మనస్సాక్షి లేదా? ప్రజలంటే అంత చులకనా? | Bigg Boss Sanam Shetty Angry on Actress Vinodhini | Sakshi
Sakshi News home page

విజయ్‌ను అరెస్ట్‌ చేయలేదనే కదా! జనం పనికిరానివాళ్లా!

Dec 7 2025 11:36 AM | Updated on Dec 7 2025 12:33 PM

Bigg Boss Sanam Shetty Angry on Actress Vinodhini

ఏడాది జరిగిన అత్యంత విషాదకర ఘటనల్లో కరూర్తొక్కిసలాట ఒకటి. హీరో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఎంతోమంది గాయపడ్డారు. విషాదంపై సినీనటులు, రాజకీయప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విజయ్తో కలిసి జిల్లా మూవీలో యాక్ట్చేసిన వినోదిని.. విజయ్‌కు నటుడిగా సపోర్ట్‌ చేస్తానని, కానీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడని ప్రశ్నించింది.

జనాలను పట్టించుకోవడం దండగ
ఈమధ్య ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. జనాలను పట్టించుకోవడం దండగ అని మధ్యే అర్థమైంది. వాళ్లకోసం మాట్లాడి ఉపయోగం లేదు. వాళ్లతో మాట్లాడినప్పుడు ఆ విషయం నాకు మరోసారి స్పష్టంగా అర్థమైంది. ఉదాహరణకు కరూర్తొక్కిసలాటనే తీసుకోండి.. 41 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ల కుటుంబాలు కూడా అదంతా మర్చిపోయి మామూలుగా ఉన్నారు. అలాంటివారి కోసం నేనెందుకు నిలబడాలి? అని మాట్లాడింది

నటి ఆగ్రహం
వ్యాఖ్యలపై బిగ్బాస్బ్యూటీ, నటి సనం శెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల బాధను ఎందుకని అవమానిస్తున్నారు? మీకు మనస్సాక్షి అనేదే లేదా? మీరేమైనా కరూర్బాధితులను నేరుగా కలిశారా? మాట్లాడారా? వాళ్ల సమస్యలేంటో అడిగి తెలుసుకున్నారా? సమస్యను అర్థం చేసుకోవడం పక్కనపెట్టి విజయ్సర్ను అరెస్ట్చేయలేదని ఎక్కువ ఫీలవుతున్నట్లున్నారు.

బీపీ వచ్చింది
జయలలిత లాంటి ‌నాయకురాలు రాజకీయాల్లో మళ్లీ కనిపించరా? అని అడుగుతుంటారు కదా! ఇదే దానికి సమాధానం. ప్రజలకు విలువ ఇవ్వని నాయకులు ఎక్కడ ఎదుగుతారు? ఆమె మాటలు విన్నాక నాకు బీపీ ఒక్కసారిగా పెరిగిపోయింది. నేను కరూర్బాధితులను నేరుగా కలిశాను. నేను మీలా రాజకీయ నాయకురాలిని కాదు. పార్టీని సపోర్ట్చేయను. అయినా వారి బాధ నేను అర్థం చేసుకోగలను

జనం పనికిరానివాళ్లా?
వాళ్లకోసం నేను పెద్దగా ఏమీ చేయకపోవచ్చేమో! కానీ, అండగా నిలబడటం నా బాధ్యత. జరిగినదాంట్లో విజయ్సర్తప్పు లేదని బాధితులే స్వయంగా చెప్పారు. కానీ, మీరు మాత్రం దాన్ని ఒప్పుకోరు. పైగా అలా అన్నందుకు మీ దృష్టిలో అమాయక జనం పనికిరానివాళ్లుగా మారిపోయారు. మీరు పార్టీకి రాజీనామా చేసి మంచి పని చేశారు. మీరు ఇంట్లో ఉంటేనే మంచిది. మీ సేవలు మాకు అక్కర్లేదు అని మండిపడింది. కాగా వినోదిని.. మక్కల్నీది మయ్యం పార్టీకి ఏడాది జనవరిలో రాజీనామా చేసింది. తమిళ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొన్న సనం శెట్టి.. తెలుగులో శ్రీమంతుడు, సింగం 123, ప్రేమికుడు చిత్రాల్లో నటించింది.

చదవండి: తనూజకు క్లాస్‌ పీకిన నాగ్‌.. ఆ ముగ్గురికే ట్రోఫీ గెలిచే అర్హత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement