30 ఏళ్ల జర్నీ.. ఆ ఒక్కటి నేర్చుకున్నా!: కిచ్చా సుదీప్‌ | Kichcha Sudeep Shares Emotional Post About His 30 Years In Cinema Industry, Check Out Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Kichcha Sudeep: మీరే నా బలం.. మీవల్లే ఇదంతా సాధ్యం!

Feb 1 2026 1:12 PM | Updated on Feb 1 2026 1:36 PM

Kichcha Sudeep Emotional Post about 30 Years in Cinema

కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా మూడు దశాబ్దాల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. సినీ ప్రపంచంలో నా మూడు దశాబ్దాల జర్నీని చూసుకుంటే మనసు సంతోషంతో నిండిపోతోంది. ఎన్నో కలలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదు.

మీ వల్లే సాధ్యం
ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. అభిమానులు.. మీరే నా బలం. నన్ను ముందుకు నడిపించింది మీరే! దర్శకరచయితలు.. మీ కథలకు నేను సరిపోతానని నన్ను నమ్మినందుకు థాంక్యూ. నిర్మాతలు.. మీ ధైర్యం, నాపై ఉంచిన నమ్మకం వల్లే కలలు సాకారమయ్యాయి. సహనటులు, ప్రతి టెక్నీషియన్స్‌కు చెప్పొచ్చేదేంటంటే.. సినిమా అంటేనే టీమ్‌ వర్క్‌. 

సమిష్టి కృషి
లైట్‌ బాయ్‌ నుంచి కెమెరామెన్‌ వరకు, ఆర్ట్‌ టీమ్‌ నుంచి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ వరకు, స్పాట్‌ బాయ్‌ నుంచి ఎడిటర్స్‌ వరకు.. మీ అందరి కష్టం సినిమాలో దాగుంది. టీవీ, మీడియా.. ఈ రెండూ నా ఎదుగుదలకు తోడ్పడ్డాయి. కన్నడ చిత్ర పరిశ్రమ.. నాకంటూ పేరుప్రఖ్యాతలు, గుర్తింపునిచ్చిందే ఈ ఇండస్ట్రీ. 

30 ఏళ్లలో..
కన్నడ సినిమా ఎప్పటికీ నా గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా కుటుంబసభ్యులు, స్నేహితులు.. మీరందరూ నన్ను మంచి మనిషిగా తీర్చిదిద్దారు. ఈ 30 ఏళ్లలో నేను నేర్చుకున్నది ఒక్కటే.. విధేయత. ఎంత సక్సెస్‌ వచ్చినా సరే మరింత విధేయతతో, కష్టపడి పని చేయాలి. నాకెంతో ఇచ్చిన ఈ సినిమాకు ఎంతో కొంత తిరిగిచ్చేయాలి అని రాసుకొచ్చాడు.

సినిమా
తయ్యావా (1997) అనే కన్నడ సినిమాతో నట ప్రయాణాన్ని ఆరంభించాడు. ఇందుడో సైడ్‌ క్యారెక్టర్‌లో నటించాడు. 2000వ సంవత్సరంలో స్పర్శ మూవీతో హీరోగా మారాడు. హచ్చ (2001) చిత్రంతో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. నంది, హచ్చ, స్వాతిముత్తు, మై ఆటోగ్రాఫ్‌, కెంపె గౌడ, ఈగ.. ఇలా అనేక సినిమాలతో స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు. చివరగా మార్క్‌ సినిమాతో అలరించాడు. మై ఆటోగ్రాఫ్‌ సహా పలు సినిమాలకు ఈయనే స్వయంగా దర్శకత్వం వహించాడు.

 

 

చదవండి: నిజం పెళ్లాన్ని అడిగినట్లే అడిగారు: శ్రీలీల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement