విషాదం.. టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత | Telugu Actor Raghunath Reddy No More | Sakshi
Sakshi News home page

350కి పైగా సినిమాలు.. ఆ నటుడు గుండెపోటుతో మృతి

Feb 1 2026 5:04 PM | Updated on Feb 1 2026 5:12 PM

Telugu Actor Raghunath Reddy No More

తెలుగు చిత్రసీమలో విషాదం. 350కి పైగా సినిమాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న రఘునాథ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉంటున్న ఈయనకు శనివారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. నెలరోజుల క్రితమే ఈయన కొడుకు కూడా గుండెపోటుతో చనిపోయారు. కుమారుడిని కోల్పోయిన బాధతోనే ఈయన కూడా కాలం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు నటీనటులు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్)

రఘునాథరెడ్డి మృతదేహాన్ని సందర్శించిన నటి శివ పార్వతి.. ఈయనకు నివాళి అర్పించారు. ఇంత సీనియర్ నటుడు చనిపోతే.. టాలీవుడ్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. రఘునాథ రెడ్డి చేసిన మూవీస్ విషయానికొస్తే.. కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం తదితర చిత్రాలో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.

శోభన్ బాబు హీరోగా చేసిన 'సర్పయాగం' సినిమాతో రఘునాథరెడ్డి.. నటుడిగా పరిచయమయ్యారు. చివరగా 2018లో సుమంత 'సుబ్రహ్మణ్యపురం'లో నటించారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్న కారణంగా.. నటనకు వీడ్కోలు చెప్పేశారు. గతేడాది పలు యూట్యూబ్ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు కొడుకుని కోల్పోయిన బాధతో ఈయన కూడా తనువు చాలించారు.

(ఇదీ చదవండి: 'చరణ్‌' చేతిలో రెండేళ్ల బిడ్డ.. మెగా ఫ్యాన్స్‌ అత్యుత్సాహం)

Advertisement
 
Advertisement
Advertisement