‘‘ఈషా’లో హారర్‌తో పాటు చావు, పుట్టుక, దైవత్వం, సృష్టి చేసే పనులు... ఇలా అన్ని అంశాలు ఉంటాయి. ఈ చిత్రంలో కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి... అందుకే ఈ సినిమా చూసి భయపడతారు. హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు ఈ సినిమా చూడకూడదు’’ అని డైరెక్టర్ శ్రీనివాస్ మన్నె తెలిపారు. అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా, హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఈషా’. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 12న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ– ‘‘జెనీలియాతో నేను తీసిన ‘కథ’ చిత్రానికి నాకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా తర్వాత నా వ్యక్తిగత కారణాల వల్ల దర్శకత్వానికి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో చాలా కథలు సిద్ధం చేసుకున్నాను. దామోదర్ ప్రసాద్‌గారు ఇచ్చిన సపోర్ట్‌తో ‘ఈషా’ చేశాను. కథ బలంగా ఉంటే సాంకేతిక అంశాలు అటూ ఇటూ ఉన్నా సినిమా సక్సెస్ అవుతుంది. ఫ్రెండ్‌షిప్, హ్యూమన్ ఎమోషన్స్, ఫిలాసఫీ, మూఢ నమ్మకాలు, ఆత్మలు.. ఇలా అన్నింటినీ ఈ సినిమాలో చర్చించాం. చిన్నపిల్లలు కొరియన్ హారర్ ఫిల్మ్స్ చూస్తున్నారు. అలాంటి వాళ్లకు మా సినిమా ఎంతో నచ్చుతుంది’’ అని చె΄్పారు.


