తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రెండు వారాల్లో ఈ సీజన్‌కు శుభం కార్డు పడనుంది. రీతూ ఎలిమినేషన్‌తో ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మిగిలారు. సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజనా, తనూజ, కల్యాణ్, పవన్.. వీరందరూ ఆల్‌రెడీ కెప్టెన్ అయ్యారు. కానీ భరణి మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు.

కూతురి కోరిక నెరవేరినట్లే
ఫ్యామిలీ వీక్‌లో వచ్చిన కూతురు కూడా కెప్టెన్ అవు డాడీ అని అడిగింది. ఆమె కోరిక తీర్చలేకపోయినందుకు చాలా ఫీలయ్యాడు భరణి. కానీ ఎట్టకేలకు ఆమె కోరిక నెరవేర్చినట్లు కనిపిస్తోంది. తాజా ప్రోమోలో భరణి చేతికి కెప్టెన్ బ్యాండ్ ఉంది. అంటే ఈ పద్నాలుగో వారం భరణి కెప్టెన్ అయ్యాడన్నమాట!
జైలుకు సంజనా
అలాగే బిగ్‌బాస్ ఇచ్చిన గేమ్‌లో సంజనా (Sanjana Galrani)కు జీరో ఉన్న బాక్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను జైల్లో వేశారని భోగట్టా! అదేంటో కానీ మొట్టమొదటిసారి ఇమ్మాన్యుయేల్.. సంజనా కోసం స్టాండ్ తీసుకున్నాడు. అయితే హౌస్ అందరూ దాన్ని వ్యతిరేకించడంతో ఆమె చేతికి జీరో బాక్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
చదవండి:


