మలాయళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ నటించిన హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇండియాలోని ప్రేక్షకులు చూసేందుకు ఇప్పటికే డిసెంబర్ 5న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, ఎఆర్‌ఐల కోసం సన్‌నెక్ట్స్‌లో ఈ మూవీ తాజాగా విడుదలైంది. అంటే కేవలం ఇతర దేశాల్లోని ప్రేక్షకులు మాత్రమే 'డీయస్ ఈరే' చిత్రాన్ని సన్‌నెక్ట్స్‌లో చూడొచ్చు.

'భూతకాలం', 'భ్రమయుగం' తదితర మూవీస్‌తో ప్రేక్షకుల్ని భయపెట్టిన రాహుల్ సదాశివన్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అక్టోబరు 31న మలయాళంలో, నవంబరు 7న తెలుగు వెర్షన్.. థియేటర్లలో రిలీజైంది. ఓవరాల్‌గా రూ.80 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉందని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. జియోహాట్‌స్టార్‌లో(jiohotstar) తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. భారత్ మినహా ఇతర దేశాల్లోని ప్రేక్షకుల కోసం సన్‌నెక్ట్స్‌లో తాజాగా విడుదల చేశారు. హారర్ మూవీ లవర్స్ అయితే గనుక దీన్ని అస్సలు మిస్ చేయొద్దని నెట్టింట పలు పోస్టులు కనిపించడం విశేషం.


