నిజంగా పెళ్లాన్ని అడిగినట్లే అడిగారు: శ్రీలీల | Sreeleela Funny Comments At College, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Sreeleela: అరిచి అరిచి గొంతు పోయిందన్న శ్రీలీల.. అబ్బాయిల రియాక్షన్‌..

Feb 1 2026 12:16 PM | Updated on Feb 1 2026 12:25 PM

Sreeleela Funny Comments At College, Video Goes Viral

'పెళ్లి సందD' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల తక్కువకాలంలోనే టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్‌ సినిమాలతో అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది. అయితే కొంతకాలంగా తనకు హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'తో పాటు హిందీలోనూ కార్తీక్‌ ఆర్యన్‌తో ఓ సినిమా చేస్తోంది. 

అలాగే ధనుష్‌ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇకపోతే సినిమాలతో పాటు ఈవెంట్స్‌కు కూడా హాజరయ్యే ఈ బ్యూటీ తాజాగా ఓ కాలేజీ ఫెస్ట్‌కు వెళ్లింది. నరసరావుపేట ఇంజనీరింగ్‌ కాలేజీలో నిర్వహించిన ఫంక్షన్‌కు హాజరై సందడి చేసింది. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ.. మిమ్మల్ని చూసిన జోష్‌లో అరిచి అరిచి గొంతు పోయిందంది. 

అందుకు అక్కడున్న అబ్బాయిలు.. అయితే డ్యాన్స్‌ చేయమని అరిచారు. అది విన్న శ్రీలీల.. నిజంగా పెళ్లాన్ని అడిగినట్లు అడిగారు, డ్యాన్స్‌ చేద్దాం.. కమాన్‌ అంటూ పాజిటివ్‌గా స్పందించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

చదవండి: మరోసారి అత్తయ్యను అయ్యా: సుస్మిత

Advertisement
 
Advertisement
Advertisement