ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గతేడాది ఇదే రోజు రిలీజైన చిత్రం పుష్ప-2. ఈ మూవీ డిసెంబర్ 2, 2024న విడుదలైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఘనత సాధించింది. ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ కోసం రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందుకోసం బాలానగర్‌లో విమల్ థియేటర్‌లో షో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ గొడవ పడ్డారు.
అయితే ఈ షో టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయానికి ఉంచారు. కేవలం సింగిల్ షో కావడంతో మరోసారి అభిమానులు బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్ నట విశ్వరూపం చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో టికెట్ల కోసం ఫ్యాన్స్ కొట్టుకున్నట్లు తెలుస్తోంది. కొందరికి మాత్రమే టికెట్స్ దక్కడంతో మరికొందరు ఫ్యాన్స్ గొడవకు దిగారు. కొందరు ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ ఏకంగా కర్రలతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సంధ్య థియేటర్ ఘటన..
పుష్ప సంధ్య థియేటర్ ఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఈ విషాద ఘటన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భాస్కర్ సతీమణి రేవతి (35) కన్నుమూయగా, వారి కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ అండగా నిలిచింది. ప్రస్తుతం శ్రీతేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నాుడు.
Sad to see these things This has happened almost for 3rd time during the Pushpa 2 release, then Arya 2 re-release & now in Pushpa 2 re-release ..
Strict ga online trolls lo matrame undandi, OFFLINE lo kaadu 🙏#1YearForIndianIHPushpa2 #Pushpa2TheRule pic.twitter.com/9ix0F9cepz— Sumanth (@SumanthOffl) December 4, 2025


