ఆకుపచ్చ​ని చీరలో ఇషా స్టన్నింగ్‌ లుక్‌:! హైలెట్‌గా రూబీ డైమండ్‌ నెక్లెస్‌.. | Isha Ambani shows green silk saree paired ruby and diamond jewellery | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ​ని చీరలో ఇషా స్టన్నింగ్‌ లుక్‌:! హైలెట్‌గా రూబీ డైమండ్‌ నెక్లెస్‌..

Oct 27 2025 3:22 PM | Updated on Oct 27 2025 3:57 PM

Isha Ambani shows green silk saree paired ruby and diamond jewellery

రిలయన్స్‌ రీటైల్‌  హెడ్‌  ఇషా అంబానీ ఎప్పటికప్పుడు తనదైన ఫ్యాషన్‌ సిగ్నేచర్‌తో కనిపిస్తుంటారామె. అటు తన వ్యాపార సామ్రాజ్యంలో తనైదైన పాత్ర పోషిస్తూనే.. ఇటు ఫ్యాషన్‌ పరంగా బాలీవుడ్‌ దిగ్గజ నటులకు తీసిపోని లుక్‌లో మెరుస్తుంటారామె. అందులోనూ అంబానీ కుటుంబికులు ధరించే వస్తువులు అత్యంత లగ్జరియస్‌ గానూ, చారిత్రాత్మకంగా పేరుగాంచిన అమూల్యమైన ఆభరణాలు తప్పక ఉంటాయి. ఈ ఏడాది దివాలీ వేడుకలకు ఇషా సన్నద్ధమైన అందమైన లుక్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఆ వీడియోలో ఇషాకి సెలబ్రిటీ మేకప్‌ ఆర్టిస్ట్‌ నమ్రతా సోని మేకప్‌ వేస్తున్నట్లు కనిపిస్తోంది. “అత్యంత అందమైన ఇషా అంబానీతో దీపావళి,” అనే క్యాప్షన్‌ని జోడించి మరి ఈ వీడియోని పోస్టు చేసింది నమ్రతా సోని. దీపావళి వేడుకల కోసం ఇషాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వీడియోని షేర్‌ చేసింది. ఈ వేడుకల కోసం ఇషా డిజైనర్ మనీష్‌ మల్హోత్రా రూపొందించిన రంగురంగుల పట్టు చీరను ధరించింది. ఆ చీరలో రాజవంశస్థురాలి మాదిరి దర్పంతో వెలిగిపోతుందామె. 

ఈ ఎథ్నిక్‌ చీరకి రూబీ, డైమండ్‌, ముత్యాలతో పొదిగిని ఆభరణాన్ని జత చసింది. పూల ఆకారంలో ఉన్న నెక్లెస్‌ ఇషాని సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచేలా చేసింది. అందుకు తగ్గ చెవిపోగులు, బ్రాస్లెట్‌లతో ఫ్యాషన్‌కే అర్థం చెప్పేలా అత్యంత అద్భుతంగా ఉందామె లుక్‌. అందులోనూ ఆ ఆకుపచ్చని చీరకు అత్యంత కాంట్రాస్టింగ్‌గా ధరించిన ఎరుపు చీర ఆమె లుక్‌ మరింత అందంగా ఆకర్ణణీయంగా కనిపించేలా చేసింది. 

కాగా, ఇషా అంబానీ తన సోదరుడు ఆకాష్‌ అంబానీలతో కలిసి తన పుట్టినరోజు వేడుకని అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఈ వేడుకకు బాలీవుడ్‌ అతిరథ మహారథులంతా కదిలివచ్చి మరి సందడి చేశారు.  

 

 

(చదవండి: ఫ్యాషన్‌ సెన్స్‌.. కారాదు నాన్‌సెన్స్‌..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement