ఎంఎస్‌ఎంఈలకు
పొదుపు మంత్రం
సాక్షి, చైన్నె : ఎంఎస్‌ఎంఈలకు రూ. 2 వేల కోట్ల మేరకు పొద్దుపు మంత్రంతోసరికొత్త రికార్డును సృష్టించామని అమెజాన్ బిజినెస్ డైరెక్టర్ మిత్రంజన్ భాదూరి తెలిపారు. బల్క్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ రివార్డులు , బిజినెస్ డీల్స్ ద్వారా 2025 సంవత్సరంలో ఇక్కడి వ్యాపార సంస్థలకు లభించిన ప్రయోజనం గురించి గురువారం స్థానికంగా ఆయన ప్రకటించారు.చిన్న వ్యాపారులకు పెద్ద అండ , ఎంఎస్‌ఎంఈల నుంచికార్పొరేట్ పరిశ్రమల వరకు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి అమెజాన్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను ప్రధాన వేదికగా మారిందని వివరించారు. జీఎస్టీ కంప్‌లైంట్ ఇన్‌వాయిసింగ్ ప్రక్రియను సరళీకృతం చేయడం ద్వారా కొనుగోళ్లలో పారదర్శకత పెరిగిందన్నారు. టైర్–2, టైర్–3 నగరాల్లో గడచిన ఐదేళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించినట్టు వివరించారు. వార్షిక వృద్ధి రేటు మొత్తం అమ్మకాలలో 40 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు.బల్క్ కొనుగోళ్లు 35 శాతం వృద్ధిని నమోదు చేశాయని పేర్కొన్నారు.
భర్తపై పెట్రోల్ పోసి కాల్చిన భార్య
– తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ భర్త మృతి
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం వ్య వహారంలో ఏర్పడిన గొడవలో భర్తపై భార్య పెట్రోలు పోసి నిప్పు పెట్టి హత్య చేసిన ఘట న సంచలనం కలిగించింది. వివరాలు.. చైన్నెకి చెందిన ఆంథోనీ రాబిన్ (26). ఇతను కళ్లకురి చ్చి జిల్లా చిన్నసేలంలో ఉన్న ఒక గ్యాస్ గోదాంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన అమ్ము (22) అనే యువతితో పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రస్తుతం వారికి 3 పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో అమ్ముకు, ఆమె సో దరి భర్తతో వివాహేతర సంబంధం ఉందని, దానిని ఆంథోనీ రాబిన్ ఖండించినట్లు సమా చారం. ఈ క్రమంలో గత 8వ తేదీన ఇంటి ముందు పడుకున్న ఆంథోనీ రాబిన్‌పై అమ్ము పెట్రోల్ పోసి నిప్పంటించింది. అప్పుడు మంటలు అంటుకున్న తర్వాత అతను వీధిలో పరిగెత్తే దృశ్యాలు, అప్పుడు వెంటాడి వెంటాడి మళ్లీ పెట్రోల్ ఒంటిపై పోసే దశ్యాలు వీడియో లో రికార్డ్ అయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆ ప్రాంత వాసులు రక్షించి కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. తర్వాత మెరు గైన చికిత్స కోసం సేలంకు తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. ఇది చూసిన బంధువులు ఆంథోనీ రాబిన్ మరణానికి కారణమైన అతని భా ర్యను, అక్క భర్తను అరెస్టు చేయాలని, అప్పుడే మృతదేహాన్ని తీసుకుంటామని చెప్పి సేలం ప్ర భుత్వ ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బస్టాండులో కత్తితో హల్‌చల్
– యువకుడి అరెస్టు
తిరుత్తణి: తిరుత్తణి బస్టాండులో యువకుడు కత్తితో ప్రయాణికులకు భయాందోళను గురిచేస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం తిరుత్తణి ఇన్‌స్పెక్టర్ శివకుమార్ తన సిబ్బందితో బస్టాండుకు చేరుకున్నారు. అక్కడ కత్తితో నిలిచివున్న యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. వేలంజేరికి చెందిన రాజ్‌కుమార్(25) ప్రయాణికులకు కత్తిచూపి బెదిరించి భయాందోళనకు గురిచేసినట్లు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సవ వధువు పరారీ
పళ్లిపట్టు : వివాహమైన 30 రోజుల్లోనే నవ వధువు పరారైన ఘటనకు సంబంధిచి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పళ్లిపట్టు సమీపంలోని కుమారమంగళం గ్రా మానికి చెందిన కృష్ణన్ రైతు. అతని కుమార్తె శ్వేత(19)కు నెల రోజుల కిందట కాంచీపురాని కి చెందిన మోహన్ అనే యువకుడితో వివా హం చేశారు. పదిరోజుల నుంచి పుట్టింట్లో ఉన్న శ్వేత నాలుగు రోజుల కిందట ఇంటి నుంచి దుకాణంకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని పలుచోట్ల వెతికినా జాడ కన పడుట లేదని యువతి పళ్లిపట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను బైక్ ఢీకొని
పాలిటెక్నిక్ విద్యార్థి మృతి
– మరో యువకుడి పరిస్థితి విషమం
పళ్ళిపట్టు: ఆటోను బైక్ ఢీకొన్న ప్రమాదంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధి ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పళ్లిపట్టు సమీపంలోని కోణసముద్రం గ్రామానికి చెందిన గోవర్ధన్ రైతు అతనికి కొడుకు, కుమార్తె ఉన్నారు. వారిలో కుమారుడు శరవణవేల్(17) ఆర్కేపేటలో ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుకునేవాడు. బుధవారం రాత్రి శరవణకుమార్ అదేగ్రామానికి చెందిన అతి మిత్రుడు నరేష్(20)తో అత్తిమాంజేరిపేటలకు బైకులో వెళ్లాడు. వారు పాతకుప్పం మలుపువద్ద వేగంగా వెళ్లుతుండగా అత్తిమాంజేరిపేట నుంచి పొదటూరుపేటకు పాల క్యాన్‌లు తరలిస్తున్న ఆటోను బైకు ఢీకొంది. ప్రమాదంలో బైకులో వెనుక వైపు వున్న శరవణవేల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నరేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు కాపాడి 108 అంబులన్స్ ద్వారా తిరువళ్లూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పొదటూరుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


