బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో పెళ్లి సందడి. ఇతడి చెల్లి కృతికకు శుక్రవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్‌తో ఏడడుగులు వేసింది. కార్తీక్ ఆర్యన్ సొంతూరు అయిన గ్వాలియర్‌లోని ఓ రిసార్ట్‌లో ఈ శుభకార్యం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన కార్తీక్.. భావోద్వేగానికి గురై పోస్ట్ పెట్టాడు.
(ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్‌కి ఓ గుణపాఠం!)
'నీ ప్రపంచం చాలా మారింది. అందులో ఈ రోజు ఒకటి. నా కికీని పెళ్లి కూతురిలా చూస్తుంటే ఇన్నేళ్లు ఒక్క క్షణంలా అనిపిస్తుంది. నువ్వు నా వెనక పరుగెత్తడం దగ్గర నుంచి ఇప్పుడు ఎంతో ఆనందంగా పెళ్లి కూతురిలా నడిచి వస్తున్నావ్. నిన్ను ఇలా చూస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. కానీ ఎప్పటికీ నువ్వు నా చిట్టి చెల్లిలివే. ఈ ప్రయాణం నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తుందనుకుంటున్నాను' అని కార్తీక్ ఆర్యన్ ఎమోషనల్ అయిపోయాడు.
కార్తీక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011 నుంచి బాలీవుడ్‌లో మూవీస్ చేస్తున్నాడు. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్ని ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, చందు ఛాంపియన్, భూల్ భులయ్యా 3 తదితర చిత్రాలతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతడి చెల్లి పేరు కృతిక తివారీ. ఈమె డాక్టర్. ఇప్పుడు ఈమెకే పెళ్లయింది. కార్తీక్ ప్రస్తుతం 'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరీ తు మేరీ' అనే సినిమా చేశాడు. ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: ఈ ఏడాది టాప్- 10 సినిమాలు ఇవే.. తెలుగు నుంచి ఒకే ఒక్కటి)





