ఘనంగా వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవం

Mar 13 2026 7:59 AM | Updated on Mar 13 2026 7:59 AM

● కేక్‌ కట్‌ చేసి ఆనందం ● పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు

సాక్షి, చైన్నె: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను చైన్నెలో ఘనంగా నిర్వహించారు. పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వైఎస్‌ఆర్‌ సేవాదళ్‌ తమిళనాడు విభాగం నేతృత్వంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పెరంబూరు సోమ సుందరం నగర్‌లోని కార్యాలయం ఆవరణలో పార్టీ జెండాను సేవాదళ్‌ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జహీర్‌ హుస్సేన్‌ ఎగుర వేశారు. మహి ళల చేత కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. మహిళలకు చీరలు అందజశారు. పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, ఇతర సహాయకాలను పంపిణీ చేశారు. పలువురు పురుషులకు సైతం వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రకాష్‌, భాస్కర్‌రెడ్డి, శరవనన్‌, కార్తీక్‌, మహ్మద్‌ సాధిక్‌, మణి వణ్ణన్‌, లక్ష్మీ, ఈశ్వరి, కీర్తి, సెల్వి తమిళరసి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement