ప్రేమలో పడ్డ కోర్ట్‌ జంట? రోషన్‌, శ్రీదేవి రియాక్షన్‌ ఇదే! | Court Movie Pair Harsh Roshan And Sridevi Reacts On Love Rumours, Check Out For More Details | Sakshi
Sakshi News home page

Roshan, Sridevi: కోర్ట్‌ కంటే ముందే పరిచయం.. ప్రేమ గురించి ఏమన్నారంటే?

Mar 8 2026 12:20 PM | Updated on Mar 8 2026 3:48 PM

Court Pair Harsh Roshan, Sridevi reacts on Love Rumours

కోర్ట్‌ జంట హర్ష్‌ రోషన్‌- శ్రీదేవి మరోసారి జంటగా నటించిన చిత్రం బ్యాండ్‌మేళం. సతీశ్‌ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ జంట సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా వారికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆన్‌స్క్రీన్‌లో ప్రేమపాటలు పాడుకుంటున్న ఈ జంట ఆఫ్‌స్క్రీన్‌లోనూ లవ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. 

లవ్‌ రూమర్స్‌
ఇదెంతవరకు నిజం? అని యాంకర్‌ ప్రశ్నించాడు. అందుకు రోషన్‌, శ్రీదేవి స్పందిస్తూ.. కోర్ట్‌ మూవీ కంటే ముందే మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఇద్దరం చైల్డ్‌ ఆర్టిస్టులం.. ఎలా పరిచయమయ్యామో గుర్తు లేదు కానీ ఫ్రెండ్స్‌ అయ్యాం. అందుకే ఇంత క్లోజ్‌గా ఉంటాం. ఒరేయ్‌, పోరా అని పిల్చుకుంటాం.

అది చూసి నవ్వుకుంటాం
కోర్ట్‌ సినిమా సమయం నుంచి బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారాం. తెరపై మమ్మల్ని చూసి ప్రేమికులు అనుకుంటారు. ఆ కామెంట్స్‌ చూసి మేము నవ్వుకుంటాం. కానీ, మేము మంచి మిత్రులం మాత్రమే.. మా మధ్య ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు. తాము కేవలం మిత్రులమే అని నొక్కి చెప్పారు. బ్యాండ్‌మేళం విషయానికి వస్తే..​ దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బాక్సాఫీస్‌ వద్ద ఎంత గట్టి సౌండ్‌ చేస్తుందో చూడాలి!

చదవండి: ఆస్తి చూసి పెళ్లి? బిగ్‌బాస్‌ బ్యూటీ ఆన్సరిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement