breaking news
Diwali 2025
-
ఈ ఏడాది దీపావళి అద్భుతమే : విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!
వినాయకచవితి, దసరా వేడుకల తరువాత చిన్నా పెద్దా అంతా ఏంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ దీపావళి (Diwali 2025). కార్తీక అమావాస్య నాడు వచ్చే. వెలుగు దివ్వెల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ ఏడాది దీపావళి 20వ తేదీన వచ్చింది ఈసారి గ్రహాల అద్భుతమైన కలయిక అని, చాలా ఏళ్ల తరువాత వచ్చే ఈ కలయికే దీపావళి ప్రత్యేకత అని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు. ఇది మరింత ఇది మరింత శుభప్రదమని అంటున్నారు. ఈ ప్రత్యేక సంయోగ సమయంలో లక్ష్మీ దేవిని పూజించడం చాలా ఫలవంతమైనదనీ, ఇంటిల్లి పాదికీ సుఖ సంతోషాలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ దీపావళి పూజకు శుభ ముహూర్తం, పూజ గురించి తెలుసుకుందాం.శుభముహూర్తం: అమావాస్య సోమవారం మధ్యాహ్నం 2:32 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం 4:26 గంటల వరకు ఉంటుంది. కాబట్టి, ఈ సంవత్సరం, దీపావళిని 20వ తేదీ సోమవారం జరుపుకుంటారు.లక్ష్మీదేవి, గణేశుని పూజించడానికి పవిత్రమైన సమయం మధ్యాహ్నం 2:39 నుండి అర్ధరాత్రి వరకు.పూజకు శుభ సమయంకుంభ లగ్నము మధ్యాహ్నం 2:09 నుండి మధ్యాహ్నం 3:40 వరకువృషభ లగ్నం సాయంత్రం 06:51 నుండి 08:48 వరకుసింహ లగ్నం ఉదయం 1:19 నుండి ఉదయం 3:33 వరకుగ్రహాల ప్రత్యేక కలయికదీపావళి రోజున, మూడు గ్రహాలు కలుస్తాయి. కుజుడు, సూర్యుడు , బుధుడు అందరూ కలుస్తారు. వారి మిశ్రమ ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల ప్రజలకు శుభ ఫలితాలను తెస్తుందని నమ్ముతారు. కార్తీక అమావాస్య నాడు దీపావళి పూజను స్థిరమైన లగ్నంలో చేయడం ఆచారం. చాలా మంది స్థిరమైన లగ్నంలో మహాలక్ష్మిని పూజిస్తారు. స్థిరమైన లగ్నము (వృషభ, సింహ, వృశ్చిక, కుంభ) నందు అమావాస్య రాత్రి మహాలక్ష్మిని పూజించే వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విశ్వాసం.మహాలక్ష్మి పూజ : మొదటి రోజు ధనత్రయోదశి, రెండో నరక చతుర్ధశి, మూడో రోజు దీపావళి , నాలుగో రోజు గోవర్ధన పూజ, , అయిదో రోజు భాయ్ దూజ్ ఇలా అయిదు రోజుల పాటు దీపావళి జరుపుకుంటారు. దీపావళి రోజు గణేశుడు, లక్ష్మి, ఇంద్రుడు, కుబేరుడు, సరస్వతి , కాళి మాతను పూజిస్తారు. దీపావళి రోజు సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీదేవిని విధిగా పూజిస్తారు.ఇల్లంతా దీపాలతో అలంకరించి బాణా సంచాల పేల్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. దీపావళి రోజున శ్రీయంత్ర పూజ ,ప్రతిష్ట ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నమాట శ్రీ యంత్రాన్ని ప్రతిరోజూ పూజించే ఇంట్లో లేదా సంస్థలో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని నమ్మం.ధన త్రయోదశి: అక్టోబర్ 18న ధన త్రయోదశి. ఈ రోజున బంగారం, వెండి, లేది ఇతర ఏదైనా కొత్త వస్తువు ఇంట్లోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. గోరెడు బంగారమైనా ఇంటికి తెచ్చుకుంటే తమ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భావిస్తారు.నరక చతుర్దశి : రాక్షసుడైన నరకాసురుడిని వధించిప్రజలకు సుఖ సంతోసాలను పంచిన రోజు నరక చతుర్దశిగా జరుపు కుంటారు. పొద్దున్నే తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు.దీపావళిఅసురుడు నరకుడి పీడ వదిలిన సంతోషంలో జరుపుకునే పండుగ. విద్యుద్దీప కాంతులతో గృహాలన్నీ కళకళ లాడుతాయి. లక్ష్మీపూజ చేసుకొని, బాణసంచాపేల్చి నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినందుకు చిహ్నంగా గోవర్ధన పూజను, అన్నాచెళ్లెళ్లఅనుబంధానికి ప్రతీకగా భాయి దూజ్‌ను జరుపుకుంటారు.అలాగే కొన్ని గోగు కర్రలతో దీపాలు వెలిగించి చిన్న పిల్లల చేత దివిటీలు కొట్టించడం ఆనవాయితీ. -
వెలుగుల పండుగ : రంగు రంగుల ప్రమిదలు రెడీ!
దీపావళి పర్వదినాన్న పురస్కరించుకుని ప్రమిదలతో పాటు బొమ్మల కొలువులు, వ్రతాలకు ఉపయోగించు కునే కుందుల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. కుమ్మరి కళాకారులు సంప్రదాయబద్ధంగా చేతులతోనే ప్రమిదలతో పాటు కుందులు తయారుచేసి చక్కని డిజైన్లకు ఆకర్షణీయమైన రంగులు వేస్తూ మార్కెట్లోకి పంపిణీ చేస్తున్నారు. అమీర్‌పేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక ఈ వృత్తి కళాకారులు, మహిళలు వీటి తయారీలో నిమగ్నమయ్యారు. కుందులకు, ప్రమిదలకు తగిన రంగులు అద్దుతూ ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని మార్కెట్లో విక్రయించేందుకు పలువురు వ్యాపారులు ఆర్డర్లు ఇవ్వడంతో తమకు చేతినిండా పని దొరికిందని మహిళలు చెబుతున్నారు. వీటి తయారీ కోసం ఈ కుటుంబాలన్నీ ముఖ్యంగా మహిళలు నిమగ్నమయ్యారు. ప్రతియేటా దీపావళికి రెండు నెలల ముందు నుంచే వీటి తయారీపై దృష్టి పెడతామని కుమ్మరి శ్రీను తెలిపారు. ఇదీ చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ : బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?