టికెట్ టు ఫినాలేలో కంటెస్టెంట్లు చేసిన తప్పొప్పులను నాగార్జున ఎత్తిచూపాడు. ఇమ్మాన్యుయేల్ తాడు వదిలేయడం వీడియో వేసి చూపించాడు. అలాగే భరణి ట్రయాంగిల్ గోల గురించి చర్చించాడు. అనవసరమైన గొడవ మొదలుపెట్టిందే తనూజ అని క్లాస్ పీకాడు. అలాగే పవన్ ఓడిపోయిన ప్లాంకుల టాస్కు గురించి మాట్లాడుతూ.. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ప్రవర్తించావు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో టికెట్ టు ఫినాలే గెలుస్తానని చెప్పి ఓడిపోయావ్ అని సెటైర్లు వేశాడు. మరి తర్వాతేం జరిగిందో శనివారం (డిసెంబర్ 6వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
సుమన్ అనర్హుడు
బిగ్‌బాస్ ట్రోఫీకి తామెందుకు అర్హులో హౌస్‌మేట్స్ చెప్పాలన్నాడు. మొదటగా సుమన్.. గేమ్ బాగా ఆడుతున్నాను, ఆ మేరకు ఎఫర్ట్స్ పెడుతున్నాను అన్నాడు. ఆయనకు కప్పు గెలిచే అర్హత లేదని సంజనా, ఇమ్మాన్యుయేల్, రీతూ, పవన్ అభిప్రాయపడ్డారు. తనూజ, భరణి, కల్యాణ్ మాత్రం ఆయనకు గెలిచే అర్హత ఉందన్నారు. ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. జనాలను ఎంటర్‌టైన్ చేయాలన్నదే నా ఏకైక లక్ష్యం. ఏ సీజన్‌లోనూ కమెడియన్ గెలవలేదు. ఈ సీజన్‌లో నేను గెలవాలనుకుంటున్నా అని చెప్పాడు. ఆయన మాటలతో హౌస్‌మేట్స్ అందరూ ఏకీభవించారు.

వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు
తర్వాత భరణి.. నాకు దెబ్బలు తగిలినా సరే ఎక్కడా తగ్గకుండా ఆడాను. కంటెంట్ కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న పవన్‌ను ఓడించాను. కచ్చితంగా కప్పుకు అర్హుడినే అన్నాడు. రీతూ, పవన్ మినహా మిగతా అందరూ ఆయన మాటలతో ఏకీభవించారు. సంజనా.. నేను మాస్క్ వేసుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాను. చూసిందే మాట్లాడాను. నిజాయితీగా ఉన్నాను అని చెప్పగా సుమన్, భరణి, పవన్ ఆమెకు కప్పు గెలిచే అర్హత లేదని భావించారు.
కల్యాణ్‌కు ఫుల్ సపోర్ట్
పవన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ నా ఇల్లు అనుకున్నాను. ఏ పని చెప్పినా అన్నీ చేశాను. ఎక్కడా మాట తప్పలేదు. బంధాల వల్ల గేమ్ తగ్గిపోతుందని తెలిసినా నేనెలా ఉన్నానో అలాగే ఉన్నాను. అన్ని టాస్కుల్లోనూ బాగానే ఆడాను అని చెప్పుకొచ్చాడు. అతడికి రీతూ, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ మాత్రమే సపోర్ట్ చేశారు. అనంతరం కల్యాణ్ మాట్లాడుతూ.. డిసిప్లేన్, డిటర్మినేషన్, డెడికేషన్.. ఈ మూడింటితోపాటు కమిట్మెంట్‌తో ఆడాను.

లేడీ విన్నర్
అందరితో బాగున్నా.. జెన్యూన్‌గా ఆడా.. ఎవరికీ అన్యాయం చేయలేదు అని చెప్పగా అందరూ ఇతడు అర్హుడనే తలూపారు. తనూజ మాట్లాడుతూ.. నాకు కుటుంబం, వర్క్ ప్లేస్ తప్ప మిగతాది తెలియదు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నానంటే ఇప్పటికీ ఓ కలలా ఉంది. ఎక్కడా ఫేక్‌గా ఉండకుండా జెన్యూన్‌గా ఉన్నాను. నావల్ల అయినంతవరకు ఆడాను. లేడీ విన్నర్ అవ్వాలని, అది నేనే అవాలనుకుంటున్నా అని చెప్పింది. అందరూ ఆమె చెప్పింది కరెక్టేనన్నారు.
ముగ్గురికే కప్పు గెలిచే అర్హత
రీతూ మాట్లాడుతూ.. ప్రతి గేమ్‌లో ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నాకు ఏదనిపిస్తే అది చేశాను. గెలిచినా, ఓడినా.. ఎలా అయినా ఫైనల్స్‌లో ఉండాలన్న కసితోనే ఆడాను. ఏదో ఒకటి చేసి ముందుకెళ్లాలన్న తపనతోనే ఉన్నాను అని పేర్కొంది. సుమన్, భరణి తప్ప మిగతా అందరూ ఆమెకు అర్హత ఉందని ఓటేశారు. మొత్తానికి ఈ ఓటింగ్‌లో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ మాత్రమే అర్హులంటూ వారికి పూర్తిస్థాయిలో ఓట్లు పడ్డాయి.


