
ముచ్చటగా అలంకరించిన లోగిళ్లు అందంగా ముస్తాబైన చిన్నా పెద్దలుఓ వైపు దీప కాంతులు మరోవైపు బాణాసంచా పేలుళ్లు ఆనందాలు విప్పారుతుండగా తియ్యని రుచులు నోరారా ఆస్వాదిస్తుంటే వేడుకంతా నట్టింట్లో కొలువుదీరినట్టే ఉంటుంది. రెట్టింపు ఆనందాలను పంచడానికి వంటిల్లు తీపి వంటకాలను సిద్ధం చేస్తూనే ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా పండగవేళ తియ్యని రుచులను సులువుగా చేసేద్దాం. ఇంటిల్లి పాదికీ ఆనందాన్ని పంచేద్దాం..
సూజీ హల్వా
కావలసినవి: సూజీ (బొంబాయి రవ్వ) – కప్పు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – కప్పు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; జీడిపప్పు, కిస్‌మిస్ – అవసరమైనంత.
తయారీ: పాన్‌లో నెయ్యి వేడి చేసి, జీడిపప్పు, ద్రాక్ష వేయించాలి. ∙వాటిని తీసి, అదే నెయ్యిలో సూజీ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ∙మరో పాత్రలో నీరు మరిగించి, రవ్వ పోస్తూ, కలపాలి. ∙రవ్వ ఉడికిన తర్వాత పంచదార కలిపి తర్వాత యాలకుల పొడి వేసి కలపాలి. ∙చివరగా వేయించిన కాజూ, ద్రాక్ష వేసి మిక్స్ చేయాలి.
గులాబ్ జామూన్
కావలసినవి: రెడీమేడ్ జామూన్ మిక్స్ – కప్పు; నీళ్లుపాలు – అవసరమైనంత (జామూన్ మిక్స్ కలపడానికి); పంచదార‡ – ఒకటిం΄ావు కప్పులు; నీళ్లు – కప్పు; యాలకుల పొడి – చిటికెడు.
తయారీ: ∙పంచదార, నీళ్లు కలిపి, మరిగించి సిరప్ తయారు చేయాలి. దాంట్లో చిటికెడు యాలకుల పొడి కలపాలి ∙జామూన్ మిక్స్‌కి కొంచెం నీళ్లు లేదా పాలు జోడించి మృదువుగా కలపాలి ∙మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ, ఉండలు చేయాలి ∙బాణలిలో నూనె పోసి వేడయ్యాక, సిద్ధంగా ఉంచుకున్న ఉండలు వేసి, వాటిని గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి ∙వేయించిన జామూన్లను వేడి సిరప్‌లో వేసి, రెండు గంటలు నాననివ్వాలి.
రైస్ పుడ్డింగ్ / పాయసం
కావలసినవి: బియ్యం – పావు కప్పు; పాలు – 3 కప్పులు; పంచదార – పావు కప్పు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; యాలకులు, కిస్‌మిస్ – అవసరమైనంత; నెయ్యి – టేబుల్ స్పూన్.
తయారీ : బియ్యం కడిగి, కొద్దిగా ఉడికాక పాలు పోసి, మెల్లిగా మరిగించాలి. బియ్యం పూర్తిగా ఉడికాక పంచదార కలపాలి. యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి కలపాలి.
బేసిన్ లడ్డూ
కావలసినవి: బేసన్ (సెనగపిండి) – కప్పు; నెయ్యి – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; యాలకుల పొడి – పావు టీ స్పూన్.
తయారీ: ప్యాన్ నెయ్యి వేసి, వేడి చేయాలి. మంట బాగా తగ్గించి, దాంట్లో శనగపిండి వేసి, మెల్లగా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. చల్లారిన తర్వాత పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ, చేతులతో లడ్డూలు చేయాలి.