ఇరుల కుటుంబంకు ఇళ్లు నిర్మించిన టీవీకే శ్రేణులు | - | Sakshi
Sakshi News home page

ఇరుల కుటుంబంకు ఇళ్లు నిర్మించిన టీవీకే శ్రేణులు

Mar 13 2026 8:00 AM | Updated on Mar 13 2026 8:00 AM

పళ్ళిపట్టు: ఇరుల కుటుంబానికి టీవీకే శ్రేణులు రూ. 5 లక్షల వ్యయంతో ఇళ్లు నిర్మించి అప్పగించారు. వివరాలు.. పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేట కొండ ప్రాంతంలో ఇళ్లులేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఇరుల కుటుంబంను ఆదుకునే విధంగా టీవీకే జిల్లా కార్యదర్శి రమేష్‌ పార్టీ శ్రేణులతో కలిసి వారి సొంత డబ్బులు నుంచి రూ. 5 లక్షల ఖర్చుతో నూతన ఇళ్లు నిర్మించారు. విజయ్‌ పేరిట నిర్మించిన ఇళ్లు ప్రారంభోత్సవం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఢిల్లీబాబు అధ్యక్షత వహించారు. ఇందులో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు లయోలా మణి, సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొని కొత్త ఇళ్లు ప్రారంభించి పేద కుటుంబంకు అప్పగించారు. అనంతరం పొదటూరుపేటలో బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీవీకే శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement