రిలయన్స్ సామ్రాజ్యవారసులు, యువ పారిశ్రామిక వేత్తలు, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ పుట్టిన రోజు వేడుకలకోసం అంబానీ ఫ్యామిలీ మరో గ్రాండ్ పార్టీని ఏర్పాడు చేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇషా , ఆకాష్ అంబానీల గ్రాండ్ బర్త్‌డే పార్టీ ఫోటోలు ,వీడియోల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కవల పిల్లలు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ అక్టోబర్ 23న తమ 34వ పుట్టినరోజును జరుపుకున్నారు. బాలీవుడ్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనేతోపాటు, అనన్య పాండే, కరణ్ జోహార్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు అనన్య, కరణ్ జోహార్ ఈ వేడుకలకు హాజరయ్యారు.

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్, షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, దిశా పటానీ, అర్జున్ కపూర్, ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ తదితర సెలబ్రిటీలు జామ్‌నగర్‌కు చేరుకున్నారు. ప్రింటెడ్ హాఫ్-స్లీవ్ షర్ట్, ఫ్రేమ్ ఉన్న సన్ గ్లాసెస్‌తో దీపికాతోపాటు, రణ్‌వీర్ సింగ్ నల్ల ప్యాంటు , బిగ్ సైజు తెల్లటి టీ-షర్టులో క్యాజువల్ లుక్‌లో విమానాశ్రయంలో దర్శన మిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడిగా మారాయి. ఈ ట్విన్స్ బర్త్‌డే సందర్భంగా ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇషా అంబానీతో ఉన్న సెల్ఫీని షేర్ చేసి, "హ్యాపీ బర్త్‌డే! అంటూ విషెస్ తెలిపింది. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)


