ఓటీటీలు వచ్చాక ఆడియన్స్ సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. క్రైమ్ అండ్ సెస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. కంటెంట్ నచ్చితే చాలు ఓటీటీల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అలా 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మర్టర్ మిస్టరీ థ్రిల్లర్ రాత్ అకేలి హై. కోవిడ్ సమయంలో ఈ మూవీ రిలీజైంది.
తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా రాత్ అకేలి హై.. ది బన్సల్ మర్డర్స్ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సీక్వెల్ మూవీ డిసెంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదకగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే మరోసారి తమ పాత్రల్లో అలరించనున్నారు. ఈ సీక్వెల్‌లో కొత్తగా చిత్రాంగద సింగ్, రజత్ కపూర్, రేవతి, దీప్తి నావల్, సంజయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఇటీవల గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రీమియర్ షో ప్రదర్శించారు.
ఈ సినిమాకు హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించారు. స్మితా సింగ్ రాసిన ఈ థ్రిల్లర్ మూవీని ఆర్వీఎస్‌పీ, మాక్‌గఫిన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
#RaatAkeliHai : #TheBansalMurders Tamil Dubbed Movie OTT Release Sets To Premiere From December 19th on Netflix
Also In Telugu Hindi pic.twitter.com/dxhpWaJ15l— SRS CA TV (@srs_ca_tv) December 7, 2025


