ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సినిమా నైజాం విడుదల హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది. ‘‘ఆది నటించిన మరో వైవిధ్యభరితమైన థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. ఈ చిత్రం నైజాం హక్కులను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్’’ అని చిత్రయూనిట్ తెలిపింది.


