'చరణ్‌' చేతిలో రెండేళ్ల బిడ్డ.. మెగా ఫ్యాన్స్‌ అత్యుత్సాహం | Ram Charan Protects Daughter Klin Kaara Amid Fans Chaos At Apollo Hospital, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

క్లీంకారతో 'చరణ్‌'.. మెగా ఫ్యాన్స్‌ అత్యుత్సాహం

Feb 1 2026 1:29 PM | Updated on Feb 1 2026 1:52 PM

Ram Charan With his daughter Klin Kaara at apollo hospital

రామ్‌ చరణ్‌, ఉపాసనల కుమార్తె క్లీంకార  ఫొటోను పూర్తిగా ఇప్పటికీ వారు రివీల్‌ చేయలేదు. కానీ, ఏదైన వారు ప్రయాణం చేస్తున్న సమయంలో కొందరు కెమెరాలతో క్లిక్‌మనిపించి సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి. అయితే, తాజాగా ఇప్పుడు కూడా రామ్‌ చరణ్‌తో క్లీంకార ఉన్న ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.

నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన అపోలో ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఉపాసన పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. దీంతో పెద్ద కూతురు క్లీంకారను తీసుకుని తాజాగా  రామ్‌ చరణ్‌ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ భారీ ఎత్తున చుట్టుముట్టడంతో అతి కష్టం మీద ఆయన లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి అయింది. 

చరణ్‌ చేతిలో రెండేళ్ల బిడ్డ ఉంది అనే కామన్‌సెన్స్‌ కూడా మెగా ఫ్యాన్స్‌ ప్రవర్తించారు. వారు చేసిన హంగామాకు ఆ చిన్నారి కూడా ఆందోళన చెందింది. దీంతో తొలిసారి చరణ్‌ కూడా సహనం కోల్పోవాల్సి వచ్చింది. సిబ్బంది రక్షణలో క్లీంకారను  ఎంతో జాగ్రత్తగా తీసుకుని ఆసుపత్రిలోకి చరణ్‌ వెళ్లారు. ఈ క్రమంలో క్లీంకార వీడియోను కొందరు తమ మొబైల్స్‌తో చిత్రీకరించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

కాపీరైట్స్‌ చర్యలు
క్లీంకారకు సంబంధించిన Klin Kaara విజువల్స్ ఎవరైనా పబ్లిష్ చేస్తే కాపీరైట్స్‌ చర్యలు తీసుకుంటామని రామ్‌ చరణ్‌ టీమ్‌ హెచ్చరించింది. ఈరోజు అపోలో హాస్పిటల్ దగ్గర ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల క్లీంకార విజువల్స్ పలు కెమెరాలలో దొరికాయి. దీంతో అవి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. (క్లీంకార పూర్తి ఫోటోలను కాకుండా తన మొఖం కనిపించని వీడియో, ఫోటోను మాత్రమే ఇక్కడ షేర్‌ చేశామని గమనించగలరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement