అమ్మకాల అవకాశాలు, ప్రత్యక్ష మార్కెట్ లింకేజీలను అందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులకు తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి దాదాపు 30 మంది మహిళా వ్యవస్థాపకులు, స్థానిక చేతివృత్తుల వారు ఒకచోట చేరి వారి కళాత్మక, సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇందులో భాగంగా అద్భుతమైన చేనేత, హస్తకళలు, పండుగ దుస్తులు, నగలు, ప్రామాణికమైన తెలంగాణ ఆహారాలు, స్నాక్స్–స్వీట్లు, గృహాలంకరణ వస్తువులను ఇక్కడ ఉంచారు. వీ హబ్ సీఈఓ సీతా పల్లచోళ్ల మాట్లాడుతూ.. ఇది ఒక ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది మహిళల సంస్థ, మహిళా శక్తి. ఈ సంస్కృతి సమాజ స్ఫూర్తికి ఒక వేడుక అని తెలిపారు. ప్రతి మహిళా వ్యవస్థాపకురాలు తన నేపథ్యం లేదా స్థానంతో సంబంధం లేకుండా ఈ కమర్షియల్ మార్కెట్లకు ప్రాప్యత పొందేలా చూసుకోవడమే తమ లక్ష్యమన్నారు. (చదవండి: Independence Day 2025: ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటే..!) -
సీత్లా భవాని పండుగ : కాపాడే దేవత
లంబాడీ గిరిజనులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే పండుగే... ‘సీత్లా భవాని’ వేడుక. గిరి జన సంప్రదా యంలో లంబాడీలు చేసుకునే తొలి పండుగ కూడా ఇదే. ప్రకృతిని ఆరాధిస్తూ... పంటలను, పశు సంపదను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడు కుంటారు. ఈ పండుగ, బోనాల వేడుకలు ఒకేకాలంలో రావడం గమనార్హం. వర్షాకాలంలో రక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అటు హిందువులూ, ఇటు లంబాడీ గిరిజ నులూ తమ తమ గ్రామదేవతలకు బోనాలు ఎత్తి పూజించి మొక్కులు చెల్లించుకుంటూ ఆ వ్యాధుల బారిన పడకుండా కాపాడమని వేడుకుంటారు. సీత్లా భవాని కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశు సంపద పెరగాలనీ; దూడలకు పాలు సరిపోనుఉండాలనీ, తమ పశువులకు గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా వాటిని కాపాడా లనీ, అటవీ సంపద తరగకూడదనీ సీత్ల తల్లికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ పండుగను వివిధతండాల్లో ఆ తండా ప్రజలు, పెద్ద మనుషులంతా కలిసి ఆషాఢ మాసంలో ఏదో ఒక మంగళవారంఎంచుకొని జరుపుతారు. ప్రతి సంవత్సరం కేవలం మంగళవారం మాత్రమే జరపడం ఆనవాయితీ.ఇదీ చదవండి: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్తండాల సరిహద్దుల్లోని పొలిమేర, కూడలి వద్ద సీత్ల భవాని సాధారణంగా ప్రతిష్ఠితమై ఉంటుంది. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు, మేకలతో; మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అక్కడికి వెళ్తారు. ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడుతారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. దేవతను పూజించే ప్రక్రియలో తండా పెద్ద మనిషి పూజారిగా వ్యవహరించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హం.– నరేష్ జాటోత్, నల్గొండ -
నెల్లూరులో ఘనంగా మొదలైన రొట్టెల పండగ..పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
ఆషాఢం.. వైవిధ్యం
ఆదివాసీ గిరిజన గూడేలు భిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలకు నిలయాలు. ఏటా ఈ గ్రామాల్లో నిర్వహించే ఆషాఢ మాస పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలని.. ఎటువంటి అరిష్టం దరిదాపులకు రాకుండా ఉండాలని వేడుకుంటూ గ్రామ పొలిమేరల్లో శంకుదేవుడికి పూజలు చేస్తూ పూర్వీకుల ఆచార వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. ముంచంగిపుట్టు: అల్లూరి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు. తూచ తప్పకుండా పాటిస్తారు. పూర్వీకులు చూపించిన దిశ నిర్దేశాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. ఇదే కోవకు చెందినది ఆషాఢమాస పండగ. పూరీ జగన్నాథుని రథయాత్ర ముగిసిన తరువాత గ్రామపెద్దలు పండగ తేదీ నిర్ణయిస్తారు. ఈ ప్రకారం గ్రామాల్లో పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.అరిష్టాల నుంచి గట్టెక్కి.. ఆదివాసీ తండాల్లో పూర్వం అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు వేసుకునే సమయంలో దుక్కిటెద్దులు, పెంపుడు జంతువులు, అందరికీ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. ఈ మాసంలో అరిష్టాలు ఎక్కువై ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు సంభవించేవి. వీటి నుంచి బయటపడేందుకు ఆషాడ మాసంలో ఊరి పొలిమేర వద్ద మేక, కోడిని బలిదానం చేసి ప్రత్యేక పూజలు చేసేవారు. అప్పటి నుంచి అన్నీ నష్టాలు తొలగిపోతూ రావడంతో సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్నారు. తరాలు మారినా పూర్వీకుల ఆచార వ్యవహారాలను ఆచరిస్తున్నారు. ఏటా ఈ పండగ చేయడం వల్లే తమకు ఎంతో మేలు జరుగుతోందని ఆదివాసీలు చెబుతున్నారు. గ్రామ పొలిమేరలో.. గిరిజన గ్రామాల్లో పొలిమేరలోని రహదారి పక్కన ఆవు పేడతో అలికి శుద్ధి చేస్తారు. నాలుగు కర్ర పుల్లలతో పందిరి ఏర్పాటు చేసి శంకుదేవుడిని ప్రతిష్టిస్తారు. మామిడి ఆకులతో తోరణాలు కట్టి పందిరి కింద అరటి మొక్కను పాతుతారు. సాగుకు ఉపయోగించే కొత్త విత్తనాలను పందిరిపై చల్లుతారు. అలాగే మట్టితో కుండలు, ప్రమిదలు తయారు చేసి వాటిలో వత్తులు పెట్టి దీపం వెలిగిస్తారు. మట్టితో తయారుచేసి రెండు ఎద్దుల విగ్రహాలకు చెక్క, కర్రతో సిద్ధం చేసిన రెండు చక్రాల బండిని అమర్చుతారు. దీనిని పందిరి ఉత్తర దిక్కుకు పెడతారు. ఇళ్ల వద్ద పనికిరాని పాత తట్టలు, బుట్టలు, చేటలు, చీపుళ్లను తీసుకు వచ్చి దిష్టి తీస్తారు. ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. అనంతరం కోడి లేక మేకను బలి ఇస్తారు. మాంసాన్ని గ్రామంలో ప్రతి ఇంటికి కొద్ది కొద్దిగా పంచుతారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో ఎటువంటి అరిష్టాలు ఎదురు కావని, పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా జరుగుతాయని ఆదివాసీ గిరిజనుల నమ్మకం. ప్రస్తుతం గ్రామాల్లో పండగ ప్రారంభం కావడంతో సందడి నెలకొంది.దోషాలు పోతాయని మా నమ్మకం గ్రామాల్లో ఎటువంటి అరిష్టాలు కలగకుండా ఉండేందుకు ఆషాఢ మాస పండుగను ఏటా జరుపుకుంటున్నాం. జగన్నాథుని రథయాత్ర మొదలైన వారంలో ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. గ్రామ పొలిమేర వద్ద శంకుదేవుడికి పూజలు చేయడం వల్ల అన్ని దోషాలు పోయి మంచి జరుగుతుంది. – బొరిబొరి లచ్చన్న, గిరిజన రైతు, బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలంపూర్వీకుల నుంచి నిర్వహిస్తున్నాం పూర్వీకులు ఆచరించిన సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. నాటి తరం నుంచి నేటి తరం వరకు ఈ ఆషాఢమాస పండగను జరుపుకుంటున్నాం. వ్యవసాయానికి, ఆరోగ్యానికి, గ్రామానికి ఎటువంటి నష్టం జరగకుండా ఈ పండగ నిర్వహిస్తున్నాం. – రెయ్యల మత్స్యరావు, గిరిజన రైతు,బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలం -
గోల్కొండ బోనాలు కోటకు వెల్లువెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
తెలంగాణ బోనం.. సాంస్కృతిక ప్రయాణం..
ఆషాఢమాసంలో బోనాల జాతర ఉత్సవాలకు నగరం సిద్ధమవుతోంది. పాతబస్తీలో ఈసారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇప్పటికే సర్వసభ్య సమావేశం నిర్వహించింది. పాతబస్తీలో బోనాల సమర్పణ అనంతరం నిర్వహించే సామూహిక ఘటాల ఊరేగింపులో ప్రధాన పాత్ర వహించే శకటాలు, కళాకారుల విన్యాసాల కోసం సంబంధిత ఉత్సవాల నిర్వాహకులు పెద్ద ఎత్తున కళాకారులకు ఇప్పటికే బుకింగ్స్ ఇస్తున్నారు.(చదవండి: ఆదివాసీ కోయిల.. ! ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కాస్తా.. ర్యాప్ సింగర్‌గా..)కళాకారుల నృత్య ప్రదర్శనలు.. ఈసారి ఉత్సవాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు హైలెట్‌గా నిలువనున్నాయి. కళాకారులు ప్రదర్శించే హావభావాలను చూసే ప్రతి ఒక్కరూ భక్తిపారవశ్యంతో తన్మయత్వం పొందుతారు. ఘట స్థాపన ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు, అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు తదితర కార్యక్రమాల్లో వివిధ రకాల అలంకరణల్లో, రూపాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరిస్తాయి. పాతబస్తీకి ప్రత్యేకం..నిజాం కాలం నుంచి ఇక్కడి అమ్మవారి దేవాలయాల్లో పూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన బోనాన్ని సమర్పించడం ఆనవాయితీ. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా నగరంలో ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. తెలంగాణ జిల్లాల్లోనే అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు పాతబస్తీ ప్రత్యేకతను చాటుతాయి.ఇతర రాష్ట్రాల కళాకారులకు ఉపాధిగా.. రాష్ట్రంలో జరిగే బోనాల ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడుకు చెందిన కళాకారులు ఎక్కువగా పాల్గొంటారు. నగరంలో బోనాల జాతర ఉత్సవాల్లో కళాకారులు, వినూత్న తరహా సెట్టింగ్స్ కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు. ఈసారి కళాకారులకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీంతో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పాతబస్తీలోని ప్రముఖ దేవాలయాల నిర్వాహకులు కళాకారుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో కొన్ని వందల కుటుంబాల కళాకారులకు ఈ బోనాల జాతర ఉత్సవాలు యేటా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆకట్టుకునే రూపాలు, నృత్యాలు.. బోనాల జాతర ఉరేగింపులో కేరళ పులికళి, భేరీ నృత్యం, గరిగెలు, బేతాళ నృత్యం, ఒగ్గోళ్ల నృత్యం, బోనాలు, కాళికాదేవీ, లక్ష్మీదేవీ, వేంకటేశ్వర స్వామి, పొట్టి పోతరాజులు, సింహరథం, డప్పులోళ్లు, హనుమంతునిలో రాముడు, తయ్యం, దేవ నృత్యం, ఉరుములు, కొమ్ముకొయ్య, జడ కోలాటం, యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి శకటం.. అందులో ఏర్పాటు చేసే మూర్తులు, విజయవాడ కనకదర్గమ్మ దేవాలయ రథం.. అందులో కొలువుదీరే అమ్మవారి వేషధారణలోని కళాకారుల హావభావాలు.. ఇలా ఒకటేంటి పలు రకాల శకటాలు, కళాకారుల నత్యాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
అలరించిన మహా నృత్యోత్సవం..
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ నాట్య శిల్పి ఆర్ట్స్ అకాడమీ 35వ ఉచిత నాట్య శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు రవీంద్రభారతిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత శిక్షణ పొందిన వంద మంది చిన్నారులు మహా నృత్యోత్సవం పేరిట కూచిపూడి, జానపద, దాండియా నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. చిన్నారులకు ఉచితంగా శాస్త్రీయ సంగీత కళలపై శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. అంతకు ముందు అకాడమీ వ్యవస్థాపకులు వాసుకి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రదర్శించిన లైట్ ఆఫ్ బుద్ద నాటకం హైలెట్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు లయన్ సర్దార్ హర్బీందర్ సింగ్, సనత్‌నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్‌రెడ్డి, అకాడమీ డైరెక్టర్ పుష్పలత పాల్గొన్నారు. (చదవండి: విశ్వ వేదికపై.. నాటు పాట..! వైరల్‌గా తెలుగు పాటలు..) -
ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..
కొన్ని పండుగలు ప్రాణాలకే ప్రమాదం అన్నట్లుగా హడలెత్తిస్తాయి. కానీ సంప్రదాయం పేరుతో వాటిని కొనసాగిస్తూనే ఉంటారు. వాటికి అధికారిక మద్దతు కూడా లభిస్తుంటుంది. అలాంటి విచిత్రమైన పండుగే ‘కూపర్స్ హిల్ చీజ్ రోలింగ్ ఫెస్టివల్’. ఈ వేడుక ఇంగ్లాండ్‌లోని గ్లాస్టర్‌షైర్‌లోని బ్రాక్వర్త్ సమీపంలోని కూపర్స్ హిల్‌పై ప్రతి ఏడాది మే చివరి సోమవారం రోజున జరుగుతుంది. ఈ లెక్కన ఈ ఏడాది మే 26న జరుగుతుంది. ఇది ముందు చెప్పుకున్నట్లు కాస్త ప్రమాదకరమైన సంప్రదాయం. ఈ ఉత్సవంలో జరిగే పోటీలో పాల్గొనేవారు దాదాపు 200 గజాల ఎత్తుగల నిటారైన కొండపై నుంచి దొర్లుతున్న డబుల్ గ్లాస్టర్ చీజ్ వీల్ (గుండ్రంగా చక్రంలా ఉంటుంది) వెనుక పరుగుపెట్టాల్సి ఉంటుంది. ఆ చక్రాన్ని కింద వరకూ వెళ్లి ఎవరు అందుకుంటారో వారే విజేత. అసలు ఈ సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో కచ్చితంగా తెలియదు, కానీ ఇది 1826లో మొదటిసారిగా లిఖితపూర్వకంగా ప్రస్తావించారు. అయితే, ఇది కనీసం 600 సంవత్సరాల నాటి సంప్రదాయమని నమ్ముతారు. ప్రస్తుతం, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలు ఈ పోటీలో పాల్గొంటున్నారు. 18 ఏళ్లు నిండితే చాలు ఈ పోటీలో పాల్గొనొచ్చు. కొండ చాలా నిటారుగా ఉండటం వల్ల, చాలామంది బ్యాలెన్స్ కోల్పోయి దొర్లుకుంటూ పడిపోతూ ఉంటారు. అయినప్పటికీ, విజేతగా నిలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కొండ దిగువన స్థానిక రగ్బీ జట్టు సభ్యులు గాయపడిన వారికి సహాయం చేయడానికి వేచి ఉంటారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది వస్తుంటారు. (చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాలిని బ్యూటీ రహస్యం ఇదే..! ) -
జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)
-
గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)
-
వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర (ఫొటోలు)
-
తిరుపతి : రెండో రోజు గంగమ్మ జాతర.. బైరాగి వేషంలో మొక్కుల చెల్లింపులు (ఫొటోలు)
-
Festival: జనాల్లోకి దూసుకొచ్చిన కారు.. 9 మంది దుర్మరణం
ఒట్టవా: ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న ఫెస్టివల్ కాస్తా ఉన్నపళంగా విషాదంగా మారిపోయింది. కెనడాలోని వాంకోవర్ సిటిలో లపూ లపూ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో కారు దూసుకొచ్చింది. ఇందులో 9 మంది దుర్మరణ పాలయ్యారు. కెనడా స్థానిక కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఫిలిపినో కమ్యూనిటీకి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై లపూ లపూ ఫెస్టివల్ వేడుకను చేసుకుంటుంగా ఈ దారుణం సంభవించింది. అయితే ఈ ఘటనలో 9 మంది వరకూ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. భారీ సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనకు కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు కెనడా పోలీసులు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలకు సంబంధించిన వీడియోలు ఆవేదన భరితంగా ఉన్నాయి. Initial reports of several killed and over a dozen injured, after an SUV plowed into a closed-off street filled with people celebrating the Lapu Lapu Festival in Vancouver, Canada. pic.twitter.com/cLQQPfOMCq— OSINTdefender (@sentdefender) April 27, 2025 -
Vishu 2025 విషు అంటే ఏంటి? విషుకణి గురించి తెలుసా?
మలయాళీలు సంవత్సరాదిని విషుగా వ్యవహరిస్తారు. కేరళ, కర్ణాటకలోని తుళునాడు ప్రాంతం, పుదుచ్చేరిలోని మాహే జిల్లా, తమిళనాడులోని అనేక జిల్లాల్లో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళీ లు జరుపుకునే ఉగాది పండుగ విషు. విషును మలయాళ నెల మేడం మొదటి రోజున జరుపుకుంటారు, ఇది సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్లో ఏప్రిల్ 14 లేదా 15న వస్తుంది. అధికారిక మలయాళ క్యాలెండర్ (కొల్లం ఎరా) చింగం నెలతో ప్రారంభమైనప్పటికీ, ఇది కేరళలో సాంప్రదాయ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది.సూర్యుడు మేడం రాశి (మేష రాశి)లోకి మారడాన్ని విషు సూచిస్తుంది. సంస్కృతంలో విషు అంటే సమానం, అంటే పగలు మరియు రాత్రి సమాన సంఖ్యలో ఉండే రోజు లేదా విషువత్తు అని అర్థం. ఇది విష్ణువుకు అంకితమైన కాలమని, భావిస్తారు, అందుకే విష్ణువు ,శ్రీకృష్ణుడిని పూజిస్తారు.ఈ పండుగకు విష్ణు దేవాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా భక్తులకు 'విషు కంజి' లేదా గంజిని ప్రసాదంగా అందిస్తారు. ఇందులో పాపడ్, ఊరగాయ, యాలుక, పచ్చి అరటి,బూడిద గుమ్మడికాయతో చేసిన 'అస్త్రం' అనేది ఉంటుంది. ఇంకా విషు ప్రసాదాల్లో 'కైనీట్టం' ముఖ్యం.విషు అంటే పునరుద్ధరణ, ఆశకు చిహ్నం కూడా. పండుగ ముందురోజు రాత్రి ఇంట్లోని మహిళల్లో పెద్దవయస్కురాలు పచ్చి బియ్యం, కొత్తబట్టలు, బంగారు-పసుపు వన్నెలో ఉండే దోసకాయలు, అరటిపళ్లు, తమలపాకులు, అద్దం వీటన్నిటినీ ‘విషుకణి’ అనే ప్రత్యేక పాత్రలో ఉంచి దైవపూజ నిర్వహిస్తుంది. మర్నాడు ఆమె ముందుగాలేచి వయసుల వారీగా ఇంట్లో అందరినీ నిద్రలేపి, వారి కళ్లు మూసి విష్ణువు ఫోటోలు పువ్వులు, పండ్లు , కూరగాయలు, బట్టలు, బంగారు నాణేలు, దీపంతో నిండిన పాత్ర దగ్గరకు తీసుకొచ్చి అప్పుడు కళ్లు తెరవమంటుంది. ఉదయాన్నే లేవగానే మంగళకరమైన విషుకణిని చూస్తే అంతా శుభమే జరుగుతుందని వారి నమ్మకం. ఈ విష్ణుకణిని శ్రేయస్సు , అదృష్టానికి ప్రతీకగా విశ్వసిస్తారు.సాద్య ప్రత్యేకతే వేరేవిషు కైనెట్టం : పెద్దలు చిన్న కుటుంబ సభ్యులకు సౌభాగ్యం, సౌభాగ్యం కోసం ఆశీర్వచనాలుగా డబ్బు ఇస్తారు.విషు సాద్య : సాద్య అంటే అవియల్, తోరన్, రసం, పాయసం వంటి 20–30 వంటకాలను వడ్డించే గొప్ప శాఖాహార విందు. అరటి ఆకులపై వీటిని వడ్డించే శాఖాహార విందే ఈ పండుగ ప్రత్యేకత. ఇందులో మాంబళ పులిసేరి (మామిడి కూర) వంటి వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి.బాణాసంచా: బాణసంచా కాల్చడం ఒక ప్రసిద్ధ సంప్రదాయం, ఇది వేడుకలకు ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని జోడిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉట్టికొట్టే సంప్రదాయం కూడా ఉంది. సంప్రదాయ వస్త్రధారణ: ప్రజలు కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. మళయాళీల చీరకట్టు, పువ్వులకు వారిచ్చే ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంటుంది. ప్రేమానుబంధం: తెలుగువారు ఉగాదిని ఎలా జరుపుకుంటారో అలాగే మళయాళీలు విషును బంధుమిత్ర సపరివార సమేతంగా జరుపుకుంటారు.చిన్నవారికి కానుకలిచ్చి సంబరపడతారు.సాంస్కృతిక వైవిధ్యం: పంజాబ్ లో బైసాఖి, తమిళనాడులో పుత్తాండు వంటి పండుగలను ఒకే సమయంలో జరుపుకుంటారు. -
ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డులు స్ఫూర్తిదాయకం
సాక్షి, సిటీ బ్యూరో : వ్యాపారం, సాంకేతికత, కళలు, సామాజిక సేవతో పాటు విభిన్న రంగాల్లో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళలను ట్రంప్స్ ఆఫ్ టాలెంట్ (టీఓటీ) ఆధ్వర్యంలో ‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్ –2025’ అవార్డులతో గౌరవించింది. హైటెక్ సిటీలోని అవసా హోటల్ వేదిక జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, వెల్నెస్ అంబాసిడర్ శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు అవార్డులను అందించారు. ఈ వేదిక ద్వారా మహిళల ప్రయాణాన్ని స్ఫూర్తివంతమైన కథలుగా ప్రదర్శించామని ట్రంప్స్ ఆఫ్ టాలెంట్ వ్యవస్థాపకులు మహమ్మద్ ఫయాజ్ తెలిపారు. అవార్డుల జ్యూరీలో లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ ఇండియా సీఈవో శిరీష వోరుగంటి, వీహబ్ సీఈవో సీతా పల్లచోల్ల, ఐబీఎం ఎగ్జిక్యూటివ్ భాగస్వామి అనురాధ ఏ, నోవార్టిస్ కంట్రీ హెడ్ దివ్య బాల్‌రాజ్, తెలంగాణ తొలి గిరిజన మహిళా వాణిజ్య పైలట్ కెప్టెన్ బాబీ ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధిపతి మనీషా సాబూ, అబైరో క్యాపిటల్ సలహాదారు మహంకాళి శ్రీనివాసరావు, ఎడ్యు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫిరోజ్ సైట్ పాల్గొన్నారు. నగరంలో ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ ‘పత్ ఉత్సవాలకు’ వేదికైన ఖాజాగూడ పెద్ద చెరువు రాయదుర్గం : ఒడిశా వాసులు గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడ పెద్ద చెరువు వద్ద సందడి చేశారు. ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ‘పత్ ఉత్సవం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో నివాసముండే ఒడిశా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. మొదట ఇస్కాన్ బృందం వారిచే కృష్ణ పరమాత్మ, రామలీలలపై గానామృతం నిర్వహించగా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రోడ్ రంగోలి మురుజా, ఆతోంటిక్, ఒడియా క్యూసిన్, డిస్ప్లే, ఆర్ట్, పైకా ఆర్ట్, టైగర్ నృత్యాలు వంటివి నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. అనంతరం శంఖనాథాలతో కూడిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓద్రా, దేహం జుంబా నృత్యాలతోపాటు పిల్లల గ్లోబల్ ఆర్ట్స్ డ్రాయింగ్ పోటీలను నిర్వహించగా ఒడిశా వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రత్యేక ఆహా్వనితులుగా ఐపీఎస్ అధికారి సౌమ్యామిశ్రా, సుప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధ పాండ్వా పాల్గొని అందరినీ మరింత ఉత్సాహపరిచారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరంలోని ఒడిశా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ రగ్బీ జాతీయ స్థాయి సభ్యత్వం ఇండియన్ ఫుట్‌బాల్ యూనియన్ నుంచి తెలంగాణ అసోసియేషన్‌కు సభ్యత్వం అధికారికంగా ప్రకటించిన ఐఆర్ఎఫ్యుతెలంగాణలో బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ తరహాలో రగ్బీ క్రీడ కూడా అభివృద్ధి చెందనుందని తెలంగాణ రగ్బీ అసోసియేషన్ వెల్లడించింది. ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ నుంచి శాశ్వత సభ్యత్వం కోసం అధికారికంగా గుర్తింపు లభించిందని సంస్థ ప్రకటించింది. ఈ నూతన అనుబంధంతో తెలంగాణ రగ్బీ అసోసియేషన్ ‘ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్’ కింద శాశ్వత సభ్యులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలనూ అందించనున్నట్లు నూతన అధ్యక్షులు, లైఫ్‌స్పాన్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ నరేంద్ర రామ్ తెలిపారు. ఈ అధికారిక గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా రగ్బీని మెరుగుపరచడానికి, జాతీయ పాలక సంస్థతో సన్నిహితంగా సహకరించడానికి అసోసియేషన్ అనుమతిస్తుందని పేర్కొన్నారు. నూతన అధ్యక్షునిగా 2028 వరకూ మూడేళ్ల పాటు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే శక్తివంతమైన రగ్బీ సంఘాన్ని సృష్టించడానికి కలిసి పనిచేయనున్నామని తెలిపారు. ఆకట్టుకున్న మార్షల్ ఆర్ట్స్ వైశాఖీ ఉత్సవాల సందర్భంగా సాయంత్రం నగర కీర్తన్ పేరిట ఊరేగింపు నిర్వహించారు. అమీర్‌పేట గురుద్వారా నుంచి ప్రారంభమైన ఊరేగింపు గ్రీన్‌ల్యాండ్స్, క్యాంపు కార్యాలయం, పంజాగుట్ట, అమీర్‌పేట మీదుగా గురుగ్రంథాన్ని, సిక్కు సంప్రదాయ ఆయుధాలను ప్రదర్శనంగా ఊరేగింపు నిర్వహించారు. సిక్కు యువతీ, యువకులు చేసిన మార్షల్ ఆర్ట్స్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గురుగోవింద్‌సింగ్ వంశపారంపర్యంగా వస్తున్న ఐదు అరుదైన గుర్రాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా గురుగ్రంథానికి పూజలు చేశారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
భాగ్యనగరంలో ప్రవాసీ ఒడియా ఫెస్టివల్..!
ఒడిశా వాసులు గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడ పెద్ద చెరువు వద్ద సందడి చేశారు. ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ‘పత్ ఉత్సవం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో నివాసముండే ఒడిశా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. మొదట ఇస్కాన్ బృందం వారిచే కృష్ణ పరమాత్మ, రామలీలలపై గానామృతం నిర్వహించగా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రోడ్ రంగోలి మురుజా, ఆతోంటిక్, ఒడియా క్యూసిన్, డిస్ప్లే, ఆర్ట్, పైకా ఆర్ట్, టైగర్ నృత్యాలు వంటివి నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. అనంతరం శంఖనాథాలతో కూడిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓద్రా, దేహం జుంబా నృత్యాలతోపాటు పిల్లల గ్లోబల్ ఆర్ట్స్ డ్రాయింగ్ పోటీలను నిర్వహించగా ఒడిశా వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఐపీఎస్ అధికారి సౌమ్యామిశ్రా, సుప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధ పాండ్వా పాల్గొని అందరినీ మరింత ఉత్సాహపరిచారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరంలోని ఒడిశా వాసులు పాల్గొన్నారు. (చదవండి: సరికొత్త మ్యూజిక్ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!) -
అంతర్జాతీయ బాలల నాటకోత్సవం.. ముఖ్య అతిథిగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా
నాటకరంగంలో బాల బాలికల ప్రతిభను పెంపొందించేందుకు అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం నిర్వహిస్తున్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రముఖ నటనా శిక్షణ సంస్థ "నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా" హైదరాబాద్‌లో మొదటిసారిగా ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, నటుడు అనీష్ కురువిల్ల, డైరెక్టర్లు వినయ్ వర్మ, వెంకట్ గౌడ, రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కోల్ కతా, భోపాల్, కేరళ ప్రాంతాలతో పాటు నేపాల్, జపాన్ తదితర దేశాల్లోని కళాకారులు, నాటక బృందాలు సైతం పాల్గొంటున్నాయి.ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ రవీంద్రభారతి ఆడిటోరియంలో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. థియేటర్, స్టోరీ టెల్లింగ్, నాటక ప్రదర్శనలతో చిన్నారులను అలరించే ఓ అద్భుతమైన వేదికగా ఈ నాటక ఉత్సవం నిలవనుంది. కొత్తతరం కళాకారుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలను పెంపొందించే ఈ వేదికపై వీక్షకులను మంత్రముగ్ధులను చేసే నాటకాలు ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. -
West Bengal: నవమి వేడుకల్లో కత్తులు తిప్పిన బీజేపీ నేతలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఈ రోజు(ఆదివారం) శ్రీరామ నవమి వేడుకలు(Sri Rama Navami celebrations) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా జైశ్రీరాం నినాదాల నడుమ శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో రోడ్లపై భక్తజన సందోహం కనిపిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఆయుధ పూజలు నిర్వహించారు. రోడ్లపై కత్తులు తిప్పుతూ కనిపించారు. బీజేపీ నేత చంద్రశేఖర్ బావన్కులే.. మమత సర్కారుపై పలు ఆరోపణలు చేశారు. సీఎం మమతా బెనర్జీ రామనవమి వేడుకలను అడ్డుకుంటున్నారని, శోభాయాత్రలకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకే జనం మమతా సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఘోరువై శ్రీరామనవమి సందర్భంగా దుర్గాపూర్‌లోని చండీదాస్ బజారులో ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన కత్తులను గాలిలో తిప్పుతూ, జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మాల్డాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల నిర్వాహకులు భక్తులకు మిఠాయిలను పంచిపెట్టారు. బీజేపీ నేత శుభేందు అధికారి నందీగ్రామ్‌లోని సోనాచురాలో నూతన రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ కోల్‌కతా సెంట్రల్ ఎవెన్యూ(Kolkata Central Avenue)లోని రామాలయంలో జరిగిన పూజలలో పాల్గొన్నారు.ఇది కూడా చదవండి: Manipur: నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్ -
ఉగాది లుక్.. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
హ్యాపీ ఉగాది.. అమ్మ చేసిన పచ్చడిని ఆస్వాదించిన జగపతి బాబు
టాలీవుడ్ నటుడు జగపతిబాబు తనదైన పాత్రలతో టాలీవుడ్లో దూసుకెళ్తున్నారు. గతేడాది పుష్ప-2లో మెప్పించిన జగపతి.. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు గాటి, జాట్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు జగ్గు భాయ్.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికీ టచ్‌లోనే ఉంటారు. సరదా పోస్టులతో అలరిస్తుంటారు. ఇటీవల ఆమనితో కలిసి ఓ మూవీ సెట్లో సరదాగా తన సినిమా శుభలగ్నం సీన్‌ను అందరికీ గుర్తు చేశారు. మళ్లీ అమ్మేయడానికి మేకప్ వేస్తున్నావా? అంటూ ఆటపట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా తన మాతృమూర్తితో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అమ్మ చేతులతో చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. అమ్మతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు జగపతి బాబుకు ఉగాది శుభాకాంక్షలు చెబుతున్నారు.Manchivallandharikey ughaadhi subhakhankshalu… pic.twitter.com/Tc0Vq48YfT— Jaggu Bhai (@IamJagguBhai) March 30, 2025 -
షడ్రుచుల ఉగాదికి..ప్రకృతే పరవశించేలా ఈ చేనేత చీరల్లో మెరుద్దాం..!
పచ్చని తోరణాలు.. షడ్రుచుల ఆస్వాదన.. సంప్రదాయ వస్త్రధారణ ఉగాదికి స్వాగతం పలుకుతూ కొత్త ఉత్సాహాన్ని మదికి మోసుకువస్తాయి. చేనేత చీరలు, ఎంబ్రాయిడరీ సొగసులు వాటి రంగుల హంగులు ప్రకృతి పరవశించేలా పండగకు మరింత శోభను తీసుకువస్తాయి. ముఖ్యంగా పసుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు రంగులు పండగ కళను రెట్టింపుగా మన కళ్లకు కడతాయి. చేనేత కళపండగ నాడు కళను రెట్టింపు చేసే అలంకరణకు ప్రాముఖ్యత ఇస్తుంటారు. అయితే, అందుకు పెద్ద హడావిడి లేకుండా మనవైన చేనేతలలో కాంతిమంతమైన రంగులున్న చీరలను ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో కంచిపట్టు చీరల నుంచి కలనేత వరకు అన్నీ పండగను వెలిగించేవే.సహజమైన రంగులుప్రకృతి నేపధ్యంగా ఉగాది జరుపుకుంటారు కాబట్టి పసుపు, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు రంగుల కాటన్, తెలుపు, ఎరుపు కాంబినేషన్, పింక్ కలర్ టస్సర్, సిల్క్ చీరలు ప్రత్యేక ఆకర్షణతో ఆకట్టుకుంటాయి. డిజైన్లుచెక్స్, లైన్స్‌తో ఉన్న డిజైన్లు, మెరుపులు లేకుండా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్, సహజంగా అనిపించే పెయింటింగ్స్ ఈ పండగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇతర అలంకరణలు..చీరలకు లాంగ్ స్లీవ్స్ బ్లౌజులు, టెంపుల్ జ్యువెలరీ లేదా థ్రెడ్, టెర్రకోట జ్యువెలరీ బాగుంటాయి. పసుపు, ఎరుపు కాంబినేషన్ ప్లెయిన్ గాజులు, సహజంగా అనిపించేలా తక్కువ మేకప్ ప్రత్యేకతను చూపుతుంది.శిరోజాల అలంకరణలో జడ, కొప్పులు, పువ్వులకు ప్రాధాన్యమిస్తే పండగ ప్రకృతి కళతో ఆకట్టుకుంటుంది. (చదవండి: అందంగా ఉండాలంటే..సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి..!) -
వెరైటీ పండుగ: ‘లాస్ ఫల్లాస్' బొమ్మలను తయారు చేసి మరీ..!
ప్రపంచ బొమ్మల ప్రియులకు ‘లాస్ ఫల్లాస్’ పండుగ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. ఇది స్పెయిన్ లోని వాలెన్సియాలో జరిగే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ వేడుక. ఇది ప్రతి ఏడాది మార్చి 15 నుంచి 19 వరకు జరుగుతుంది. ఈ పండుగలో ప్రధానంగా భారీ కార్టూన్లాంటి బొమ్మలను తయారు చేసి, వాటిని ప్రదర్శిస్తారు. ఆ బొమ్మలను అక్కడివారు ‘ఫల్లాస్’ అని పిలుస్తారు. పండుగ చివరిరోజున ఈ బొమ్మలను తగలబెడతారు.ఫల్లాస్ల తయారీనే ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. చెక్క, కార్డ్బోర్డ్, కాగితం, స్టెరోఫోమ్ వంటి మండే పదార్థాలతో, స్థానిక కళాకారులు ఏడాది పొడవునా శ్రమించి, వీటిని తయారు చేస్తారు. ఈ బొమ్మల్లో హాస్యం, వ్యంగ్యం, సమకాలీన సంఘటనలను ప్రతిబింబించే అంశాలు ఉంటాయి. ఈ బొమ్మల ప్రదర్శనలో పోటీలు కూడా జరుగుతాయి. ఈ ఫెస్టివల్ జరిగే ఐదురోజుల్లో మధ్యాహ్నం పూట, రాత్రి పూట కనుల విందుగా బాణసంచా కాలుస్తారు. చివరి రోజైన మార్చి 19న జరిగే బొమ్మల దహనాన్ని ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. దాన్ని ‘లా క్రెమా’ అని పిలుస్తారు. మొదటిగా పెద్దలు తయారు చేసిన బొమ్మలు కాల్చి, తర్వాత పిల్లల బొమ్మలను కాలుస్తారు. అలా కాల్చడంతో చెడు దహనమైందని భావిస్తారు. ఈ పండుగలో సంగీత కార్యక్రమాలు, సంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, బహిరంగ భోజనాలు, వీథుల్లో పలు బృందాల కవాతులు.. అక్కడి కళా సాంస్కృతిక పరంపరకు ప్రతీకగా నిలుస్తాయి. (చదవండి: ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..! శాస్త్రవేత్తలకే అంతుపట్టని మిస్టరీ అది..) -
Holi 2025: హోలి సెలబ్రేషన్స్‌లో బుల్లితెర తారలు (ఫోటోలు)
-
హోలీ అంటే రంగుల పండుగేనా..? కాముని పూర్ణిమ అని ఎందుకంటారు..?
'హోలీ' అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు. కానీ ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది. ఈ పండుగ మహాభారతకాలం నుంచే వాడుకలో ఉంది. “హోళీక” అను రాక్షస దేవత బ్రహ్మ సృష్టించిన రావణ బ్రహ్మ సోదరి. ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు. సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవంతులవుతారుని ప్రశస్తి. ఈ హాలీ పండుగ నేపథ్యంలో అందుకు సంబంధించి.. ప్రాచుర్యంలో ఉన్న పలు కథనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.మహాభారతకాలంలో “బృహద్రధుడు” అను ఒకరాజు ఉండేవాడు. ఆ రాజులకు ఇరువురు భార్యలు. వారికి సంతానం లేకపోవుటచే హోళికను పూజించమని చెప్పారట. వారు హోళికారాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకుని పూజలు చేశారట. వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది. ఇరువురు భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును రెండు భాగములుగా చేసి భుజించారట. దాంతో వారికి సగం-సగం శరీరభాగాలతో శిశువులు కలిగారట. వారు అలా శిశువులను చూసి తట్టుకొనలేక ఆ రెండు శరీర భాగములు సంధిచేసి (అనగా అతికించి) ఒక్క ఆకారంగా చేశారట. ఆ శరీరమే జరాసంధుడుఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే..ఈ హోలీ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. 'హోలీ' అంటే 'అగ్నిపునీత' అని అర్థం. ఈ పండుగ ప్రతి ఏడాది ఫాల్గుణమాసం పౌర్ణమిరోజున వస్తుంది. కనుక ఈ పండుగను 'హోళీ', కామునిపున్నమి', 'డోలికో త్సవం' అని రకరకాలుగా పిలుస్తారు. హోలీ అంటే అసలు తత్త్వం మరచిపోయి కాలాను గుణంగా రంగులపండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటుపడ్డారు. కానీ భారతీయ సాంప్రదాయంలో ఈ పండుగ అసలు ప్రాశస్త్యం తెలుసుకుందాం. దీనికి పురాణాల ప్రకారం ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. 'హిరణ్యకశివుడు' రాక్షసరాజు, అతని కుమారుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు కొడుకు విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతాడు.కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామ స్మరణతోనే తన తోటి విద్యార్ధులతో విద్యను అభ్యసించుచూ హరిభక్తిలో లీనమవుతాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుడు తన పుత్రుని బ్రతిమిలాడి, బుజ్జగించి హరిభక్తిని విడనాడమని నచ్చచెప్పి చూస్తాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమార్ధమని చెప్పి తండ్రిమాటను ఖతరు చేయడు. ఇక్కడ హిరణ్యకశిపుడు హరివైరి. కనుక హరిని సేవించే తన కుమారుడిని తనకు శతృవుగా భావించి ప్రహ్లాదుని అంత మొందించాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఉద్దేశ్యంతోనే తన సేవకులను పిలిచి పిల్లవాడిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం. లోయలో పడ చేయడం, పాములతో కరిపించడం వంటి దారుణాలు చేయిస్తాడు. కానీ ఆ సమయంలో కూడా హరిభక్తివీడక 'నారాయణ' నామస్మరణచేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. దీంతో ప్రహ్లదుడికి విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలుగదు.హోళికాదహనం ఎందుకంటే..అది గమనించిన హిరణ్యకశిపుడు తనసోదరి హోళికను పిలిపిలిపిస్తాడు. ఎందుకంటే హోళికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువ' ఉంటుంది. ఆ శాలువ ఆమె ఒంటిమీద ఉన్నంతవరకు మంటలు ఆమెను అంటుకోవు. అందువలన హిరణ్యక శిపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు."అమ్మా! హోళికా! నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని చితిమీద కూర్చో! నీవు శాలువా కప్పుకో. నీకు మంటలు అంటవు. ప్రహ్లాదుడు కాలి బూడిదవుతాడు అని చెబుతాడు. ఆమె అన్న చెప్పి నట్లుగా చితి పేర్చుకుని ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండ బెట్టుకుని, తాను మాత్రం శాలువాను కప్పుకుని చితికి నిప్పు పెట్టుమంటుంది.అత్త ఒడిలో కూర్చున్న ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా నారాయణనామ స్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయచే హోళిక శరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాదుని శరీరం మీదకి వచ్చినట్లు చేస్తాడు. అప్పుడు హోలిక బూడిద అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. ఆ రోజు హోళిక దహనం కావడంతో..ఈనాటికీ చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో పాత కర్రలతో మంటలు పెట్టి 'హోళికాదహనం' అని జరుపుకుంటారు. రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమైందన్న సంతోషంలో జరుపుకొనే పండుగ ఇది.కాముని పున్నమి అని ఎందుకంటారంటే..మరొకగాథ ప్రకారం.. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది.. మదగర్వంతో దేవతలను బాధించుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకొనలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు. తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు. కానీ శివుడేమో విరాగిలా స్మశానాలలో తిరుగుతూ ఉంటాడు. కనుక ఎలా గైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్ధించి పార్వతిని ఒప్పించి శివకల్యాణం జరిగేటట్లు చూడమని చెబు తాడు.విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతనివద్దకు మన్మథుడుని పంపుతారు ఋషులు. శివునిపై మన్మథుడు కామమును ప్రేరేపించే పూలబాణం వేయించుతారు. ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికారమును కలిగించగా.. ఆయన కోపంలో మన్మథుడుని చూశాడు. ఆ సమయానికి మన్మథుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకునే ఉండటం గమనించి పట్టరాని కోపంతో తన మూడవకన్ను తెరుస్తాడు.ఆ సమయంలో శివుని కంటి నుంచి సూర్యుని కిరణాలలో ఉన్న ఏడురంగుల కాంతితో మిళితమైన ఆ భగభగ మంటలధాటికి మన్మథుడు భస్మమైపోతాడు. అది గమనించిన మన్మథుని భార్య రతీదేవి శివుడిని ప్రార్ధించగా కామదేవుడైన మన్మథుడుని తిరిగి బతికించాడు. కానీ భౌతికంగా కనిపించడని, భౌతికకామం కంటే నిజమైన ఉద్రేకపూరితమయిన ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియజేస్తాడు. ఆ ఏడురంగుల మంటలకు గుర్తుగా రంగుల పండుగలా ఈ హోలీని జరుపుకుంటారు.రంగులు ఎందుకు పులుముకుంటారంటే..శ్రీ కృష్ణునికి సంబంధించిన మరొక విషయంకూడా ఈ హోలీ పండుగకు సంబంధించింది. బాలకృష్ణుని ఫాల్గుణమాసం పౌర్ణమిరోజునే ఊయలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అందువలన పశ్చిమబెంగాల్లో ఈ పండుగరోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలోని వేసి 'డోలోత్సవం' జరుపుతారు. అందుకనే డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది. ఈ హోలీ పండుగరోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడట.కృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో 16 రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. "రంగ పంచమి" రోజున శ్రీకృష్ణునికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం, రాధ శరీరం ఎరుపు వర్ణం గురించి ఫిర్యాదుచేశాడట. అందుకని కృష్ణుని తల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందట. అందువలన అందరూ హోళీ పండుగ రోజున రంగులు పులుముకుంటారని పురాణ వచనం.పూరీ జగన్నాధ్ జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు. మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను దహనం చేసి, వీధులలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంటలు వేస్తారు. కాశ్మీరులో సైనికులు రంగు రంగుల నీళ్ళను చల్లుకుంటూ పండుగను జరుపుకుంటారు. ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపికలను ఆటపట్టించాడట. అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట. అప్పటినుండి హోళీ పండుగను 'లార్మోర్' అనే పేరుతో జరుపుకుంటారు.కవుల మాట్లలో హోలీ .."విలాసానాం సృష్టికర్రీ హోలికా పూర్ణిమా సదా"కాళిదాస మహాకవి ఈ హోళీ పండుగను వర్ణించుచూ సూర్యకాంతిలోని ఏడురంగుల కలయిక హోళీ అన్నాడట. రంగులు అంటే రాగరంజిత భావానలు అని అర్ధం. అల్లసాని పెద్దన పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నాడు-"వెలగడిమి నాడి వెన్నెల అలవడునేగాది బోయెన అమవస నిశితిన్" అంటే పౌర్ణిమనాటి వెన్నెలను విడిచి బెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్యవరకు కూడా వెలుగునుంచుకోవాలని... అలాగే జీవితంలో పండుగల ద్వారా మనం పొందే ఆనందం, మానసిక ఆనందంగా మలచుకోవాలని పెద్దనగారి ఉద్దేశ్యం. ఏదీఏమైనా మన భారతీయ పండుగలు గొప్ప ఆధ్యాత్మికత తోపాటు ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని అందిస్తాయనడంలో అతిశయోక్తి లేదు కదా..!.(చదవండి: ఎపుడూ వైట్ డ్రెస్సేనా? కలర్ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా!) -
Holi 2025 : రంగుల పండుగ, షాపింగ్ సందడి షురూ!
నగరంలో హోలీ సందడి మొదలయ్యింది. ఈ నెల 14న పండుగ సందర్భంగా ఇప్పటికే నగరంలోని పలు దుకాణాల్లో హోలీ వేడుకలకు సంబంధించిన వివిధ రకాల సామగ్రిని కొనుగోలు చేయడానికి బేగం బజార్ వచ్చిన కొనుగోలుదారులు, మహిళలతో సందడి వాతావరణం నెలకొంది. హోలీ రంగుల కేళీ. చక్కటి సంగీతం, కుటుంబం , స్నేహితులతో మంచి సమయం గడపటం, చక్కటి స్వీట్లు. రెండు రోజుల వేడుకల కోసం సన్నాహాలు వారాల ముందుగానే షురూ అయిపోతాయి. రంగుల పొడులు (గులాల్), వాటర్ గన్లు , స్వీట్లను కొనుగోలు చేసే వ్యక్తులతో మార్కెట్లు నిండిపోతాయి. రాధా కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగల్లో మరో ముఖ్యమైన పండుగ. హోలీ అంటే రంగుల పండుగ. ఫాల్గుణ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. పౌర్ణమి రాత్రి హోలికా దహనం చేస్తారు. మరునాడు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకలను ఎంజాయ్ చేస్తారు. దీనిని ధూలేడి పండుగ అని అంటారు.హోలీ పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా. వసంతం రాకను తెలియ చెప్పే పండుగ. భారతదేశం వ్యాప్తంగా హోలీని గొప్పగా జరుపుకుంటారు. ఒక్కోప్రాంతంలో ఒక్కోలా దీనిని చేసుకుంటారు. శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర, బృందావనంలో హోలీకి ప్రత్యేక ప్రాధన్యత ఉంది. మేజర్‌గా అన్ని చోట్ల రంగులతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఆర్గానిక్ కలర్స్‌నే వాడదాంహోలీ ప్రధానంగా రంగుల చుట్టూ ఉంటుంది. అందుకే దీనిని ఆడేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పర్యావరణానికి, మన చర్మానికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలంటే సేంద్రీయ, సహజమైన రంగులు ఎంచుకోవడం ఉత్తమం. అలాగే స్నేహితులతో హోలీ ఆడేటపుడు అప్రమత్తంగాఉండాలి. ఎక్కువగా తిరగకుండా, హైడ్రేటెడ్‌గా ఉండాలా జాగ్రత్తపడాలి. జుట్టుకు నూనె రాస్తే రంగులు ఈజీగా వదిలిపోతాయి. కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి. సన్‌స్క్రీన్ వాడితే మంచిది. -
'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడ అడుగుపెట్టారో..
శరవేగంగా పరుగులు తీసే గుర్రాలను అధిరోహించి, ఒకరిపై మరొకరు ఈటెలతో కలబడే ఆ దృశ్యాన్ని చూస్తే, అక్కడేదో యుద్ధం జరుగుతోందని ఎవరైనా పొరబడతారు. నిజానికి అది యుద్ధంకాదు, అక్కడి ప్రజలు జరుపుకొనే సంప్రదాయ పర్వదినం. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని సుంబా దీవిలో జరిగే ఈ పండుగ పేరు ‘పసోలా’. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పండుగను పంటకాలానికి ప్రారంభ సూచికగా జరుపుకొంటారు.పూర్వీకుల ఆత్మశాంతి కోసం, కుటుంబాల మధ్య అనుబంధాలను బలపరచుకోవడానికి, మూలాలను కాపాడుకోవడానికి ఈ పండుగ ఒక మార్గమని స్థానికులు చెబుతారు. ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టం ఈటెల పోటీ. సత్తా ఉన్నవారంతా బరిలోకి దిగి, గుర్రాల మీద స్వారీ చేస్తూ, ప్రత్యర్థులతో కలబడతారు. ఎదురుగా దూసుకొచ్చే ఈటెలను తప్పుకోవడం ఒక ఎత్తయితే, గురిచూసి ఎదుటివారిని దెబ్బతీయడం మరో ఎత్తు. యుద్ధాన్ని తలపించే ఈ పోటీల్లో చాలామందికి గాయాలవుతుంటాయి.పసోలా అనే పదానికి సుంబా స్థానిక భాషల్లో ‘ఈటె విసరడం’ అని అర్థం. ఈ పోటీల్లో వినియోగించే ఈటెలను ‘హోలా’ అని పిలుస్తారు. ఈ పండుగ వెనుక పురాతన చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం, పసోలా పండుగ ఆకాశంలో ఒకరితో ఒకరు పోరాడిన రెండు శక్తిమంతమైన ఆత్మల కథ నుంచి మొదలైందట! ఆ ఆత్మల సంఘర్షణ ఫలితంగా భూమిపై ఈటెల వర్షం కురిసిందట!. ఈ పౌరాణిక గాథ ప్రేరణతోనే ఈ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుక కోసం గుర్రాలను పెంచడాన్ని గౌరవంగా, హోదాచిహ్నంగా భావిస్తుంటారు. పనికట్టుకుని ఈ పోటీలో పాల్గొనే పోటీదారులు తమ గుర్రాలను తామే పెంచుకుని, రోజుల తరబడి సాధన చేసి మరీ బరిలోకి దిగుతుంటారు. ఈ పోటీని చూడటానికి పెద్దసంఖ్యలో పర్యటకులు కూడా పోటెత్తుతారు. అడుగుపెడితే శిలైపోతారుభూమిపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఉత్తర టాంజానియాలో ఉండే నాట్రాన్ సరస్సు ఒకటి. ఇందులోని నీరు నెత్తుటిలా ఎర్రగా ఉంటుంది. సరస్సంతా నెత్తుటి మడుగులా కనిపిస్తుంది. ఈ సరస్సును దయ్యాలు సృష్టించాయని, ఆ సరస్సులోకి మనుషులు గాని, జంతువులు గాని దిగితే, రాళ్లుగా మారిపోతారని స్థానికులు చెబుతుంటారు. అందుకే, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ అక్కడ తిరగడానికి సాహసించరు. శాస్త్రవేత్తలు ఈ సరస్సును పరిశీలించి, ఈ సరస్సు నీటిలో సోడియం కార్బొనేట్, నైట్రో కార్బొనేట్ ఎక్కువగా ఉండటంతో, ఇందులోని నీరు ప్రాణాంతకంగా మారిందని తేల్చారు. ఈ సరస్సులోకి మనుషులు సహా ప్రాణులేవైనా వెళ్తే, ఇలా రాళ్లలా గడ్డకట్టిపోవడానికి గల కారణాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోయారు. (చదవండి: గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!) -
'గోచీ పండుగ'..ఎందుకోసం నిర్వహిస్తారో తెలిస్తే షాకవ్వుతారు..!
వినడానికి వింతగా; అనడానికి విడ్డూరంగా ఉన్నా.. కనడానికి కన్నులవిందుగా ఉంటుందా వేడుక. పేరులో ‘గోచీ’ ఉండొచ్చు కాని, పండగలో పాల్గొనేవారు మాత్రం నిండుగా సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోతారు. సంతానోత్పత్తికి సంకేతంగా నిర్వహించే ఈ పర్వదినంలో ఆబాలగోపాలానికి అవకాశం లేదు. పెళ్లిళ్లయిన, పెళ్లీడుకొచ్చిన స్త్రీ పురుషులు మాత్రమే అర్హులు. ఆశ్చర్యంగా అనిపించే ఆ వేడుక పేరే ‘గోచీ’ పండుగ. ఇంతకీ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది? ఏమిటా వేడుక విశేషాలు? తెలుసుకోవాలనుందా, అయితే ఇది చదివేయండి. శిశుజననం.. వారికి పండుగదేవభూమిగా భాసిల్లే హిమాచల్ ప్రదేశ్ దేశంలోని అగ్రగామి పర్యాటక ప్రాంతాల్లో ఒకటనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో సింహభాగం మైదాన ప్రాంతం కంటే పర్వత శ్రేణుల్లోనే ఉంటుంది. సముద్ర మట్టానికి సగటున 50 మీటర్ల ఎత్తున ఉండే ఆవాసాలే అధికం. ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంత వాసులే! 2016 నాటికి 99.5 శాతం విద్యుద్దీకరణ జరిగిన రాష్ట్రంగా నమోదైంది. అంతేకాదు 2017 సర్వే ప్రకారం అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా ఖ్యాతికెక్కింది. అయితే సంతానోత్పత్తి విషయంలో మాత్రం వెనుకబడింది. 2014కు ముందు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.9గా ఉండేది. 2015–16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆ రేటు 1.7కు పడిపోయింది. ఇక 2019–21 జాతీయ నివేదిక ఆధారంగా ఆ రేటు మరింత దిగజారి 1.5గా నమోదైంది. ఇక ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఈ రేటు మరింత క్షీణించింది. బహుశా ఈ పరిణామాలే పర్వత శ్రేణుల్లోని లోయల్లో నివసించే గిరిజనులు గోచీ పండగను మరింత ఘనంగా నిర్వహించేందుకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఇక్కడి లాహోల, స్పితి జిల్లాల్లోని చంద్, భాగ్ లోయల్లోని గిరిజనులు సంతానప్రాప్తిని అదృష్టంగా భావిస్తారు. అందుకు ప్రతీకగా శిశువు జన్మించిన సందర్భంలో ఊరంతా ఏకమై ఉత్సవం నిర్వహిస్తారు. ఎవరికైతే బిడ్డ పుట్టాడో ఆయా కుటుంబాలు గోచీ ఉత్సవానికి సంకల్పిస్తాయి. ఏటా మాఘ మాసంలో ఈ పండగ జరుపుకొంటారు. స్థానిక గిరిజన తెగల ప్రజలు చలిమంటల చుట్టూ చేరి, స్త్రీ పురుషులు వేర్వేరుగా నృత్యాలు చేస్తూ పండగను ప్రారంభిస్తారు.లక్ష్యం చేరిన బాణమే సంతానానికి సంకేతంగహర్ లోయలో పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలున్నాయి. వేర్వేరు తండాల్లో ఒక్కో రీతిన ఈ ఉత్సవం నిర్వహిస్తారు. మగబిడ్డ పుడితే ఓ గ్రామం, ఆడ బిడ్డ జన్మిస్తే ఇంకో గ్రామం ఇలా ఒక్కొక్కరు గోచీ పండగ నిర్వహిస్తారు. పండగకు ఒకరోజు ముందు గ్రామపూజారి విల్లుబాణం పట్టుకుని ఊరంతా తిరిగి స్థానిక గ్రామదేవతకు ప్రార్థన చేస్తాడు.ఆ తర్వాత బిడ్డ పుట్టిన ఇంటిని సందర్శిస్తాడు. పండగ రోజు ఉదయాన్నే ఊరంతా సమావేశమై ఎలా ముందుకువెళ్లాలో నిర్ణయిస్తారు. పర్వదినం సందర్భంగా సత్తు పిండితో శివలింగాన్ని చేసి, దానికి పూజలు చేస్తారు. ఈ రూపాన్ని స్థానికులు ‘యుల్లా’ దేవత అని పిలుస్తారు. ఊరంతా కలియతిరిగి ఓ కూడలిలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారు. దేవతారా«ధన అనంతరం విలువిద్య ఆట ఆడతారు. పెళ్లైన మగవారికి మాత్రమే ఇందులో ప్రవేశం. నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని తాకిన బాణాల సంఖ్య ఆధారంగా ఆ గ్రామానికి రానున్న కాలంలో అంతమంది శిశువులు జన్మిస్తారని వీరి నమ్మకం. లక్ష్యం చేరిన బాణాల సంఖ్య పదికి దాటితే చాలు వీరి ఆనందానికి అవధులుండవు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తారు. సంప్రదాయ వంటకాలతో అందరూ సహపంక్తి భోజనాలు చేస్తారు. ఆడపిల్లతో అదృష్టమని..ఈసారి భాగ్ లోయలోని పుకార్ గ్రామం ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో ఇక్కడి వారు కేవలం మగబిడ్డలు పుడితేనే గోచీ పండుగ జరిపేవారు. కాని, ఈసారి ఆడ శిశువు పుడితే ఘనంగా వేడుక నిర్వహించడం విశేషం. తమ ఇంట అమ్మాయి పుడితే అదృష్టంగా భావించారు పుకార్ గిరిజనులు. తాజాగా ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజులు ఉత్సవాన్ని జరిపారు. ‘తంగ్జన్’గా పిలిచే గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పూజారి బిడ్డ తల్లిదండ్రులను ఆశీర్వదించాడు. అనంతరం బారసాల (తొట్టి పండగ) నిర్వహిస్తారు. అయితే ఈ సందర్భంగా బిడ్డకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తీయరు. ఆరునెలలు నిండేంత వరకు ఈ నిబంధనను పాటిస్తారు. అలా చేస్తే కనుదృష్టి తగులుతుందని వీరి భయం. లోహర్ అని పిలిచే డప్పుల దరువులతో పండగ మారుమోగుతుంది. ‘చాంగ్’ అనే సంప్రదాయ మద్యాన్ని అంతా సేవిస్తారు. డప్పుల దరువులకు లయబద్ధంగా నృత్యం చేస్తూ ఒకరిపై ఒకరు మంచుముద్దలను విసరడంతో గోచీ పండుగ ముగుస్తుంది. · -
మమ్ము ఆశీర్వదించు మేరీమాతా! గుణదల తిరునాళ్ల సంరంభం
దేశంలోని క్రైౖస్తవ పుణ్యక్షేత్రాలలో రెండవ అతిపెద్ద ఆలయంగా విజయవాడలోని గుణదల మేరీమాత క్షేత్రం ప్రఖ్యాతి చెందింది. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మరియమాతను దర్శించుకుంటారు. తమ మొక్కుబడులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రతియేటా ఈ పుణ్యక్షేత్రంలో జరిగే ఉత్సవాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచీ లక్షలాది యాత్రికులు తరలి వచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.నూరేళ్ల క్రితమే ప్రతిష్ట..కతోలిక క్రైస్తవులు భారతదేశంలో సేవనారంభించిన తొలినాళ్లలో అనగా 1925లో గుణదల ప్రాంతంలో విద్యాబోధన ప్రారంభించారు. గుణదల కొండ సమీపంలో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్కి అప్పటి రెక్టర్ ఫాదర్ గా పనిచేస్తున్న అర్లాటి స్వామి కొండ పైభాగంలో సహజసిద్దం గా ఉన్న కొండ గుహను గుర్తించారు. భక్తులలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే సంకల్పంతో ఆ గుహలో మరియమాత స్వరూపాన్ని ప్రతిష్టించారు. ఆనాటి నుంచీ కతోలిక క్రైస్తవులు, ఇన్స్టిట్యూట్ విద్యార్ధులు కొండపై ఉన్న మరియమాత స్వరూపాన్ని ఆరాధించడం ప్రారంభించారు. ఆ రోజుల్లో యేడాదికి ఒకసారి ఫిబ్రవరి 11వ తేదీన మరియమాత ఉత్సవాలను జరుపుకోవడం సంప్రదాయమైంది.అర్లాటి స్వామి మేరీమాత స్వరూపాన్ని ప్రతిష్ట చేసిన నాటి నుంచీ మేరీమాత పుణ్యక్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. కొండ శిఖరాగ్రాన యేసుక్రీస్తు శిలువను ప్రతిష్టించారు.1937లో కొండగుహలో మేరీమాత విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేశారు. అటుపై ప్రత్యేక్ర ప్రార్థనలు, సమిష్టి దివ్యబలి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు బలిపీఠాన్ని నిర్మించారు. కొండగుహను తొలిచి మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. 1948లో కొండ శిఖరాగ్రానికి చేరుకునే దారిలో దేవ రహస్యములు తెలియపరిచే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. గుణదల పుణ్యక్షేత్రంలో పనిచేసే గురువులు భక్తులకోసం మౌలిక సదు΄ాయాలు, మెట్లమార్గాలు ఏర్పాటు చేశారు. రానురాను ప్రాచుర్యం పెరిగి భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మేరీమాత ఉత్సవాలను నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టారు.ఆచారాలుకులమతాలకు అతీతంగా భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. తొలుత మరియమ్మ తల్లిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. మైనపువత్తులు వెలిగించటం, కొబ్బరికాయ లు కొట్టడం, తలనీలాలు సమర్పించడం, చెట్లకు ఉయ్యాలలు కట్టడం, దివ్యపూజలు చేయించడం, యాత్రికులు నిద్ర చేయటం వంటి ఆచారాలను అనుసరిస్తుంటారు.ఉత్సవాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బిషప్ గ్రాసి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సమష్టి దివ్యబలిపూజ ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. అంతేకాకుండా నిరంతరం క్రై స్తవ భక్తి గీతాలాపనలు, ప్రత్యేక ప్రసంగాలు, క్రై స్తవ నాటికలు ప్రదర్శిస్తున్నారు. మహోత్సవాలు ప్రారంభంప్రస్తుతం 101వ తిరునాళ్ల మహోత్సవాలు జరుగుతున్నాయి. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 10 లక్షలమందికి పైగా విచ్చేస్తారని అంచనా. మూడు రోజుల పాటు నిర్వహించే ప్రార్థనల్లో కర్నూలు పీఠాధిపతి గోరంట్ల జ్వాన్నేస్, ఖమ్మం పీఠాధిపతి సగతి ప్రసాద్ తదితరులు పాల్గొంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభంఆదివారం ఉదయం విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, గుణదల పుణ్యక్షేత్రం రెక్టార్ ఫాదర్ యేలేటి విజయం జయరాజులు ప్రత్యేక ప్రార్థనలు, సమష్టి దివ్యబలి పూజ సమర్పించి తిరునాళ్ల మహోత్సవాలను ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ గురువులుసందేశాలిచ్చారు– చక్రాల శరత్ రాజుసాక్షి, గుణదల (విజయవాడ తూర్పు) -
దూకుడుతో శిశురక్షణ
కార్పస్ క్రిస్టీ కేథలిక్ పండుగగా చెప్పుకునే ‘బేబీ జంపింగ్ ఫెస్టివల్’ కొత్తగా వినేవారికి, చూసేవారికి వింతగా అనిపిస్తుంది. ఉత్తర స్పెయిన్ లోని కాంటాబ్రియన్ పర్వతాల దిగువన ఉన్న ‘కాస్ట్రిలో డి ముర్సియా’ అనే కుగ్రామంలో ఏటా ఈ పండుగను జరుపుకొంటారు. వేలాది మంది పర్యాటకులు ఈ వేడుకను చూడటానికి తరలి వస్తుంటారు. సుమారు రెండువందల సంవత్సరాలుగా తమకు ఈ ఆచారముందని అక్కడి వారు చెబుతారు. ‘ఎల్ కొలాచో’ (ది డెవిల్) అని పిలుచుకునే పసుపురంగు ముసుగులాంటి దుస్తులు ధరించిన కొందరు యువకులు, దయ్యాలను తలపిస్తూ ఈ పండుగలో ప్రత్యేకంగా నిలుస్తారు.పసుపు రంగు దుస్తులు వేసుకున్న ‘ఎల్ కొలాచో’లు స్థానికంగా ఈ వేడుకను చూడటానికి వచ్చిన వారిని కూడా హడలెత్తిస్తుంటారు. భయపెడుతూ, తరుముతూ పరుగులెత్తిస్తుంటారు. వారు తమ చేతిలో గంటలాంటి ఒక వస్తువుని పట్టుకుని, విచిత్రమైన శబ్దాలు చేసుకుంటూ, ఈ ఊరేగింపులో పాల్గొంటారు. పెద్ద పెద్ద డప్పులు, అరుపులు భయపెట్టేలా ఉంటాయి. నల్లటి కోట్లు, టోపీలు ధరించిన మరికొందరు వ్యక్తులు గంభీరంగా, ఈ ‘ఎల్ కొలాచో’లతో పాటు ఊరేగింపులో నడుస్తారు. ఈ వేడుకలో రోడ్డు పొడవునా పరుపులు, తలదిళ్లు పరిచి, వాటిపై ఏడాదిలోపు పసిపిల్లలను వరుసగా పడుకోబెడతారు. వారి మీద నుంచి ‘ఎల్ కొలాచో’ అనే యువకులను, పిల్లల పైనుంచి దూకిస్తారు. అలా దూకితే పిల్లలపై భూత ప్రేత పిశాచాల పీడ పడదని, దుష్టశక్తులు దరిచేరవని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అక్కడివారి నమ్మకం.అలా పిల్లల మీద నుంచి దూకిన తర్వాత మతపెద్దలు ప్రార్థనలు జరిపి, ఆ పసివాళ్లను ఆశీర్వదిస్తారు. ఈ సమయంలో చుట్టుపక్కల నుంచి, గులాబీ రేకులతో పిల్లలకు దీవెనలు అందుతాయి. ఇదంతా వేడుక రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపే ముగుస్తుంది. అయితే, ఈ వేడుకపై పలు విమర్శలున్నాయి. చాలామంది దీన్ని మూఢనమ్మకంగా కొట్టి పారేస్తున్నా, కొందరు మాత్రం తమ పిల్లల క్షేమం కోసం ఈ వేడుకలో పాల్గొంటున్నారు. -
Hyderabad Literary Festival 2025: సాహిత్య సౌరభం..
హైదరాబాద్ నగరం ఒక్కసారిగా సాహితీ పరిమళాలను అద్దుకుంది. భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన సాహితీ ప్రముఖులు నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో వాలిపోయారు. నగరంలోని టీ–హబ్, సత్వ నాలెడ్జ్ సిటీ వేదికలుగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ఫెస్ట్ శుక్రవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. శని, ఆదివారాల్లోనూ కొనసాగనున్న ఈ సాహితీ పండుగలో సాహిత్యం, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరించిపోతున్న భారతీయ భాషలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రత్యేక సదస్సులు, వర్క్‌షాప్స్, కళాప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా సాహితీ ప్రముఖులతో ప్రత్యక్ష చర్చా కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించారు. ప్రారంభ ప్లీనరీలో ఏ లైఫ్ ఆఫ్ సినిమా పై సినీ ప్రముఖులు షభానా అజ్మీ, సాహితీవేత్త అమితా దేశాయ్‌తో చర్చించారు. అనంతరకార్యక్రమంలో అంతరించిపోతున్న సింధీ భాషపై ప్రముఖులు నందితా భవానీ, రితా కొఠారీ, సోనీ వాధ్వా చర్చించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా కావ్యధార, స్టేజ్ టాక్స్, ఆర్ట్ వర్క్ షాప్స్, నన్హా నుక్కడ్ కార్యక్రమాలు, పరిశోధనా రంగ ప్రముఖులతో సైన్స్ అండ్ ది సిటీ సెషన్స్, రచయితలకు సంబంధించిన మీట్మై చర్చ నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న కళా ప్రదర్శనలు, నగరంలోని కొండరాళ్ల సంరక్షణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్టూన్ స్పెషల్.. ఈ ఫెస్ట్‌లో భాగంగా ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య ఆధ్వర్యంలోని అబ్ట్యూస్ యాంగిల్ కార్టూన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య మాట్లాడుతూ.. ఇది నగర ఖ్యాతిని మరింత పెంచుతుందని, ఈ తరం ఆలోచనా విధానానికి స్ఫూర్తి నింపే వ్యక్తులు హాజరుకావడం సంతోషమన్నారు. తన కార్టూన్ పుస్తకంలో బ్యూరోకాట్ల ప్రయాణాన్ని, ఆలోచనా విధానాన్ని కార్టూన్ల రూపంలో తెలిపానన్నారు. ఫొటోలతో ప్రత్యేక చిత్ర ప్రదర్శనను ఏరాప్టు చేశారు. పుస్తకావిష్కరణలో ప్రముఖ రచయిత డా.దినేష్ శర్మ, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి డా.ఎస్ఎన్ మోహంతి పాల్గొన్నారు.యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో 2లోనే క్లైమాక్స్.. అనంతరం ప్రముఖ సినీతార హుమా ఖురేషి ముఖ్య అతిథిగా సాహితీవేత్త కిన్నెర మూర్తితో చర్చించారు. ఈ సందర్భంగా హుమా ఖురేషి రాసిన యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో పుస్తకంలోని కొన్ని అంశాలను చదివి వివరించారు. ఈ పుస్తకం క్లైమాక్స్ త్వరలో రానున్న రెండో పుస్తకంలో ఉంటుందన్నారు. సినిమా ఎంపికలో కథే ప్రామాణికంగా చేస్తానని, యాక్షన్ కామెడీ వంటి చిత్రం చేయడం ఇష్టమని వెల్లడించారు. -
బాల ఏసు పండుగ
ప్రపంచంలోని చాలా చోట్ల శిలువ మీద ఉన్న జీసస్‌ను ఆరాధిస్తారు. ఫిలిప్పీన్స్‌లో మాత్రం బాల ఏసును ఆరాధిస్తూ పండుగ జరుపుకొంటారు. ‘అతి అతిహన్’ పేరుతో ఈ పండుగ చేసుకుంటారు. దీన్నే ‘కలిబో శాంటో నినో ఫెస్టివల్’ అని కూడా పిలుస్తారు. ఇది ఫిలిప్పీన్స్ అక్లాన్ ప్రావిన్స్ లోని పలు పట్టణాలలో ఘనంగా జరుగుతుంది. ‘హోలీ చైల్డ్’ లేదా ‘బేబీ జీసస్’ను గౌరవించుకుంటూ మత పెద్దలు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ పండుగలో బాల ఏసును ప్రత్యేకంగా కొలుస్తారు.ప్రతి ఏడాది జనవరి నెలలోని మూడవ ఆదివారం రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 19న ఈ వేడుక జరుగుతోంది. ఫిలిప్పీన్స్ పండుగల్లో ప్రత్యేకంగా జరిగే ‘దినాగ్యాంగ్ ఆఫ్ ఇలోయిలో’, ‘సినలోగ్ ఆఫ్ సిబూ’ వంటి పండుగలకు కూడా ఈ ‘అతి అతిహన్’ పండుగే మూలమట! అందుకే ఈ పండుగను అక్కడివారు మదర్ ఫెస్టివల్ లేదా పెద్ద పండుగ అని పిలుచుకుంటారు. ఈ పండుగలో మతపరమైన ఊరేగింపులు, వీధి కవాతులు అద్భుతంగా జరుగుతాయి. రంగురంగుల దుస్తులు ధరించి నృత్యబృందాలు, కవాతు బ్యాండ్లు దుమ్ము లేపుతుంటాయి. ప్రజలంతా ముఖానికి, శరీరానికి రంగులు పూసుకుని, నృత్యం చేస్తూ ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ ‘అతి అతిహన్’ వేడుక మూలాలు ఇప్పటివి కావు, క్రీస్తుశకం 1212 నాటివి. ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దేశాల మధ్యనున్న బోర్నియో ద్వీపం నుంచి పారిపోయిన ‘డాటస్’ అనే పదిమంది మలయ్ అధిపతులు ఫిలిప్పీన్స్ లోని పనాయ్ ద్వీపంలో స్థిరపడ్డారు. ఆ పదిమంది బృందానికి పెద్ద అయిన ‘దాతు పుటి’ స్థానిక ‘అతి’ తెగ ప్రజలతో వ్యాపారం చేసేవాడు. ఒకసారి స్థానికంగా కరవు పీడిస్తుంటే, అక్కడి ప్రజలకు తినడానికి తిండి ఇచ్చి ఆదుకున్నాడు. దానికి కృతజ్ఞతగా ఆనాడే ఈ వేడుక మొదలైందని చెబుతారు. 1960ల నాటికి, ఫిలిప్పీన్స్ పర్యాటక శాఖ స్థానిక పండుగలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించడంతో ఈ పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. 1972 నాటికి ఈ పండుగలో వాడే వస్త్రాల్లో కూడా చాలా మార్పు మొదలైంది. ఆఫ్రికా, పాపువా న్యూ గినీ తదితర దేశాలతో పాటు భారతీయ గిరిజన సంప్రదాయ వస్త్రధారణ కూడా ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తుంది. 2012 నాటికి ఈ పండుగ యునెస్కో సాంస్కృతిక వారసత్వ వేడుకల జాబితాలో చోటు పొందింది. ఈ వేడుకను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ వేడుకలను చూడటానికి ఏడాది ముందు నుంచే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకుంటారంటే, ఇది ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవాల్సిందే! -
వాళ్లు.. విందులు, వినోదాల్లో.. వీళ్లు.. వీధుల్లో, విధుల్లో..
రిషి.. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్.. ప్రస్తుతం కోనసీమ కోళ్ల పందేల్లో బిజీబిజీగా ఉన్నాడు.. పండుగకు మూడ్రోజుల ముందే ఊరొచ్చేశాడు. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు..ప్రవీణ్.. ప్రభుత్వ ఉద్యోగి.. సొంతూరు జనగామ. భోగి ముందు రోజున వచ్చాడు. చెడ్డీ దోస్తులతో, బంధువులతో సంబరాలు చేసుకుంటున్నాడు.కిశోర్.. ప్రైవేటు ఉద్యోగి.. తూర్పుగోదావరి జిల్లా.. సేమ్ అందరిలాగే సంక్రాంతి వేడుకల్లో తలమునకలై ఉన్నాడు..ఇక్కడా కొందరు తలమునకలై ఉన్నారు.. విందులు, వినోదాల్లో కాదు.. వీధుల్లో.. విధులను నిర్వహిస్తూ తలమునకలై ఉన్నారు. నాన్నెప్పుడొస్తడా అంటూ ఇంట్లో ఎదురుచూస్తున్న పిల్లలను తలచుకుంటూ.. ఊర్లో ఉన్న అమ్మాబాపులను యాది చేసుకుంటూ.. పండుగ రోజున కూడా సెలవు తీసుకోని మన సంరక్షకులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అది ఉప్పల్‌లో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న ఓ పోలీసు కావచ్చు.. గోల్కొండ ప్రభుత్వాస్పత్రిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తున్న ఒక వైద్యుడు కావచ్చు.. పతంగులు చిక్కుకోవడం వల్ల ఫీడర్లో అంతరాయాలు తలెత్తి.. మనకు కరెంట్ పోకుండా చూస్తున్న ఓ విద్యుత్ ఉద్యోగి కావచ్చు.. లేదా.. ఆర్టీసీ, వాటర్ బోర్డు, శానిటరీ సిబ్బంది, టీవీ రిపోర్టర్లు, అత్యవసర విభాగాల్లో పనిచేసేవాళ్లు, మాల్స్‌లో పనిచేసేవారు, స్విగ్గీ, జొమాటో బాయ్స్.. వీళ్లెవరైనా కావచ్చు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ‘మన కోసం’ అలుపెరుగని వీరుల్లా పనిచేస్తూనే ఉన్నారు.పండుగ రోజు.. కరెంట్ పోకుండా..సంక్రాంతి పండుగ అంటే పతంగులు. ఎగరేసేప్పుడు గాలివేగానికి దారం తెగి పతంగులు అనేక చోట్ల విద్యుత్ లైన్ల మధ్య చిక్కుకుంటాయి. ఇదే సమయంలో పలు ఫీడర్లలో సాంకేతిక లోపాలు తలెత్తి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. వాటిని వెంటనే సరిచేసి సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రీన్లాండ్స్ డివిజన్ సెంట్రల్ బ్రేక్ డౌన్ (సీబీడీ)విభాగం ఏడీఈ చరణ్‌సింగ్ నేతృత్వంలోని బృందం ఫ్యూజ్ ఆఫ్ కాల్ సహా ఎలక్ట్రిసిటీ కంట్రోల్ రూం నుంచి వచ్చే ఫిర్యాదులను అటెండ్ చేస్తూ.. ఎప్పటికప్పుడు లైన్ల మధ్య చిక్కుకున్న గాలిపటాలను తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనిలో నిమగ్నమైంది.ఇంట్లో ఉండాలంటారు.. నాకు వీలవదు..నాకు పండుగ పూట ఇంట్లో ఉండాలని ఉంటుంది. కానీ విధి నిర్వహణ తప్పదు. నాన్న వస్తాడంటూ ఎదురు చూడటం పిల్లలకు అలవాటైపోయింది. ఇంట్లో ఉండండి అని చాలా సార్లు అడిగారు. నాకు వీలవ్వదుగా.. ఈ మధ్య వాళ్లు అమ్మమ్మ వారింటికి వెళ్లిపోతున్నారు. నేను ఇలా డ్యూటీకి వచ్చేస్తున్నాను. – ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్రెడ్డిఈ సంతృప్తి ముందు ఏదీ సాటి రాదు..సొంతూరు వెళ్లి కుటుంబం, బంధువులతో సంక్రాంతి పండుగను జరుపుకోలేకపోతున్నామనే బాధ కొంత ఉంటుంది. అయితే విధి నిర్వహణలో రోగులకు సేవలు అందించడంలో ఉన్న సంతృప్తి ముందు ఏదీ సాటిరాదు. రోగులకు సేవలు అందించడం గర్వంగా ఉంది.– డాక్టర్ పీవీ శ్రీనివాసరావు, గోల్కొండ ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్మేం పనులు చేయకపోతే.. రోడ్లు అధ్వానమే.. మాది వరంగల్ దగ్గరి మైలారం. పండుగలప్పుడు మేం పనులు చెయ్యకపోతే రోడ్లు అధ్వానంగా అవుతయి. అప్పుడెలా? అందుకే మాకు పండుగలప్పుడు సెలవులుండవు. ఊరికి వెళ్లడం కుదరదు. –జి.బాబమ్మ, జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలుఇలాంటి సంతృప్తి పోలీసు శాఖలోనే..పోలీసు ఉద్యోగంలోకి వచ్చి 30 ఏళ్లవుతోంది. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఇలా ఎన్నో పండుగల సమయంలో విధుల్లో ఉన్నాను. విధినిర్వహణలో ఎంతో మంది మమ్మల్ని కలిసి శుభాకాంక్షలు తెలుపు తారు. ఇలాంటి సంతృప్తి పోలీసుశాఖలోనే దొరుకుతుంది.తర్వాతి రోజు ఇంట్లో పండుగ జరుపుకొంటాం.– బి.యాదగిరి, హెడ్ కానిస్టేబుల్, బచ్చన్నపేట, జనగామ జిల్లా -
పని చేయకపోతే ఇల్లెలా గడుస్తాది.. నారాయణుడి జీవిత గాథ
యేటి సేత్తామ్.. అందరికి అనుకున్నట్లు అవుతాదేటీ.. ఎవలికి ఏది ప్రాప్తమో.. అదే దక్కుతాది.. నువ్వెంత ఎగిరినా కాణీ ఎక్కువ రాదు.. అంటాడు నారాయణ. అచ్చం రజనీ కాంత్ చెప్పినట్లే చెప్పాడు.. దక్కేది దక్కకుండా పోదు.. దక్కనిది ఎన్నటికీ దక్కదు అనే మాటను నారాయణ సింపుల్‌గా చెప్పేసాడు.అవును.. ఇద్దరు మగపిల్లలు.. ఒక ఆడపిల్ల ఉన్న నారాయణకు అరవయ్యేళ్లపైనే ఉంటుంది.. అప్పట్లో చిట్టివలస జూట్ మిల్లులో పని చేశాడట.. అది మూసేసాక ఇక వేరే పనేం లేక.. ఆనందపురం దగ్గర్లోని తాళ్ల వలసలో ఊరకనే ఇంట్లో ఉండడం ఎందుకని కూరగాయలు.. ఆకుకూరలు, పూలు.. మార్కెట్లో కొనుక్కుని మళ్ళా మారు అమ్మకానికి మోపెడ్ మీద తిరుగుతాడు. రోజూ దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్లు తిరుగుతాడు.పెద్దగా తెలివితేటలు లేవు .. ఎక్కువ రేటు చెప్పడు.. మార్కెట్ రేటుకు మరి కాసింత పైన వేసుకుని అమ్ముతాడు.. ఇదేంటి నారాయణ ఇంత అమాయకుడివి.. తెలివి లేదు ఎలా బతుకుతావు అంటే.. పల్లకుందూ ఎవడినైనా ముంచాలంటే తెలివుండాలి గానీ.. మామ్మూలుగా బతకడానికి తెలివెందుకు.. మనం కొన్న సరుకుమీద కేజీకి ఐదో పదో వస్తే చాల్లే.. నాకెందుకు తెలివి.. మేడలు కట్టాలా.. మిద్దెలు కట్టాలా అంటాడు.. అవునులే.. బతకడానికి తెలివి అక్కర్లేదు.. రెక్కలకష్టం చాలు.. ఎవరినో మోసం చేయాలంటే తెలివి ఉండాలి.. అనేశాను.నారాయణతో వాదించలేం.. తెలివి లేదంటాడు.. కొత్త లాజిక్కులు తీస్తాడు.. నారాయణ ఇద్దరు కొడుకులూ మేస్త్రీలే.. రోజూ పని.. డబ్బులు ఉంటాయి.. ఇద్దరి బతుకులకు ఎక్కడా సమస్య లేదు.. ఆడపిల్లను కూడా దగ్గిరోళ్లకే ఇచ్చాను.. దాని బతుక్కి పర్లేదు.. అల్లుడు మంచోడే.. పండక్కి కూతురికి మూడువేల ఇచ్చాను.. నా కొడుకులు కూడా తలా వెయ్యేసి ఇచ్చారు.. మొత్తం ఐదువేలు.. దానికి దాని పిల్లలకు గుడ్డముక్కలకు సరిపోతాయి.. ఇంకేటి కావాలి చెప్మి అంటాడు.. అంత దిలాసాగా ఉన్నవాడితో మనం నెగ్గుకురాలేం.. అవును నారాయణ జీవితానికి ఇంకేటి కావాలి అన్నాను. పిల్లలు బాగున్నారు కదా మరి నువ్వెందుకు తిరగడం అంటే.. మా బాగా చెప్పినావ్.. మన బతుకు మనది.. నేను మా ముసల్ది .. నా జీవితం వేరే.. పిల్లలతో మనకెందుకు.. ఒంట్లో సత్తువున్నంత వరకు మనం పంజేయాలా. పైసా తెచ్చుకోవాలా.. మనం ఆళ్ళమీద చెరబడ్డం ఎందుకు.. నాకసలు అలాంటివి నచ్చదు.. రోజూ ఇలాగే తిరుగుతా నాకు మా ఇంటిదానికి సరిపోతాయి.. ఇంకా వందా యాభై మిగిలితే మానవరాళ్లకు గట్రా ఇస్తుంటా అంటాడు.. యేటి మరి పండక్కి బట్టలు కొన్నావా అంటే.. ఆ.. రెండు కొత్త నిక్కర్లు.. చొక్కా కొన్నా అన్నాడు మెరుస్తున్న కళ్ళతో.. మరేటి ఐతే కనుమకు ఏర్పాట్లు అంటే.. ఉంటుందిలే.. ముక్కలు గట్రా.. ఉండవేటి మరి.. అన్నీ ఉంటాయి.కనుమంటే కనుమే అంటాడు.. మరి కనుమకు మా ఇంటికి వచ్చేరాదూ నారాయణా అంటే.. గొప్పగ చెప్పినావ్.. మనవళ్లు.. మనవరాళ్లు కొడుకులు.. కోడళ్ళు.. ఓస్.. ఎంతమంది ఉన్నారనుకున్నావ్.. మా ఇల్లే పెద్ద జాతర తెలుసా.. నువ్వే మా ఇంటికి వచ్చిద్దు.. మంచి మాంసం కూర వండుకుందుము అని ఎదురు ఆహ్వానిస్తాడు.. అప్పుడంతే జగనన్న ఉన్నప్పుడు పండుక్కి ఏదో పధకం డబ్బులొచ్చేవి.. పండుగ గడిసిపోయేది.. ఇప్పుడవేటి లేవు.. ఇంట్లో పైసా లేదు. జనాల దగ్గర డబ్బుల్లేవు.. మనమే ఏదో చేసి తెచ్చుకోవాలి.. అంటూ ఎకనామిక్స్ మొదలెట్టాడు.. ఆ ఓహో అన్నాను. సర్లే.. నీతోటి మాట్లాడుకుని కూకుంటే నా యాపారం లాసైపోద్ది .. ఎల్తాను.. మళ్ళా పండుగ.. కనుమల తరువాత వస్తాను.. అంటూ కూరగాయల సంచితో బయల్దేరాడు..-సిమ్మాదిరప్పన్న. -
సంక్రాంతి జరీచీర
ఏదో తప్పదు కావున పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారనీ, సంక్రాంతికి పిన్నీ బాబాయిలు పుట్టింటి హోదాలో తననూ భర్తనూ పిలిచేదేమీ లేదనీ తేలిపోయాక చిన్నబుచ్చుకుంది ఆ కొత్త పెళ్లి కూతురు. భర్త గమనించాడు. వాళ్లు రాసినట్టే పిలిచినట్టే ఒక కార్డుముక్క సృష్టించాడు. పండక్కు ముందు భార్యను బయల్దేరదీశాడు. పట్నానికి తీసుకెళ్లి దర్జాగా హోటల్లో దించాడు. ‘ఇదేమిటండీ’ అని ఆశ్చర్యపోయింది భార్య. ‘మరేటనుకున్నావోయ్. ఇంతకు మించిన పుట్టిల్లు లేదు. కోరిన టిఫెను, భోజనం గదిలోకే వస్తాయి. సాయంత్రమైతే సినిమాలు షికార్లు బోలెడన్ని. ఇదే నీ పుట్టిల్ల నుకొని సంతోషపడు’ అంటాడు. మనసుంటే పండగ ఉండదా? మధురాంతకం రాజారాం ‘పండగ అల్లుడు’ కథ ఇది.చార్జీలు, పండగ ఖర్చులు తలచి పాపం ఆ పేద తల్లిదండ్రులు పెద పండుగ ఊసే ఎత్తలేదు కూతురి సంగతే మరిచినట్టు. అల్లుడు అది గమనించాడు. పండక్కు తన భార్య కొత్తచీర కట్టుకుంటే ఆ మురిపెం వేరు. సింగారమూ వేరు. కోర్టు గుమాస్తా అతను. చిన్న జీతమే. కాని పెద్ద మనసు. రిక్షా ఎక్కడం మానేశాడు. బయట టిఫెన్లు కాఫీలు మానేశాడు. నాటకాలు చూడ్డం మానేశాడు. పుస్త కాలు కొనడమున్నూ. ప్రతి పైసాను పొదుపు చేసి తెచ్చాడు ఆఖరుకు ‘పుల్లంపేట జరీచీర’! పది హేను మూరల ఆ జరీచీర కట్టుకుని కళకళ్లాడిన భార్య ‘ఇంత కష్టం చేసి నా కోసం తెచ్చారా’ అని భర్త కంఠార తల ఆన్చి బాష్పాలు రాలుస్తుంది. సయోధ్య ఉంటే కాపరం పండగే. శ్రీపాద కథ ఇది.కరువు రోజుల్లో పండగంటే ఎంత కష్టం. ఇంటి పెద్ద మనసు కష్టపెట్టుకుంటూనే ఎక్కడ ఏది సర్ది చెప్పాలా అని ఆగమవుతూ ఉంటాడు. పిల్లలకిది పడుతుందా? పండగ మరో నెలుందనగానే తట్టలు పట్టి ఎక్కడి పేడంతా సేకరించి పిడకలు కొట్టి ఆరబెట్టారు. ‘ఎన్నర్రా’ అని తండ్రి అడిగితే ‘300’ అన్నారు గర్వంగా. తండ్రికి ఎన్నో ఆలోచనలు. వాటిని పొయ్యిలోకి వాడితే కట్టెలైనా మిగిలి నాలుగు పైసలు ఆదా అవుతాయి గదా అని. ‘ఇవ్వండ్రా’ అనంటే ‘ఊహూ’. భోగి మంటలేసి ఎగిసే మంటలను చూసి పక్కింటివాళ్లను ఓడిస్తేనే పిల్లలకు ఆనందం. పేదవాడికి పండగంటే ‘సర్దుబాటే’. సాక్షాత్తూ ఆరుద్ర రాసిన కథ ఇది. అయితే ‘ఇప్పటి భోగిమంటలు ఒక మంటలేనా’ అంటారు ముళ్లపూడి వెంకట రమణ. జగన్నా థుని రథమంత ఎత్తున లేసేలా వేస్తేనే వేసినట్టట. ‘ఒరే ఫ్రెండూ... వెళ్లి రెండు బైండింగ్ అట్టలైనా పట్టుకురారా మంట పెంచుదాం’ అనంటే ఎవరింట ఉన్నాయట బైడింగ్ అట్టలూ పుస్తకాలూనూ. కోళ్లగంపలూ తాటాకు బుట్టలూ తప్ప. కావున జానెడు ఎత్తు మంటే జగన్నాథుడితో సమానం. అయితే పిల్లకారుకు చిన్న సరదా ఉందిలే. ఆ చిరుచీకట్లలో ప్లీడరు శేషయ్యగారి బోర్డు ఊడబెరికి మంటల్లో వేసి గోడ ఖాళీ ఎందుకని భోజనం తయార్ బోర్డు తెచ్చి అక్కడ వేళ్లాడదీశారు. పండగంటే పిల్లల అల్లరిది. జీవితాంతం చెప్పుకునేటందుకు జ్ఞాపకమై గూడుకట్టేది. ముళ్లపూడి ‘భోగి మంటలు’ బలే సరదా కథ. అయితే స్త్రీగళాన్ని ఎలా వదిలేస్తాం? ఒక సింగిల్ ఉమన్‌కు అందరూ గది అద్దెకిస్తారుగాని ఒకటే షరతు... రోజూ ఇంటి ముందర ముగ్గేయాలని. ఆ సింగిల్ ఉమన్ మంచి జర్నలిస్టు. ఆలోచనాశీలి. సమాజానికి పనికొచ్చే పనులు చేయగలిగినది. మించి తన జీవి తాన్ని తాను నిర్మించుకోగలిగేది. అయినా సరే. ముగ్గేయాల్సిందే. ‘నాకు రాదు... వచ్చినా వేయను’... ‘పనిమనిషితోనైనా వేయించు’... పండుగ నెల వచ్చిందంటే ఆమెకు గండం. ముగ్గు లేని వాకిలిగా ఆమె ఇల్లే కనపడుతుంది. ఆ నెల్లో యజమాని ఖాళీ చేయించడం ఖాయం. మరో గదికి చలో. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలట. ఇల్లాలి చదువు, జ్ఞానం, వికాసం వీటి వల్ల కాదా దేశానికి పండగ వచ్చేది? పి.రామకృష్ణారెడ్డి కథ ‘ముగ్గు’.సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండగ. యుగాంతం వరకూ నిలిచే పండగ. సంస్కృతిని ఎప్పటికీ కాపాడుకోవాల్సిందే. కాని సందర్భాలలోని అంతరాలను చూసి సరిచేసి పండుగ అర్థాన్ని విశాలం చేసుకోవాలి కూడా. ‘గుమ్మం ముందు బొబ్బిలిపాట గాళ్లేమిటి... బుడబుక్కల వాళ్లేమిటి... తందానపదం వాళ్లేమిటి... గంగిరెడ్ల వాళ్లేమిటి... పగటి వేషగాళ్లేమిటి... తోలు బొమ్మలాళ్లేమిటి... ఎరకలాళ్లేమిటి... చెంచులాళ్లేమిటి... జంగాలేమిటి... సన్నాయి వాళ్లేమిటి... వీళ్లంతా నిమిష నిమి షానికి వచ్చేవాళ్లే’ అని రాస్తారు కవికొండల వేంకటరావు ‘మా ఇంట సంక్రాంతి’ కథలో. పండగ ఒకరు చేసుకునేదిగా... మరొకరు వారింటి ముందుకు వచ్చి ఇనాము అడిగేదిగా ఎందుకు ఉండాలి? ఇనాము ఇచ్చే స్థాయిలో ఒకరు, పొందే స్థాయిలో ఒకరు ఉంటే అది న్యాయమైన సమాజమేనా? జన్మ అంతరాలు, ఆర్థిక అగాథాలనే కాబోలు భోగిజ్వాలల్లో పడేయాల్సింది. గాయకుడు పుట్టా పెంచల్దాసు ‘యేటంబిడ యేడుచ్చా పోయా’ అనే కథను రాశాడు. భోగి రోజు పండగ చేసుకోనీకుండా, ఇల్లు గడిచేందుకు భత్యాలు తీసుకురమ్మని తల్లి పోరుపెడితే, చీకటితో బయల్దేరి ఇంటింటా పాటలు పాడి గింజలు, వడ్లు తీసుకుని చీకటి పడ్డాక ఇల్లు చేరి, అప్పుడు కొత్త బట్టలు కట్టుకుని ఎవరికి చూపించుకోవాలో తెలియక దిగాలు పడే పసివాడి కథ అది. దుఃఖం వస్తుంది. సంక్రాంతి ఎంతో సంబరమైన పండగ. కాని సమకాంతికై అది చేసే వాగ్దానాన్ని మనం ఇంకా అందుకోవలసే ఉంది. సామాజికంగా అందరూ అడుగు పెట్టగలిగేదే ఉత్తరాయణం అంటే. క్రాంతి రావడమే సరైన సంక్రాంతి. అటువంటి సంక్రాంతిని కాంక్షిస్తూ గుమ్మడి పూల, పసుపు చేమంతుల శుభాకాంక్షలు! -
ఎడారి ఓడల వేడుక
ఒంటెలు ఎడారి ఓడలు. ప్రపంచంలో ఎడారులు ఉన్న ప్రతిచోటా ఒంటెలు కనిపిస్తాయి గాని, వాటి రాజసం చూడాలంటే మాత్రం రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగే కేమెల్ ఫెస్టివల్‌కు వెళ్లాల్సిందే!బికనీర్ నగరంలో ప్రతి ఏటా జనవరి రెండో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ ఎడారి ఓడల వేడుక జరుగుతుంది. ఈసారి జనవరి 11, 12 తేదీల్లో జరుగుతున్న కేమెల్ ఫెస్టివల్ కోసం బికనీర్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రాజస్థాన్ పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుక కోసం రాష్ట్రంలోని ఒంటెల యజమానులు పెద్దసంఖ్యలో తమ తమ ఒంటెలతో ఇక్కడకు చేరుకున్నారు. బికనీర్ నగర వ్యవస్థాపకుడు రావు బికా హయాంలో పదిహేనో శతాబ్దంలో ఇక్కడ ఒంటెల వేడుకలు నిర్వహించడం మొదలైంది. ఇక్కడి ఒంటెలు సైనిక దళాలకు సేవలందించాయి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో ఇక్కడి ఒంటెలతో ఏర్పడిన సైనికదళం ‘గంగా రిసాలా’ కీలక పాత్ర పోషించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, 1965లో జరిగిన ఇండో–పాక్ యుద్ధంలో ఇక్కడి ‘గంగా జైసల్మేర్ రిసాలా’ సైనిక దళంలో పనిచేసిన ఒంటెలు సైన్యానికి కీలకమైన సేవలందించాయి. ఇక్కడి ఒంటెల చారిత్రక ఘనతను చాటేందుకు, ఈ వేడుకను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు కొన్నేళ్లుగా రాజస్థాన్ పర్యాటక శాఖ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఒంటెల వేడుకలో పాల్గొనే ఒంటెలకు, వాటి యజమానులకు రకరకాల పోటీలు జరుగుతాయి. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి. ఒంటెల పరుగు పందేలు, ఒంటెల నాట్యం, ఒంటెల పాలు పితకడం, ఒంటెల విన్యాసాలు, ఒంటెల అందాల పోటీలు వంటివి జరుగుతాయి. పురుషులకు కుస్తీ పోటీలు, మీసాల పోటీలు, స్త్రీ పురుషులకు వేర్వేరుగా టగ్ ఆఫ్ వార్ పోటీలు, మహిళలకు తలపై కుండలు మోస్తూ త్వరగా నడవడంలో పోటీలు జరుగుతాయి. సాయంత్రం వేళల్లో బహిరంగ వేదికలపై రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. -
దుమ్ము దులిపేద్దాం.. జ్ఞాపకాలు సర్దేద్దాం!!
అంజలీ.. ఈరోజు ఎలాగూ కాలేజీ సెలవు కదా ఇల్లు సర్దేద్దాం నువ్వూ నాన్నా రెడీగా ఉండండి.. వంటింట్లోంచి కేకేసింది లావణ్య.. అమ్మా ఈరోజు వద్దమ్మా .. ఇంకోరోజు చేద్దాం.. తప్పించుకోబోయింది కూతురు.. లేదు.. లేదు.. పండగ వచ్చేస్తోంది.. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి.. అన్నీ రూములు.. సెల్ఫ్ లు.. పుస్తకాలు.. బట్టలు.. బుక్స్ ర్యాకులు అన్నీ తీసి పక్కన పెట్టండి.. అన్నీ దుమ్ము దులిపి అన్నీ మళ్ళా లోపల పెట్టాలి.. అర్థమైందా.. ఆర్డర్ వేసింది లావణ్య. సరే.. చేస్తే నాకేమిస్తావ్ అంది అంజలి.. నీకు బిర్యానీ చేసి.. సాయంత్రం బొబ్బట్లు చేస్తాను అని ఆఫర్ ఇచ్చింది.. మరి నాకూ అన్నాడు రాజేష్ కొంటెగా.. సిగ్గుండాలి మనిషికి అని మురిపెంతో కలిపిన చిరాకుతో వంటింట్లోకి వెళ్ళింది లావణ్య.బుక్స్ సర్దుతూ నాన్నా ఇదేంటి ఇలా మాసిపోయింది అంటూ ఓ కోతిబొమ్మను చూపించింది.. ఓ.. అదా.. ఇన్నేళ్లకు మళ్ళీ దొరికిందా అంటూ దాన్ని ముద్దుగా చేతిలోకి తీసుకున్న లావణ్య.. ఓహ్.. అదా.. నువ్వు నాలుగేళ్లు ఉన్నపుడు డాల్ఫిన్ హోటల్లో ఓ పుట్టినరోజుకు వెళ్ళాం గుర్తుందా అప్పుడు అక్కడ డెకరేషన్ కోసం పెట్టిన బొమ్మ కావాలని ఏడ్చావు.. ఎంత ఊరుకోబెట్టినా ఏడుపు ఆపలేదు.. చిరాకొచ్చి నాన్న నీకు టెంకిమీద రెండు పీకాడు గుర్తుందా.. అంది లావణ్య.. ఓహ్.. నాన్న నన్ను కొట్టారా.. అంటూ ఇప్పుడు ఏడుపు మొహం పెట్టింది అంజలి.. ఆ.. అలా కొట్టి మళ్ళీ నిన్ను ఎత్తుకుని జగదాంబ జంక్షన్లో చినుకులు పడుతున్నా వెతికి మరీ ఈ బొమ్మ కొన్నాం.. అదన్నమాట దీని కథ.. అని లావణ్య చెప్పగా.. ఓహ్.. అంటూ నాన్న తనను కొట్టారన్న కోపం స్థానే.. నాన్నను నేనంటే ఎంత ముద్దో అని ప్రేమగా నాన్నవైపు చూసింది అంజలి. నాన్నా చిన్న చిన్న గ్రీటింగ్స్ .. ఆకులు.. ఎండిపోయిన పూలు.. రంగుకాగితాలు దొరికాయ్.. అంది అంజలి.. అవునమ్మా చిన్నప్పుడు నువ్వు నా బర్త్ డేకు. న్యూ ఇయర్ కు కూడా నువ్వే సొంతగా గ్రీటింగ్ చేసి ఇచ్చేదానివి.. అవన్నీ ఇలా దాచిపెట్టాను.. ఇప్పుడు పెద్దయ్యాక ఇవ్వడం మానేసావులే.. అన్నాడు రాజేష్ నిష్టూరంగా. చిన్ననాటి తన క్రియేటివిటీకి మురిసిపోయిన అంజలి.. అయ్యో అదేంలేదునాన్న నువ్వు ఎప్పటికీ నాకు హీరోవి.. నీకు నేనే పెద్ద గ్రీటింగ్ కార్డు.. అంటూ కవర్ చేసేసింది.నాన్నా ఇవేంటి ఐస్ క్రీమ్ కప్పులు.. జడక్లిప్పులు.. అన్నీ ఒక్కో రంగులో ఒక్కో గాజు.. ఇవన్నీ ఒక్కో కవర్లో ఉన్నాయి.. బయటపడేయాలా అంది అంజలి.. వంటగదిలోంచి పరుగున వచ్చిన లావణ్య.. వెంటనే ఆ కవర్ అందుకుని తీసుకుంది.. ఎందుకమ్మా ఆ చెత్తంతా బయటేసేద్దాం అంది అంజలి.. అది చెత్త కాదమ్మా.. ప్రేమ జ్ఞాపకాలు చెప్పబోయాడు రాజేష్.. చాలు.. మీ దిక్కుమాలిన లవ్వు.. దానికో జ్ఞాపకం.. పిల్ల ఉందన్న జ్ఞానం కూడా లేదు.. కసురుకుంటూ.. జ్ఞాపకాలను తలచుకుంటూ కవర్ తీసుకుని ప్రేమగా వేరేచోట పెట్టింది.ర్యాక్ లోని కవర్ నుంచి ఓ పాత చీర తీసి సెల్ఫ్ మొత్తం తుడిచేయబోతుంటే రాజేష్ .. అంజూ ఆ చీర జాగ్రత్తగా ఉంచమ్మా అన్నాడు.. ఏంది దీనికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా అంది అంజలి.. ఉంది నాన్న.. నేను అమ్మను తొలిసారి చూసింది ఈ చీరలోనే.. ఆ తరువాతనే నేను అమ్మను ప్రపోజ్ చేయడం.. పెళ్లి చూపులు చూడడం ... నువ్వు మాకు దక్కడ అంటూ పరవశంతో చెబుతున్నాడు.. ఐతే నాన్న నేను ఈ చీర ఉంచుకుంటా.. అమ్మనువ్వు ఇద్దరూ నాతో ఉన్నట్లే ఉంటుంది కదా అంది అంజలి.. పాప ప్రేమను చూసి భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.. సరే సర్దింది చాలు.. బిర్యానీ అయిపొయింది.. రండి అంది లావణ్య. చూసారా ఇల్లు సర్దితే అటు సమన్లు పేర్చుకోవచ్చు.. ఇటు పాత జ్ఞాపకాలనూ పొడుపుకోవచ్చు అంది లావణ్య.. అవునవును అంటూ తండ్రీకూతుళ్ళు ఇద్దరూ తల్లిని అల్లుకుపోయారు.-సిమ్మాదిరప్పన్న. -
ముగ్గులో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో తెలుసా..!
ఈ ముగ్గుల సంస్కృతి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. కాకపోతే ఒక్కోభాషలో ఒక్కో పేరుతో దీన్ని పిలుస్తారు. తెలుగులో ముగ్గులు అంటాం. కన్నడలో రంగోలి అంటారు. తమిళం-మళయాళంలో కోలం, బెంగాల్లో అల్పన, రాజస్థాన్‌లో మండన, సంస్కృతంలో మండల వంటి పేర్లుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా.. అందరూ అందంగా తీర్చిదిద్దేది రంగవల్లులే. పండుగలతో సంబంధం లేకుండా ప్రతి తెలుగింటి లోగిళ్లలో తప్పనిసరిగా ముగ్గు వేయడం పరిపాటి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం లేదా సంస్కతిగా చెబుతారు పెద్దలు. అయితే ఇలా ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దడంలో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో చూద్దామా ఏంటో చూద్దామా..!ముత్యాల ముగ్గులోని శాస్త్రీయ కోణం..ముగ్గులని ప్రాచీన ఖగోళశాస్త్రంగా చెబుతుంటారు. పూర్వం ఆర్యభట్ట ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు ముగ్గుల రూపంలో నేలమీద చిత్రించాడట. అప్పటినుంచే ఖగోళశాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం, వాటిని వివిధ ఆకారాల్లో కలపడం ద్వారా ముగ్గులను వేస్తున్నారని నానుడి. జ్యోతిషంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాశుల చిహ్నాలూ ముగ్గుల్లో కనిపిస్తాయి. గృహవాస్తు, ఆలయవాస్తు, నగర నిర్మాణాల్ని తెలిపే రంగవల్లులూ ఉన్నాయంటున్నారు నిపుణులు. వైద్యశాస్త్రం కూడా ఉందట..రంగవల్లిలో కిందికి చూపించే త్రిభుజాలు స్త్రీలనీ, పైకి చూపించే త్రిభుజాలు పురుషులనీ, ఈ రెంటినీ కలపడం ద్వారా గీసిన ఆరు కోణాల నక్షత్రం స్త్రీ, పురుషుల కలయికకు సంకేతమనీ నమ్ముతారు. ముగ్గులోని కలుగపువ్వు గర్భాన్ని సూచిస్తుందట. నేటి కంప్యూటేషనల్ ఆంత్రోపాలజీ పరిశోధనలకీ ముగ్గు ఉపయోగపడుతుంది. ముగ్గుల్లోని గణిత సూత్రాలను అధ్యయనం చేసేందుకు ఆల్గారిథమ్స్‌ను రూపొందించి, వాటిని బొమ్మలు గీసే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లోనూ వాడుతున్నారట. అంతేగాదు సంక్లిష్టమైన ప్రొటీన్ నిర్మాణాల్ని అర్థం చేసుకునేందుకూ ఈ ముగ్గులు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.ముగ్గులో గమ్మతైన గణితం..ఈ ముగ్గులో తీరుగా పెట్టే చుక్కలు లెక్కలపట్ల ఆసక్తిని పెంచితే కలపడం వల్ల గణితం తేలికగా అర్థమవుతుందట. ఉదాహరణకు చుక్కలు పెడుతూ సరి, బేసి సంఖ్యలు నేర్చుకోవచ్చు. చుక్కలు...అంక గణితమైతే, వాటిని కలపడం సమితులు. నిజం చెప్పాలంటే ముగ్గులు మేధస్సుకి సవాలుగా నిలుస్తాయి. అంతేగాదు పిల్లల మెదడు వృద్ధి చెందడానికి మొదటి ఏడు సంవత్సరాలూ కీలకం. ఆ సమయంలో వారికి తేలికపాటి ముగ్గులు నేర్పిస్తే వాళ్లలో నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారుఆరోగ్య ప్రయోజనం..ముగ్గు వేయడం అనేది మహిళలకు మంచి వ్యాయామం లాంటిది. వంగి లేవడం కారణంగా.. వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని.. అందుకే పెద్దలు రోజూ ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం తీసుకొచ్చారని అంటారు.చేతులు, కాళ్లను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటూఇటూ తిప్పడం వల్ల వారి జీర్ణక్రియ, పునరుత్పత్తి అవయవాలకు చక్కిని మసాజ్‌లా ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, జాయింట్లు, వెన్నెముక, పూర్తి శరీరానికి వ్యాయాయం తద్వారా బలం చేకూరుతుంది. ముగ్గులు వేసే మహిళల మెదడు చాలా చురుగ్గా పని చేస్తుందట. మహిళలకు ఇది శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.అంతేగాదు ముగ్గులు వేయడం వల్ల మంచి శరీరాకృతిని కలిగి ఉంటారట.శరీరాన్నీ మనస్సునూ ఒకేచోట కేంద్రీకృతం చేస్తూ వేసే ముగ్గు ఏకాగ్రతను పెంచే దివ్యమైన మెడిటేషన్‌గా చెబుతున్నారు. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుందట. ఎక్కడో చూసి.. ఎప్పుడో నేర్చిన ముగ్గుల్ని గుర్తుతెచ్చుకుంటూ వేయడంవల్ల ధారణశక్తి మెరుగవుతుందట. దీనివల్లే మహిళలకు ఏకాగ్రత, ఓర్పు అలవడుతాయట.అదీగాక ఉదయాన్నే ముగ్గు వేస్తారు కాబట్టి..స్వచ్ఛమైన గాలిని పీల్చడం జరుగుతుంది. అందువల్ల మహిళలు ఇలా వాకిట ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలని అంటున్నారు ఆరోగ్య నిపుణలు. అలాగే చాలామంది ముగ్గుగా బియ్య పిండిని ఉపయోగిస్తారు. ఇది పక్షులు పావురాలు, చీమలు, పిచ్చుక, కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక పరంగానూ, ఆరోగ్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలందించే రంగవల్లికలను శోభాయమానంగా తీర్చిదిద్దుదాం..ఆరోగ్యంగా ఉందాం. (చదవండి: ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..) -
వేడుకగా వింటర్ ఆర్ట్ వీక్..!
వింటర్ సీజన్ జైపూర్ లో ఉండటానికి అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. ఉదయం పొగమంచుతో, పగలంతా ఎండ, సాయంత్రం నగరం అందించే కళలను ఆస్వాదించడానికి తగినంత చల్లగా ఉంటుంది. అందుకు తగినవిధంగానే జైపూర్ ఈ వింటర్లో కళ, సంస్కృతి, వారసత్వ ఉత్సవాలకు ఆతిథ్యం ఇస్తోంది. ’కుంభ్ ఆఫ్ లిటరేచర్’గా పరిగణించబడే జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో రచయితల సెషన్ కళాత్మకంగా జరుగుతుంది. ఇక జైపూర్ ఆర్ట్ వీక్‌లో ఎగ్జిబిట్లు, ఇన్స్టాలేషన్ల ద్వారా వర్ధమాన కళాకారుల తెలుసుకోవచ్చు. లిటరేచర్ ఫెస్టివల్ 2025టీమ్‌వర్క్ ఆర్ట్స్ రచయితలు, ఆలోచనాపరులు, మానవతావాదులు, రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, వినోదకులు, సాంస్కృతిక చిహ్నాల ఆసక్తిని పరిచయం చేస్తుంది. జైపూర్‌లోని క్లార్క్స్ అమెర్లోని ఐదు రోజుల ఉత్సవంలో నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. దేశ విదేశాలకు చెందిన రచయితలు ఈ వేడుకలో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా వివిధ కళారూ΄ాల ప్రదర్శన కూడా ఉంటుంది. ప్రాంగణంలో జైపూర్ కళాకారులు చిత్రించిన కుండలు, అప్లిక్ ఎంబ్రాయిడరీ విశేషంగా ఆకట్టుకుంటాయి. వీటి తయారీ కళ, వాస్తుశిల్పం, జైఘర్, రాజస్థాన్ కోటల చరిత్ర, జైపూర్ నగర దృశ్యాలు, వారసత్వం, భారతదేశ అసంఖ్యాక చరిత్రలు, ప్రశంసలు పొందిన వక్తలు, రచయితలు, చరిత్రకారులతో కూడిన సెషన్లో కళలను ఆస్వాదించవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ 27 నుంచి మూడు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. జానపద కళా రూపాలుఆవాజ్ స్టూడియోచే నిర్వహించే ఆర్ట్స్, డిజైన్ ఈవెంట్ ఏఐఊఖీ. రాజస్థాన్ లోని ఒక గ్రామంలో ఎదుగుతున్న అట్టడుగు నేపథ్యాలను అన్వేషించే పాటలకు ప్రసిద్ధి చెందిన ఇండీ కళాకారుడు రాహ్గీర్ను ప్రదర్శించే మూడు రోజుల పండుగ. డిసెంబర్ 20న ్ర΄ారంభమవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో రాష్ట్రంలోని జానపద కథల పరిణామం ఇక్కడ చూడచ్చు. హ్యాండ్–బ్లాక్ ప్రింటింగ్, కుండల తయారీ, ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్‌ల, మూడు రోజులలో రాజస్థాన్ హస్తకళల సొగసును చూడచ్చు. మాస్టర్ కల్బెలియా కళాకారులచే 500 మందికి పైగా జానపద నృత్యంలో పాల్గొంటున్నారు. కళల ప్రదర్శనపబ్లిక్ ఆర్ట్స్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PAT)చే నిర్వహించే, ఒఅగి 4.0 వారం రోజులపాటు ఆర్ట్ వీర్ జరుగుతుంది. ఆ కార్యమ్రంలో ప్రదర్శనలు, వర్క్‌షాప్‌ల నిర్వహణ కోసం నగరంలోని వర్ధమాన కళాకారులు తమ చేయూతను అందిస్తున్నారు. దేవుళ్లు, రాక్షసులు, ఆలయ పెయింటింగ్‌లు, జానపద కథలను వీటిలో రూపొందించారు. ఆర్కిటెక్చరల్ ఆర్టిస్టుల బృందం ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో పెద్ద ఎత్తున ఇంటరాక్టివ్ ఇన్‌స్టాలేషన్‌ను ఆవిష్కరిస్తుంది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ ఆర్ట్ వీక్ జరుగుతుంది. వేడుకగా వింటర్ ఆర్ట్ వీక్ -
విజయవాడలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Kukur Tihar: శునకాల పండుగ
కుక్క మనిషి పట్ల చాలా విశ్వాసంగా ఉంటుంది. మరి మనిషి దానికి కృతజ్ఞత ప్రకటించే పండుగ చేసుకోవాలి గదా. నేపాలీలకు శునకాలంటే చాలా ప్రీతి. వారు దీపావళి మరుసటి రోజును ‘కుకుర్ తిహార్’ పేరుతో శునకాల పండుగ నిర్వహిస్తారు. ఆ రోజు పెంపుడు శునకాలకు, వీధి కుక్కలకు పూజలు చేసి వాటికి ఇష్టమైన ఆహారం పెడతారు. మూగ జీవులకు మనిషి ఆశ్రయం ఇచ్చి వాటిని పెంచాలనే సందేశం ఈ పండుగలో ఉంది.నేపాల్‌లో శునకాల మీద ప్రేమ బాల్యం నుంచి నేర్పిస్తారు. అక్కడ దీపావళి పండుగ ఐదు రోజుల పాటు చేస్తారు. మొదటి రోజు దీపావళి అయితే రెండోరోజు ‘కుకుర్ తిహార్’. అంటే శునకాల పండుగ. ఆ రోజున శునకాలకు పూజ ఎలా చేయాలో ఇళ్లల్లో ఉన్న నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలకు నేర్పిస్తారు. ‘పిల్లలూ... మనిషిని ఏ స్వార్థం లేకుండా ప్రేమించే జీవి కుక్క ఒక్కటే. అది మనతోపాటే ఉంటుంది. మనల్ని కనిపెట్టుకుని ఉంటుంది. అంతేకాదు... మనం చనిపోయాక స్వర్గం వరకూ దారి చూపించేది అదే. అందుకే దానికి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టాలి. కుకుర్ తిహార్ రోజు దానికి పూజ చేసి నమస్కరించుకోవాలి’ అని చెబుతారు.నేపాలీలు తరతరాలుగా ఇలా ఈ సంప్రదాయాన్ని అందిపుచ్చుకుని ‘కుకుర్ తిహార్’ నిర్వహిస్తారు.కుంకుమ బొట్టు... బంతి పూల మాల‘కుకుర్ తిహార్’ రోజు పెంపుడు కుక్కలకు గాని, ఇంటి కుక్కలకు గాని ప్రతి ఇంటి వారు తప్పక పూజ చేస్తారు. పూజలో మొదట కాళ్లు కడుగుతారు. ఆ తర్వాత దానికి పసుపు, కుంకుమ బొట్లు పెడతారు. ఆ తర్వాత నేత దారంతో చేసిన దండ తొడుగుతారు. ఆపైన బంతి పూల మాల వేస్తారు. ఆ పైన హారతి ఇచ్చి నమస్కరించుకుంటారు. ఇక అప్పుడు దానికి కొత్త బంతి, కొత్త బొమ్మలు ఇచ్చి ఉడికిన గుడ్లు, బిస్కెట్లు లాంటివి తినిపిస్తారు. కుక్కలు కూడా బుద్ధిగా కూచుని ఇవన్నీ చేయించుకుంటాయి. తమ యజమానులను మరింతగా ప్రేమిస్తాయి.విశ్వాసానికి కృతజ్ఞతకుక్కలా విశ్వాసంగా ఉండే జీవి మరొకటి లేదు. చరిత్రలు దాదాపు 14 వేల సంవత్సరాల క్రితం నుంచే మనిషికి, కుక్కకు స్నేహం కుదిరిందని ఆధారాలు చెబుతున్నాయి. మనిషి మచ్చిక చేసుకున్న మొదటి జంతువు కుక్క. నేపాలీలు మరో అడుగు వేసి కుక్క యముడికి తోడుగా వస్తుందని భావిస్తారు. మృత్యు సమయంలో అది సహాయంగా ఉండి దారి చూపుతుందని నమ్ముతారు. అందుకే కుకుర్ తిహార్ ఎంతో శ్రద్ధగా జరుపుతారు. మరో విషయం ఏమిటంటే కుక్కలకే కాదు మూగ జీవులకు ఆశ్రయం ఇవ్వడం మనిషి బాధ్యత అని, వాటిని పోషించే ఓర్పు మనిషికి ఉండాలని చెప్పడానికి కూడా ఈ పండుగ జరుపుకుంటారు. -
Diwali 2024 పలు కారణాల పండగ
ఎంతో విస్తృతీ, వైవిధ్యం గల భారతదేశంలో, భిన్నత్వంలో అంతర్లీనంగా ఉండే ఏకత్వానికి దీపావళి పండగ ఒక ప్రతీక. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండగ జరుపుకుంటారు. కానీ ఈ పండగ ప్రాశస్త్యానికీ, ప్రాముఖ్యతకూ వెనక కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది.దక్షిణ భారతంలో నరకాసుర వధ కథ ప్రసిద్ధం. సత్యభామా సహితుడై, శ్రీకృష్ణుడు ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకుడిని సంహరించాడు. కనుక అది నరక చతుర్దశి. ఆ మరునాటి విజయోత్సవ దినం దీపావళి. కానీ ఉత్తర భారతంలో ఈ కథ తెలిసిన వారే అరుదు. ఉత్తర భారతంలో, రావణ సంహారం జరిపి రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ దినంగా దీపావళి అమావాస్యకు గుర్తింపు. అందుకే ఆరోజు మహోత్సవం. అంతటి మహోత్సవం గనక చిన్న దీపావళి (చతుర్దశి), పెద్ద దీపావళి అని రెండు రోజులు జరుగుతుంది. తూర్పున వంగ దేశంలో దీపావళి అమావాస్య... కాళీ పూజ పర్వదినం. పశ్చిమాన గుజరాత్ వాసులకు దీపావళి అమావాస్య సంవత్సరాంతం. అమావాస్య ముగుస్తూనే నూతన సంవత్సరాది. రాజస్థాన్‌లో చాలా ప్రాంతాలలో దీపావళి అమావాస్య నాడే ఉగాది. ఆరోజు వైభవంగా లక్ష్మీ పూజ చేసి, కొత్త పద్దు పుస్తకాలకు శ్రీకారం చుట్టడం భాగ్యప్రదమని అక్కడి వ్యాపారస్థులు భావిస్తారు.జైనులకు దీపావళి అయిదు రోజుల పండగ. జైన ప్రవక్త మహావీరుడు, నేటికి సరిగ్గా 2,550 సంవత్సరాల క్రితం, దీపావళి అమావాస్యనాడు మోక్ష ప్రాప్తి (నిర్వాణం) పొందాడు. అమావాస్య ముందు త్రయోదశి నాడు ఆయన తన శిష్యులకు ఆఖరి బోధనలు ఆరంభించాడు. ఆ త్రయోదశి ‘ధన్య త్రయోదశి’ (ధన్–తేరస్). ఆ రోజు వాళ్ళు ధ్యానాది సాధనలలో గడిపే పవిత్ర దినం. కాలగతిలో ‘ధన్–తేరస్’ను ధన త్రయోదశిగా జరుపుకొనే ఆనవాయితీ అనేక ప్రాంతాలలో ఆరంభమైంది.అమావాస్య నాడు మహావీరుడనే మహత్తరమైన ‘జ్ఞాన జ్యోతి’ అంతర్ధానమవటం వల్ల కలిగిన అంధకారాన్ని ఆయన శిష్యగణం దివ్వెల వరసలు (దీప– ఆవళులు) వెలిగించి తొలగించటానికి చేసే ప్రయత్నంగా ఈ దీపావళులకు చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వర్ధమానుడు దూరమవడంతో, దుఃఖ సాగరంలో మునిగి, చేష్టలుడిగిన నంది వర్ధనుడనే రాజును, శుక్ల విదియనాడు, ఆయన సోదరి సుదర్శన తన ఇంటికి ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి, వైరాగ్య బోధన చేసి ఊరడించిన సందర్భం ‘భాయి–దూజ్’.దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు! – ఎం. మారుతి శాస్త్రి -
‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’
దీపావళి పండగను పురస్కరించుకుని చాలా మంది విభిన్న రీతుల్లో వేడుకలు నిర్వహించుకుంటారు. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ముఖేశ్ అంబానీ గారాలపట్టి, ఆయన కూతురు ఇషా అంబానీ దీపావళి రోజును ఎలా జరుపుకుంటారో తెలిపారు. ఇంటిల్లిపాది ఎలా వేడుకలు నిర్వహించుకుంటారో తెలియజేశారు. తన వ్యాపారాలు వృద్ధికి ఈ పండగ ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు.‘చిన్ననాటి నుంచి నాకు పండుగలంటే చాలా సరదా. ఆ సమయంలో మా ఇల్లు బంధువులతో, పండుగ వేడుకలతో కళకళలాడుతుంది. ఎన్ని పనులున్నా అమ్మానాన్నలు వాటిని పక్కన పెట్టి మాతోనూ, బంధుమిత్రులతోనూ గడుపుతారు. బిజీ జీవితంలో పండుగలు మా అందరికీ ఓ ఆటవిడుపులా దోహదపడుతాయి. అంతేకాదు ఎన్నో విషయాల్నీ శాస్త్రాల్నీ తెలియజేస్తుంటాయి. అయితే నాకు అన్ని పండుగల్లో కెల్లా దీపావళి అంటే చాలా ఇష్టం. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం, ఆ వెలుగును చూస్తూ ఆనందించడం అలవాటు. ఆ కాంతులు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ పండగ వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. టపాసుల విషయానికొస్తే పక్షుల్నీ, జంతువుల్నీ భయపెట్టీ, పర్యావరణానికి హాని చేసే వాటికి నేను దూరం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించే ఏకైక దేశం భారత్!ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్‌మెడ్స్ ఫ్రెష్‌పిక్ -
టీమిండియా కెప్టెన్ ఇంట కర్వా చౌత్ వేడుకలు (ఫొటోలు)
-
దేవర గట్టు కర్రల సమరం.. పగిలిన తలలు
సాక్షి, కర్నూలు: దేవరగట్టు ఉత్సవాల్లో మరోసారి తలలు పగిలాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. అయితే ఉత్సవ మూర్తుల్ని దక్కించుకునేందుకు వందలాది భక్తులు పోటీ పడ్డారు. కర్రల సమయంలో 100మందికి పైగా గాయాలయ్యాయి. 100మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. నిప్పు రవ్వలు పడి మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ భక్తుల్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ‘బన్ని’ ఉత్సవం ప్రత్యేకత ఇదే..గట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం అనంతరం ‘బన్ని’ ఉత్సవంగా జరిగే కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేవరగట్టు ఆలయ నిర్వాహణ బాధ్యత మోస్తున్న పరిసర గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువుకట్ట (డొళ్లిన బండే) వద్దకు చేరి కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. అనంతరం గ్రామపెద్దలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కంట్రోల్ రూం వద్దకు వచ్చి కొండపై జరిగే కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా వారికి బండారాన్ని ఇచ్చి వెళ్తారు.అనంతరం బాణసంచా పేల్చి ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో అప్పటికే అక్కడ ఉంచిన మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో ఉన్న మాళమ్మ ఉత్సవ విగ్రహంతో వేదపండితుల భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అర్ధరాత్రి వేళ కల్యాణోత్సవం జరిపిస్తారు.అనంతరం ఉత్సవమూర్తులను తీసుకుని జైత్రయాత్రను సాగించడానికి కొండ దిగే వేళ కర్రలు గాలిలోకి లేస్తాయి. దివిటీలు భగ్గుమంటాయి. ఈ సమయంలో కర్రలు భక్తుల తలలకు తగిలి గాయపడతారు. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవం అనంతరం జరిగే ఈ మొగలాయిలో పాల్గొంటారు. మొగలాయిలో భక్తులు చేతుల్లో ఉన్న కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు.ఈ సమయంలోనే చాలా మందిపై దివిటీలు మీద పడటం, భక్తుల తోపులాటలో కిందపడటంతో తీవ్రంగా గాయపడి గతంలో కొందరు మృత్యవాత పడ్డారు. ఉత్సవాల్లో గాయపడిన భక్తులకు స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర స్వామి వారి ఊరేగింపుతో ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. ఉత్సవ వివరాలు ఇలా..12న శనివారం రాత్రి మాంగల్యధారణ–కల్యాణోత్సవం (బన్ని), అనంతరం జైత్రయాత్ర మొదలై రక్షపడి (రక్త తర్పణం చేయుట) మీదుగా శమీ వృక్షం చేరుతుంది 13న ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి (కార్ణీకం) వినిపిస్తాడు 14న నెరణికి గ్రామ పురోహితుల చేత స్వామి వారికి పంచామృతం, రథోత్సవం15న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన 16న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి -
ఫెస్టివ్ లుక్.. ఫ్యాషన్ క్లిక్..
వరుసగా రెండు పెద్ద పండుగలు వచ్చేస్తున్నాయి. పుట్టినరోజులు, నైట్ పార్టిలు, వార్షికోత్సవాలు తదితర సందర్భాల్లో ధరించే దుస్తులతో నగరవాసులు అత్యాధునిక ఫ్యాషన్‌కు కేరాఫ్ అ‘డ్రెస్’లా మారిపోతారు. అయితే పండుగల సందర్భం మాత్రం పూర్తిగా విభిన్నం. తమ ఫెస్టివల్ లుక్ మోడ్రన్‌గా మెరిపించడంతో పాటు ట్రెడిషన్‌కు కేరాఫ్‌గా కూడా చూపించాలని తపిస్తారు. అలాంటి ఫ్యాషన్ ప్లస్ ట్రెడిషన్ ప్రియులైన నగర యువత కోసం నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ పలు సూచనలు అందిస్తోంది. ఇటీవల గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్ ద్వారా శారీ డ్రేపింగ్ స్టైల్స్ ప్రభావితమవుతున్నాయి. ముందుగా కుట్టిన చీరలు, ధోతీ స్టైల్ ప్యాంట్ తరహా చీరలు, కేప్ స్టైల్ డ్రేప్స్.. వంటి వినూత్న పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ స్టైల్స్‌లో అసిమెట్రికల్ కట్స్, స్ట్రక్చర్డ్ సిల్హౌట్‌లతో సహా పాశ్చాత్య ఫ్యాషన్ మేళవింపులతో విభిన్న రకాల మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇవి సంప్రదాయ చీరల్ని అత్యాధునికంగా మారుస్తాయి. వీటితోపాటు అనేక రకల సంప్రదాయ దుస్తులు ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి..డిజైనర్స్ సూచనలు.. పండుగ సీజన్లో స్టైలి‹Ùగా, సౌకర్యవంతంగా ఉండటానికి లైమ్ గోటా పట్టి ఉన్న చందేరి కార్డ్ సూట్ సెట్‌ను ఎంచుకోవచ్చు. ఇది మోనోక్రోమాటిక్ లుక్స్‌కి రంగురంగుల వైబ్స్‌ని జోడిస్తుంది. ఎంబ్రాయిడరీ చేసిన ఐవరీ కో–ఆర్డ్ షరారా పండుగ దుస్తులకు పర్ఫెక్ట్ క్లాసిక్ చిక్ రూపాన్ని అందిస్తుంది. బ్లేజర్లు కార్పొరేట్ స్టైల్‌కి మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ, ఇటీవల ఆల్–టైమ్ ఫేవరెట్‌గా మారాయి. ఒక ఎంబ్రాయిడరీ బ్లేజర్‌ను డ్రేప్డ్ స్కర్ట్ లేదా ధోతీ ప్యాంట్‌తో మేళవించాలి. నడుముకు బెల్ట్‌తో ఏ సమయంలోనైనా ఈ డ్రెస్ బెస్ట్ ఎంపికగా నిలుస్తుంది. ఈ నవరాత్రి రోజుల్లో మస్టర్డ్ షరారా చీర ధరిస్తే చాలా స్టైలి‹Ùగా, తేలికగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది. డ్రేప్డ్ బాటమ్తో సెట్ చేసే డ్రెస్సులు ఇటీవల ట్రెండ్‌లో ఉన్నాయి. పర్ఫెక్ట్ ఈవెనింగ్ వేర్ కోసం డ్రేప్డ్ స్కర్ట్, ఎంబ్రాయిడరీ క్రేప్‌తో జత చేయాలి. అదనపు డోస్ కోసం సీక్వెన్స్ జుతీస్ బెస్ట్. పేస్టెల్, బ్రైట్ కలర్స్‌తో ఓ సరికొత్త చిక్ కాంబినేషన్. ఈ ఆఫ్–వైట్– పింక్ కేడియా టాప్, షెల్– మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన షార్ట్ అవుట్‌ఫిట్‌తో ప్రకాశవంతమైన పసుపు ధోతీతో జతగా ధరించవచ్చు. ఆధునిక– సంప్రదాయాల సమ్మేళనంతో డిజైన్ చేసిన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఉన్న స్కార్లెట్ సిల్క్ లెహెంగా పలాజో సెట్ ధరిస్తే..కలల రూపం సొంతమవుతుంది.. సల్వార్ కమీజ్ అందంగానూ, సౌకర్యవంతంగానూ ఉంటుంది. ప్రకాశవంతమైన రంగులతో కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్నవి ఎంచుకోవచ్చు. వివాహాలు, పండుగలు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో చనియా చోళీ ధరిస్తారు. వీటికి ఆధునిక ఉపకరణాలు, ఆభరణాలను జత చేస్తున్నారు. పిల్లల కోసమైతే తక్కువ బరువున్న ఆభరణాలను ఎంచుకోవాలి. పిల్లల దుస్తులను సొంతంగా లేదా ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవచ్చు. పిల్లలతో సరిపోలే దుస్తులను ధరించడం వల్ల యూనిక్ ఫ్యామిలీ అనిపించుకోవచ్చు. పిల్లల దుస్తులు సౌకర్యంతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పండుగ వేడుకల్లో డ్యాన్స్ చేసేటప్పుడు జారిపడకుండా ఉండేలా పొడవును, సౌకర్యాన్ని నిర్ధారించుకోవాలి. ప్రమాదాన్ని కలిగించేలా పదునైన ఉపకరణాలు, ఆభరణాలకు దూరంగా పెట్టాలి. పురుషుల కోసం.. ఎతి్నక్వేర్తో పండుగ లుక్‌ను మార్చుకోవాలని భావిస్తే.. కుర్తా కరెక్ట్. ఏ సందర్భానికైనా నప్పే కాలాతీత ఫ్యాషన్‌గా కుర్తాను ఎంచుకోవచ్చు. సరైన రీతిలో ఫిట్ అయ్యే కుర్తా–పైజామా ఎల్లప్పుడూ స్టైలిష్ లుక్‌ని అందిస్తాయి. ఇంకొంచెం కొత్తగా కనిపించాలంటే.. కుర్తాకి నెహ్రూ జాకెట్‌ని జత చేయవచ్చు. మొత్తంగా మెరిపించే సత్తా ఈ కాంబినేషన్‌కి ఉంది. అదే విధంగా షేర్వానీలు కూడా వేడుకలకు నప్పే ఎంపికలు. పండుగలకు ఇవి సరైన ఛాయిస్. అలాగే దీపావళి పారీ్టలకు కూడా కరెక్ట్‌గా నప్పుతాయి. ఎరుపు రంగు షేడ్.. సంప్రదాయ పండుగల్లో చాలా అర్థవంతమైన వర్ణంగా పేర్కొంటారు. నేవీబ్లూ, బ్లాక్, వైట్, ప్లమ్, ఆలివ్ గ్రీన్.. కూడా నప్పే ఎంపికలే. యాక్సెసరీస్... భారీ ఆభరణాలను ఉపయోగించే బదులు బ్యాంగిల్స్, జూకాలు (చెవిపోగులు), బిందీలు, హెయిర్‌పిన్ వంటి తక్కువ బరువున్న వాటిని యాక్సెసరీస్‌గా ఎంచుకోవాలి. -
కావ్య మండవతో దసరా ప్రత్యేక ఇంటర్వ్యూ
-
విజయవాడ : దసరా సందర్భంగా సిద్ధార్థ ఆడిటోరియంలో యువజనోత్సవాలు (ఫొటోలు)
-
నేటినుంచి పూల పండుగ: ఇల్లిల్లూ ఓ గుడి... వీధంతా సింగిడి
తెలంగాణ అంతటా గ్రామ గ్రామాల్లో సంబరంగా చేసుకునే పండగ బతుకమ్మ పండుగ. ఆటపాటలతో, ఆనందంగా ప్రజలు తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే ఒక సామాజిక జీవన సంరంభం ఈ పండుగ. వానాకాలం వెళ్లేముందు తెలంగాణ ప్రాంతంలో విరబూసే తంగేడు పూలతో సింగారించుకున్న పల్లె పడుచులతో ఎటు చూసినా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అలుగులు పారే చెరువులూ, నిండుగా ఉన్న కుంటలూ, ఆపైన గట్లమీద పూసే వెండి జిలుగుల గునుగుతో పల్లెలు అందాలు సంతరించుకుకుంటాయి.పూరిగుడిసెలమీద, పందిరిమీద, పొదలమీద, పెరట్లోనూ, విరగబూసిన బీరపూలూ, గుమ్మడిపూలు, కట్లపూలు, బంతిపూలతో పసిడి పూసినట్లుగా హరివిల్లులా– కనిపిస్తాయి గ్రామీణ కుటీరాలు. ఇంద్రధనుస్సు దిగివచ్చిందా అన్నట్లు బతుకమ్మ పూలతో నిండుగా నవ్వుతూ స్వాగతం పలుకుతాయి పొలంగట్లు. పూలు కోసుకురావడం ఒక్కటే మగవారి వంతు. ఇక ఆ తర్వాత హడావుడి అంతా ఆడవాళ్లదే. పుట్టిన పిల్లలు పురిటిలోనే చనిపోతుంటే ‘బతుకమ్మ’ అంటూ ఆ జగన్మాత పేరు పెడితే పిల్లలు బతుకుతారన్న విశ్వాసం ఈనాటికీ తెలంగాణలో ఉంది.తెలంగాణ సంస్కృతికీ, వైభవానికీ ప్రతీకగా నిలిచే ఈ తొమ్మిదిరోజుల పండుగ మహాలయ పక్ష అమావాస్యతో ఆరంభం అవుతుంది. కొన్నిచోట్ల పితృ అమావాస్య రోజు మట్టితో చేసిన బొడ్డెమ్మలను సాగనంపి, ఆ తెల్లవారినుంచి, ప్రతిరోజూ సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి లయబద్ధంగా ఆడతారు. ఆ పాటలు లక్ష్మీదేవి, గౌరమ్మ, పార్వతి, శివుడు, బతుకమ్మ మీదనే ఎక్కువగా ఉంటాయి.అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో తెలియజేయడంతో పాటు ఆడపిల్లలకు సంబంధించిన అనేక విషయాలమీదే ఉంటాయి. ధనిక, పేద అనే భేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఆడుకునే పాడుకునే ఒక అద్భుతమైన పండుగ. భాద్రపద అమావాస్య అక్టోబరు 2నప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల పాటూ వైభవంగా సాగి, అక్టోబరు 10న సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. – డి.వి.ఆర్. -
అవును... అది యాపిల్ కోతల పండుగ!
ఏటా శరదృతువు ప్రారంభంలో యాపిల్ కోతల కాలంలో అక్కడ పండుగ జరుపుకొంటారు. ఊరంతా భారీస్థాయిలో యాపిల్పండ్ల ప్రదర్శనలు కనిపిస్తాయి. కూడళ్లలో యాపిల్పండ్లతో తీర్చిదిద్దిన కళాఖండాలు కనువిందు చేస్తాయి. ఈ విలక్షణమైన పండుగ స్వీడన్లో సిమ్రిషామ్ మునిసిపాలిటీ పరిధిలోని కివిక్ ప్రాంతంలో జరుగుతుంది. ‘కివిక్ యాపిల్ మార్కెట్ ఫెస్టివల్’గా పేరుపొందిన ఈ పండుగకు స్వీడన్ నలుమూలల నుంచే కాకుండా, యూరోప్‌లోని పలు ఇతర దేశాల నుంచి కూడా జనాలు పెద్దసంఖ్యలో వస్తుంటారు.యాపిల్ కోతల పండుగ రోజుల్లో కివిక్ ప్రాంతంలోని పిల్లా పెద్దా అందరూ యాపిల్ తోటల్లోకి, శివార్లలోని చిట్టడవుల్లోకి వెళ్లి యాపిల్‌పండ్లను కోసుకొస్తారు. యాపిల్ బుట్టలు మోసుకుంటూ, సంప్రదాయ నృత్య సంగీతాల నడుమ ఊరేగింపులు జరుపుతారు. యాపిల్ విస్తారంగా పండే కివిక్ను ‘యాపిల్ కేపిటల్ ఆఫ్ స్వీడన్’ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి రకరకాల యాపిల్‌పండ్లు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.కివిక్లో జరిగే యాపిల్ పండుగను చూడటానికే కాకుండా, ఇక్కడి పురాతన రాతియుగం నాటి ఆనవాళ్లను, కాంస్యయుగానికి చెందిన మూడువేల ఏళ్ల నాటి శ్మశాన వాటికను, అందులోని ఆనాటి రాజు సమాధిని చూడటానికి కూడా పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు సిమ్రిషాన్ స్థానిక పరిపాలనా సంస్థ 1988 నుంచి ఇక్కడ యాపిల్ పండుగను వార్షిక వేడుకగా నిర్వహించడం ప్రారంభించింది. యాపిల్ పండుగ సందర్భంగా ఊళ్లో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఏడాది యాపిల్ పండుగ వేడుకలు సెప్టెంబర్ 28న మొదలయ్యాయి. ఈ వేడుకలు అక్టోబర్ 6 నాటితో ముగుస్తాయి. -
Dussehera 2024 : నవరాత్రి స్పెషల్, కమ్మని ప్రసాదాల తయారీ
దసరా వేడుకలకు సమయం సమీపిస్తోంది. ఒకవైపు షాపింగ్, మరోవైపు పిండివంటలు సందడి షురూ అయిపోయింది. తొమ్మిది రోజులు అమ్మవారికి పలు రకా నైవేద్యాలు మాత్రమేకాదు, ఇంటికొచ్చే అతిథులకు, మనవళ్లు, మనవరాళ్లకు రకరకాల వంటలు చేసి పెట్టాల్సిందే. ముఖ్యంగా స్వీట్లపై పెద్ద పీట. అటు అమ్మవారికి నైవేద్యంగా ఉపయోగపడేలా, ఇటు ఇంట్లో అందరూ ఇష్టంగా తినేలా కొన్ని వంటకాలు చూద్దాం.పండుగరోజు పులిహోర, పూర్ణం బూరెలు,గారెలు, బొబ్బట్లు (భక్య్షాలు) తదితర వంటకాలు చేసుకోవడం అలవాటు. కానీ సులువుగా చేసుకొనే మరికొన్ని వంటకాలను చూద్దాం.పెసరపప్పు పొంగలికావాల్సిన పదార్థాలుబియ్యం - ఒక కప్పుపెసరపప్పు - ఒక కప్పుబెల్లం - రెండు కప్పులుకొబ్బరి ముక్కలు - అరకప్పుజీడిప్పులు ,బాదం, కిస్ మిస్కొద్దిగా, యాలకు పొడి అరస్పూనునెయ్యి - అర కప్పుతయారీ బాండ్లీలో కొద్దిగా నెయ్యి వేసి, కొబ్బరి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాతజీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులను నేతిలో దోరంగా వేయించుకోవాలిఇప్పుడు బియ్యం, పెసపప్పు బాగా కడిగి నీళ్లుపోసి నాలుగు మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చిక, అన్నంలో ముందుగా తరిగిపెట్టుకున్న బెల్లం తురుము వేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. బెల్లం పాకం వచ్చి, పాయసంలాగా తయారవుతూ, కమ్మని వాసన వస్తూంటుంది. ఇపుడు ముందుగా వేయించుకున్న కొబ్బరిముక్కలు, జీడిపప్పులు, కిస్ మిస్లు,బాదం పలుకులు వేసి బాగా కలపాలి. చివర్లో కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసుకుంటే కమ్మని పెసరపప్పు పొంగలి నైవేద్యం రెడీ.కట్టు పొంగలి కావలసిన పదార్థాలుబియ్యం: రెండు కప్పులు,పెసరపప్పు: ఒక కప్పు, మిరియాలు, జీలకర్రకరివేపాకు రెండు రెబ్బలు, అయిదారు పచ్చిమిరపకాయలు కొద్దిగా నెయ్యి, నూనె,ఉప్పు తగినంత, చిటికెడు ఇంగువ: చిటికెడుతయారీ: ఒకటి రెండు చొప్పున పెసరప్పు, బియ్యం శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.ఇపుడు స్టవ్‌మీద మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తరువాత కొలతకు తగ్గట్టుగా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానిన బియ్యం, పప్పు , ఉప్పు వేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికాక నేతిలో వేయించుకొన్న జీడిపప్పులు వేసుకోవాలి. అంతే మిరియాలు, ఇంగుల ఘాటుతో, వేడి వేడి నెయ్యితో రుచికరమైన కట్టు పొంగలి రెడీ.బాదం పాయసంకావాల్సిన పదార్థాలుబాదం పప్పులు: ఒక కప్పుపాలు - ఆరు కప్పులుపంచదార - ఒక కప్పునీళ్లు - ఒక గ్లాసుకుంకుమ రేకలు: అయిదు రేకలుతయారీ: ముందుగా బాదం పప్పులను నానబెట్టుకోవాలి. శుభ్రంగా పొట్టుతీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇపుడు కడాయి పెట్టి చిక్కని పాలు పోసి బాగా మరగనివ్వాలి. పాలు మరిగాక బాదం పేస్టు వేసి బాగా కలపాలి. కదుపుతూ పదినిమిషాల పాటూ ఉడికించాలి. బాదం పాలల్లో బాగా కలిసాక, పంచదార వేయాలి. పంచదార వేసాక పాయం చిక్కబడుతుంది. అడుగు అంటకుండా మెల్లగా కలుపుతూ మరింత చిక్కగా అయ్యేదాకా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇపుడు కొద్దిగా యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు రేకులను అలా పైన చల్లుకోవాలి. అంతే, టేస్టీ, టేస్టీ బాదం పాయసం సిద్దం. -
చెరువులో మునిగి ఎనిమిది మంది చిన్నారులు మృతి
పట్నా: బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జీవితపుత్రిక పర్వదినం సందర్భంగా రెండు వేర్వేరు గ్రామాల్లోని చెరువులలో స్నానాలు చేస్తూ ఎనిమిది మంది చిన్నారులు నీట మునిగి మృతి చెందారు.ఔరంగాబాద్ జిల్లా పరిధిలోని మదన్‌పూర్ బ్లాక్‌లోని కుషాహా గ్రామంలోను, బరున్ బ్లాక్‌లోని ఇతత్ గ్రామంలోను చెరువులో స్నానం చేస్తూ చిన్నారులు మృతిచెందడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ శ్రీకాంత్ శాస్త్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ జీవితపుత్రిక పండుగ సందర్భంగా పుణ్యస్నానం చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ చెరువులకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆయా చెరువుల వద్దకు వెళ్లి, బాధితులను బయటకు తీసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: సీఎంను తాకిన వైద్యుల నిరసన సెగ -
Dussehra 2024 సంబరాల దసరా: ఇంత తతంగం ఉంటుంది!
దసరా.. అన్ని వర్గాల వారికీ ఆనందాన్ని పంచే పండగ! ఎన్నో సెంటిమెంట్లను సరదాలను, మెసుకొచ్చే శుభదినం. కొత్త బట్టలు, కొత్త కార్లు, కొత్త ఇల్లు, సరికొత్త ఆభరణాలు కొత్త మొబైల్, ఇలా కొంగొత్తగా వేడుక ఉండాలని ఆరాట పడతారు. కొత్త వ్యాపారాలు చేసే వారు దసరా ముహూర్తం కోసం ఎదురు చూస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయల్లా విలసిల్లాలని మొక్కుకుంటారు. అంతేనా ఉద్యోగులకు బోనస్‌లు, బహుమతులు అబ్బో.. ఆ సందడే వేరు! మనసంతా షాపింగ్సరదా అంటేముందుగా గుర్తొచ్చేది షాపింగ్. ఆఫ్లైన్లైనా ఆన్లైన్లైనా షాపింగ్ మాత్రం మస్ట్. దీన్ని క్యాష్ చేసుకునేందుక రకకరకాల ఆఫర్లతో మురిపిస్తుంటాయి కంపెనీలు. ఏ మాత్రం హడావిడి లేకుండా, జాగ్రత్తగా షాపింగ్ చేసేయ్యడమే. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. మనకి కావలన్నపుడు నచ్చినవి దొరక్క, డీలా పడ్డం కాదు, చీప్‌గా దొరికినపుడు దక్కించుకోవడమే ఇదీ లేటెస్ట్ ట్రెండ్కలిసొచ్చే సెలవులుదసరా అంటే పిల్లలకు కూడా చాలా సంబరం. ఎందుకంటే దాదాపు పది రోజులు ఎంచక్కా సెలవులొస్తాయి. అమ్మచేతి కమ్మనైన వంటలు (అపుడపుడు మొట్టికాయలు కూడా) తినేయొచ్చు. కొత్త బట్టలొస్తాయి, కొత్త బొమ్మలూ వస్తాయి. సన్నిహిత బంధువుల పిల్లకాయలొస్తారు. ఇంకేంముంది ఇల్లు పీకి పందిరేయడమే.స్వీట్లుస్వీట్లు లేని దసరా ఊహించుకోగలమా? చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆ జగన్మాతను పూజించుకోవడంతోపాటు, నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. లడ్డూలు, జిలేబీలు, గులాబ్ జామూన్ పూతరేకులతోపాటు, జంతికలు, కారప్పూస, సఖినాలు ఇలా రకరకాల పిండి వంటల తయారీలో మహిళలు ఫుల్ బిజీగా ఉంటారు. ఇక దసరా నాడు, గారెలూ, బజ్జీలూ, వడలు, ఇక ఆ తరువాత కోడికూర, మటన్ మంచింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దసరా భక్తిదసరా' అనే 'దశ' అంటే 'పది' ,'హర' అంటే 'ఓటమి' అనే రెండు సంస్కృత పదాలనుంచి వచ్చింది. దసరా నవరాత్రులు, లేదా దేవీ నవర్రాతులు పేరుతో తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మను కొలుస్తారు. ఈ శరన్నవ రాత్రల్లో దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి దేవాలయాలు సర్వంగా సుందరంగా ముస్తాబవుతాయి. రాముడు (విష్ణువు ఎనిమిదవ అవతారం), శని యుగంలో జన్మించిన పది తలల రాక్షసుడు రావణుడిని సహరించిన శుభ సందర్భాన్ని, పాండవుల అజ్ఞాత వాసం వీడి, శమీ వృక్షం మీదున్న ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న సందర్భాన్ని కూడా దసరాగా జరుపుకుంటారు. ఇందులో భాగమే రావణ దహనం, శమీ పూజలు తొమ్మిది రోజులు, తొమ్మిది అవతారాలుఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా పాటిస్తారు. శరదృతువు ఆరంభంలో వచ్చిన పండుగు కనుక శరన్నరాత్రులు అంటారు. ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు. తొమ్మిది రకాల పైవేద్యాలు సమర్పిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి. మహా సరస్వతి, నందయ, రక్త దంతి, శాకంబరి దుర్గ, మాతంగి, భ్రమరి అవతారాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. బాలాత్రిపుర సుందరి , గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, సరస్వతి మహిషాసరమర్ధిని, దర్గమ్మ, రాజరాజేశ్వరి, మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. బొమ్మల కొలువుదసరా సంబరాల్లో బొమ్మల కొలువు మరో ముఖ్యమైన ఆచారం. ఈ బొమ్మల కొలువును తీర్చిదిద్దడంలో మహిళలు, అమ్మాయిలు తమ కళాత్మక దృష్టిని ప్రదర్శిస్తారు. ఇది కేవలం భక్తిప్రధానమే కాక, విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా సంస్కృతీ సంపన్నమైన ఆచారాలకు ప్రతిబింబంగా ఉంటుంది. -
వినాయక మండపంలో రాజ్యాంగ పఠనం
జాల్నా: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు అంత్యంత వైభవంగా జరుగున్నాయి. అయితే మహారాష్ట్రలోని జాల్నాలో గణేశ మండపం ఒక ప్రత్యేకతను చాటుతోంది. ఇక్కడ ప్రతిరోజా సాయంత్రం వేళ వినాయకుని హారతి ఇచ్చిన అనంతరం భక్తులంతా సామూహికంగా రాజ్యాంగ ప్రవేశికను పఠిస్తున్నారు.ఈ సందర్భంగా వినాయక ఉత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, ప్రాథమిక హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమనే లక్ష్యంతో రోజూ రాజ్యాంగ పఠంనం చేస్తున్నామన్నారు. ఈ మండపాన్ని గణేష్ మహాసంఘ్ అధ్యక్షుడు అశోక్ పంగార్కర్ సారధ్యంలో ఏర్పాటు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రాయ్‌సాహెబ్ దానే, ఎమ్మెల్యే కైలాష్ గోరంట్యాల తదితరులు మండపాన్ని దర్శించుకున్నారు. -
దయ్యాల పండుగ..! ఒక రకంగా ఇది..?
దయ్యాల పండుగ (ఘోస్ట్ ఫెస్టివల్), ఆకలి దయ్యాల పండుగ (హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్) అని ఈ పండుగకు పేరు వచ్చినా, ఒకరకంగా ఇది పెద్దల పండుగ. ఆసియా దేశాల్లోని బౌద్ధ మతస్థులు, తావో మతస్థులు ఈ పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. బౌద్ధులు దీనిని ‘యులాన్పెన్’ పండుగ అని, తావో మతస్థులు ‘ఝోంగ్యువాన్’ పండుగ అని పిలుచుకుంటారు. చైనా కేలండర్ ప్రకారం ఏడో నెలలోని పదిహేనో రోజు వచ్చే ఈ పండుగను తైవాన్‌లో ‘పుడు’ అని, ‘పున్యాన్’ అని పిలుస్తారు. నిజానికి చైనా కేలండర్లోని ఏడో నెల అంతటినీ పెద్దల మాసంగా ‘ఘోస్ట్ మంత్’గా పాటిస్తారు.ఈ నెల అంతా మరణించిన పెద్దల ఆత్మసంతృప్తి కోసం రకరకాల ఆచారాలను పాటిస్తారు. పండుగ రోజున పెద్దల సమాధుల వద్ద అగరొత్తులు వెలిగిస్తారు. అలాగే, ‘జోస్ పేపర్’ అనే సుగంధభరితమైన కాగితాలను, దుస్తులు, మొక్కల పీచు వంటివి నింపి కాగితాలతో తయారు చేసిన ‘పాపీర్ మేష్’ అనే భారీ బొమ్మలను దహనం చేస్తారు. టాంగ్ వంశస్థుల పాలనాకాలంలో ఈ పండుగ జరుపుకోవడం మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బౌద్ధులు, తావో మతస్థులతో పాటు చైనాలోని వివిధ గిరిజన తెగలకు చెందిన వారు కూడా ఈ పండుగను తమ తమ పద్ధతుల్లో జరుపుకొంటారు.ఈ పండుగ రోజున తమ తమ కుటుంబాల్లో మరణించిన పెద్దలకు నచ్చిన ఆహార పదార్థాలను, పానీయాలను వారికి నైవేద్యంగా పెడతారు. బంధు మిత్రులతో కలసి విందు భోజనాలను ఆరగిస్తారు. నరకంలో చిక్కుకుపోయిన పెద్దల ఆత్మలు ఆకలితో బాధపడుతుంటాయనే భావనతో వారికి ఆకలి తీరేలా భారీగా నైవేద్యాలు పెడతారు. తావో మతస్థులు ఈ పండుగ రోజున నరకంలో బాధలు పడే తమ పూర్వీకుల పాపాలు నశించాలనే ఉద్దేశంతో ‘జోస్ పేపర్’తో తయారు చేసిన నరక లోకపు డబ్బును (హెల్ బ్యాంక్ నోట్స్) తగులబెడతారు.అలాగే, పెద్దల పాప విమోచనం కోసం ఈ పండుగ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సంప్రదాయ వేషధారణలు ధరించి, సంగీత నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొన్నిచోట్ల రంగస్థల వేదికలపై పరలోక పరిస్థితులను కళ్లకు కట్టే నాటకాలను ప్రదర్శిస్తారు. బౌద్ధులు, తావో మతస్థులు ఎక్కువగా ఉండే లావోస్, తైవాన్, వియత్నాం, కంబోడియా, మలేసియా, ఇండోనేసియా, నేపాల్, శ్రీలంక దేశాల్లోనూ ఈ పండుగను జరుపుకొంటారు. -
పండుగ డిమాండ్..లక్షల్లో గిగ్ జాబ్స్!
రాబోయే పండుగ సీజన్ కోసం కొలువుల సైరన్ మోగింది. కస్టమర్ల నుంచి అంచనాలను మించి డిమాండ్ ఉంటుందనే లెక్కలతో కంపెనీలు తాత్కాలిక ఉద్యోగుల (గిగ్ వర్కర్లు)లను పొలోమంటూ నియమించుకుంటున్నాయి. దీంతో గిగ్ హైరింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంటుందనేది హైరింగ్ ఏజెన్సీల మాట! – సాక్షి, బిజినెస్ డెస్క్పండుగల పుణ్యామా అని తాత్కాలిక హైరింగ్ జోరందుకుంటోంది. పరిశ్రమలవ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 7 లక్షల గిగ్ వర్కర్లకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని అంచనా. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఇది 15–20 శాతం అధికం కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకెళ్తుండటం.. స్టాక్ మార్కెట్లు కూడా మాంచి జోరుమీదుండటంతో వినియోగదారులు పండుగల్లో ఈసారి కొనుగోళ్లకు క్యూ కడతారని కంపెనీలు భావిస్తున్నాయి.పంట దిగుబడులు మెరుగ్గా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో గ్రామీణ డిమాండ్ కూడా దన్నుగా నిలుస్తుందని లెక్కలేస్తున్నాయి. వెరసి పండుగ అమ్మకాల కోసం కీలక పరిశ్రమలు తాత్కాలిక కొలువులతో రెడీ అవుతున్నాయని క్వెస్, ర్యాండ్ స్టాడ్, అడెకో, సీఈఐఎల్, హెచ్ఆర్ సరీ్వసెస్, టీమ్‌లీజ్ సరీ్వసెస్ తదితర హైరింగ్ సంస్థలు చెబుతున్నాయి.ఈ రంగాల్లో జోష్... రాఖీ పౌర్ణమితో మొదలయ్యే పండుగ సీజన్.. కేరళ ఓనమ్, వినాయక చవితి, దసరా, దీపావళి, చివర్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలతో ముగుస్తుంది. దీంతో ఈకామర్స్ సంస్థలు, రిటైల్ స్టోర్లు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్లాన్లు వేస్తున్నాయి. ఫుల్ డిమాండ్ ఉంటుందనన్న అంచనాలతో ఈ–కామర్స్, లాజిస్టిక్స్ కంపెనీలు తాత్కాలిక హైరింగ్‌కు గేట్లెత్తాయి. ఈ రెండు రంగాల గిగ్ నియామకాల వృద్ధి 30–35 శాతం ఉంటుందని భావిస్తున్నారు. మరోపక్క, కన్జూమర్, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్, తయారీ, పర్యాటకం–ఆతిథ్య రంగాలు కూడా పటిష్టమైన డిమాండ్‌ను అంచనా వేస్తున్నాయి. ‘పండుగ హైరింగ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్, మండుటెండల ప్రభావంతో ప్రజలు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. దీంతో, పండుగల్లో దండిగానే ఖర్చు చేసే అవకాశం మెండుగా ఉంది. అన్ని రంగాల్లోనూ కలిపి 6 లక్షల నుంచి 7 లక్షల మేర తాత్కాలిక ఉద్యోగాలు వెల్లువెత్తొచ్చని భావిస్తున్నాం’ అని క్వెస్ కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా పేర్కొన్నారు. కన్జూమర్ డ్యూరబుల్స్/గూడ్స్ కంపెనీలు కొత్త ఉత్పత్తులతో పండుగ షాపింగ్‌కు కొత్త కళ తీసుకొస్తున్నాయి. మరోపక్క, బ్యాంకులు/ఎన్బీఎఫ్సీలు సైతం లోన్లు, క్రెడిట్ కార్డుల జారీపై మరింత దృష్టి సారిస్తున్నాయి. రిటైల్ స్టోర్లలో తాత్కాలిక ఉద్యోగులను పెంచుకోవడం ద్వారా మరింత వ్యాపారాన్ని చేజిక్కించుకోవాలనేది వాటి ప్లాన్. దేశంలోని చాలా కంపెనీల వార్షిక వ్యాపారంలో మూడింట రెండొంతులు ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యే జరుగుతుందని అంచనా.చిన్న నగరాల్లో మరింత అధికంపట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండటం, మాల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ సంస్కృతి విస్తరిస్తుండటం.. వినియోగదారుల ఖర్చు కూడా పుంజుకోవడంతో చిన్న నగరాల్లో కూడా గిగ్ వర్కర్లకు మరింత డిమాండ్ జోరందుకుంది. ‘ముఖ్యంగా గౌహతి, బరోడా, జామ్‌నగర్, వైజాగ్, కటక్, జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, కోయంబత్తూరు, లక్నో, సూరత్, భువనేశ్వర్, భోపాల్, లూధియానా, చండీగఢ్ వంటి పలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు తాత్కాలిక ఉద్యోగులకు హాట్ స్పాట్లుగా నిలుస్తున్నాయి. గత సీజన్‌తో పోలిస్తే ఇక్కడ గిగ్ వర్కర్ల డిమాండ్‌లో 25–30 శాతం వృద్ధి కనిపిస్తోంది.పికర్లు, ప్యాకర్లు, వేర్‌హౌసింగ్ స్టాక్ నిర్వహణ ఉద్యోగులు, డెలివరీ సిబ్బంది, షాప్‌లలో, ఫీల్డ్‌లో ఉత్పత్తులను ప్రదర్శించే సేల్స్ పర్సన్ల వెంటపడుతున్నాయి కంపెనీలు’ అని హైరింగ్ సంస్థ అడెకో డైరెక్టర్ మను సైగల్ పేర్కొన్నారు. పండుగల్లో ఆఫర్ల జోరు నేపథ్యంలో ఈ–కామర్స్ రంగానికి సంబంధించిన డెలివరీ సిబ్బంది, కస్టమర్ సరీ్వస్ ప్రతినిధులు, ప్యాకేజింగ్, లేబులింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ సిబ్బంది నియామకాలు జోరందుకున్నాయని టీమ్‌లీజ్ సరీ్వసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణియన్ తెలిపారు. -
17, 18లలో అమెరికాలో భారత స్వాతంత్య్ర సంబరాలు
రాబోయే పంద్రాగస్టున భారతదేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరగనున్నాయి. ఇదే సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 17, 18 తేదీలలో 32వ ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ ఇండియా డే పరేడ్ జరగనుంది. ఆరోజున భారత్- అమెరికాల సంస్కృతుల సంగమం వెల్లివిరియనుంది. ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ గ్లోబ్ (ఎఫ్‌ఓజీ),ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఫ్ఐఏ) సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భారతదేశం-యుఎస్ఏ సాంస్కృతిక వారసత్వం కనిపించనుంది. ఇండియా డే పరేడ్, ఫెయిర్‌లో వేలాది మంది పాల్గొననున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వెల్నెస్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్, చిన్నారులను ఉత్సాహపరిచే కార్యక్రమాలు, కవాతు నిర్వహించనున్నారు.ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో 250కి పైగా నృత్య బృందాలు తమ కళలను ప్రదర్శించనున్నాయి. క్లాసికల్, ఫోక్, బాలీవుడ్, కాంటెంపరరీ, హిప్-హాప్ తదితర కేటగిరీలలో ఈ ప్రదర్శనలు జరగనున్నాయి. ఎఫ్‌ఓజీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ డాక్టర్ రోమేష్ జప్రా మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా తమ ఫెడరేషన్ అమెరికాలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నదన్నారు. -
ఇలాంటి కార్లు ఎప్పుడూ చూసుండరు (ఫోటోలు)
-
Eid Al-Adha 2024: మౌలిక విధులు..
ఇస్లామ్ ధర్మంలోని ఐదు మౌలిక సూత్రాల్లో ‘హజ్’ కూడా ఒకటి. కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనే మౌలిక సూత్రాల్లో ఏ ఒక్కదాన్ని నమ్మక పోయినా విశ్వాసం పరిపూర్ణం కాదు. అందుకని ఈ ఐదు అంశాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఇందులోని చివరి అంశం హజ్. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం మక్కాలో నిర్మించిన దైవ గృహ సందర్శనా ప్రక్రియను ‘హజ్’ అంటారు.హజ్ అనేది ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లిం జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక ఆచరించాల్సిన విధి. ఇది జిల్ హజ్జ్ నెల పదవ తేదీన మక్కాలో నిర్వహించబడుతుంది. అదేరోజు యావత్ ప్రపంచ ముస్లింలు ఈద్ జరుపుకొని ఖుర్బానీలు సమర్పిస్తారు. ఇస్లామీయ క్యాలండరులో ఇది చివరి నెల. దీని తరువాత కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.అందుకే ఈ నెలకు ఎనలేని ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ నెలలోని మొదటి పదిరోజులూ చాలా ప్రాముఖ్యం కలిగినవి. ఈ దశకంలో దైవ కారుణ్యం కుండపోతగా వర్షిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చేసే ప్రతి సత్కార్యమూ గొప్ప ప్రాముఖ్యాన్ని కలిగి దేవుని కృపకు పాత్రమవుతుంది. ఈ దినాల్లో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరం కావు. ఈరోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా (ఉపవాసం)... ఏడాది మొత్తం పాటించే రోజాలకు సమానం. ‘అరఫా’ (జిల్ హజ్ నెల 9వ తేదీ) నాటి ఒక్క రోజా రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అరఫా రోజు సైతాన్ ఘోర పరాజయాన్ని చవిచూస్తాడు. అవమాన భారంతో చితికి పోతాడు.‘అరఫా’ రోజు ‘లాయిలాహ ఇల్లల్లాహు వహదహూ లాషరీ కలహు, లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలాకుల్లి షయ్ ఇన్ ఖదీర్’ అనే దుఆ ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. దీనితో పాటు ‘తహ్ లీల్’ అంటే, ‘లాయిలాహ ఇల్లల్లాహ్’; ‘తక్బీర్’ అంటే, ‘అల్లాహుఅక్బర్’; ‘తహ్ మీద్’ అంటే, ‘అల్ హందులిల్లాహ్’; ‘తస్ బీహ్’ అంటే, ‘సుబ్ హానల్లాహ్’ అని తరచుగా ధ్యానిస్తూ ఉండాలి. అరఫా రోజే కాకుండా ‘అయ్యామె తష్రీఖ్’లో కూడా అంటే, పండుగ తరువాతి మూడు రోజులూ (జిల్ హజ్ నెలలోని 11, 12, 13 తేదీలు) వీలైనంత అధికంగా ఈ వచనాలు పఠించాలి. కనుక ఈ సుదినాలను సద్వినియోగం చేసుకుంటూ పండుగ ముందు రోజు పాటించే ‘అరఫా’ ఉపవాసం పాటించి, సత్కార్యాలు ఆచరిస్తూ దైవక్రృపకు పాత్రులు కావడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ సన్మార్గ పథం అనుగ్రహించుగాక! – మదీహా అర్జుమంద్ (నేడు బక్రీద్) -
వసంతోత్సవాలకు అంకురార్పణ
చంద్రగిరి (తిరుపతి జిల్లా): తిరుచానూరులో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. వసంతోత్సవాలకు అవరోధాలు కలగకుండా సకల దేవతలను కోరుతూ మంగళవారం రాత్రి పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు అంకురార్పణ నిర్వహించారు. అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. యాగశాలలో సిద్ధంగా ఉంచిన నవపాళికలలో పుట్టమన్ను నింపి, అందులో నవధాన్యాలు వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టడంతో వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల సందర్భంగా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యానవనంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, రాత్రి 7.30 గంటలకు తిరువీధోత్సవం నిర్వహించనున్నారు. రేపు స్వర్ణరథోత్సవం వసంతోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం 7.45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వసంతోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. వసంతోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. స్నపన తిరుమంజనం జరిగే మండపం చుట్టూ చల్లదనం కోసం వట్టివేళ్లతో తెరలను ఏర్పాటు చేశారు. భక్తులను ఆకట్టుకునేలా రంగోళి, అమ్మవారి చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలు, విద్యుత్ దీపాలంకరణతో ఉద్యానవనం నూతన శోభను సంతరించుకుంది. అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
-
దివ్యం.. భవ్యం.. రమ్యం రామచరితం
పితృవాక్పాలన, ధర్మవర్తన, సదా సత్యమే పలకడం, ప్రజానురంజకమైన పాలనను అందించడం.. వంటి ఎన్నో లక్షణాలను బట్టి అందరి గుండెల్లో దేవుడిగా కొలువు తీరాడు రాముడు. అయితే మన నిత్యజీవితంలో అసలు రామ శబ్దం లేనిదెప్పుడు? చిన్నప్పుడు లాల పోసి శ్రీరామ రక్ష చెప్పడం దగ్గరనుంచి ‘రామాలాలీ.. మేఘశ్యామాలాలీ’ అనే జోలపాటతో బిడ్డలను నిద్ర పుచ్చడం వరకు... అందరి జీవితాలలో రాముడు ఒక భాగంగా మారిపోయాడు. నేడు ఆ జగదభిరాముడు ఇలపై పుట్టినరోజు.. అంతేనా... ఆదర్శదంపతులుగా పేరు ΄పొందిన సీతారాముల పెళ్లిరోజు కూడా. ఈ సందర్భంగా ఆ పురుషోత్తముడి గురించి... ఆయన ఇక్ష్వాకు కుల తిలకుడు. దశరథ మహారాజ తనయుడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యంతోబాటు సర్వ సంపదలనూ, అన్నిసుఖాలనూ విడనాడి నారదుస్తులు ధరించి పదునాలుగేళ్లపాటు అరణ్యవాసం చేశాడు. ఎన్ని కష్టాలొచ్చినా వెరవలేదు. తాను నమ్మిన సత్య, ధర్మమార్గాలనే అనుసరించాడు. ఒక మంచి కొడుకులా, అనురాగాన్ని పంచే భర్తలా, ఆత్మీయతను అందించే అన్నలా, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే రాజులా ... అందరితో అన్ని విషయాలలోనూ వినమ్రతతో మెలిగే మర్యాద పురుషోత్తముడిలా... ఇలా ఎవరితో ఏవిధంగా ఉండాలో ఆ విధంగానే నడుచుకున్నాడు. అన్నివేళలా ధర్మాన్నే పాటించాడు. ఆపన్నులకు స్నేహహస్తాన్ని అందించాడు. ఆత్మీయులకు, మిత్రులకు అండగా నిలిచాడు. తాను అవతార పురుషుడినని అనలేదు. అనుకోలేదు కూడా... దేవుడినని ఎన్నడూ చెప్పుకోలేదు. ఎవరికీ ఏ ధర్మాన్నీ బోధించలేదు. తాను ఆచరించినదే ధర్మం – అనుకునే విధంగా వ్యవహరించాడు. అందుకే ధర్మం రూపు దాల్చితే రాముడిలా ఉంటుందేమో అనుకునేలా ప్రవర్తించాడు. సంపూర్ణావతారం ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలన్నింటిలోనూ సంపూర్ణమైనవి రామావతారం, కృష్ణావతారాలే. మిగిలినవి అంశావతారాలు. అంటే అప్పటికప్పుడు ఆవిర్భవించినవి. మత్స్య, కూర్మ, హయగ్రీవ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, కల్కి అవతారాలు. మానవాళిని సత్యవాక్య పాలకులుగా తీర్చిదిద్ది, సన్మార్గంలో నడిపించడం కోసం మానవుడిలా పుట్టాడు. అందరిలాగే ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అయితేనేం, ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. అందుకే కదా... అతి సామాన్యులనుంచి అసామాన్యుల వరకు అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవడిక ద్వారా నిరూపించి, సకల గుణాభిరాముడయ్యాడు. కల్యాణ వైభోగం ఆ శ్రీహరి రామునిగా ఇలపై అవతరించిన పుణ్యతిథి శ్రీరామ నవమి. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుతారు. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ పూజాదికాలు, రామనామ పారాయణం చేస్తారు. అసలు చైత్ర మాసప్రారంభం నుంచే ఇంటింటా, వాడవాడలా, వీధివీధినా చలువ పందిళ్లు, మామిడాకు తోరణాలు... ఇలా ప్రతిచోటా కళ్యాణోత్సవ సంరంభాలు మొదలవుతాయి. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. పుట్టినరోజునే పెళ్లి వేడుకలా.!? శ్రీరాముడు జన్మించిన పుణ్యతిథి చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఆనాడు రాముని జన్మదిన వేడుకలు జరిపించాలి. అయితే శ్రీ సీతారామకళ్యాణం జరిపించడంలోని అంతరార్థం ఏమిటనేదానికి పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథం ఏమి చెబుతోందంటే– ఆ పరమాత్ముడు అవతారమూర్తిగా ఏ రోజున ఈ పుణ్యపుడమిపై అవతరిస్తే ఆ రోజునే కళ్యాణం జరిపించాల్సి ఉందనీ, ఒకవేళ ఆ తిథి తెలియకపోతే ఏకాదశి రోజున కళ్యాణం జరిపించడం సంప్రదాయమని పేర్కొంది. అందుకే లోక కళ్యాణం కోసం సీతారాములకు çపుణ్యక్షేత్రమైన భధ్రాచలంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు అభిజిత్ లగ్నంలో పెళ్లి వేడుకలు జరిపిస్తున్నారు. శ్రీరామ నవమినాడు ఏం చేయాలి? ఈరోజు రామునితోబాటు సీతాదేవి ని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను కూడా పూజించాలి. రామునికి జన్మనిచ్చిన కౌసల్యను, దశరథుని కూడా స్తుతించడం సత్ఫలితాలనిస్తుంది. సీతారామ కళ్యాణం జరిపించడం, ఆ వేడుకలలో పాల్గొనడం, చూడడం, శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించడం, విసన కర్రలు దానం చేయడం మంచిది. సమర్పించవలసిన నైవేద్యం పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర ΄పొంగలి, చెరకు, విప్పపూలు నివేదించాలి. సీతారామ కళ్యాణ తలంబ్రాలను ధరిస్తే ఆటంకాలు తొలగి సత్వరం వివాహం అవుతుందని పెద్దలంటారు. నిత్యజీవితంలో రాముడు... లాల పోసేటప్పుడు శ్రీరామ రక్ష, జోలపాడేటప్పుడు రామాలాలీ మేఘ శ్యామాలాలీ... ఓదార్పుగా అయ్యోరామ... అనకూడని మాట వింటే రామ రామ... పద్దు పుస్తకాలనుప్రారంభిస్తూ శ్రీరామ... కూర్చునేటప్పుడు లేచేటప్పుడూ రామా... ఇలా ఆయన అందరి నాలుకలమీదా నర్తిస్తూనే ఉన్నాడు... ఉంటాడు. అల్లరి చేస్తే కిష్కింద కాండ, కఠినమైన ఆజ్ఞ ఇస్తే సుగ్రీవాజ్ఞ విశాలమైన ఇంటి గురించి చెప్పేటప్పుడు లంకంత ఇల్లు పాతవాటి గురించి చెప్పాలనుకుంటే ఇక్ష్వాకుల కాలం నాటిది... సామెతలు: రామాయణంలో పిడకల వేట; రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు... చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఆకారం గురించి చెప్పాలంటే రాముడిలా ఆజానుబాహువంటారు. ఎంతకీ చూడ్డానికి రాబోతే సీతకన్నేశావంటారు. సైన్యంలా వస్తే రామదండు అంటారు. చక్కని జంటను సీతారాముల్లా ఉన్నారంటారు. ఎవరైనా కొట్టుకుంటే రామరావణ యుద్ధమంటారు. అందరిళ్లలోని గిల్లి కజ్జాలను ఇంటంటి రామాయణమంటారు. రాముడు మనకు విలువలను, వ్యక్తిత్వాన్నీ నేర్పితే రామాయణం మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది. రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరిమీదా ప్రసరించాలని కోరుకుంటూ.... – డి.వి.రామ్ భాస్కర్ తారక మంత్రం ‘శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే .. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే శ్లోకం విష్ణుసహస్ర నామంతో సమానమైనదంటారు. మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రాలు ఓం నమో నారాయణాయ, ఓం నమశ్శివాయల నుంచి తీసుకున్న అక్షరాల కలయిక అయిన రామనామాన్ని జపిస్తే ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల కలిగే ఫలితం కంటె ఎక్కువ ఫలం కలుగుతుంది. మన పెదవులు రామనామంలోని ‘రా’ అనే అక్షరాన్ని పలికినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు అవి లోపలకు రాకుండా మూసుకుంటాయి. కాబట్టి ‘రామ’ అనే రెండక్షరాల తారక మంత్రాన్ని సదా స్మరిస్తుండడం వల్ల పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని కబీరుదాసు, భక్త రామదాసు, తులసీదాసు వంటి మహాభక్తులు ఉవాచించారు. శుభప్రదం... రామచరిత పారాయణం రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. దేశం సుభిక్షంగా ఉంది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటి రాజుకొసం– రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరుదాసు వంటి వారందరూ ...‘‘అంతా రామ మయం.... ఈ జగమంతా రామమయం’’ అని వేనోళ్ల స్తుతించారు. ఆ పురాణ పురుషుని పుణ్యచరితమైన రామాయణాన్ని విన్నా, చదివినా, అందులోని శ్లోకాలను, ఘట్టాలను మననం చేసుకున్నా, శుభం కలుగుతుందని ప్రతీతి. 12 గంటలకు ఎందుకు? రాముడు త్రేతాయుగంలో వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు జన్మించాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని భద్రాద్రిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు దేశం నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు. తానీషా గోల్కొండ నవాబుగా ఉన్న కాలం నుంచి– ఆనాటి సాంప్రదాయం మేరకు నేటికీ భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సమర్పించడం ఆనవాయితీ -
Happy Bihu 2024: అంబరాన్నంటే సంబరాలు.. (ఫోటోలు)
-
పండుగ పూట.. మహిళలుగా మారిపోయే పురుషులు (ఫొటోలు)
-
Eid 2024 : ఈద్ ముబారక్ అంటున్న ఈ సెలబ్రిటీలను గుర్తు పట్టారా (ఫోటోలు)
-
ఓ అల్లాహ్ ..ఇదంతా నీవు పెట్టిన భిక్ష!
ముఫ్ఫై రోజుల రమజాన్ ఉపవాసాలు పూర్తయ్యాయి... సహరీ, ఇఫ్తార్ ల ద్వారా సహనశీలత, కృతజ్ఞతాభావం అలవడ్డాయి.. ఖురాన్ పారాయణం, తరావీహ్ నమాజులు ఆత్మకు నెమ్మదిచ్చాయి. మండే ఎండల్లో రోజాలో ఉంటూ ఆకలిని తట్టుకునే సహనం అలవడింది. ఓ అల్లాహ్! ఇదంతా నీ కృపాకటాక్షాలతోనే సాధ్యమైంది! ! ఓ అల్లాహ్! నీకు వేనవేల షుక్రియా (కృతజ్ఞతలు) అంటూ అల్లాహు అక్బర్... అల్లాహు అక్బర్ నినాదాన్ని బిగ్గరగా పఠిస్తూ ఈద్గాహ్ కు చేరుకుంటారు. ‘తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్ కుమ్’ మా రమజాన్ ఆరాధనలన్నీ స్వీకరించు ప్రభూ! అంటూ వేడుకుంటారు. నెల రోజుల రమజాన్ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపునే శుభ సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్’ రమజాన్ పర్వదినం. ఈద్గాహ్ మైదానానికి చేరుకుని అల్లాహ్ ఘనతను, గొప్పతనాన్ని చాటిచెప్పే ముస్లిముల హృదయాలు పులకించిపోతాయి. ఓ అల్లాహ్ మేము 30దినాలు పాటించిన రమజాన్ రోజాలు, నమాజులు, సహరీ, ఇఫ్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షయే అల్లాహ్ అని ఆనంద భాష్పాలు రాల్చే శుభఘడియలు. రంజాన్‌లో అల్లాహ్‌కు ఇచ్చిన వాగ్దానాలు మిగతా 11నెలలూ ఆచరణాభాగ్యానికి నోచుకోవాలని రోదిస్తారు. రాబోయే రంజాన్ వరకూ రంజాన్ స్ఫూర్తి కొనసాగించే భాగ్యాన్నివ్వమని అల్లాహ్ కు విన్నవించుకుంటారు. రెండు రకాతుల షుక్రానా నమాజు చేస్తారు. రమజాన్ మొదలు మళ్లీ వచ్చే రంజాన్ వరకూ స్వర్గాన్ని ఉపవాసకుల కోసం ముస్తాబు చేస్తారు. అలాంటి రంజాన్‌ను మరోసారి ఇచ్చినందుకు అల్లాహ్‌కు షుక్రియా తెలుపుకుంటారు. కేవలం మేము రంజాన్ వరకే ముస్లిమ్గాగా ఉండకుండా మిగతా 11నెలలూ ముస్లిమ్‌గా జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అని అల్లాహ్‌ని వినమ్రంగా వేడుకుంటారు. నెలంతా ఎన్నెన్ని ఆరాధనలు, మరెన్ని పుణ్యకార్యాలు చేసినా వాటిపట్ల రవ్వంత గర్వాన్ని కూడా రానీయకూడదు. నెలసాంతం పాటించిన ఉపవాసాలు, పఠించిన ఖురాన్ పారాయణం, రాత్రుళ్లు నిద్రను త్యాగం చేసి ఆచరించిన నమాజులు, జకాత్, ఫిత్రా దానాలను నీవు నీ ప్రత్యేక కారుణ్యంతో స్వీకరించు ప్రభూ! మా శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ప్రసాదించు అని వేడుకుంటారు. నమాజు తరువాత ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు. అందరి పండుగ.. ఈదుల్ ఫిత్ర్ పండుగ నాడు ప్రతీ ముస్లిమ్ కుటుంబం ఉన్నదాంట్లో గొప్పగా జరుపుకుంటుంది. ఇంటిల్లిపాది కొత్తబట్టలు ధరించడం, అత్తరు పరిమళాలు పూసుకోవడం ప్రవక్త సంప్రదాయంగా భావిస్తారు. షీర్ ఖుర్మా పాయసాన్ని తమ ఆత్మీయులకు, దగ్గరి బంధువులకు, ఇరుగు పొరుగు వారికి అందించి ప్రేమను చాటుకుంటారు. తమకు అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహ భాగ్యాలను చాటుకోవాలన్నది ప్రవక్త బోధన. ఫిత్రా, జకాత్ దానాలతో నిరుపేదలు సైతం పండుగను సంతోషంగా జరుపుకుంటారు. కుటుంబంలోని ఎంతమందైతే ఉన్నారో ప్రతీ ఒక్కరూ ఫిత్రా దానాన్ని లెక్కించి నిరుపేదలకు పంచాలన్న ప్రవక్త సూక్తిని ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందే. అర్హులై ఉండి ఫిత్రా చెల్లించకపోతే ఉపవాసాలు స్వీకరించబడవన్నది కూడా ప్రవక్త హెచ్చరిక. ఈదుల్ ఫిత్ర్ ఇలా... ఈదుత్ ఫిత్ర్ పర్వదినంనాడు ముహమ్మద్ ప్రవక్త (స) కొన్ని ఖర్జూరపు పండ్లు తిని నమాజుకోసం ఈద్గాహ్కు వెళ్లేవారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముస్లిములు ఖర్జూరాలు తిని ఈద్గాహ్ కు చేరుకుంటారు. ఈద్గాహ కు కాలినడకన వెళ్లడం ఉత్తమం. ఈద్ నమాజు తరువాత పిల్లలకు ఈదీ (ఈద్ కానుక)లు ఇస్తారు. ఖజా రోజాలు... రమజాన్ నెలలో ఎలాంటి కారణం లేకుండా ఒక్క రోజాను వదిలేసినా మిగతా రోజుల్లో ఏడాదంతా ఉపవాసం పాటించినా సరితూగదన్నది ప్రవక్త బోధనల సారాంశం. అయితే కొంతమందికి రమజాన్ నెల ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంది. బాలింతలు, రుతుక్రమంలో ఉన్న స్త్రీలు, రోగగ్రస్తులు మిగతా రోజుల్లో ఆ ఉపవాసాల సంఖ్యను పూరించాలన్నది ఖురాన్ ఉద్బోధ. ఇలాంటి రోజాలను ఖజా రోజాలు అని అంటారు. వీలయినంత త్వరగా ఈ రోజాలను పూర్తిచేయాలని ఉలమాలు సందేశమిస్తారు. రంజాన్ లో తప్పిపోయిన రోజాలను తొలి తీరికలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. రమజాన్ స్ఫూర్తిని ఏడాదంతా కొనసాగించాలి. ఖురాన్ ప్రబోధనలు ►మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైనరీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశ్యంతో దానిని న్యాయనిర్ణేతల వద్దకు తీసుకునిపోకండి. (2:188) ►ధర్మం విషయంలో నిర్బంధంకానీ, బలాత్కారంకానీ లేవు. (2:253) న్యాయం పలకాలి. ►అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు.(4:10) ►తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాథులూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. (4:36) ►మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరి తోనూ సహకరించండి. పాప కార్యాలలో అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. (5:2) ►అల్లాహ్‌కు పరిశుద్ధతను పాటించేవారు అంటేనే ఇష్టం.(9:108) ►పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము వారికీ ఉపాధిని ఇస్తాము, మీకూ ఇస్తాము. వాస్తవానికి వారిని హత్య చేయటం ఒక పెద్ద నేరం. (17:29) నీవు అనాథులపట్ల కఠినంగా ప్రవర్తించకు.యాచకుణ్ణి కసురుకోకు.(93.10) (చదవండి: హలీమ్.. రుచికి సలామ్) -
Ugadi 2024: ఈ పండుగకి 'ఉగాది' అనే పేరు ఎలా వచ్చిందంటే..?
తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిళ్లలో క్రోధి నామ సంవత్సరం సందడి మొదలైంది. ఉగాది అంటే ప్రతీ ఒక్కరికి గుర్తుకొచ్చేది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే పండుగ ప్రత్యేకత. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే పచ్చడి. హిందూ పురాణాల ప్రకారం, ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం.. ఈ గమనానికి ఆది ఉగాది.. అంటే సృష్టి ఉగాది రోజు నుంచే ప్రారంభమైందని అర్థం. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాఢ్యమి తిథి రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’, మలయాళీలు ‘విషు’, సిక్కులు ‘వైశాఖీ’, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’గా జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రముఖ ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఈ నేపథ్యంలో క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. ఇవి చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు? -
రెడ్ హెడ్ డేస్ ఫెస్టివల్ గురించి తెలుసా?
రెడ్ హెడ్ డే పండుగ గురించి ఎపుడైనా విన్నారా? నెదర్లాండ్స్‌లో ఈ పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. పేరుకు తగ్గట్టే.. ఎర్ర జుట్టు వాళ్లంతా ఒక చోట చేరి చేసుకునే వేడుక ఈ రెడ్ హెడ్ డే ఫెస్టివల్. ఇది ప్రతి ఆగస్టు చివరి వారాంతంలో టిల్బర్గ్ నగరంలో జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఆ పండుగకు పలు దేశాల్లో ఉన్న ఎర్ర జుత్తు మగ, ఆడ అంతా ఒక్క చోట చేరి వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 23-25 తేదీల్లో ఈ పండుగను నిర్వహించనున్నారు. అంతేకాదు ఎర్ర జుట్టు లేని వాళ్లు పాల్గొనాలంటే ఎర్ర రంగు బట్ట లేసుకోవాలనే నియమాన్ని పాటిస్తారు. జన్యుపరమైన మార్పులతో ఇలా ఎర్ర జుత్తు వస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు ఒక శాతం ప్రజలకు ఎర్ర జుత్తు ఉందని ఒక అంచనా. స్కాట్లాండ్, రష్యాలలో రెడ్ హెయిర్ ఉన్నవారు ఎక్కువగా ఉన్నారట. -
Ugadi 2024 : ఈ ఏడాది ఉగాది పేరేంటి? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం తొలి రోజు జరుపుకునే తొలి పండుగ. తెలుగువారికి తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం. హిందూ క్యాలెండర్ నెల చైత్ర మొదటి రోజు సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. 2024లో ఉగాది ఏప్రిల్ 9వ తేదీన (మంగళవారం) వస్తుంది. "యుగాది" అనే పదం రెండు పదాల కలయిక - "యుగం" (వయస్సు) , "ఆది" (ప్రారంభం) ఒక శుభ సందర్భం అని అర్థం. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏప్రిల్ 9 న క్రోధి అర్థం కోపం కలిగించేదని. మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అసోం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోను ఈ పండుగ జరుపు కుంటారు. బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతేకాదు, వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. ఇతర విశేషాలు ఈ రోజు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు. త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుపుకునేవారు. ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకునే వారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వారం రోజుల ముందు నుంచే సందడి ఉగాదికి వారం రోజుల ముందునుంచే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, అలంకరించుకునే పనులతో సందడి మొదలవుతంది. రంగురంగుల రంగువల్లులతో ఇంటి ముంగిళ్లు ముస్తాబవుతాయి. మామిడి ఆకుల తోరణాలతో గుమ్మాలను అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, దానధర్మాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వంటలు, ఉగాది పచ్చడి, నైవేద్యాలు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. పాలు పొంగించి, పిండి వంటలు సిద్ధం చేసి. ఇష్టదైవాన్ని పూజిస్తారు. పులిహోర, పాయసం, బొబ్బట్లు ఇలా ఎవరికికి నచ్చినట్టు వారు తయారు చేసుకున్న వంటకాలను నైవేద్యంగా అందిస్తారు. ఏడాదంతా మంచి జరగాలని తొలి పండుగగా తెలుగువారు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఏడాది మొత్తం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేసే పండగ ఉగాది. కుటుంబమంతా ఆనందంగా గడుపుతారు. కొత్తమామిడి కాయలు, వేపపువ్వు, బెల్లం, పులుపు,కారం, ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడితో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు ఏదైనా మంచి కార్యం తలపెడితే శుభం జరుగుతుందని నమ్ముతారు. బంగారం, కొత్త వస్తువులు,కొత్త వాహనాలు, కొత్త ఇళ్లు లాంటివి కొనుగోలు చేస్తారు.కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారు. పంచాంగ శ్రవణం ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది రోజున కవి సమ్మేళనాలు, కవి సన్మానాలు అంటూ కవులు, రచయితలు సందడి సందడిగా ఉంటారు. -
Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు
త్వరలో ఉగాది వస్తోంది. ఆరు రుచులున్న ఉగాది పచ్చడిని ఈ రోజు తప్పనిసరిగా సేవించడం ఈ పండగ ఆచారం. ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగే సంవత్సరమంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని, అలా రకరకాల అనుభవాలూ, అనుభూతులను ఆస్వాదించడమే జీవితమని పెద్దలు చెబుతారు. అయితే అలా కేవలం ఉగాది నాడు మాత్రమే కాదు, వీలయితే ప్రతిరోజూ ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఏయే రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 1. తీపి శరీరంలోని వాత, పిత్త దోషాలను ఈ రుచి సమం చేస్తుంది. తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే వీటిని చాలా తక్కువగా తినాలి. లేదంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ రుచి ఉన్న ఆహారాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగాఉండవచ్చు . 2. పులుపు వాత దోషాలను పులుపు తగ్గిస్తుంది. పులుపు రుచి ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నిమ్మ, చింతకాయ వంటి పులుపు ఉన్న ఆహారాలను నిత్యం పరిమితంగా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. కనక పులుపు ఆహారాలను కూడా తక్కువగా తీసుకోవాలి. 3. ఉప్పు ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కణాలు శుభ్రమవుతాయి. ఉప్పు ఉన్న పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. 4. కారం కారపు రుచి గల ఆహారాలను తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి వేస్తుంది. కణాలు శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కఫ దోషం తగ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది. అందువల్ల కారాన్ని నిత్యం తక్కువగానే తీసుకోవాలి. 5. చేదు చేదుగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావు. 6. వగరు వగరు ఉన్న పదార్థాలను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న పదార్థాలు ఎంతగానో మేలు చేస్తాయి. పచ్చి అరటి పండ్లు, క్రాన్ బెర్రీలు, గ్రీన్ బీన్స్ వంటివి ఈ రుచి ఉన్న పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడు ఒకేసారి ఆరు రుచులు కలిసిన పదార్థాలను తినాల్సిన పనిలేదు. రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న పదార్థాలను తిన్నామా లేదో అని చెక్ చేసుకుంటే చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉదయం చేదు, కారం, మధ్యాహ్నం తీపి, వగరు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాలను తీసుకుంటే చాలు. ఇవే తినాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఆహారాలను ఎంచుకుని ఆరు రుచులు కవర్ అయ్యేలా చూసుకుంటే చాలు. -
రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?
ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత రుతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు.. మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే..? ఆ రుతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. అంతేనా ఆ కొమ్మలపైన కుహు.. కుహు.. అంటూ మనసు పులకరించేలా కోయిలమ్మ మధురగానాలతో వీనుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కృతమవుతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాలు లేకుండా కులమతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పండుగ రంగుల పండుగ.. అదో ఆనంద కేళీ… ప్రజలు ఎంతో ఇష్టంగా పాల్గొనే పండుగ. వసంతాగమనంలో వస్తుంది ఈ రంగుల హోలీ. గజగజా వణికించిన చలికి టాటా చెబుతూ.. వేసవి వెచ్చదనంలోకి అడుగుపెడుతున్న వేళ హోలీ వస్తుంది. భారతీయ పండుగల్లో హోలీ మరీ ప్రత్యేకం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు హోలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. సంవత్సరంలో కేవలం ఒక్క సారి మాత్రమే ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం చూస్తే విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడిని చంపడానికి రాక్షసి హోలికా ప్రయత్నిస్తుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం, తనని మాత్రమే పూజించాలన్నా.. తన మాట వినకపోవడంతో హిరణ్యకశ్యపుడే తన కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని హోలికాకి ఆదేశాలు ఇచ్చాడు. ఎందువల్ల ఇలా చేస్తాడంటే..రాక్షస రాజు.. హిరణ్యకశ్యపుడు .. కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు.. అది హిరణ్యకశ్యపుడికి నచ్చదు దీంతో భక్త ప్రహ్లాదుని చంపేయాలి అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటలలో ఆహుతి చేయమని ఆమెను కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని, మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో ప్రహ్లాదుడు బయటపడతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని చనిపోతుందట. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సతీవియోగంతో తపస్సులో ఉన్న శివునికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి దేవతలు వివాహం చేయాలనుకుంటారు. కానీ తపస్సులో ఉన్న శివునికి ఎలా తపో భంగం కలిగించాలోనని ఆలోచించి మన్మథున్ని శివుని మీదకు పంపుతారు. కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేసేందుకు పూల బాణాలు వదలడంతో శివుని మనస్సు పెండ్లి వైపు మరలిస్తాడు. దీంతో పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. మన్మథ బాణం ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మథుడి వల్ల తపో భంగం కలిగిందని తన మూడో నేత్రంతో కామదేవుడిని భస్మం చేస్తాడు. పతీ వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి శివునితో తన భర్త కామదేవున్ని బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు. పూర్వం ఈ పండుగ రోజున రకరకాల పూలను ఒకరిపై ఒకరు చల్లుకుని.. అలా వారి సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూల స్థానంలో రకరకాల రంగులు వచ్చాయి. ఈ రంగులను నీళ్ళలో కలుపుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రేమ తోపాటు, సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి అని అందరూ భావిస్తారు. హోలీ ఎలా వచ్చిందంటే.. ఇక మరో కథనం ప్రకారం.. అప్పట్లో శ్రీకృష్ణుడు గోపికలతో కలసి బృందావనంలో పువ్వులు, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారు. ఇలా చేయడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. పురాణ కథల ప్రకారంగా.. కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉంటుంది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ గురించి చెబుతాడు. రాధ మేని మెరుపు తన ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది, ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు యశోద బదులిస్తూ, రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి, శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలైంది ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఈ రోజునే మహాలక్ష్మీ ఆవిర్భావం.. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి. శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు. నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦! ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!! ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦. (చదవండి: జీవితం వర్ణమయం) -
Ramzan: సుర్మాతో.. కంటి సంబంధిత వ్యాధులకు చెక్!
ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ‘సుర్మా’ ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ప్రత్యేకత చాటుతోంది. ఈ మాసంలో ముస్లింలు వయోభేదం లేకుండా త్రికరణ శుద్ధితో ఉపవాసం(రోజా)ఉంటారు. ఖురాన్ పఠిస్తూ ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తారు. మహ్మద్ ప్రవక్త బాటను అనుసరిస్తూ నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఈ మాసంలో ముస్లింల నేత్రాలకు అలంకరించే సుర్మాకు ఎంతో విశిష్టత ఉంది. విధిగా కళ్లకు సుర్మా అలంకరించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. సువాసన వెదజల్లే అత్తర్లకు ప్రాధాన్యమిస్తారు. ఇదీ.. సుర్మా ప్రశస్తి.. నిత్యం అల్లాహ్ నామస్మరణలో గడిపే దైవప్రవక్త హజ్రత్ మూసా అలైహిసలా తుస్సలాంకు అల్లా ప్రసన్నం పొంది అతడిని అల్లా ఎక్కడున్నాడో చూపించమని అనునయులు కోరుతారు. దీంతో ఈజిప్టు, సిరియా ప్రాంతాలకు చెందిన పెద్దలను సమీపంలోని కోహితూర్ పర్వతం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఒక్కసారి అల్లాహ్ నూర్ (ఓ వెలుగు)ప్రత్యక్షంకావడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు.అప్పుడే కోహితూర్ పర్వతం భస్మమై బూడిదగా(చూర్ణంగా) మారుతుంది. దైవసంకల్పం కళ్లెదుట సాక్షాత్కరించడంతో తమలోని భక్తి ఉప్పొంగి ఆ చూర్ణాన్ని వారు కళ్లకు అద్దుకుంటారు. ఈ సమయంలో తమ కళ్లకు సుదూరంలోని చీమల కదలికలను సైతం పసిగట్టే విధంగా ప్రకాశవంతం కావడం గమనించి అల్లాహ్ కృపవల్లనే సాధ్యపడిందని భావిస్తారు. అప్పటి నుంచి కోహితూర్ పర్వతానికి చెందిన రాళ్ల చూర్ణమే క్రమంగా సుర్మాగా రూపాంతరం చెందిందనేది ముస్లింల ప్రగఢ నమ్మకం. కళ్లకెంతో మేలు..! భక్తితోపాటు వైద్యపరిభాషలోనూ ఈ సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరుంది. కంటికి సంబంధించిన వ్యాధులకు నివారణగా, కళ్లకు చలువగా పనిచేస్తుంది. నమాజ్ చేయడానికి ముందు వజూ ఆచరించాక మహ్మద్‌ప్రవక్త కంటికి సుర్మా పెట్టుకునే వారని ప్రతీతి. రాత్రివేళ నిద్రపోయేముందు కళ్లకింద సుర్మ రాసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సుర్మాతో కంటికి సంబంధించిన వ్యాధులు రావని నిరూపి తం కావడంతో ఇతరులు కూడా సుర్మాను రా సుకోవడానికి ఆకర్షితులవుతున్నారు. మహిళలు కళ్లకు కాటుక బదులు సుర్మా వాడడానికి ఇష్టపడుతున్నారు. అతిథులకు సుర్మ, అత్త ర్లు పూయడం ద్వారా గౌరవించే సంప్రదాయాన్ని ముస్లింలు కొనసాగిస్తున్నారు. సుర్మ, అత్తర్ల విక్రయాలు..! అనేక గ్రామాల్లో రంజాన్ సందర్భంగా అత్తర్లు, సుర్మా విక్రయాలకు గిరాకీ ఉంటుంది. దీనికోసం జిల్లాలో పలు అత్తర్లు, సుర్మా అమ్మకాల దుకాణాలు వెలిశాయి. సుర్మా కిలో పొడి ధర రూ.175 నుంచి రూ.550 వరకు ఉంటుంది. వీటిని చిన్న సీసాల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇవి రూ10 నుంచి రూ . 100 విక్రయిస్తున్నారు. కంపెనీని బట్టి వీటి ధరలు నిర్ణయిస్తున్నారు. సుర్మాను భద్రపరచడానికి ఆకర్షణీయమైన ఆకారాల్లో సుర్మేన్లు (భరిణె) మార్కెట్లో ఉన్నాయి. వీటి ధర రూ.50 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదవండి: HOLI 2024: జీవితం వర్ణమయం -
ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’..
ఏటా వసంతాగమన వేళ వచ్చే హోలీ హిందువులకు రంగుల పండుగ. సిక్కులకు మాత్రం ఇది రంగుల పండుగ మాత్రమే కాదు, వీరవిద్యల వేడుక కూడా. హోలీ నాటితో మొదలై మూడు రోజులు కొనసాగే ఈ వేడుకను ‘హోలా మొహల్లా’ అంటారు. సిక్కుల గురువు గురు గోబింద్ సింగ్ ఈ వేడుకను జరుపుకొనే ఆనవాయితీని ప్రారంభించారు. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడమే కాకుండా, ఆరుబయట మైదానాల్లోకి చేరి యువకులు సంప్రదాయ వీరవిద్యలను ప్రదర్శిస్తారు. జోడు గుర్రాల మీద నిలబడి స్వారీ చేయడం, గుర్రపు పందేలు, ఒంటెల పందేలు నిర్వహిస్తారు. ‘హోలా మొహల్లా’ అంటే ఉత్తుత్తి యుద్ధం అని అర్థం. ఈ వేడుకల్లో కత్తులు, బరిసెలతో ఉత్తుత్తి యుద్ధాల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తొలిసారిగా ‘హోలా మొహల్లా’ వేడుకలు 1701లో ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగాయి. అదే సంప్రదాయ ప్రకారం ఇప్పటికి కూడా ఆనంద్‌పూర్ సాహిబ్‌లో ఈ వేడుకలు ఆర్భాటంగా జరుగుతాయి. పంజాబ్, హర్యానాలతో పాటు పాకిస్తాన్లో కూడా సిక్కులు ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ఉదయం వేళ రంగులు చల్లుకోవడం, వీరవిద్యా ప్రదర్శనలు, ఆయుధ ప్రదర్శనలు; సాయంత్రం వేళలో ఆధ్యాత్మిక సంకీర్తనలు, సంగీత నృత్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేడుకల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో వచ్చే జనాలకు సంప్రదాయక వంటకాలతో ఆరుబయట విందుభోజనాలను ఏర్పాటు చేస్తారు. ఇవి చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..! -
ఆ గ్రామం.. హోలీకి దూరం!
ప్రస్తుతం దేశమంతా హోలీ సన్నాహాల్లో మునిగితేలుతోంది. అయితే మన దేశంలో హోలీ వేడుకలు చేసుకోని ఒక గ్రామం ఉంది. పైగా ఆ గ్రామంలో హోలీనాడు పిండివంటలు కూడా చేసుకోరు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? బీహార్‌లోని ఆ గ్రామంలో గత 250 ఏళ్లుగా హోలీ వేడుకలు చేసుకోరు. అదే ముంగేర్ జిల్లాలోని సజువా గ్రామం. హోలీ వేడుకలు చేసుకుంటే గ్రామంలో విపత్తులు సంభవిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అందుకే ఇక్కడివారంతా రంగుల పండుగకు దూరంగా ఉంటారు. ఈ గ్రామంలో సుమారు రెండువేల మంది నివసిస్తున్నారు. వీరంతా హోలీ వేడుకలు చేసుకోరు. ఈ గ్రామంలో హోలీనాడు ఏదైనా పిండివంటకం చేసుకున్నట్లయితే ఆ కుటుంబానికి ఆపదలు ఎదురవుతాయని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ గ్రామాన్ని సతీ గ్రామం అని కూడా పిలుస్తారు. సుమారు 250 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఈ గ్రామంలోని వారు ఏప్రిల్ 14న హోలికా దహనం జరుపుకుంటారు. తమ గ్రామంలో ఎవరూ హోలీ చేసుకోరని గ్రామానికి చెందిన చందన్ కుమార్ తెలిపారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని గ్రామంలోని అందరూ పాటిస్తున్నారని ఆయన తెలిపారు. -
500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ వేడుకలు
భగవాన్ రామ్‌లల్లా నూతన రామాలయంలో కొలువైన దరిమిలా రామనగరిలో ప్రతి క్షణం ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత రామాలయం రూపుదిద్దుకుంది. దీంతో బాలరాముడు తన జన్మ స్థలంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇకపై ప్రతి పండుగను అయోధ్యలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కోవలో అయోధ్యలో 500 ఏళ్ల తరువాత హోలీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ హోలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఈనెల 25న జరగబోయే హోలీ వేడుకలకు రామాలయం ముస్తాబవుతోంది. రామ భక్తులు ఆరోజు బాలరామునితో హోలీ వేడుకలు చేసుకోనున్నారు. హోలీ నాడు 56 వంటకాలను బాలరామునికి నైవేద్యంగా సమర్పించనున్నారు. అలాగే ఆరోజున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ప్రసాద వితరణ చేయనున్నారు. రామమందిరం ట్రస్ట్ కార్యాలయ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఇకపై హోలీ వేడుకలు రాముని ఆస్థానంలో జరగనున్నాయని, ఈ నేపధ్యంలో అయోధ్య అంతటా ఆనందం నెలకొన్నదన్నారు. ఇందుకోసం రామమందిర ట్రస్ట్ సన్నాహాలు చేస్తున్నదన్నారు. హోలీ వేడుకల సందర్భంగా అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. -
‘అక్కడ రాముడుంటే.. ఇక్కడ మురుగన్’.. డీంఎంకే కొత్త ప్లాన్?
భారతీయ జనతా పార్టీ అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించి, తన ఖ్యాతిని పెంచుకుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న వేళ.. తమిళనాట అధికార డీఎంకే ‘మురుగన్’ను ఆశ్రయిస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో విశేషంగా పూజలు అందుకునే మురుగన్ (కుమారస్వామి)ని ఆరాధిస్తూ డీఎంకే ప్రభుత్వం రాబోయే జూన్ లేదా జూలైలో అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో మురుగన్ చిత్రాలతో కూడిన ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహిస్తామని హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. తమిళనాడులో రాజకీయ పార్టీలు ‘మురుగన్’ వైపు మొగ్గు చూపడం కొత్తేమీ కాదు. 2020లో ఎల్ మురుగన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ‘వేల్ యాత్ర’ నిర్వహించింది. డీఎంకే కొంత వరకు నాస్తిక భావజాలాన్ని కలిగివుందని అంటుంటారు. అయితే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం దేవుణ్ణి ఆశ్రయించడం ఇదే తొలిసారి. హిందుత్వంపై తనదైన ముద్రను పెంచుకుంటున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే డీఎంకే ఈ ఎత్తుగడ వేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మురుగన్ సదస్సు ద్వారా ఎన్నికల్లో లాభపడాలని డీఎంకే భావిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. కాగా డీఎంకే సారధ్యలో మురుగన్ సదస్సు నిర్వహణపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీనివాసన్ మాట్లాడుతూ మొదట డీఎంకే పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టిందని, ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని, రాజకీయాలను కాపీ కొడుతున్నదని ఆరోపించారు. మురుగన్‌ను తమిళనాడుకు మాత్రమే పరిమితం చేయలేమని, మురుగన్‌ను దేశవ్యాప్తంగా పూజిస్తారని, డీఎంకే మాయలో ప్రజలు ఎప్పటికీ పడిపోరని పేర్కొన్నారు. బీజేపీ నేతల ఆరోపణలపై రాష్ట్ర మంత్రి శేఖర్‌బాబు స్పందిస్తూ, మురుగన్ అంతర్జాతీయ ఉత్సవ నిర్వహణలో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మురుగన్ ఆలయాల కోసం ఖర్చు చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని చేర్చామని, ఆలయ పునరుద్ధరణకు రూ.300 కోట్లు కేటాయించామని తెలిపారు. అలాగే పళని మురుగన్ ఆలయ పునరుద్ధరణకు రూ.100 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. -
జన్మకో శివరాత్రి అని ఎందుకంటారో తెలుసా!
శివతత్వమే మంగళం. జన్మకో శివరాత్రి అన్నది ఆర్యోక్తి. దీని అర్ధం సంవత్సరంలో వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డ దైవారాధన కనీసం శివరాత్రి రోజు చేసినా సమస్త మంగళాలు ప్రోదిచేసి అందించే దైవం బోళాశంకరుడు అన్నది అందరూ అనుభవైకపూర్వకంగా అనుభవించే సత్యం. మహా శివరాత్రి అనడానికి.. ప్రతీమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు.ప్రతి మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మాసశివరాత్రిగా వ్యవహరిస్తారు. మాఘ కృష్ణ పక్ష చతుర్దశిలో వచ్చే శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు.ఈ తిథి నాడు లింగాకారంలో పరమేశ్వరుడు ఆవిర్భవించిన సందర్బంగా పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక దినంగా మహాశివరాత్రిగా జరుపుకుంటాం. శివ అంటే.. శివ అనే నామమే అత్యంత పవిత్రమైనది.శివ అంటే మంగళం,శుభం,క్షేమం,భద్రం,శాంతం అనే అర్ధాలు చెప్పబడ్డాయి.అన్నిటికీ ఆధారమైనవాడు శివయ్య.అలసిన జీవుడు ధ్యానంలో చేరేది శివ చైతన్యవలయంలోనికే. పరమ శివుని ఆవిర్భావం అందరికీ తెలిసిందే.భక్త సులభుడు మరియు భక్త వరదుడు శంకరుడు అన్నది పురాణాలు ద్వారా అందరికీ సుపరిచితం. శివతత్వం అంటే.. సాక్షాత్ చదువుల తల్లి సరస్వతీ మాత శివతత్వం గ్రంథస్తం చేసే క్రమంలో ఎంత రాసినా తరగని ఘని అయిన పరమేశ్వరుడి తత్వరచన కోసం కాటుక కొండను కరిగించి "సిరా" (ఇంక్) గానూ, కల్పవృక్షం కొమ్మను "కలం"(పెన్) గాను, భూమాతను "కాగితం"(పేపర్)గా చేసుకుని రచన ప్రారంభించి ఎంత రాసినా పూర్తి కానీ సశేషం శివతత్వం అని గ్రహించి "పరమేశ్వరా నీ తత్వం అందనిది కానీ నీ అనుగ్రహం సులభసాధ్యంగా అందరికీ అందేదీ"అని నిర్వచించారట అమ్మవారు. అంతటి విశిష్టతే శివతత్వం. శివపూజ.. గీతాచార్యుడయిన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలిపిన అమృతవాక్కు పురాణాల ద్వారా గ్రహించిన మహనీయులు ప్రపంచానికి అందించినది "కోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శివపూజ చేయలేము".సాక్షాత్ దైవమే చెప్పిన ఈ మాట శివపూజలో ఉన్న ధార్మిక ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఈ రోజు ఉపవాసమే నైవేద్యం:- పార్వతీనాధునికి ఉపవాసమే భక్తుడు సమర్పించే నిజమైన నైవేద్యం.తృప్తి కోసం భక్తుడు తాను స్వీకరించే ఆహారం సాత్వికమైనది శివార్పణమ్ చేసి తీసుకోవచ్చు.శక్తి కొద్దీ ఎవరు ఇష్టపూర్వకంగా సమర్పించే ఆహారం అయినా పరమాత్మునికి ప్రీతికరమైనది. అభిషేకప్రియుడు.. లింగరూపుడు అయిన శివయ్యకు శుద్ధజలం(మంచి నీరు)అత్యంత ప్రీతి కరమయిన అభిషేకద్రవ్యం.గంగాధరుడు కాబట్టి గంగకు అత్యంత ప్రాధాన్యత.మరో రకంగా ఆలోచిస్తే సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే జలం కోరుకున్నాడు భగవానుడు.శక్తి కొద్దీ పంచామృతాలు,పళ్లరసాలు భక్తులు సమర్పిస్తారు.ఒక్కో ద్రవానికి ఒక్కో విశిష్టత చెప్పబడింది.స్థూలంగా శివునికి అభిషేకం అత్యంత ప్రియం. బిల్వదళం.. మారేడుదళాలు సంవత్సరం మొత్తంలో శిశిరఋతువులో సైతం ఆకురాల్చని విధానం కలిగి ఉండటమే కాక శరీరం లోని వేడిని సైతం తగ్గించే శక్తి కలిగి ఉండడంతో గరళకంటుడికి మారేడుదళం సమర్పిస్తారు భక్తులు.ఈ బిల్వదళం సమర్పణలో ఒక్కో రకమయిన పురాణ వివరణలు కూడా ఉన్నాయి. ఈ శివరాత్రి రోజును ఉపవాసంతో శివుడిని అర్చించి జాగరణ చేయడం అనేది అత్యంత కష్టమైన విధి విధానం. వీటన్నింటిని కనీసం ఒక్కసారైన ఆచరించే పూజ చేయగలిగితే చాలని జన్మకో శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘమాసం ఈ చలికాలంలో ఇవన్నీ ఒక్కసారైన నియమంగా చేస్తే చాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఆర్కోక్తి జన్మకో శివరాత్రి. అందువల్లే దీన్ని మహా శివరాత్రి అని కూడా పిలవడం జరిగింది. ఐక్యతకు శివకుటుంబం ఆదర్శం.. పరస్పర వైరభావం కలిగిన వాహనాలు ఎద్దు,సింహం,నెమలి,ఎలుక ఏంతో అన్యోన్యతతో ఒదిగి ఉండటం ప్రస్తుత సమాజానికి ఒక విలువైన పాఠం.ఎన్నో వైరుధ్యాలు,భావాలు,వ్యక్తిత్వాలు ఉన్నా సమాజం అనే గొడుగు క్రింద అందరం అన్యోన్యంగా ఉన్నప్పుడే భావితరాలకి శాంతి మరియు సౌబ్రాతృత్వాలు అందించగలం.ఐక్యతే విజయ సూత్రం అని చెబుతోంది శివకుటుంబం. దయగల దైవం చంద్రశేఖరుడు. భక్తితో శివునికి చేరవ్వవుదాం. సత్కర్మలు ఆచరించి నిశ్చలమైన భక్తి, విశ్వాసాలను ఇవ్మమని అడుదాం. శివతత్వాన్ని శాశ్వతం చేసుకుందాం మన నిత్య జీవనవిధానంలో.. (చదవండి: శివయ్య అనుగ్రహం కావాలంటే..) -
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)


