బెంగళూరులో ఎన్టీఆర్ క్రేజ్.. సింహాద్రి సీన్‌ రిపీట్‌ (వీడియో) | Jr NTR Draws Massive Crowd In Bengaluru During Hospital Inauguration, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

బెంగళూరులో ఎన్టీఆర్ క్రేజ్.. సింహాద్రి సీన్‌ రిపీట్‌ (వీడియో)

Mar 8 2026 11:32 AM | Updated on Mar 8 2026 1:42 PM

Jr NTR fans massive crowd in Bangalore

కన్నడలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు క్రేజ్‌ ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ఆయన బెంగుళూరుకు వెళ్లారు. ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్లిన తారక్‌ను చూసేందుకు దారిపొడవునా ఫ్యాన్స్‌ నిల్చొని ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌, బెంగళూరు సెంటర్స్‌, ఆసుపత్రి ఇలా ఎక్కడ చూసినా సరే ఆయన అభిమానులే కనిపించారు. చాలారోజుల తర్వాత ఎన్టీఆర్‌ పబ్లిక్‌ వేదికపైకి రావడంతో ఫ్యాన్స్‌ పోటెత్తారు. 

బెంగళూరు రోడ్లపై ఎక్కడ చూసినా తారక్‌ ఫ్యాన్సే కనిపించడంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. సింహాద్రి సినిమాలో సింగమలై అంటూ జనాలు ఎలా పోటెత్తారో ప్రస్తుతం బెంగళూరు ఆసుపత్రి వద్ద అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. తారక్‌ కనిపించగానే ఒక్కసారిగా సీఎం.. సీఎం.. అంటూ ఫ్యాన్స్‌ నినాదాలు చేయడమే కాకుండా ఫ్లెక్సీలు ప్రదర్శించారు.

బెంగళూరులో తారక్‌ అభిమానుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో.. మహాదేవపుర, ఎలక్ట్రానిక్ సిటీ వైపు వెళ్లే  రహదారులన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో సాధారణ ప్రయాణికులకు కూడా ఇబ్బంది ఎదురైంది. ట్రాఫిక్‌ పోలీసుల అంచనాలకు మించి అభిమానులు రావడంతో సిగ్నల్స్‌ వద్ద  ఇబ్బందులు పడ్డారు. అయితే, పరిస్థితిని గమనించిన బెంగళూరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. రోడ్డు క్లియరెన్స్‌ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement