దేశవ్యాప్తంగా ప్రస్తుతం విమాన సర్వీసులు రద్దు అనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా మారిన నిబంధనల వల్ల ఎక్కడిక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో విమానాలు రద్దయ్యాయి. చాలామంది సామాన్యులు.. విమానాశ్రయాల్లో గంటలు గంటలు పడిగాపులు కాస్తున్నారు. వీళ్లలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. విమానాలు వాయిదా, రద్దు కారణంగా తామెంత ఫస్టేషన్‌కి గురవుతున్నామో చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' పునర్నవి)
రెండు రోజుల క్రితం తెలుగు సీనియర్ నటుడు నరేశ్.. విమాన సర్వీస్ ఆలస్యం కారణంగా తనెలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారో రాసుకొచ్చారు. చెప్పిన టైమ్‌కి చేరుకున్నా సరే విమానాలు లేటు అయ్యాయని, దీనికి తోడు తమ లాంటి నటులకు ప్రైవసీ కూడా కరువైందని, జనాలు గుర్తుపట్టేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ వీడియోని పోస్ట్ చేశారు.
మరోవైపు బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య.. స్టేజీ ప్రోగ్రాం కోసం గోవా-ముంబై, ముంబై నుంచి కోల్‌కతా వెళ్లాల్సి ఉంది. అయితే తన ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ కావడంతో ఏకంగా రూ.5.40 లక్షలు ఖర్చు చేసి వేరే విమానంలో వెళ్లాల్సి వచ్చిందని చెప్పి అసహనం వ్యక్తం చేశారు. నటి నియా శర్మ కూడా ఇలా తను బుక్ చేసుకున్న ఫ్లైట్ రద్దయిన కారణంగా.. ఏకంగా రూ.54 వేలు చెల్లించి మరో విమానంలో తన గమ్యస్థానానికి చేరాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన టీమ్ సభ్యుల్లో నలుగురు.. మూడు వేర్వేరు విమానల్లో గమ్యస్థానానికి చేరుకున్నామని కూడా చెప్పుకొచ్చింది. వీళ్లే కాదు ఇలా తమ ఇబ్బందిని బయటపెట్టని సెలబ్రిటీలు మరికొందరు కూడా ఉండొచ్చు.
(ఇదీ చదవండి: 'అఖండ 2' విడుదల వాయిదాకు కారణాలివే!)

The fun of Flying ended in the 90s 🥹. Reached in time at HYD Indigo terminal at 8:15 AM. All Indigo flights delayed . Packed food by then to eat in the flight. Shopping & rush back to see a full scale battle between the ground crew and passenger. Filth🤬. To make matters worse,… pic.twitter.com/rj7bCArbgD
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) December 3, 2025


