యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ఓ ఎంటర్‌టైన్‌మెంట్ షో, 'జబర్దస్త్' కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ బాబీ అలియాస్ లక్ష‍్మినారాయణ.. రెండు రోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ క్రమంలోనే 'జబర్దస్త్' కమెడియన్స్ నవీన్, బాబీ తదితరులు ఇతడి మృతిపై మిస్ యూ పోస్టులు పెడుతున్నారు. యాంకర్ సుమ కూడా బాబీ ఇంటికి వెళ్లి, అతడి మృతదేహానికి నివాళులు అర్పించింది. ఇంతకీ అసలేమైంది? ఎప్పుడీ ప్రమాదం జరిగింది?
(ఇదీ చదవండి: కొడుకు చనిపోయిన నెలకే టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత)
సోమవారం రాత్రి కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై రెండు బైక్స్.. ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సీఐ విశ్వం చెప్పిన ప్రకారం.. కొవ్వూరుకు చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై రాజమండ్రిలో సినిమా చూసేందుకు వెళ్తున్నారు. మరోవైపు రాజమండ్రి క్వారీ మార్కెట్‌కు చెందిన ఆనపు లక్ష్మీనారాయణ మోటార్ సైకిల్ ఎదురుగా వచ్చేసరికి రెండు బైకులు బలంగా ఢీకొన్నాయి. ఆనపు లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదం జరగడానికి ఒకటి రెండు రోజుల క్రితమే ఇతడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇంతలోనే విషాదం జరిగిపోయింది.
(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు)



