నేనెంత లక్కీ.. కన్నీళ్లాగడం లేదు: తనూజ ఎమోషనల్‌ | Bigg Boss Thanuja Puttaswamy Gets Emotional Over Lady Fan Heartfelt Dairy, Read Story Inside | Sakshi
Sakshi News home page

మాటలు రావడం లేదు.. ఈ జీవితానికి ఇది చాలు: తనూజ

Mar 8 2026 1:48 PM | Updated on Mar 8 2026 4:36 PM

Bigg Boss Thanuja Puttaswamy gets emotional over Lady Fan Dairy

సెలబ్రిటీలు జనాల అభిమానాన్ని, కోపాన్ని అస్సలు తట్టుకోలేరు. వారి ప్రేమాభిమానాలు చూసి ఆనందభాష్పాలు రాలుస్తారు. కోపంతో దారుణంగా విమర్శించినప్పుడు ఎందుకిలా చేస్తున్నారని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటారు. నటి, తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ రన్నరప్‌ తనూజ పుట్టస్వామి కూడా ఇప్పుడు సంతోషంతో ఏడ్చేసింది.

నేనెంత అదృష్టవంతురాలినో..
ఆ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. తనను ఎంతగానో ఇష్టపడే ఓ మహిళా అభిమాని తనకోసం డైరీ రాసిందని, దాన్ని చదువుతున్నానని పేర్కంది. నేనెంత అదృష్టవంతురాలినో కదా.. నాకు పుస్తకాలు చదవడమంటే ఇష్టం. ఈసారి ఎంతో ప్రత్యేకమైన పుస్తకాన్ని చదువుతున్నాను. నా యోగక్షేమాలు కోరుకునే వ్యక్తి నాకోసం స్పెషల్‌గా రాసిన డైరీ చదువుతున్నాను. నాకు మాటలు రావడం లేదు. 

నన్ను అర్థం చేసుకున్నారు
నమ్ముతారో, లేదో.. ఇది చదువుతూ ఉంటే కన్నీళ్లు ఆగడం లేదు. మనల్ని లోతుగా అర్థం చేసుకునేది మన కుటుంబసభ్యులు మాత్రమే.. కానీ, నా విషయంలో.. ఎంతోమంది జనం నన్ను అర్థం చేసుకున్నారు, అక్కున చేర్చుకున్నారు.. నా మంచి కోసం ప్రార్థిస్తున్నారు. నా జీవితానికి ఇది చాలు అని తనూజ ఆనందం వ్యక్తం చేసింది. తనకోసం డైరీ రాసిన వందన అనే అమ్మాయికి ఐ లవ్యూ చెప్పింది.

చదవండి: ప్రేమలో కోర్ట్‌ హీరోహీరోయిన్‌.. వాళ్ల స్పందన ఇదే!

Advertisement
 
Advertisement
Advertisement