రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్‌, చచ్చిపోవాలనుకున్నా! | Bigg Boss Fame Prince Yawar Says His Friend Cheated Him | Sakshi
Sakshi News home page

Prince Yawar: కేటీఆర్‌ పేరు చెప్పి బెదిరింపులు.. నాలా ఎవరూ మోసపోకండి

Feb 1 2026 2:58 PM | Updated on Feb 1 2026 3:12 PM

Bigg Boss Fame Prince Yawar Says His Friend Cheated Him

బంధువును నమ్మి డబ్బులిచ్చి మోసపోయానంటున్నాడు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, మోడల్‌ ప్రిన్స్‌ యావర్‌. తన డబ్బు ఇవ్వమని అడిగితే.. పెద్ద పెద్దవార్ల పేరు చెప్పి బెదిరిస్తున్నాడంటూ ఓ వీడియో షేర్‌ చేశాడు. అందులో ప్రిన్స్‌ యావర్‌ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్‌ బలవంతం చేయడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. నా బంధువుల్లో ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడు. స్థలం విషయంలో రూ.30 లక్షలు ముంచేశాడు. అయితే నా ఫ్యామిలీతో మాట్లాడి రూ.23 లక్షలు తిరిగిస్తానని నన్ను ఒప్పించాడు.

పైసా ఇవ్వడం లేదు
15 రోజుల్లో ఇచ్చేస్తానన్నాడు. కానీ, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తిరిగివ్వలేదు. అన్ని చోట్లా నన్ను బ్లాక్‌ చేశాడు. అతడి స్నేహితుడికి ఫోన్‌ చేస్తే నువ్వేం చేయలేవంటూ రివర్స్‌లో నన్నే బెదిరిస్తున్నారు. పెద్దవాళ్ల పేర్లు చెప్పి భయపెడుతున్నారు. అందులో కేటీఆర్‌ సర్‌ పేరు కూడా ఉంది. ఈ వీడియో కేటీఆర్‌ సర్‌ దగ్గరికి చేరాలని కోరుకుంటున్నాను. ఆయన వెనకాల ఇంత జరుగుతుందని కేటీఆర్‌ సర్‌కు తెలియదనే అనుకుంటున్నాను. 

చచ్చిపోదామనుకున్నా
ఇకపోతే అతడు చేసిన మోసం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. భయంకరమైన ఆలోచనలు వచ్చాయి. చచ్చిపోవాలనుకున్నాను. కానీ, నాకు నా అభిమానులున్నారు. వారికోసం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన విరమించుకున్నాను. నాలా ఇంకెవరూ మోసపోకూడదు అని చెప్పుకొచ్చాడు. ప్రిన్స్‌ యావర్‌.. తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతకుముందు సీరియల్స్‌ కూడా చేశాడు. పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు.

 

 

చదవండి: మీరే నా బలం.. 30 ఏళ్లర్నీపై కిచ్చా సుదీప్‌ ఎమోషనల్‌

Advertisement
 
Advertisement
Advertisement