కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయగన్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. మద్రాసు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు, సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ అంటూ ఈ కేసు తిరుగుతూనే ఉంది. ఫైనల్‌గా కోర్టు ఆదేశాల మేరకు చిత్ర యూనిట్ ‘జన నాయగన్’ను సెన్సార్ బోర్డు రివ్యూ కమిటీకి పంపింది. నేడు మార్చి 8న మద్యాహ్నం తర్వాత ఈ చిత్రాన్ని ఈ కమిటీ మరోసారి చూడనుంది.
జన నాయగన్ సినిమా చూసిన తర్వాత రివ్యూ కమిటీ ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. ఆ సీన్స్‌ను కట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. దీంతో జన నాయగన్ విడుదలకు లైన్ క్లియర్ అవుతుంది. అన్నీ అనకున్నట్లు జరిగితే ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. రంజాన్ కూడా కలిసి రావడంతో ఈ సెలవులు జన నాయగన్ కలెక్షన్స్‌కు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.


