2025లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఇండియన్ సినిమాల లిస్ట్ వచ్చేసింది. ఈ ఏడాదిలో భారత సినిమాల గురించి గూగుల్‌లో ప్రపంచవ్యాప్తంగా చాలామంది వెతికేశారు. ఈ లిస్ట్‌లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలు ఉన్నాయి. అభిమానుల అభిరుచి మేరకు పలురకాల సినిమాల వివరాల కోసం తెగ వెతికారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా గూగుల్‌లో సర్చ్ చేసిన టాప్- 10 లిస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
2025లో చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ మధ్య విడుదలైన సినిమాల్లో ప్రేక్షకులు ఎక్కువగా సర్చ్ చేసిన లిస్ట్‌లో ఎక్కువగా హిందీ సినిమాలే ఉన్నాయి. ఈ లిస్ట్‌లో సైయారా చిత్రం మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇందులో నటించిన అహాన్ పాండే, అనీత్ పడ్డా ఇద్దరూ కొత్తవారే కావడం విశేషం. ఈ జాబితాలో ఉన్న టాప్- 10 సినిమాలేమిటంటే..
సైయారా ( హిందీ)
కాంతార- 2 (కన్నడ)
కూలీ (తమిళ్)
వార్- 2 (హిందీ)
సనమ్ తేరీ కసమ్ (హిందీ)
మార్కో (మలయాళం)
హౌస్‌ఫుల్-5 (హిందీ)
గేమ్ ఛేంజర్ (తెలుగు)
మిసెస్ (హిందీ)
10 మహావతార్ నరసింహ (కన్నడ, హిందీ)
తెలుగు నుంచి రామ్ చరణ్ మాత్రమే
రామ్ చరణ్- దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. శంకర్ నేరుగా తెలుగులో చేసిన సినిమా కావడంతో అభిమానులు కూడా అంచనాలు పెట్టుకున్నారు. కానీ కథలో బలం లేకపోవడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే, గూగుల్ ట్రెండ్‌లో మాత్రం ఈ మూవీ టాప్‌లో నిలిచింది. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు కామెంట్స్‌తో పాటు కలెక్షన్స్ వంటి విషయాలు తెలుసుకునేందుకు ఎక్కువమంది గూగుల్‌లో సర్చ్ చేశారు. అలా టాలీవుడ్ నుంచి ఈ లిస్ట్‌లో చోటు సంపాధించుకున్న ఏకైక చిత్రంగా గేమ్ ఛేంజర్ నిలిచింది.


