టీమిండియా యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ డేటింగ్ అంటూ వార్తలు కొత్తేం కాదు. గతంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు తెలుగు యాంకర్ వర్షిణితో ఇతడు డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వచ్చాయి. తర్వాత తర్వాత అవి కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయాయి. ఇప్పుడు సుందర్, ఓ బాలీవుడ్ నటి, స్పోర్ట్స్ ప్రెజెంటర్‌తో డేటింగ్ చేస్తున్నాడని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?)
క్రికెటర్లు.. హీరోయిన్లతో డేటింగ్, పెళ్లి చేసుకోవడం లాంటివి కొత్తేం కాదు. ఇప్పుడు ఆ లిస్టులోకి సుందర్ చేరుతాడా అనిపిస్తుంది. ఎందుకంటే హిందీ నటి సాహిబా బాలీతో ఓ కేఫ్‌లో సుందర్ జంటగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఎప్పటిది అనేది తెలియట్లేదు గానీ సుందర్-సాహిబా డేటింగ్ గురించి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు.
సాహిబా బాలీ విషయానికొస్తే.. ఈమె కశ్మీరీ కుటుంబానికి చెందిన అమ్మాయి. నాటకాలతో మొదలుపెట్టి హిందీలో పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఐపీఎల్‌లో స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గానూ కనిపించి ఆకట్టుకుంది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ టైంలోనూ క్రికెట్ యాంకర్‌గా పనిచేసింది. అయితే సుందర్-సాహిబా మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా అనేది తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం డేటింగ్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్‌కి ఓ గుణపాఠం!)


