కొరుక్కుపేట: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ సీఎండీ ప్రసన్నకుమార్ మోటుపల్లికి అరుదైన గౌరవం దక్కింది. గవర్నెన్‌న్స్ నౌ 12వ పీఎస్‌యూ అవార్డుల ప్రదానోత్సవంలో పీఎస్‌యూ లీడర్‌షిప్ అవార్డు ఎండీ కేటగిరీలో ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ సీఎండీ ప్రసన్నకుమార్ మోటుపల్లికి అవార్డును ప్రదానం చేశారు. ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కార్యాచరణ పనితీరు, స్థిరమైన వృద్ధి పథాన్ని గణనీయంగా బలోపేతం చేసిన తన దూరదృష్టి గల నాయకత్వం, వ్యూహాత్మక దిశానిర్దేశం, పరివర్తనాత్మక చొరవలకు గుర్తింపుగా మోటుపల్లి ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ అవార్డును మొత్తం ఎన్ ఎల్ సి ఇండియా లిమిటెడ్ శ్రామిక శక్తికి మోటుపల్లి అంకితం చేశారు.


