మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్ మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంపై రోజు రోజుకు హైప్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వారణాసికి సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీ ఓవర్‌సీస్ రైట్స్‌పై టాలీవుడ్‌లో ఓ టాక్ వైరల్‌గా మారింది. ఈ సినిమా ఓవర్‌సీస్ రైట్స్ భారీ ధరకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ మూవీ కోసం ఏకంగా రూ.160 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో మేకర్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అత్యధిక ధర దక్కించుకున్న చిత్రంగా వారణాసి నిలవనుంది. ఇప్పటి వరకు ఓ ఇండియన్ సినిమాకు ఇంతపెద్ద స్థాయిలో ఓవర్‌సీస్ రైట్స్ డీల్ కుదరలేదు. సినీ ఇండస్ట్రీలో ఈ అరుదైన రికార్డ్ సాధించిన చిత్రంగా వారణాసి నిలవనుంది.
కాగా.. ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ ఫాంటసీ మైథలాజికల్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.


