బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ దాదాపుగా చివరకొచ్చేసింది. ప్రస్తుతం 13వ వారం నడుస్తోంది. అంటే మరో రెండు వారాల్లో షో పూర్తి కానుంది. సరే ఎప్పటిలానే వీకెండ్ వచ్చింది కాబట్టి ఎలిమినేషన్ ఎవరు అవుతారా అని అందరూ ఎదురుచూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఈసారి ఆరుగురు నామినేట్ అయ్యారు. వీళ్లలో నుంచి షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఆమెనే రీతూ చౌదరి.
ఈ వారం నామినేషన్స్‌లో తనూజ, భరణి, సంజన, సుమన్ శెట్టి, పవన్, రీతూ చౌదరి ఉన్నారు. గత రెండు మూడు వారాల బట్టి చూసుకుంటే ఓటింగ్ తక్కువగా పడుతున్న సంజన లేదంటే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోవాలి. కానీ గత వీకెండ్ ఎపిసోడ్‌లో జరిగిన హంగామా వల్ల లెక్కలన్నీ మారిపోయినట్లు కనిపిస్తోంది. రీతూ-పవన్ మధ్య బంధం గురించి సంజన కొన్ని కామెంట్స్ చేసింది. హోస్ట్ నాగార్జున.. ఎలాగైనా సరే సంజనతో క్షమాపణ చెప్పించాలని చూశాడు. కానీ వల్ల కాలేదు.
(ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?)
గత వీకెండ్‌లో సంజన చెప్పిన పాయింట్స్‌కి ఆడియెన్స్ ఫిదా అయిపోయారేమో గానీ ఈ వారం ఆమెకు ఓటింగ్ పరంగా టాప్‌కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి బిగ్‌బాస్‌కి అవకాశం లేకుండా అయిపోయింది. ఈ విషయంలో రీతూపై కాస్త నెగిటివిటీ ఏర్పడినట్లు అనిపిస్తుంది. దీంతో ఈసారి ఈమెకు కాస్త ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అలా ఈమెని హౌస్ నుంచి బయటకు పంపేసినట్లు సమాచారం.
అయితే రీతూ చౌదరి.. టాప్-5 వరకు వచ్చే ఛాన్స్ ఉందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఓటింగ్ పరంగా కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ గేమ్స్ విషయంలో మాత్రం మిగతా వాళ్లకు మంచి పోటీ ఇచ్చేది. ఫినాలే కంటెండర్‌షిప్ పోటీల్లోనూ చివరివరకు వచ్చింది గానీ విజయం సాధించలేకపోయింది. అలానే పవన్‌తో ఈమె రాసుకుపూసుకు తిరగడం కూడా జనాలకు మొహం మొత్తేసినట్లు ఉంది. ఇలా పలు కారణాల వల్ల బిగ్‌బాస్, రీతూని సాగనంపేసినట్లున్నాడు!
(ఇదీ చదవండి: ఏసియన్ పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న నటి ప్రగతి)


