బిగ్‌బాస్ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. వరుస గేమ్స్‌లలో తన సత్తా చూపి ప్రేక్షకులను ఫిదా చేశాడు. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో ఎప్పటికీ కల్యాణ్ పేరు నిలిచిపోతుంది. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మూడోవారం డేంజర్ జోన్‌లోకి వెళ్లి ఎలిమినేట్ అవుతాడనుకున్నారు.
అమ్మాయిల పిచ్చోడు అంటూ వచ్చిన నిందలు భరించాడు. అదే అమ్మాయి కల్యాణ్ గెలుపులో మూలస్థంభంగా నిలబడింది. కల్యాణ్ కేవలం సెలబ్రిటీల చుట్టు మాత్రమే తిరుగుతున్నాడని హేళన చేశారు. ఇలా ఎన్నో భరించిన కామన్ మ్యాన్ కల్యాణ్ రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు. ఏకంగా ఫస్ట్ పైనలిస్ట్‌గా నిలిచి అదే సెలబ్రిటీల చేత శభాష్ అంటూ చప్పట్లు కొట్టించుకున్నాడు. కానీ, టికెట్ టూ ఫినాలే కల్యాణ్‌కు దక్కడం పెద్ద మైనస్ కానుంది. ఈ విజయం ఫైనల్ కప్‌కు దూరం చేసే ఛాన్స్ బలంగా ఉంది.

భరణి, రీతూల మాటల యుద్ధం
బిగ్‌బాస్ సీజన్-9లో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచేందుకు కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, భరణి గట్టిగానే ఫైట్ చేశారు. అయితే, రీతూ చేతిలో భరణి ఓడిపోయాడు. దీంతో ఆయన టాస్క్ నుంచి విరమించాల్సి వచ్చింది. గేమ్ పూర్తి అయిన తర్వాత సంచాలక్ సంజన తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆధారాలతో సహా తనూజ చూపుతుంది. దీంతో భరణికి కోపం వచ్చి సంజన పట్ల తన అసంతృప్తిని వ్యక్తపరుస్తాడు. ఆపై రీతూతో పెద్దగొడవే జరిగింది. నేను గెలిచిన ప్రతిసారి ఇలా ఎదో ఒకటి చేస్తారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
ఇందులో భరణి వాదన కరెక్ట్‌గానే ఉంది. సంజన ఇచ్చిన తీర్పు కూడా కరెక్ట్‌గానే ఉంది. కానీ, టాస్క్‌లో భాగంగా ఇచ్చిన ట్రయాంగిల్ (త్రిభూజాకారం) వస్తువును కావాలనే బిగ్‌బాస్ టీమ్ అలా డిజైన్ చేసిందా... పొరపాటున తప్పిదం జరిగిందా తెలియాలంటే నాగార్జున చెప్పాల్సిందే. అయితే, ఈ టాస్క్‌లకు ఎలాంటి సంబంధం లేని కల్యాణ్‌ని భరణి లాగి గొడవపడ్డాడు. దీంతో కల్యాణ్‌తో కూడా గొడవ జరుగుతుంది.

విన్నర్‌కు కల్యాణ్ దూరం
కల్యాణ్‌కు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచే అర్హత వంద శాతం ఉంది... అదే సమయంలో తనూజ నుంచి కూడా గట్టిపోటీ ఉంది. తనకు మహిళల బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కల్యాణ్ విన్నర్ అవడం చాలా కష్టమనే చెప్పవచ్చు. ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ తీసుకుని బిగ్‌బాస్ విన్నర్ ట్రోఫీ వదిలేశాడేమో అనిపిస్తుంది. రీతూ, కల్యాణ్‌ల మధ్య జరిగిన చివరి టాస్క్ కల్యాణ్‌ను గెలిపించేందుకే బిగ్‌బాస్ ఇచ్చాడనిపిస్తుంది. అతనొక ఆర్మీ సైనికుడు కావాలనే పూర్తి ఫిజికల్ టాస్క్ పెట్టినట్లు తెలుస్తోంది. అమ్మాయి ప్రత్యర్థిగా ఉంటే ఇలాంటి టాస్క్ అవసరం లేదు. ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచిన కల్యాన్ మరో రెండు వారాలు ఓటింగ్‌లో కనిపించడు.
ఈ వారం కెప్టెన్ కావడంతో ఇప్పటికే ఓటింగ్‌లో లేడు. దీంతో టైటిల్ కోసం ఓటింగ్ రేసులో మాత్రమే కల్యాణ్ కనిపిస్తాడు. తనూజ దాదాపు ప్రతి వారం రేసులో ఉంటుంది. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్ గెలుపులో తనూజ పాత్ర కూడా చాలా ఎక్కువగానే ఉంది. కల్యాణ్ కెప్టెన్ కావాలని ఆమె బలంగా కోరుకుంది. ఆపై అతనికి సపోర్ట్ కూడా చేసింది. ఇలా తనూజకే చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దీంతో దాదాపు బిగ్‌బాస్ విన్నర్ తనూజ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో రాహుల్ మినహా టికెట్ టూ ఫినాలే అందుకున్న ఎవరు కూడా బిగ్‌బాస్ ట్రోఫీ గెలవలేదన్నది గమనార్హం.


