
ఒక్కసారిగా రోడ్డెక్కిన ట్రావెల్స్, సిటీ బస్సులు. ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు, విద్యార్థులతో హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతం శుక్రవారం సాయంత్రం కిక్కిరిసింది.

శనివారం బంద్, ఆది, సోమవారాలు దీపావళి సెలవు దినాలు కలిసి రావడంతో సిటీజనులు పెద్ద ఎత్తున సొంతూళ్లుకు బయలుదేరారు. దీంతో సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ఈ ప్రాంతంలో భారీ రద్దీ కనిపించింది. మరోవైపు గంటల కొద్ది ట్రాఫిక్ జామ్‌లతో జనం ఇబ్బంది పడ్డారు.

















