ఇంట్లో పెళ్లంటే ఆ హడావుడి మామూలుగా ఉండవు. అందులోనూ ప్రాణంగా ప్రేమించే చెల్లి పెళ్లంటే ఆ సందడి వేరే లెవల్లో ఉంటుంది. కానీ, ఈ పండగ వాతావరణాన్ని తనూజ మిస్ అయింది. తెలుగు బిగ్బాస్ 9లో అడుగుపెట్టిన తనూజ ఎంతోకాలం ఉండననుకుంది. ఇంట్లోవాళ్లు కూడా వెంటనే వచ్చేస్తుందిలే అని పంపించారు. తీరా తన గేమ్తో విన్నింగ్ రేస్లో ఉంది. 13 వారాలుగా టాప్ ఓటింగ్‌తో దుమ్ము లేపుతోంది.
పెళ్లికూతురుకి ఆశీర్వాదం
అయితే కుటుంబాన్ని మాత్రం చాలానే మిస్ అవుతోంది. తను కెప్టెన్ అయినవారమే ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి వచ్చారు. అలా తనూజ కోసం ఆమె చెల్లి పూజ హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. తనను చూడగానే తనూజకు కన్నీళ్లాగలేదు. వరుసకు చెల్లే అయినా తల్లిలా తనూజకు ఏడవద్దని సలహా ఇచ్చింది. 'ఓపక్క పెళ్లి పనులు.. మరోపక్క నువ్వు ఇక్కడ షోలో ఏడుస్తుంటే అక్కడ అమ్మ, అక్క ఏడుస్తున్నారు.

నా పెళ్లి విషయం మర్చిపోయింది.
వాళ్లని హ్యాండిల్ చేయలేకపోతున్నా.. నా పెళ్లికి కొద్దిరోజులే సమయం ఉంది. అన్నీ హ్యాండిల్ చేయాలి. ప్లీజ్, నువ్వు ఏడవకు' అని బతిమాలింది. 'నువ్వు ఒక్కసారి ఏడిస్తే అమ్మ రెండురోజులు ఏడుస్తుంది. నా పెళ్లి విషయం కూడా మర్చిపోయింది. ప్రతిరోజు బిగ్‌బాస్, రీల్స్ చూస్తుంది.. నువ్వేం చేస్తావో తెలీదు, విన్ అవ్వాలి. నేను ఏది కొన్నా ఫస్ట్ ఫోటో నీకు పెట్టేదాన్ని.. అది మిస్ అవుతున్నా.. అని భావోద్వేగానికి లోనైంది.
శుభలేఖలో తనూజ పేరు
తర్వాత గార్డెన్ ఏరియాలో చెల్లెల్ని తన చేతులతో పెళ్లికూతుర్ని చేసి ఆశీర్వదించింది. శుభలేఖలో తన పేరు చూసుకుని తనూజ మురిసిపోయింది. తన పెళ్లికి బిగ్‌బాస్ టైటిల్ గిఫ్ట్‌గా కావాలని చెప్పింది. అందుకోసం తనూజ కూడా బాగానే కష్టపడుతోంది. నవంబర్ 23 నాటి ఎపిసోడ్లో తన చెల్లి పెళ్లి జరిగిందన్న తనూజ.. నాగార్జునతో కొత్తజంటకు ఆశీర్వాదాలు ఇప్పించింది.

పూజ పెళ్లి వీడియో
అలా నవంబర్ చివరి వారంలో తనూజ చెల్లి పూజ పెళ్లి జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఇవి చూసిన అభిమానులు పూజకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంత పెద్ద శుభకార్యంలో అక్క లేకపోవడం ఎంతైనా తీరని లోటే అని అభిప్రాయపడుతున్నారు.
చదవండి: మనస్సాక్షి లేదా? ప్రజల బాధను అవమానిస్తారా? నటి ఫైర్


